Search This Blog

Monday 28 July 2014

బంగారు తెలంగాణా గా మారడానికి సింగరేణి ఓ వరం .

1. సింగరేణి కాలరీస్‌కు చెందిన గనులలో మొత్తం 22,200 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్టు జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అంచనా వేసింది. ఇందులో ఇప్పటివరకు 1,200 మిలియన్‌ టన్నుల  బొగ్గును మాత్రమే వెలికితీశారు. 
2. ఒక మిలియన్‌ టన్ను బొగ్గు నిల్వలు ఉన్న గని ఖరీదు సుమారు 10  కోట్ల రూపాయలు . అనగా సింగరేణిలో  ప్రస్తుతం ఉన్న 21 వేల మిలియన్‌ టన్నుల నిల్వల విలువ సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు .  ఇందులో కేంద్రం వాటా 49 శాతం. 

Wednesday 16 July 2014

ధర్మ కర్మ సాధన

ధర్మం అనగా ధరించేది అని అర్ధం . ఈ చరాచర ప్రపంచాన్ని ధరించి ఉన్న  చైతన్య ప్రవాహం నే దైవం అని వ్యవహరిస్తాం . ధర్మం దేశ ,కాల స్థితులకు అతీతం గా ఉంటుంది . అది ఒక సుస్థిర మైన ,అమరమైన స్పందనా రాహిత్య స్థితి . అదే సత్యం . ఎందుకంటే అది మారేది కాదు . అదే ఆనందం .   చిన్నపదంలో చెప్పా లంటే  అదే -ఓం తత్సత్ . 
అలాంటి స్పందనా రాహిత్య చైతన్యం లో ఒక్క శాతం నుండి మాత్రమే అపరా ప్రక్రుతి వ్యక్త మవుతుంది . మిగతా 99% అవ్యక్తం గా ఉంటుంది .
భౌతిక స్థాయిలో సుఖాల వలన కలిగేది సంతోషం ,దుఖాల వలన కలిగేది విచారం . సుఖ దుఖాలకు అతీతం గా ఉన్న స్పందనా రాహిత్య స్థితి ఆనందకరం  అని ఋషి వాక్యం .

దైవం = స్పందన (vibration) లేని చైతన్యం  = అవ్యక్తం = పరా ప్రక్రుతి .
మనిషి కంటికి , కె మేరాలకు ,దూరదర్శిని లకు ,ఇంకా ఎన్నో అధునాతన పరికరాలకు అందే విశ్వం ,చరాచర ప్రాణులు  = వివిధ స్థాయిలలో స్పందించే చైతన్యం  = వ్యక్తం = అపరా ప్రక్రుతి .

దైవం = 99% పరా ప్రక్రుతి + 1% అపరా ప్రక్రుతి .

సాధన ద్వారా మనిషి పరిణామం :
కంటికి కనపడే వాటి పై మోజు పెంచుకొని , "నేను -నాది ' అనే చైతన్యం తో  భౌతిక స్థాయిలో ఉన్న మనిషి   వివేక వైరాగ్య అభ్యాసాలతో  క్రమేణా చైతన్య పరిధిని విస్తరించు కొంటూ ఇంద్రియాలను , ఆలోచనలను ,చిత్త వాసనలను అధిగమిస్తూ  ఆ క్రమం లో మోహ బంధాలను తెంచు కొంటూ -"నేను(అహం ) అనేది మిధ్య - నా నిజమైన స్థితి ఆత్మ స్థితి " అని అనుభూతిస్తూ చివరికి ఈ ఆత్మ కూడా పరమాత్మలో ఓ శకలం ' అని అనుకొంటూ చిట్ట చివరికి అపరా ప్రక్రుతి ,పరా ప్రక్రుతి అన్నీ ఒక్కటే ' అనే స్థితికి చేరుకొంటాడు . ఈ సాధనే మనిషి అసలైన  ధర్మం. ఈ పరిణామ ప్రక్రియే అసలైన కర్మ .  


సనాతన లేదా అసలైన లేదా అమరమైన ధర్మ మంటే --- సంప్రదాయాలు , ఆచారాలు , మత విశ్వాసాలు ,పాప పుణ్యాలు ,మంచి చెడ్డలు ,వర్ణాశ్రమ  మరియు నిత్య నైమిత్తిక కర్మలు కావు . ఇవి మనం సంఘ శాంతి కోసం , మానవ సంబంధ బాంధవ సౌలభ్యం కోసం ,ప్రక్రుతి రక్షణ కోసం ,చిత్త శాంతి కోసం ఏర్పాటు చేసుకొన్న నీతి నియమాలు .
అలా అని వీటిని నిర్లక్ష్యం చేయ కూడదు . ధర్మ సాధన కి పని కొచ్చేవీ ధర్మమే . అందుకే  అంతిమ ధర్మాన్ని పొందా లంటే ఈ విలువలు  కూడా అవసరమే .

(Duty & responsibility)కర్తవ్యం ,బాధ్యత ,అనేవి  వ్రుత్తి పరం గా ,బాంధవ్యాల పరం గా ,పదవుల పరం గా ,ప్రవ్రుత్తి పరం గా  ఆయా దేశ కాల మాన పరిస్థితులకు అనుగున్యం గా చేయ వలసిన కర్మలు .

ప్రతి ప్రాణి కర్మ చేయకుండా మనలేదు . చిత్తం లో ఒక సంకల్పం పుట్టిందీ అంటే అదీ కర్మే . చిత్త  కర్మ .
మనస్సులో ఒక ఆలోచన మొదలయ్యిందీ అంటే అదీ కర్మే . మానసిక కర్మ .
ఒక మాట పలికాము అంటే అదీ కర్మే . వాచిక కర్మ .
శరీర స్థాయిలో అసంకల్పిత చర్యలూ (autonomous actions like digestion,respiration,circulation,cell energy metabolissm,etc...) కర్మే .

కర్మ ద్వారా ధర్మ సాధన ఎలా ? 
కర్తృత్వ భావన లేకుండా , చేసే పనిలో కుశలత ,చేసిన పని నుండి వచ్చే ఫలితం పై నిరాసక్తి ,ఏ  పని చేసినా భగవద్ సేవ గా ,ఎలాంటి ఫలితం వచ్చినా దైవ ప్రసాదం గా ,సంపూర్ణ శరణాగతి -శ్రద్ధతో -ఎలాంటి పనిచేసినా అది ధర్మానికి దారితీస్తుంది .

"మోహ బంధ నాశనం మనిషి సాధనా లక్ష్యం 
మాయా విచ్చిన్న మోక్షం మనిషి జన్మ గమ్యం " .