Search This Blog

Saturday, 2 May 2020

5 లక్షల వైరస్ మరణాలా ? 10కోట్ల ఆకలి చావులా?

లాక్ డౌన్ విధించకపోతే మన భారతదేశం లో ఎంతమందికి వైరస్ సోకేది ? సుమారు కోటి మందికి సోకేదా? ఏమో ? ఓ పని చేద్దాం. ప్రపంచంలోనే బాగా దెబ్బతిన్న అమెరికా జనాభా ,అక్కడ వ్యాపించిన పాజిటివ్ కేసులు ,వాటి మధ్యనున్న నిష్పత్తిని ఒక మోడల్ గా తీసుకొని దానిని మన దేశానికి అప్లై చేద్దాం. 
 35కోట్ల అమెరికాలో ఓ 15 లక్షలమందికి సోకిన కరోనా ఇండియాలో ఎంతమందికి సోకుతుంది? రేషియో లో అమెరికా జనాభాకి 4 రెట్లున్న  138కోట్ల ఇండియాలో 4రెట్లు అనగా 60 లక్షల మందికి సోకే అవకాశం ఉంది. ఇలా జరగడానికి సుమారు ఏడాది పట్టేదాలేదూ 6నెలల్లో నే కోటిమందికి సోకేదనుకొందాం . 


వాస్తవానికి మనదేశంలోని 730 జిల్లాలలో కేవలం 300 జిల్లాలలోనే వైరస్ ఆక్టివ్ గా ఉంది. అంతేకాదు, 60 శాతం జనాభా ఉన్న రూరల్ ఏరియాలలో వైరస్ ఆక్టివ్ గా వ్యాపించలేదు. అంటే, దేశం లో 40 % ప్రాంతం లోనే ముఖ్యంగా నగరాలు, పట్టణాలలోనే వైరస్ ఎక్కువగా వ్యాపిస్తూ ఉంది. 

సరే,కోటి మందికి సోకితే అందులో 15శాతం అనగా 15 లక్షలమందికి హాస్పిటల్ అడ్మిషన్ అవసరమయ్యేది.  సుమారు ఒక్కో రోగికి 15రోజుల చొప్పున మనదేశం లో ఉన్న ఉన్న 2 లక్షల ఐసోలేషన్  బెడ్స్ సరిపోయేవి కావు. ఆక్సిజన్ సరిపోయేది కాదు. అన్నింటి కంటే ముఖ్యం హెల్త్ వర్కర్స్ సరిపోయేవారు కారు.     సుమారు 5లక్షలమంది చనిపోయేవారు . 
ఆక్సిజన్ యంత్రాలు గానీ, కనీసం ఆక్సిజన్ గొట్టాలు కూడా తయారు చేయలేని దుస్థితి లో మన దేశం ఉంది. దీనికి కారణం మన నాయకుల హ్రస్వ దృష్టి అని గానీ, ఆరోగ్యమే మహాభాగ్యమనే ఇంగితం లేకపోవడమనీ నేను విమర్శించబోవడం లేదు.


మనదేశం లోఉన్న అర లక్ష వెంటిలేటర్లు , 25000 అత్యవసర చికిత్స బెడ్స్ , 2 లక్షల ఐసోలేషన్ బెడ్స్ , 5 లక్షల ఆక్సిజన్ సిలిండర్లు, లక్ష మంది  వైద్య నిపుణులు , 5 లక్షలమంది నర్సింగ్ సిబ్బంది సరిపోరు. అత్యవసర చికిత్స లో నైపుణ్యం తక్కువ ఉన్న వైద్యులు , చాలీ చాలని మౌలిక సదుపాయాల తో ఈ కోవిడ్  తో యుద్ధం చేస్తే మరణాలు ఎక్కువగా నమోదు అవ్వడం లో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మన నాయకులు గత 70 ఏళ్లుగా పబ్లిక్ హెల్త్ ను ఏ మాత్రం పట్టించుకోలేదు. బిచ్చ మేసినట్లు వైద్యులకు, నర్సింగ్ సిబ్బందికి  జీతాలు ఇస్తున్నారు. సెకండరీగ్రేడ్ టీచర్లకు లక్షల  జీతమిస్తున్న ప్రభుత్వాలు,వైద్యులకు కేవలం 50 వేలు విదిలిస్తున్నాయ్. ఆరోగ్యరంగం లో మౌలిక సదుపాయాలను ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. అత్యవసర చికిత్సకు ప్రామాణికమైన హాస్పిటల్స్ లేవు. నిపుణులు లేరు. ప్రభుత్వాలు ఇకనైనా మారాలి. కనీసం మన జి డి పి లో 5 % ఆరోగ్యరంగానికి కేటాయించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాలనే గుణపాఠాన్ని  ప్రభుత్వాలు నేర్చుకోవాలి.   

