10 ఏళ్ల తర్వాత అధికారం చేపట్టిన చంద్ర బాబు మనస్సులో సమస్య ల సుడి గాలి .
- కోస్తా వారికి ,రాయల సీమకి సమ న్యాయం ఎలా ఏ విధం గా చేయాలి ?
- అలాగే సీమ భూముల్లో బంగారం పండించి సీమ బతుకుల్లో ఎలా నవ్వులు పూయించాలి ?
- వృధాగా పోతున్న గోదావరి జలాలను రాష్ట్ర సర్వతో ముఖాభి వృద్ధికి ఎలా వినియోగించాలి ?
- ప్రభుత్వ ధనం ఖర్చు పెట్ట కుండా కొత్త రాజధాని ని ఎలా నిర్మించాలి ?
- వ్యవసాయం దండుగ గా మారి కునారిల్లుతున్న రైతు బతుకులో పండుగ ఎలా తీసుకు రావాలి ?
వెంటనే నిపుణుల సమావేశం ఏర్పాటు ఐయింది .
రాష్ట్రం లోని మేధావులు ,ఇతర దేశాల నిపుణులు అభి ప్రాయాలు , రాజకీయ కార్య కర్తల సలహాలు వీటన్నింటినీ క్రోడీకరించు కొని తీసుకొన్న నిర్ణయాలే అమరావతి నగరం ,పట్టిసీమ ప్రాజెక్ట్ , రైతు ఋణ మాఫీ ...
కారు చీకటిలో కాంతి రేఖ - ఇరిగేషన్ కార్య దర్శి సమయానికి గుర్తు చేసిన విషయం -
బచావత్ ట్రిబ్యునల్ సూచన తో మూ డు రాష్ట్రాలు- మహారాష్ట్ర ,మధ్య ప్రదేశ్ ,ఆంద్ర ప్రదేశ్ ల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, గోదావరి నది లోని మిగులు జలాలలో 80 TMC ల నీటిని కృష్ణా నదికి మళ్లిం చు కోవచ్చు .
ఇంతలోనే నిర్వేదం - దానికి కారణం పోలవరం కాలవలో నీరు పారదు .
పోలవరం ఆంధ్రాకి వరం . దురదృష్ట వశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం వారి ట్రేడ్ మార్క్ అవినీతికి ఆలవాలం గా ముందు 'డాం ' కట్ట కుండా కాలవలు తవ్వడానికి ఉత్సాహం చూపించారు . ఎందుకంటే మట్టిపనుల్లో లాభాలు ఎక్కువ .
అలా పోలవరం కుడికాలువ 80% పూర్తయ్యింది . కాని డాం లేదు . కాలవలో నీరు పారదు .
కొంతమంది నిరుత్సాహం -
18000 కోట్లు ఖర్చు పెడితే గానీ , 150 అడుగుల పోలవరం డాం పూర్తవ్వదు . అంత డబ్బు కేంద్రం నుండి వచ్చి పోలవరం ప్రాజెక్ట్ పూర్తవ్వడానికి ఎంత కాలం పడుతుందో తెలియదు . ఈ లోపల నా నాటికీ ఎడారిగా మారి పోతున్న రాయలసీమ వాసుల కష్టాలు ఎప్పటికి గట్టేక్కెనో ?
మేధోమధనం సాగుతుంది -
3000 TMC ల గోదావరి నీరు వృధాగా సముద్రం లోకి పోతుంది .దానిని సద్వినియోగం చేసుకోవాలీ అంటే గోదావరి -కృష్ణ ల అనుసంధానం జరగాలి . ఇలా చేస్తే గోదావరి డెల్టా కి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో ?
రాయలసేమ జిల్లాలకు సాగు ,తాగు నీ టి అవసరా లు తీరాలంటే ఏం చేయాలి ?శ్రీశైలం నుండి కిందకు అంటే నాగార్జున సాగర్ కి కృష్ణా డెల్టా అవసరాలకు వదిలే నీటిలో సింహ భాగాన్ని ఒక రెగ్యు లేటర్ ద్వారా రాయలసేమ జిల్లాలకు పంపాలి.
అలాచేస్తే కృష్ణా డెల్టా ఇబ్బంది పడుతుంది . మరి కృష్ణా డెల్టా రైతుల అవసరా లు తీరే మార్గం ఏమన్నా ఉందా ?
