Search This Blog

Tuesday 29 October 2013

హిందూ సంస్కృతి అనేది ఒక్క భారత దేశానిదే కాదు,ఇది విశ్వానిది.

భారతీయులు ఆచరించే సంప్రదాయాలను హిందూ మతం  అని పిలవడం తప్పు. 
హిందువులకు మతం లేదు. ఉన్నదంతా మనిషి సుఖంగా,శాంతం గా ఎలా జీవించాలో తెలిపే జీవన విధానం. ఆ పద్దతి నే సంస్క్రుతం లో ధర్మం' అని పిలుచు కొంటాము.ఎప్పటి నుండో పురాతన కాలం నుండి ఉన్న సత్ ధర్మం  కాబట్టి సనాతన ధర్మం అని చెప్పుకొంటా ము .సింధు ప్రాంతపు ప్రజలు ఆచరించే ధర్మం కాబట్టి  పర దేశీయులు హిందూ మతం అని పిలుస్తున్నారు . 

ధర్మం, జీవన సూత్ర సంపుటి. మనిషి ఎప్పుడు ఎలా,ఏ విధం గా ప్రవర్తిస్తే వ్యక్తి తో పాటు వ్యవస్థ కూడ ఆనందం గా సమతుల్యత లో ఉంటుందో తెలిపేది హిందూ ధర్మం.
ఇది చాలా పురాతన మైనది. ఎన్నో వేల ఏళ్ళ క్రితం అనేక మంది మహర్షులు సంఘ గమనాన్ని,మనిషి బలం -బలహీనతలను,తద్వారా దేశ సౌభాగ్యం ఎలా పరివర్తనం చెందుతుంది- మొదలగు సాంఘిక,భౌతిక విషయాలను పరిశీలించి , వివేకం తో విచక్షణ చేసి, నిగ్గు తేల్చిన జీవిత విధానాలు, హిందూ ధర్మం గా పరివ్యాప్తి చెందింది.

 దీని నుండి,ఆయా దేశ,కాల మాన పరిస్థితులకు అనుగుణం గా ఆహార  అలవాట్లు,పండుగలు,నమ్మకాలు,ఆచారాలు,సంప్రదాయాలు వ్యాప్తి చెందాయి.

ప్రపంచం ఇలా దేశాలుగా విడిపోక ముందే,పరిణామ క్రమంలో హిందూ ధర్మం పుట్టి ,వ్యాప్తి చెందింది.
 సిద్దాంతం ఎంత మంచిదైనా, ఆయా మహర్షులు ఎంతగా తపించి  జీవన విధానాన్ని సూత్రాలుగా చెప్పినా,కాల క్రమం లో మానవ సమూహాలు ఆయా సంఘ అవసరాలకు అనుగుణ్యం గా  కొత్త కొత్త భాష్యాలు లేవదీస్తాయి. అలా ఏర్పడినవే, జైన,బుద్ద, వైష్ణవ,శైవ,శాక్తేయ,గాణ పత్య,ఆదిత్య, ఇస్లాం,యూదు,జొరాష్ట్రియన్,క్రీస్తు సూత్రాలు /మతాలు.

సూత్రాలకు,అంటే ధర్మానికి, మతానికి తేడా ఏమిటి?
ధర్మం ఓ జీవ నదీ ప్రవాహం  ఐతే,మతం ఒక దిగుడు బావి లాంటిది.
నదిలో నీరున్నం త వరకే ఏ బావి ఐనా దప్పిక తీర్చుతుంది.

మనిషి ఎలాంటి వాడు?
 మనిషి ఎల్లప్పుడూ తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఎన్నో యుక్తులు పన్నుతాడు. అందులో ముఖ్యమైనది,గుంపు ని పోగు చేయడం లేదా గుంపులో కలిసిపోవడం.
జంతువులు కూడ ఈ యుక్తినే పాటిస్తాయి.

సరే,గుంపు లేదా సమూహం ఎలా తయారవుతుంది?
గుంపుకి  ఏదైనా ప్రత్యేకత ఉండాలి. చర్మం రంగు,బలమైన శరీరం, ఆ తర్వాత మతం,కులం, ధనం,క్లబ్బు, వ్రుత్తి,అలవాట్లు- ఇలా ఏదో ఒక దానిని ప్రత్యేక లక్షణం గా చూపుతూ గుంపులు ఏర్పడ తాయి.
ఆ గుంపు లో ఉన్న వ్యక్తుల సంఖ్యని బట్టి ఆ గుంపు కి అంత బలం ఏర్పడుతుంది. గుంపు ఎంత బలం గా ఉంటే ఆ గుంపులోని వ్యక్తి కూడ అంత బలం గా ఉంటాడు.

