Search This Blog

Thursday, 31 January 2019

చంద్రబాబు విశ్వరూపం

గత 4 ఏళ్లలో  కియా , ఇసుజు, టాటా, అశోక్ లేలాండ్, సినామాస్  వంటి బడా పరిశ్రమలు , పేరెన్నికున్న సాఫ్ట్ వేర్ కంపెనీలు , అదానీ,అంబానీ,జిందాల్  లాంటి దిగ్గజాలను,చైనా,కొరియా,జపాన్ ,ఇండోనేషియా లాంటి దేశాలనుండి  ధనాన్ని ఆంధ్రాకి రప్పించి సుమారు 100 పరిశ్రమలను స్థాపించి 12లక్షల ఉద్యోగాలను కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అదే మోదీ పాలన చూడండి. దేశాన్ని,నిరుద్యోగ యువత ను ఎంతగా కుంగదీశాడో అర్ధం అవుతుంది.
India's unemployment rate hit a 45-year high in 2017/18 . 
జాతీయ సర్వే NSSO-రిపోర్ట్ ఇది.

  • India's jobless rate shot up to 45-year high during 2017-2018.
  • NSSO showed unemployment rate at 6.1%, the highest since 1972-73.
  • Joblessness stood at 7.8% in urban areas compared with 5.3% in the countryside.
  • This was the first comprehensive assessment of India's employment situation post DeMo.


  • చంద్రబాబు  సారధ్యంలో దండుగ మారి వ్యవసాయం ఎలా పండుగగా మారిందో చూడండి. కేవలం 4ఏళ్లలో వ్యవసాయం, ఉద్యానవనాల నుండి రైతులు,రాష్ట్రం ఎంతగా లబ్దిపొందిందో ఈ క్రింది  చార్ట్ చూస్తే అర్ధం అవుతుంది. 3. 5శతం నుండి 18 శాతానికి పెరిగింది.





    వ్యవసాయమే కాదు, పారిశ్రామిక ప్రగతి ని గమనించండి.  ఏయే జిల్లాలలో ఏయే పరిశ్రమలు వచ్చాయో అర్ధం అవుతుంది. ఇందులో కొన్ని ప్రారంభోత్సవాలు జరుపుకొని ఉత్పత్తులు చేస్తుంటే, మరికొన్ని నిర్మాణదశలో ఉన్నాయి.
    అక్కడ లభ్యమయ్యే వనరులను బేస్ చేసుకొని  ప్రతి జిల్లాకి ప్రాముఖ్యతనిచ్చిన తీరు చూస్తే భారతదేశంలో ఏ నాయకుడూ చేయలేని ఘనకార్యం చేశాడు చంద్రబాబు అని తెలుసుకొంటాం.  పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో వికేంద్రీకరణ , యువతకు ఉద్యోగాలు, రైతుకి భరోసా, మహిళకు దన్ను , వెనకబడిన వర్గాలకు చేయూత , పేదలకు మూడు పూటలా కడుపు నిండా అన్నం , విద్యార్థులకు ఉచిత  విదేశీ విద్య , బాలికలకు సైకిళ్ళు, తల్లీబిడ్డ రక్షణకు ఎక్స్ ప్రెస్ సౌకర్యాలు, మనిషి జననం నుండి మహాప్రస్థానం వరకు అడుగు అడుగునా తోడూ నీడగా మారిన తీరు చూస్తే, ఇలాంటి నాయకుడు దొరకడం ఆంధ్రుల అదృష్టం.
    ఇదిగో ...ఇదే చంద్రబాబు విశ్వరూపం ...