పరిష్కారం -
నిజానికి 2006 లో ఇరిగేషన్ నిపుణులు సూచించిన ప్రకారం 80 TMC ల గోదావరి నీటిని ఒక క్రమ పద్దతిలో నెలకు ఇన్ని TMC ల చొప్పున వదులుతూ కాలవ ల ద్వారా కృష్ణా నదికి పంపితే ఆ నీటితో కృష్ణా డెల్టా అవసరా లు తీరతాయి . అంటే గోదావరి -కృష్ణా నదుల అనుసంధానం .
సరే బాగానే ఉంది . గోదావరి జిల్లాలకు లోటు రాకుండా గోదావరి నీటిని ఎలా ,ఎక్కడ నుండి
మళ్లిం చాలి ?
అందుకు అనువైన చోటు, కట్ట బోయే పోలవరం డాం కి దిగువన ఉన్న పట్టిసీమ . అక్కడ గోదావరి నీటి మట్టం 15 మీటర్ల కన్నా ఎక్కువ ఉండి, వరద లాగా వృధా అవుతున్న ప్పుడు మాత్రమే నీటిని, ఇప్పటికే 80% పూర్తయిన పోలవరం కాలవ లోకి పంపు చేసి ప్రకాశం బారేజి రిజర్వాయర్ కి మళ్లిం చాలి .
అలా పంప్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది ?
1400 కోట్లు .
అంటే 1400 కోట్లతో పోలవరం డాం కడితే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం
ఇప్పుడే ,ఇంత తక్కువ ఖర్చు తో వస్తుందా ?
గోదావరి డెల్టా ఆయకట్టు స్థిరీకరణ , కొత్తగా 7లక్షల ఎకరాలకు సాగు నీరు , విశాఖ కి త్రాగు నీరు , కృష్ణా నదికి 80 TMC ల నీటి మళ్లిం పు ,1000 విద్యుత్ ఉత్పత్తి -ఇవీ పోలవరం ప్రాజెక్ట్ వలన ఒన గూడే లాభాలు .
ఇందులో అత్యంత ముఖ్యమైనది కృష్ణా నదికి 80 TMC ల నీటి మళ్లిం పు ద్వారా నదుల అనుసంధానం,
తద్వారా కృష్ణ డెల్టా ఆయకట్టు స్థిరీకరణ మరియు రాయలసేమ జిల్లాలకు సాగు ,తాగు నీటి లభ్యత . దీనికి గోదావరి వరద నీటిని మాత్రమె వాడుకొనే పట్టిసీమ ఎత్తిపోతల పధకం సరిపోతుంది .
మరి ,గోదావరి జిల్లాల రైతులు ఎందుకు భయ పడుతున్నారు ?
వారు ఏ మాత్రం భయ పడ నక్కర లేదు . ఖరీఫ్ లో గోదావరి డెల్టా కి 150 TMC ల నీరు అవసరం ఉంది .
ఖరీఫ్ 5 నెలల్లో ధవ ళే శ్వరమ్ ఆనకట్ట దగ్గర నీటి లభ్యత సుమారు 700 TMC లు అని వెంకట రావ్ కమిటీ చెప్పింది .
గ త 50 ఏళ్ల రికార్డ్గ లు పరిశీలిస్తే 40 ఏళ్ళు గోదావరికి వరదలు వచ్చినట్లుగా తేలింది .
ఖరీఫ్ 150 రోజుల్లో సుమారు 125 రోజులు, రోజుకి 50000 క్యూసెక్ ల చొప్పున సరాసరి ఏటా 3000 TMC ల వరద నీరు వృధాగా సముద్రం లోకి పోతున్నట్లు లెక్కలు చూపిస్తున్నాయి . అంటే ,ఖరీఫ్ కాలం లో గోదావరి జిల్లాల డెల్టా కి అవసరమైన దాని కంటే 20రెట్లు లభ్య మవుతుండగా ,రబీ కాలం లో మాత్రం అవసర మైన దాని కంటే 30 TMC ల నీరు తక్కువ లభ్య మవు తుంది . రబీ కాలం లో నీటిని వినియోగించు కోవడానికి వీలుగా గోదావరి నీటిని నిల్వ చేసుకోవడానికి పోలవరం జలాశయం పనికి వస్తుంది . ధవ ళే శ్వరమ్ ఆనకట్ట నుండి నీరు వరద రూపం లో బయటకు వచ్చిన ప్పుడు మాత్రమే పట్టిసీమ ఎత్తిపోతల టర్బైన్ లు పనిచేయడం మొదలెడ తాయి . కాబట్టి ,
గోదావరి జిల్లాల రైతులు ఏ మాత్రం భయ పడ నక్కర లేదు .
