ఆంధ్రా లో ఎన్ని నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయి ?
40.
ఈ నదీ పరివాహక ప్రాంతాల వలన ఆంధ్రాకి నీటి లభ్యత ఎంత ఉంటుంది ? పూర్వం సమైఖ్య రాష్ట్రం లో 2800 టి.ఎం.సి.లు . కానీ ఇప్పుడు ఆంధ్రాకి కేవలం 1700 టి.ఎం.సి.ల నీరు అందుబాటులో ఉంది.
కృష్ణా నది నీటిలో ఆంధ్రా వాటా ఎంత ? కృష్ణా నదిలో 800 టి. ఎం.సి.ల నీరు లభ్యమవుతుంటే, ఆంధ్రప్రదేశ్‌కు 520 టి.ఎం.సి.లు, మిగతానీరు తెలంగాణాకు కేటాయించారు.
గోదావరి నది నీటిలో ఆంధ్రా వాటా ఎంత ? 650 టి.ఎం.సి.లు . మొత్తం 1480 టి.ఎం.సి.ల గోదావరి నీరు లభ్యమవుతుంటే, బచావత్ ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు అందులో 650 టి.ఎం.సి.లు కేటాయించారు, మిగతాది తెలంగాణా రాష్ట్రం పొందింది.
ఈ మూడు నదుల నుండి వచ్చే మన వాటా నీటిని నిల్వ చేసు కోవడానికి ఎంత సామర్ధ్యం గల జలాశయాలు ఉన్నాయి ?
పోలవరం డాం ఎలా ఉపయోగ పడుతుంది ?
పోలవరం ఎడమ కాల్వద్వారా విశాఖపట్నానికి 1.5 లక్షల ఎకరాల నీరు,
ఏలేరుకాల్వ ద్వా రా మరో లక్ష ఎకరాలకు నీరు ,
1000MW విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది .
ఉత్తరాంధ్ర ప్రాంతంలో మొత్తం 23 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, ప్రస్తుతం 10 లక్షల ఎకరాలకు మాత్రమే నీరందుతోంది, ఇంకా 13 లక్షల ఎకరాలకు నీరందాల్సివుంది. దీనికి ప్రభుత్వం ఏం చేయాలి ?
ఇందు కోసం నదుల అనుసంధానం, గోదావరి నీటి సమగ్ర వినియోగం అత్యంత అవసరం .
ఉత్తరాంధ్ర ప్రాంతం లో ఉన్న నదులు -వంశధార ,నాగావళి ,బాహుదా ,మహేంద్ర తనయ ,చంపావతి ,గోస్తనీ నదులను ఎలా అనుసంధానం చేయాలి ?
ఈ బ్లాగ్ ని ఫాలో అయ్యే మిత్రులు ఈ విషయాలను మీకు అందుబాటులో ఉన్న మంత్రులకు సవివరమైన మెమొరాండం ద్వారా అందించి ,ప్రభుత్వాన్ని కదిలించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ -
డా . శ్రీని వాస రాజు .

- పెన్నా నదిలో 100 టి.ఎం.సి.ల నీరు ఉంటే , 200 టి.ఎం.సి.ల నీటిని నిల్వ చేసే రిజర్వాయర్లు నిర్మాణం జరిగింది.
- కృష్ణానది కేటాయింపు 800 టి.ఎం.సి.లు ఉంటే, 800 టి.ఎం.సి.ల నీటిని నిల్వచేసే సామర్ధ్యం కలిగిన రిజర్వాయర్లు ఉన్నాయి.
- కానీ గోదావరి నీటిని నిల్వచేసేందుకు ఉన్న ఒకే ఒక రిజర్వాయర్ శ్రీరామ్‌సాగర్ సామర్ధ్యం 100టి.ఎం.సి.లు మాత్రమే. ఇప్పుడు ఆ జలాశయం కూడా తెలంగాణా రాష్ట్ర పరిధిలో ఉండడంతో, ఆంధ్ర ప్రదేశ్‌లో గోదావరి నీటిని నిల్వచేసే ఒక్క జలాశయం కూడాలేదు.
పోలవరం డాం ఎలా ఉపయోగ పడుతుంది ?