నాన్ కోవిద్ జబ్బులు- ఆకలి ఆక్రన్దనలు. 

కోవిద్ పైనే గురిపెట్టి నాన్ కోవిద్ వ్యాధులను గాలికి వదిలేయడం వలన ఏడాదిలో కనీసం   10లక్షలమంది చనిపోయే అవకాశం ఉంది. 
 55 రోజులపాటు లాక్ డౌన్ విధించడం వలన ఏమి జరిగిందో తెలుసా?
అనధికారిక ఆర్థిక వ్యవస్థలో  వ్యవసాయ కూలీల ను పక్కనబెట్టినా , దాదాపు 20 కోట్లమంది  కార్మికులు అంటే దేశ  శ్రామికశక్తిలో దాదాపు సగం మంది జీవితాలు ప్రమాదంలో పడ్డాయని, వారి జీవనోపాధి ధ్వంసమైందని  అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) అధ్యయనంలో వెల్లడైంది.అదృష్ట వశాత్తు  పల్లె ల్లో వ్యవసాయరంగం పై లాక్ డౌన్ పెద్దగా దుష్ప్రభావం చూపెట్టలేదు. కేవలం అర్బన్ జీవనాన్ని మాత్రమే అతలా కుతలం చేసింది. 
  మనదేశం లో ఉన్న 5000 మీడియం సైజు, 3 లక్షల చిన్న సైజు, 6కోట్ల మైక్రో పరిశ్రమలలో పనిచేసేవారిలో 50% అనగా 10కోట్లమంది భవిష్యత్ అగమ్యగోచరమైపోతుంది. ఎందుకంటే పోస్ట్ లాక్ డౌన్ కాలం లో ఈ పరిశ్రమలు నిలదొక్కుకో గలవా ? అనే సందేహం నిజం కా కూడదని అనుకొందాం. ప్రభుత్వం స్టమ్యులస్ పాకేజీ ఇచ్చి ఈ రంగాన్ని ఆదుకోకుంటే 10 కోట్ల కుటుంబాలు వీధినపడతాయి. 
ఆర్ధిక మాంద్యం అంటే  ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడం చేత డిమాండ్ తగ్గిపోవడం. కానీ ఇప్పుడేమైందంటే, డిమాండ్ తోపాటు సప్ప్లై కూడా(ఉత్పత్తి) తగ్గిపోయింది.  

కరోనా మహమ్మారి సృష్టించిన ఆర్థిక సంక్షోభం ఫలితంగా 10కోట్ల మంది (ఇన్ఫార్మల్ ఎకానమీ వర్కర్స్) సంపాదన కోల్పోతున్నారని పేర్కొంది. ఇదంతా లాక్‌డౌన్ చర్యల ఫలితమని వివరించింది.   
   
హోల్‌సేల్, రిటైల్ రంగాలు, తయారీ రంగం ,వసతి, ఆహార  సేవల రంగం, రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు , చిన్న చిన్న హాస్పిటల్స్ అన్నీ ఇబ్బందుల్లో కూరుకు పోతాయి. 
 10కోట్ల కుటుంబాలు అంటే సుమారు 40కోట్లజనాభా !వీరి జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయి మరింత పేదరికం ,అనారోగ్యం ,మరిన్ని నేరాలు దేశ వ్యాప్తంగా పెరిగిపోయే అవకాశం ఉంది. 
దీనికి బాధ్యులెవరు ? 
కరోనా వైరస్సా ?
 ముందు చూపు లేని కరడుగట్టిన నాయకత్వమా ?
ఎప్పుడు లాక్ చేయాలో,ఎప్పుడు వదిలివేయాలో లెక్క వేయలేని  మేధావి వర్గమా?
ఏ మాట కామాట చెప్పుకోవాలి. వాతావరణం, పర్యావరణం, నదులు,సముద్రాలు , రోడ్లు అన్నీ స్వచంగా మారాయి. మరి,మనిషి మనస్సు మారిందా?అలవాట్లు శాశ్వతం గా  మారతాయా ? 
ఏది ఏమైనా ఈ క్రింది వాటిలో ఏదో ఒక టి సెలెక్ట్ చేసుకోవాలి!
5 లక్షల వైరస్  మరణాలా ? 
40 కోట్ల ఆకలి ఆక్రంద న లా? 
10కోట్ల ఆకలి చావులా?
మీరేది కోరుకొంటారు?!