సరే ఇంతవరకు బాగానే ఉంది . పోలవరం ప్రాజెక్ట్ 10 ఏళ్లలో పూర్తయ్యి నప్పుడు ,పట్టి సీమ ప్రాజెక్ట్ పై పెట్టిన 1400 కోట్లు వ్రుధా యే గదా ?
సమ న్యాయం అనేది రాజ్యాంగ హక్కు . అదీ గాక , ఇప్పటికే రాయలసీమ లో సాగు చతికిల పడి పోయింది . ఇంకా 10 ఏళ్ళు ఆలస్యం చేస్తే ప్రాంతీయ అసమానతలు పెరిగిపోయి మళ్ళీ రాష్ట్రం ముక్క చెక్క లవుతుమ్ది .
దుర్మార్గపు రాజకీయం చేస్తున్న కొందరు చెబుతున్నట్లు ,పట్టిసీమ పధకం ముడుపుల కోసం కానే కాదు .
కృష్ణ -గుంటూరు ఆయకట్టు లో సకాలం లో నాట్లు వేసి నేల నాలుగు చెరగులా పచ్చని వరి ,అపరాల పంటలతో ఏటా కోట్లాది రూపాయల విలువైన పాడి పంటలు , రాయలసీమ మెట్ట కి కనీసం నాలుగు తడులిచ్చి ఏపుగా పెరిగే శనగ ,జొన్న పంటలు, సీమ వాసుల దప్పిక తీర్చే కలుషితం కాని జలాలు- వీట న్నిం టికి విలువ కడితే పట్టిసీమ కి ఖర్చు పెట్టే 1400 కోట్లు ఏపాటి ?
జల యజ్ఞం పేరిట లక్షలాది కోట్ల ప్రజా ధనాన్ని నీరు చుక్క పారని కాలవ లు ,మట్టి పనులు ,మొబిలైజేషన్ ముడుపులు పేరిట యదేచ్చగా దొంగల దోపిడీ చేసినప్పుడు ఎవ్వరూ అరచి గోల చేయ లేదేం ?
ముఖ్యమైన విషయాలు మరో రెండు ఉన్నాయి :
1. పట్టిసీమ ప్రాజెక్ట్ వలన లభ్య మయ్యే నీటితో, నాగార్జున సాగర్ నీటి పై ఆధార పడ నక్కర లేకుండా కృష్ణా డెల్టా కి సరైన సమయం లో నాట్లు పడే అవకాశం ఉంది . శ్రీశైలం నీటిని పోతి రెడ్డి పాడు రెగ్యు లేటర్ ద్వారా నియమిత విధానం లో వదులు కొంటూ ,హంద్రినీవా కాలువల ద్వారా రాయలసీమ నాలుగు జిల్లాలకు సాగునీరు ,త్రాగు నీరు అందించ వచ్చు . అంటే ,పోలవరం పూర్తయ్యే వరకు వేచి చూడ కుండా , కృష్ణా ఆయకట్టు స్థిరీకరణ , సీమ పొలాలకు నీరు అందించే పట్టిసీమ ప్రాజెక్ట్ అత్యంత అవసరం .
ఫ్లోరైడ్ కాలుష్యం నుండి సీమ బతుకు లకు విముక్తి కలుగుతుంది .
సీమ వాసుల ఆరోగ్య సంపద , రాయలసీమ రైతాంగం పండించే పంటల విలువ ముందు 1400 కోట్లు ఏపాటి ?
2. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత , పట్టిసీమ ప్రాజెక్ట్ లో వాడే మోటార్ లు , పంపులు మళ్ళీ ఎక్కడైనా వినియోగించు కోవచ్చు .
ఇలా భిన్న కోణాలలో తరచి తరచి చూసినా పట్టిసీమ ప్రాజెక్ట్ ఇటు కృష్ణా డెల్టా కి ,అటు రాయలసీమ కి పెద్ద వరం . అలాగే ఇది చంద్ర బాబు దార్సనికతకు నిజమైన సరిఐన రూపం .
.