ఓజస్సు, తేజస్సుగా,తేజస్సుప్రాణశక్తిని ఉద్దీపన చేసే శక్తిగా
చేసే విధానమే కాయకల్ప.
సృష్టిలో ఏదైనా దేశ కాలాలకు లొంగి ఉండవలసిందే!
కాలమానాలలో తేడా ఉండవచ్చు తప్ప , చివరికి బ్రహ్మ అనే శక్తికి కూడా జననం,లయమూ
ఉంటాయి. మానవ పూర్ణ ఆయుర్ధాయం 120 ఏళ్ళు. . కానీ ఈతి బాధలు, అంటువ్యాధులు,
ధాతు నష్ట ము, జనటిక్ తదితర వ్యాధులు , దురిత(కర్మ) కారకములు ఇలా అనేక కారణాల
చేత ఆయుర్ధాయం తగ్గిపోతుంది.
ముఖ్యంగా అపరిమితమైన లేదా పూర్తిగా లోపించిన ఆహరం,నిద్ర,ఆలోచనలు
,పని , లైంగిక క్రియ అనేవి మనిషిలో వైటల్ ఎనర్జీని బాగా తగ్గించివేస్తాయి.
ఎప్పుడైతే వైటల్ ఎనర్జీ తగ్గిందో, కణాలను పట్టిఉంచే బయో అయస్కాంత శక్తి
తగ్గి వ్యాధులు కలుగుతాయి .
కాబట్టి , ఆహరం,నిద్ర,ఆలోచనలు ,పని , లైంగిక క్రియ అనే
ఐదు మితంగా అదుపులో సంతులిత స్థాయిలోనే ఉండేటట్లు మన ప్రవర్తనను తీర్చి దిద్దుకోవాలి.
కేవలం వ్యాధి కి, వ్యాధి కారణానికి చికిత్స
అందిస్తే సరిపోదు. వ్యాధులను తట్టుకొనే రోగ నిరోధ సామర్ధ్యాన్ని పెంచితే తప్ప, క్వాలిటీ
ఆయువును అనగా ఎలాంటి రోగాలు లేని ఆయుస్సును మనిషికి ఇవ్వలేము.
బిలియన్ల సంఖ్యలోఉన్న సప్త ధాతువులకు చెందిన కణాలను ఒక
మానవాకారం లో కలిపి, నిలిపి ఉంచే శక్తినే బయో అయస్కాంత ఎనర్జీ
లేదా పోలార్ ఎనర్జీ అంటారు. ఈ అయస్కాంత శక్తి ఉందంటే విద్యుత్ శక్తి లాంటిది కూడా ఉండాలి
గదా?
అవును! కణాల మధ్యన భ్రమణం చేసే సూక్ష్మ మైన కణాలుంటాయి. వీటి
కేంద్రీయ భ్రమణ శక్తి ( centrifugal force ) వలన శక్తి తరంగాలు దేహమంతటా వ్యాపిస్తూ
ఉంటాయి. ఇదే విద్యుత్ శక్తి,కైనటిక్ శక్తి లేదా జీవశక్తి. (vital force).
జీవశక్తిని, బయో అయస్కాంత శక్తిని, ఎనర్జీని సరి
సమాన పాళ్ళలో ఉంచేటట్లుగా మన ఆహార విహార వ్యవహారాలను తీర్చి దిడుకొవాలి.
యోగ రసామృతం (sexual vital fluidic energy storehouse) అనేది ఒక బ్యాటరీ లాంటి అనగా శక్తిని నిల్వ ఉంచే ఒక రసాయనశక్తి . ఇది మెదడులో ముఖ్యంగా పీనియల్,పిట్యూటరీ,హైపో థలామస్ , మూడవ కుహరం అనే ఒక వలయకారపు సర్క్యూట్ ఉత్తేజము చెందినప్పుడు ఈ యోగ రసామృతం దేహములోని వైటల్ ఫోర్స్ ప్రవహించే నాడుల లోకి ప్రసరిస్తుంది.