పోలవరం ఎడమ కాల్వద్వారా విశాఖపట్నానికి 1.5 లక్షల ఎకరాల నీరు,
ఏలేరుకాల్వ ద్వా రా మరో లక్ష ఎకరాలకు నీరు ,
1000MW విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది .
ఉత్తరాంధ్ర ప్రాంతంలో మొత్తం 23 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, ప్రస్తుతం 10 లక్షల ఎకరాలకు మాత్రమే నీరందుతోంది, ఇంకా 13 లక్షల ఎకరాలకు నీరందాల్సివుంది. దీనికి ప్రభుత్వం ఏం చేయాలి ?
ఇందు కోసం నదుల అనుసంధానం, గోదావరి నీటి సమగ్ర వినియోగం అత్యంత అవసరం .
ఉత్తరాంధ్ర ప్రాంతం లో ఉన్న నదులు -వంశధార ,నాగావళి ,బాహుదా ,మహేంద్ర తనయ ,చంపావతి ,గోస్తనీ నదులను ఎలా అనుసంధానం చేయాలి ?
- పోలవరం ఎడమ కాల్వ నుండి , "ఉత్తరాంధ్ర సుజల స్రవంతి" అనే ఎత్తి పోతల ప్రాజెక్ట్ నిర్మాణం మరియు గడిగెడ్డ రిజర్వాయర్, తాటిపూడి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా 20 టి.ఎం.సి.ల నీటిని నిల్వచేసి 8 లక్షల ఎకరాలకు నీరు అందించ వచ్చు .
- జంఝావతి ప్రాజెక్ట్ వలన ఉపయోగం ఏమిటి ? ఒరిస్సాతో ఒప్పందం కుదిరితే ,జంఝావతి ప్రాజెక్ట్ నిర్మించి తాటిపూడి ని అనుసంధానం చేయడం ద్వారా 4 టి.ఎం.సి.ల నీరు ,ఇంకా అదనం గా పారే 20 టి.ఎం.సి.ల నీటిని చంపావతి, గోస్తనీ నదీ పరివాహక ప్రాంతానికి కానీ మళ్లిస్తే, తాటిపూడి ద్వారా విశాఖకు కూడా నీళ్లు అందించవచ్చు.
- వంశధారనాగావళి నదులను అనుసంధానం చేయా లంటే ఏం చేయాలి ? గొట్టా బ్యారేజ్ ఇప్పటికే రెడీ గా ఉంది . కాబట్టి హిరమండలం జలాశయం నిర్మించి , దీనిని , నాగావళి పై ఉన్న నారాయణపురం ఆనకట్టకు అనుసంధానం చేస్తే, అదనపు నీరు లభ్యం అవుతుంది.
- మహేంద్ర తనయ, బాహుదా నదుల అనుసంధానం ఎలా జరపాలి ? పారాపురం జలాశయాన్ని కుడి, ఎడమల దిశగా అనుసంధానం చేస్తే, రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఇచ్ఛాపురం వరకూ నీరంది, అక్కడ నుంచి మహేంద్ర తనయ, బాహుదా నదుల మరో అనుసంధానం కూడా చేపట్టే అవకాశం ఉంది.
- వంశధార ప్రాజెక్ట్ ఎలా పని చేస్తుంది ? దీని కింద 52.5 టి.ఎం.సి.ల నీటిని వినియోగించేందుకు ఒప్పందం ఉంది. వంశధార స్టేజ్ వన్, టూ ద్వారా ఇప్పటివరకూ 35 టి.ఎం.సిలు మాత్రమే వినియోగిస్తున్నారు. మిగిలిన 17.5 టి.ఎం.సి.ల నీటిని వాడుకోవాలంటే, వంశధార స్టేజ్ త్రీ ద్వారా పారాపురం ద్వారా ఇచ్ఛాపురం, పాలకొండలకు నీటిని అందించవచ్చు.
ఇవన్నీ సాకార మైన నాడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో 12 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి వినియోగంలోనికి తీసుకొనిరావచ్చు .
ఈ బ్లాగ్ ని ఫాలో అయ్యే మిత్రులు ఈ విషయాలను మీకు అందుబాటులో ఉన్న మంత్రులకు సవివరమైన మెమొరాండం ద్వారా అందించి ,ప్రభుత్వాన్ని కదిలించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ -
డా . శ్రీని వాస రాజు .