Search This Blog

Thursday, 7 June 2018

Modern prayer! ఆధునిక ప్రార్ధన.

మీకు దైవం పై నమ్మకం ఉన్నా,లేకున్నా మీ ఆత్మ సాక్షిగా , ప్రతి రోజూ 3 సార్లు ఈ క్రింది ప్రార్ధన శ్రద్ధతో,విస్వాసం తో చేయండి. మీరు పలుకుతున్న ప్రతి పదము' పైన ప్రగాఢమైన నమ్మకం తో ఉంటూ ,భావయుక్తంగా  ఉచ్చరించండి. ఇలా  జరగాలనే కోరికతోకాకుండా , మీరు పలికినవన్నీ నిజంగా జరుగుతున్నాయని భావన చేయండి.

"నేను ఎల్లపుడూ నిజమే మాట్లాడుతాను. 
నేను అన్నివేళలా ఇతరులకు సహాయం అందిస్తాను. 
నేను దైర్యంగా ఉంటాను. 
నేను ఎల్లపుడు ఆత్మవిశ్వాసంతో ఆలోచిస్తాను,ఆత్మ విశ్వాసంతో మాట్లాడుతాను,ఆత్మవిశ్వాసంతో కార్యాలు సాధిస్తాను.
నేను ఎల్లపుడు ఆరోగ్యంగా,ఉత్సాహంగా ఉంటాను.
నేను ఎల్లపుడూ విజయాన్నే సాధిస్తాను.
నేను బాధ్యతగా ఉంటాను.
నేను ఎల్లపుడూ సత్యమే చెబుతాను.
నేను ఎల్లపుడు అన్ని భాషలలో అనర్గళంగా మాట్లాడుతాను.
 నా మాటలు,చేష్టలు  అందరి హృదయాలకు చేరుతాయి.
నా మాటలు,చేష్టలు  అందరికీ స్వాన్తన  నిస్తాయి.
నేను అందరితో సామరస్యంగా ఉంటాను.
నేను మానవ సంబంధాలకు ప్రాముఖ్యత నిస్తాను .
నేను ఎప్పుడూ ప్రశాంతంగా,ఆనందంగా ,శాంతిగా ఉంటాను.
నేను సమస్త జీవులకు ప్రశాంతతను,  ఆనందాన్ని, శాంతిని ఇస్తాను.
నేను సాధించే విజయాలలో అందరికీ భాగస్వామ్యం ఉంటుంది.
నేను సాధించిన ఫలాలలో అందరికీ భాగస్వామ్యం ఉంటుంది.
నేను ప్రకృతిని ప్రేమిస్తాను.
నేను ధర్మం గా చరిస్తాను.
నేను-నేను-నేను అని చెబుతున్నాను గానీ,నిజానికి నేను అనేది "అదే!


Wednesday, 6 June 2018

BJP's Betrayal - భాజపా వారి మహాకుట్ర - 1 వ భాగం!

ఆంధ్రులు ఆధ్యాత్మిక చింతనా పరులేగానీ పరమత సహనం లేని మూఢ మతస్థులు కాదు. కాబట్టి సంఘ్ పరివార్ యుక్తులు ఉత్తరభారతంలో చెల్లుబాటైనట్లు ,ఆంధ్రాలో చెల్లవు. ఆంధ్రాలో కేవలం కుల పిచ్చే  గానీ,మత పిచ్చి లేదు. కాబట్టి , ఆంధ్రాలో కులాల మధ్యన మంటలు పెట్టి పబ్బం గడుపుకోవడానికి ఎక్కువశాతం ప్రయత్నం చేస్తారు భాజపా  వాళ్ళు.

భాజపా టార్గెట్ : చంద్రబాబు పతనం & తమ గుప్పెట్లో ఆంధ్ర రాష్ట్రం !
సూత్రధారులు : శ్రీ మోదీజీ & అమిత్ షా !
పాత్రధారులు : ఆంధ్రాలో ప్రతిపక్ష పార్టీల నాయకులు , విశ్రాంత ఆఫిసర్లు,విశ్రాంత అర్చకులు , విశ్రాంత రాజకీయ నాయకులు , ఖాళీగా ఉన్న దగుల్భాజీలు !
మహాకుట్ర లో తోలి అంకం  సుమారు 3 ఏళ్ళక్రితమే మొదలయింది. రాష్ట్రానికి ఏదో బిచ్చమేసినట్లు నాలుగు రూపాయలు, పేపర్ నోటిఫికేషన్ లు, నోటి మాటలు,గుప్పెడు హామీలు, తట్టెడు  ప్రచారం తో ఆంధ్రులను,చంద్రబాబుని  అందరినీ తప్పుదారి పట్టించి , తెర వెనక జగన్,పవన్ లతో లాలూచీ లు మొదలుపెట్టారు. ఈ కుట్రను కాస్త ఆలస్యంగా గ్రహించిన చంద్రబాబు , భాజపా గుప్పిటి నుండి బయటకు వచ్చేశాడు . అప్పటి నుండి భాజపా తమ మహా  కుట్రలో గేరు మార్చింది.  
తమకు ఎలాంటి సొంత బలం లేకున్నా, ఆంధ్రాలో అధికారాన్ని తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకోవడా నికి, తమిళనాడు మోడల్ లో ,  అవినీతి మకిలి లో మెడ వరకు కూరుకు పోయిన వారిని, చెప్పినట్లుగా ఆడే  వేషగాళ్ళను  వెనకుండి  నడిపించడం సంఘ్ పరివార్ అసలైన అస్త్రం.
ఇప్పటి వరకు జగన్ మోహన్ రెడ్డి కూడా మాట్లాడని విధంగా, పరుష పదజాలంలో చంద్రబాబుని తిడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆధారాలు లేకుండా,నోటికేది వస్తే అది కక్కే స్తున్నారు.  ఒక పక్క చంద్రబాబు బీజేపీతో పోరాడుతుంటే, చంద్రబాబుని బలహీనపరుస్తూ, నేషనల్ మీడియాకు ఎక్కి మరీ చంద్రబాబుని తిడుతున్నాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబుకు ఇంగితం లేదు అన్నారు... చంద్రబాబు ఇసుక కరా కరా తింటున్నారు అన్నారు... మేము రోడ్లు వేసాం అని లోకేష్ అంటుంటే,  ఇది నీ తాత గాడి సొమ్ము ఏమన్నా తెచ్చి పెడుతున్నావా ? మీ నాన్న నువ్వు కలిసి, కంకరు, సిమెంట్ కలుపుతున్నారా అనే దిగజారుడు, చౌకబారు ఆరోపణలు చేస్తున్నాడు పవన్... ఇక పవన్ సినిమా అభిమానులు అయితే, సోషల్ మీడియాలో చంద్రబాబుని, లోకేష్ ని ఎలా తిడుతున్నారో చెప్పే పని లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఇంత దిగజారి పోవలసిన అవసరం ఏమొచ్చింది? భాజపా వారి  తావీదు  మహిమ!

