Search This Blog

Wednesday, 25 January 2017

రాష్ట్ర ప్రజానీకానికి , యువతకు విజ్ఞప్తి . ఒక్క సారి ఆలోచించి అడుగు వేయండి .

1 . రాష్ట్రాలకు ఇచ్ఛే కేంద్రం నిధులు  32% నుండి 42% కి పెరిగిన ఈ  తరుణం లో  ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకు రాయితీ లొస్తాయ్ అనే మాట అబద్దం .
2. . 2 ఏళ్ల క్రితం హోదా అనే మాటనే రద్దు చేసిన 14 వ ఆర్ధిక సంఘం తీసుకొన్న నిర్ణయం కేవలం మన రాష్ట్రానికే చెందినది కాదు . అది యావత్ భారత్ దేశానికి వర్తిస్తుంది . కాబట్టి పార్లమెంట్ లో చట్ట సవరణ ద్వారా ఆ నిర్ణయాన్ని మార్చి నప్పుడు జరిగే ఫలితం కేవలం ఆంద్ర రాష్ట్రానికే కాక దేశం మొత్తానికి చెందే అవకాశం ఉంది . దేశంలోని అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా వస్తే మనకు కొత్తగా ఒరిగే దేమి ఉంటుంది ?
3. నిజానికి హోదా ' వఛ్చి ఉంటే , విదేశీ సంస్థలు ,విదేశీ బాంక్ ల సాయం తో నిర్మించే ప్రాజెక్ట్ (EAP-externally aided projects) లకు కేంద్రం 90% సాయం(grant) అందిస్తుంది . హోదాలేని రాష్ట్రాలకు కేవలం 60% సాయం అందిస్తుంది . అందుకే ,హోదా అనేది ప్రస్తుత రాజ్యాంగ పరిధిలో లేనందున , మన రాష్ట్రానికి హోదా వలన ఎంత సాయం అందేదో , అంతే సాయాన్ని ( 90% ) కేంద్రం అందివ్వడానికి ఒప్పుకోవడమే ప్రత్యేక ప్యాకేజి . ఇపుడు మనం డిమాండ్ చేయవలసింది , ప్రత్యేక ప్యాకేజి  కి చట్టబద్ధత !
4 . EAP లకు  FRBM  నిబంధనలు అడ్డొఛ్చి నా , ఆ సాయాన్ని మొత్తం ఋణం  గా  చూపించి కేంద్రమే తీర్చే విధం గా కేంద్రం ఇఛ్చిన హామీ నే ప్రత్యేక ప్యాకేజి .
ఎండిపోయిన చెరువులో చేపలు పట్టినా ఒకటో రెండో చేపలు దొరక వచ్చ్చేమో గానీ ,ఎండమావులలో చేపలు పట్టు కోవాలను కోవడం  వృథా ప్రయాస .
ఏది ఏమైనా పోరాటం చేయాలీ అనుకొంటే  ముందు అవినీతి పై చేయాలి . లింగ వివక్షత పై చేయాలి . కులాల కుమ్ములాట పై చేయాలి . ఓటు బాంక్ రాజకీయాల పైన చేయాలి . ప్రాంతీయ ,భాషా దురభిమానం పై చేయాలి . ఉత్తర దక్షిణ భారతా లంటూ రెచ్చ గొట్టే  పబ్బం గడుపు కొనే వారిపై చేయాలి . 9 మరియు 10 వ షెడ్యూల్ ఆస్థుల కింద తెలంగాణ నుండి రావలసిన 70000 కోట్ల కోసం చేయాలి .
ముందుగా మనం  భారతీయులం .  ఆ తర్వాతే తెలుగు వారం .
జైహింద్ . 

Friday, 20 January 2017

 జల్లికట్టు అనే ది ఒక ఆటా ? లేక తమిళుల  సంప్రదాయమా ? లేక శాస్త్రీయమైన రహస్యం ఏమైనా దాగుందా ?
 ఎవరికీ నష్టం కలిగించని  , ఏ వ్యవస్థ ను  కష్ట పెట్టని జల్లికట్టు ,  తమిళ సంప్రదాయం లో  తరతరాలుగా పెనవేసుకున్న సంప్రదాయపు క్రీడ .  దానివలన మంచే గానీ చెడు జరగదు . జంతువులను ఎలా ప్రేమించాలో జంతుమాంసం తినే విదేశీయులు మనకు చెప్పనక్కర లేదు .
ఎందుకు "పెటా" లాంటి విదేశీ కారుణ్య సంస్థలు పని గట్టుకొని భారత దేశ సంప్రదాయాలలో,సాంస్కృతిక  కార్యక్రమాల యందు వేలు పెడుతున్నారు ?
ఆడిట్ లెక్కలు కాదు కనీసం ఆదాయ వ్యయాల లెక్కలు  కూడా సమర్పించ కుండా , దొంగ ఖాతాలతో నెట్టు కొచ్చ్చే లక్షలాది  విదేశీ స్వచ్చ్చంద సంస్థలు మనదేశం లో   ప్రతిదానిలో వేలు పెట్టి అమాయకులను రెచ్చ  గొట్టి పబ్బం గడుపు కొంటున్నాయి . గ్రీన్ పీస్ అనే విదేశీ సంస్థ కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్ట్ ని ఇలాగే ఎదుర్కొన్నారు .

ఈ అరాచకాలకు  చెక్ పెట్టే  టైం  వచ్చ్చింది . తమిళ సోదరులు చేస్తున్న మెరీనా ఆందోళన,దేశంలో  మిగతా చోట్ల పేట్రేగు తున్న సాంస్కృతిక దాడుల ను ఎదుర్కొనే స్ఫూర్తిని ఇస్తుంది !సందేహం లేదు .
జైహింద్ . 

Sunday, 8 January 2017

What is Life ?

జీవితమంటే ఏమిటి ?
సుఖదుఃఖాల సమాహారం . 
సరే ,ఒక విషయం గానీ ,ఒక బంధం గానీ ,ఒక సంఘటన గానీ మనకు సుఖాన్నో ,దుఃఖాన్నో ఇస్తాయని అనుకొంటాం . 
నిజానికి  సుఖదుఃఖాలనేవి జరిగే సంఘటనల్లో ఉండవు . ఆయా సంఘటనలను మనం ఎలా తీసుకొంటున్నాం ? అనే దానిపైనే జీవితం ఆధారపడి  ఉంటుంది !
Life is 10% what happens to us but 90% of, how we react to it !