Search This Blog

Saturday, 11 May 2013

వైశాఖం ...

అన్ని మాసాలు పవిత్రమైన వైనా , వైశాఖ -మాఘ -కార్తీకాలు అత్యంత శ్రేష్ట మైనవి . 
ముఖ్యం గా విష్ణారాధన ,జల దానం ( చలి వేం ద్రాలు ) ,మొక్కలు నాటి పోషించడం ,ఈ మాసం లో తప్పక ఆచరించాలని రుషి వాక్యం . 
అక్షయ తృతీయ ,ఆదిశంకర జయంతి ,నరసింహ జయంతి ,బుద్ద  జయంతి , స్కంద జయంతి , దత్త 
జయంతి - ఈ  నెల లోని పవిత్ర మైన పండుగ రోజులు . 
శరీర శుద్ది తో పాటు చిత్త  శుద్దిని అలవాటు చేయడ మే మన పర్వ దినాల విశిష్టత  . 

చిత్త శుద్ది తో చేసే పూజలు మనస్సుకి ప్రశాంతత ను , బుద్దికి వివేకాన్ని  ఇచ్చి 
అహంకార నిర్మూలనకు తోడ్పడ తాయి . 
ఎప్పుడైతే అహంకారం తగ్గుతుందో , అప్పుడు  మానవ సంబంధాలు 
మెరుగవుతాయి. తద్వారా మనిషి భౌతికం గా ఎదగడానికి అవకాశం  ఉంటుంది .