ఆంధ్రాలో ఏదో విధంగా బ్రాహ్మణ కులపు ఓట్లు, వీలయితే హిందువుల ఓట్లను గంప గుత్తగా భాజపా పార్టీకి పడేటట్లు ,అలాగే మొత్తం కాపుసమాజం ఓట్లు జనసేన పార్టీకి, దళితుల ఓట్లు మొత్తం జగన్ గారి పార్టీకి  పడేటట్లు చీలిస్తే,తెలుగుదేశం ఓడిపోతుందనే గాఢమైన నమ్మకంతో ఎలక్షన్ బూత్ స్థాయిలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. 
 కులాల వారీగా ఓట్లను చీల్చడం,  చంద్రబాబు సామర్ధ్యం పై సందేహాలు,చంద్రబాబు విశ్వసనీయత పై అనుమానాలు ప్రజల్లో కలగ చేయడం,  దీనికి గాను వివిధ వ్యక్తుల తో బురద జల్లుడు కార్యక్రమాలు చేయించడం, తమ మాట వినే రెండు సత్రకాయ పార్టీ నాయకుల కు స్క్రిప్ట్ ఇచ్చి పిచ్చి పెట్టినట్లుగా రెచ్చి పోయేటట్లు బూతులు వాగించడం,భాజపా వారి మహాకుట్ర లో ని వివిధ అంకాలు.  
ఇప్పటికే తిరుమల  వ్యవహారాలపై రమణ దీక్షితులతో (బ్రాహ్మణులూ)  , దళితుల సమస్యలపై మోత్కుపల్లి తో, అమరావతి పై  విశ్రాంత ఆఫీసర్లతో  చంద్రబాబు పై  బురద జల్లించారు. ఆ బురద కడుకోవడానికే చంద్రబాబు గారి విలువైన సమయం  సరిపోతుంది కాబట్టి,ఆయన రాష్ట్రం పై దృష్టి పెట్టలేడు ,అంతే కాదు జాతీయ రాజకీయాలలో కూడా యాక్టివ్ గా పాల్గోలేడని భాజపా వాళ్ళ ఊహ!

.భాజపా వాళ్ళు చేయించే ఆరోపణల్లో వాస్తవం లేకపోయినా మీడియాలో ఏదో ఒక విధమైన నెగెటివ్ ప్రాపగాండా ని ప్రజల్లోకి తీసుకెళితే, క్రమేణా చంద్రబాబుపై విశ్వసనీయత తగ్గి పోతుందనే మహాకుట్రలో భాగం గా భాజపా పార్టీ ,  వాళ్ళ శక్తియుక్తులు, వేలాది కోట్లను డబ్బులను  నీళ్లలాగా ఖర్చు చేస్తున్నారు. అందులో సగం మన రాష్ట్రానికి కేటాయించినా చంద్రబాబు వాళ్ళతోనే ఉండేవాడు గదా?  
ఇది ఏముంది?  ఇంకా ముందు ముందు ముస్లిం వ్యక్తులు , వెనుకబడిన తరగతులకు చెందిన వాళ్ళతో కూడా తెలుగుదేశం ,ముఖ్యంగా చంద్రబాబు పై  బురద జల్లే కార్యక్రమానికి తెర తీస్తారు.  
కానీ ఆంధ్రులు భాజపా చేసే మాయలు మోసాలకు లొంగుతారా?  రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొట్టే విధంగా జగన్ &పవన్  లు చేస్తున్న అరాచకపు వేషాలకు  ప్రజలు ముగింపు పలుకుతారని ఆశిద్దాం. 

ఇప్పటికే కన్నడ నాట తెలుగు వాళ్ళ దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించారు. భాజపా  నోటికాడి వరకు వచ్చిన అధికారాన్ని  లాగేశారు. 2019 లో కూడా ఆంధ్రులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరికీ ఎలా వాత పెట్టాలో అలా కీలెరిగి వాత పెట్టాలి!