Search This Blog

Monday, 19 February 2024

అమరావతి ఫైల్స్

 





అమరావతి ఫైల్స్ 1: చంద్రబాబు ఇప్పుడున్న అసెంబ్లీ ,Secretariat, హై కోర్ట్ భవనాలకు తాత్కకాలిక అని ఎందుకు అనాల్సి వచ్చింది ?? అమరావతి భూసేకరణ లో 90% 2015 లోనే పూర్తి అయ్యింది Master plan కూడా 2015 సెప్టెంబర్ కల్లా పూర్తి అయ్యింది కానీ అమరావతి అనుమతులు కావాలి అంటే NGT అనుమతి అవసరం. నార్మల్ గా అయితే అది వెంటనే వచ్చేది కానీ వైసీపీ వాళ్ళు కేసులు వేయించి అనుమతి రాకుండా అడ్డుకున్నారు ఫైనల్ గా NGT అనుమతులు నవంబర్ 17 2017 న వచ్చింది. NGT అనుమతులు లేకుండా రాజధాని కట్టటం కుదరదు. అందుకే ఏపీ ప్రభుత్వం రాజధాని భవనాలు కట్టటానికి "తాత్కాలిక" పెర్మిషన్ తెచ్చుకుంది. master plan ప్రకారం కాకుండా వేరే చోట కట్టటానికి అనుమతులు తెచ్చుకుంది. వైసీపీ వాళ్ళు తాత్కాలిక పేరుతో permanent రాజధాని కట్టేస్తున్నారు అని ఎక్కడ NGT దగ్గర మళ్ళా గొడవచేస్తారో అని .. ప్రాజెక్ట్ మొత్తం తాత్కాలిక అనే పేరుతో చేశారు. అప్పటి ప్రభుత్వం ఇది ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సింది .. ఇవ్వలేదు అసలు అమరావతి రాజధాని పనులు NGT అనుమతి వచ్చిన తరువాత .. January 2018 లో మొదలు అయ్యాయి. మీరు చూస్తున్న భవనాలు అన్ని 15 నెలలలో కట్టేసినవే.
Not only that,adi interim ane name tho chesaru There is difference btw interim and Tatkalika/temporary. YCP publicised it as temporary but they r interim and not temporary which TDP failed to give publicity.


అమరావతి ఫైల్స్ 2 అమరావతి స్మశానం అని వైసీపీ వాళ్ళు ప్రచారం చేశారు కానీ అమరావతి లో 3 అతి పెద్ద ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏర్పాటు అయ్యాయి అని ఎంత మందికి తెలుసు ఆ మూడిటిలో ఒకటి "India's No:1 Upcoming University" VIT కనీసం రోడ్డు కూడా వెయ్యకుండా జగన్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నా .. VIT వాడు బాబుగారి కి ప్రామిస్ చేసినట్టు కట్టుకుంటూ పోతున్నాడు ప్రస్తుతానికి ఆ యూనివర్సిటీ లో 25000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు బాబు గారు Phase 1 లో ఇచ్చిన లాండ్ మొత్తం వాడేసాడు. ఆయన వచ్చి రెండో ఫేస్ మొదలు పెట్టించాలి. కేవలం ఈ University లోనే 60-70000 స్టూడెంట్స్ వుంటారు అమరావతి లో వున్న ఉన్నత విద్యా సంస్థలు అన్ని పూర్తి అయ్యేసరికి .. రెండులక్షల వరకు స్టూడెంట్స్ వుంటారు.

అమరావతి ఫైల్స్ 3 NID : National Institute of Design పురంధేశ్వరి గారు కాంగ్రెస్ కేంద్ర HRD minister of State గా వున్నప్పుడు విజయవాడ కి రెండు కేంద్ర సంస్థలు ఇచ్చారు 1. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) 2. School of Planning and Architecture (SPA) అప్పట్లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కనీసం భూమి ఇచ్చే ప్రయత్నం కూడా చెయ్యలేదు. రెండేళ్ల తరువాత SPA అద్దె భవనాలలో మొదలయ్యింది .. NID కి ఆ అదృష్టం కూడా దక్కలేదు ( జగన్ మోహన్ రెడ్డి బయటపడ్డాడు కానీ .. ఏ సీమ రెడ్డి ముఖ్యమంత్రి కూడా విజయవాడ - గుంటూరు ప్రాంతానికి ఏమి చెయ్యలేదు .. ఆ ప్రాంతం చూస్తే సీమ రెడ్లకు అదో రకమైన insecurity) బాబు గారు 2014 లో ముఖ్యమంత్రి అయ్యిన వెంటనే NID temporary campus Nagarjuna University లో ఏర్పాటు చేసి .. 2015 నుంచి మొదటి బ్యాచ్ మొదలు పెట్టించారు. SPA కి కూడా విజయవాడ నడి బొడ్డులో .. polytechnic College లో నిరుపయోగంగా వున్న లాండ్ లో కొంత SPA కి allot చేశారు. Venkaiah Naidu గారు వెంటనే College కట్టటానికి నిధులు ఏర్పాటు చేయించి. రెండు సంవత్సరాలలో పూర్తి చేసేశారు. NID కి అమరావతి లో 50 ఏకరాల లాండ్ ఇచ్చారు. పనులు కూడా మొదలు పెట్టారు. గత ప్రభుత్వం ఆఖరి సంవత్సరంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం కొంచెం slow చేసింది. ఆ తరువాత ఆ ఇన్స్టిట్యూషన్ గురుంచి అడిగే వాడు లేడు. పని మొదలు పెట్టీ 7 సంవత్సరాలు తరువాత ఇది పరిస్థితి. 👇👇 VIT & NID పనులు ఒకేసారి మొదలు అయ్యాయి. అది ప్రైవేట్ అవ్వటం వల్ల వేగం గా పనులు చేసి .. మొదటి సంవత్సరం లోనే క్లాసులు మొదలు పెట్టీ .. NID కంటే 30 రేట్లు ఎక్కువ కట్టడాలు పూర్తి చేశారు ( ఫోటో అమరావతి ఫైల్స్ 2 పోస్ట్ లో చూడొచ్చు) ప్రభుత్వం రోడ్డు ఇవ్వకపోయినా VIT వాడు ముందుకు వెళ్ళాడు NID కేంద్ర ప్రభుత్వ సంస్థ అందుకే లైట్ తీసుకున్నాడు బాబు రావాలి NID కొత్త campus లో క్లాసులు మొదలు పెట్టాలి.