ప్రస్తుత భారత దేశం లో మత సామరస్యత పేరుతో ఒక మతాన్ని పూచిక పుల్ల లా చూస్తూ ,మరి కొన్ని మతాలను ప్రోత్సహిస్తున్నారు. అది తప్పు . 
 ప్రజలందరి మనోభావాలు ఎలాంటి వివక్ష లేకుండా కాపాడట మే ప్రభుత్వ ధర్మమ్. 
కానీ జరుగుతుంది ఏమిటంటే,మతం పేరుతో ప్రభుత్వాలు ప్రజల మధ్య పొరపొచ్చాలు కలుగ చేసి అధికారాన్ని అందుకోవడం ఒక దుర్మార్గపు ఆనవాయితీ ఐంది .
అజ్ఞానం ముదిరితే మూర్ఖత్వం అవుతుంది . 
శాస్త్ర జ్ఞానం వేరు -నిజమైన ప్రజ్ఞ వేరు .
 తర్కం , స్పందన  వేర్వేరు గా ఉండొచ్చు .  . 
భావం,ఆలోచన,కార్యా చరణ ఒకే రకం గా ఉండటమే సమతుల్యత. 

ఎవరైతే సనాతన ధర్మ సూత్రాలకు అనుగుణం గా ప్రవర్తిస్తారో ఏ మతం లో ఉన్నా  వారందరూ హిందువులే. వీరు మంచి అనేది ఎక్కడున్నా స్వీకరిస్తారు. సమాజ హితవు కోరే ఏ భావ జాలాన్ని ఐనా గౌరవిస్తారు. వారు అన్ని వర్గాల వారి నమ్మకాలను సహ్రుదయం తో గౌరవిస్తారు.
మతాలను మాత్రమే  నమ్మేవారు చాందస వాదులుగా ఉండిపోయి ఇతరుల భావాలకు విలువ ఇవ్వరు.దాని వలన ఎన్నో యుద్దాలు,మారణ కాండలు జరిగాయి.జరుగుతున్నాయి.

నిజమైన హిందువు ఎల్లప్పుడూ తన బుద్దిని పదును పెట్టుకొంటూ, తనూ,తనతో పాటు అన్ని జీవులు,14 మితులున్న(dimensions) సకల చరాచర విశ్వం(14 లోకాలు) సుఖం గా,శాంతం గా ఉండటానికి ,దానికి తోడ్పడే ఆలోచనలు ఎక్కడినుండి వచ్చినా స్వీకరిస్తాడు. గాయత్రి మంత్ర అర్ధం కూడ అదే.

మనిషి గమ్యం - మళ్ళీ జన్మ లేకుండా, జనన మరణ చక్రం నుండి విముక్తి.

గమ్యం చేర్చే మార్గం: సాధన.

ఏమి  సాధన చేయాలి?
వయస్సుకి,బాధ్యతలకు  తగ్గ ధర్మ కార్యా చరణ. ధర్మ సమ్హితం గా కోరికలను అధిగమించి (కోరికలను అణచుకోవడం కాదు),అర్ధాన్ని సంపాదించుకొని మోక్షం పొందటమే హిందువుల చతుర్విధ పురుషార్ధ సాధన.

అలాగే,అష్టాంగ యోగ సాధన అనేది సంచిత కర్మలను భస్మం చేసుకొని,ఆగామి కర్మలను లేకుండా చేసుకొని,ప్రారబ్ద కర్మలను సహించే బలాన్ని పొందటానికి చేసే శారీరక,మానసిక క్రియలు.

సర్వేషాం స్వస్తిర్భవతు ;  సర్వేషాం  శాంతి ర్భవతు ; 
                                      సర్వేషాం పూర్ణం భవతు ;   సర్వేషాం  మంగళం భవతు. 
                                 ఓం శాంతి

Friday 18 October 2013

if i am in the shoes of Sonia.....

1.As a leader of the national political  party,i have to set it right for my party. Recent poll results and surveys denote that congress loosing the ground in both regions.so,what could be done to gain?
           i may be reasoned in my mind,that it is better to win one region by keeping a promise rather than losing in both the regions by violating it. Even if the promise to the people of Telangana is broken, there is no guarantee that the Congress would sweep in Seemandhra with YSJ and TDP coming first and second in successive opinion polls.So,out of compulsion,i may opt for bifurcation of the state for the sake of congress party... 
           But,taking the cue from reports of  first SRC ,JVP committee,Sri krishna committee and indira gandhi's remarks in parliament---  as statesman, i definitely go for ---
1. commissioning of "autonomous regional development board" to look after the backwardness of all backward regions in A.P. state.
2. to address divisive demands in our country , Commissioning of the second SRC 
3. power sharing rights for telengana political leaders.

Wednesday 16 October 2013

బువ్వ కావాలి... రైతన్న లారా మీరు మారాలి...

జనాభా పెరుగుతోంది! పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార భద్రత పెరగాలంటే.. రెండే పరిష్కారాలు!! అయితే, సాగు విస్తీర్ణం పెరగాలి! లేదంటే.. ఎకరా  ఉత్పాదకత పెరగాలి! సాగు విస్తీర్ణం పెంపు అనేది దీర్ఘకాల ప్రక్రియ! దీనికి వ్యయమూ ఎక్కువే! కానీ, ఉత్పాదకతను పెంచడం మన చేతుల్లోనే ఉంది! 
ఇప్పుడు  60 లక్షల హెక్టార్లలో మాత్రమే ఆహార ధాన్యాలను సాగు చేస్తున్నారు 
బువ్వ కావాలంటే.. భూమి పండాలి! 
భూమి పండుతోంది! కానీ, అందరికీ బువ్వ ఎందుకని   అందడం లేదు ?
భు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటే వరి ఉత్పాదకత మరింత తగ్గే ముప్పు ఉంది . 
నేటికీ ,వరి ఉత్పాదకత హెక్టారుకు 30 క్వింటాళ్లుగా ఉంది.

సన్న రకాల సాగుకు ఖరీఫ్ అనుకూలం. రబీలో పండేవి దొడ్డురకం ధాన్యమ్ . 
కృష్ణా డెల్టాలో ఖరీఫ్‌లో సుమారు 13 లక్షల ఎకరాల్లో వరి వేస్తారు. ఇందుకు 180 నుంచి 200 టీఎంసీల నీటిని వాడుతున్నారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే వంద టీఎంసీల నీళ్లు సరిపోతాయి. అలాగే, నాగార్జున సాగర్ కింద 22 లక్షల ఎకరాల మేరకు వరి సాగవుతుంది. ఇందుకు సుమారు 260 టీఎంసీల నీటిని వాడుతున్నారు. ఇక్కడ 110 టీఎంసీల నీరు వృథా అవుతున్నట్లు చెబుతున్నారు. పుష్కలంగా నీరుండి, అధికస్థాయిలో వాడినప్పటి కంటే...ఆచితూచి నీరు విడుదల చేసినప్పుడే 'బంపర్ క్రాప్' వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి.ఖరీఫ్ లో సూర్య రశ్మి తక్కువ . కాబట్టి నీరు ఎక్కువ పెట్టినా లాభం లేదుః 


System of Root Intensification -  శ్రీ వరి సాగు 

 నారు మాళ్ళు పోయడానికి వాడే విత్తనాలలో సగం నేరుగా దమ్ము చేసిన పొలం లో నాటి ,నారు కొద్దిగా పెరిగాక, పాయల మధ్య ఓ పది అంగుళాల ఖాళీ ఉండేటట్లు చూసుకోని,ఇప్పుడు మన రైతులు పెట్టే నీటిలో 5 వ వంతు నీటి తో కొద్ది మోతాదుల్లో సేంద్రియ ఎరువులు వాడుతూ ,కలుపు లేకుండా పైపాటు చేస్తుంటే ఎకరానికి 50 బస్తాల ధాన్యం పండుద్ది. అందరి కడుపూ నిండు ద్ది .  

Monday 14 October 2013

పంచ కోశ శరీరం

పంచ కోశ శరీరం :
The human body consists of two primary systems. The first is the “biological body,” - second system is known as the “Human Energy System,” and consists of a finer grade of matter called “anti matter.” You cannot perceive physically this body, because it has a higher frequency and wavelength (beyond the 3rd dimension). 
Our spirit bodies can be compared to radio waves:
§         they’re normally imperceptible,
§         they each have a unique frequency or vibration that keeps them distinct from each other,
§         the different frequencies let them coexist independently in the same space, and
§         we can learn to tune in to the various bodies separately with certain techniques and technologies.
In other words, we are made up of several bodies that are superimposed over each other. The physical body is the densest
మనలో ఉన్న ధ్వని ప్రధాన మైన శరీరం- ఆస్ట్రల్ శరీరం 
-జీవ కాంతి ప్రధానమైన శరీరం- కుండలినీ చక్ర నాడీ వలయం -ఈ ధర్ శరీరం . 
ధ్వని,కాంతి ద్వారా ఈ  రెండు శరీరాలను ప్రభావితం చేయ వచ్చు. 

మంత్రాలు,తంత్రాలు,భావనా మయ సజెషన్ లు  ఇవన్నీ ఆస్ట్రల్ , ఈ ధర్  శరీరం లను ప్రభావితం చే స్తాయి .