National Institute of Fashion Technology (NIFT), Central Institute of Tool Design (CITD), Indian Institute of Plantation Management (IIPM) e institutes kuda Central Govt Vijayawada ki allot chesindi vatiki Amaravati, Gannavaram lo land allot chesaru avi jaragaledhu.

Amaravati Files - 4 అమరావతి లో ఉద్యోగులు , IAS / IPS అధికారులు , MLA / MLC లు నివాసాల కోసం కట్టిన ఇళ్లు 75% పూర్తి అయ్యాయి జగన్ మోహన్ రెడ్డి ఆ పనులు ముందుకు తీసుకెళ్లినట్లు అయితే ఇంకో ఆరు నెలలలో పూర్తి అయ్యేవి. మహా అయితే ఇంకో 1000 కోట్లు ఖర్చు అయ్యేవి ఇవి ఉద్యోగులు కి ఇచ్చినట్టు అయితే ప్రభుత్వానికి నెలకి HRA రూపములో 70 కోట్లు మిగిలేవి. ( ఈ 70 కోట్లు లెక్క ఎక్కడ నుంచి వచ్చింది అని మీరు అడగొచ్చు. రెండు రోజులు క్రితం ఏపీ ప్రభుత్వం నెలకి 70 కోట్లు అద్దె CRDA కి చెల్లిస్తునట్టు ఒక GO ఇచ్చింది ) అంటే 50 నెలలో ప్రభుత్వానికి 3500 కోట్లు ఆదాయం వచ్చేది. బిల్డింగ్లు పూర్తి అయ్యేవి. వెయ్యి కోట్లు ఖర్చులకు పోను .. మిగిలిన 2500 కోట్లు తో secretariat భవనాలు కట్టి వుంటే జగన్ కి పేరు కూడా వచ్చేది. వాళ్ళ కాంట్రాక్టర్లకు పనులు కూడా దక్కేవి. కానీ జగన్ మంచి పేరు కంటే అమరావతి నాశనం ఎక్కువ కోరుకున్నాడు ..


Amaravati Files - 5 అమరావతి మునగాలి అంటే ప్రళయం రావాల్సిందే !! అమరావతి announce చేసిన వెంటనే అమరావతి ముంపు ప్రాంతం అని నీలి బ్యాచ్ ప్రచారం మొదలు పెట్టింది అసలు అమరావతి మునుగుతుందా ?? అమరావతి కి రెండు ముంపు ముప్పులు వున్నాయి 1. కృష్ణ నదిలో వచ్చే వరద వల్ల 2. కొండవీటి వాగు వల్ల కొండవీటి వాగు వల్ల వచ్చే ముంపు గురుంచి అమరావతి ఫైల్స్ 6 లో మాట్లాడుకుందాం. ఇప్పుడు కృష్ణ నదిలో వచ్చే వరద వల్ల వచ్చే ముంపు గురుంచి ఇప్పుడు మాట్లాడుకుందాము అమరావతి నగరం కృష్ణా నది ఒడ్డున వుంది. నగరానికి వున్న నాలుగు పక్కలలో ఒక పక్క ( నార్త్) కృష్ణ నది వుంటుంది ( 15km river front వుంటుంది) కృష్ణ నదికి వరదలు వస్తె .. అమరావతి మునాగాలి కదా అనే డౌట్ అందరకీ రావొచ్చు. అమరావతికి ఆనుకుని వున్న కృష్ణ బ్యారేజి లో ఎప్పుడు సముద్ర మట్టం నుంచి 17.3 మీటర్లు ఎత్తులో నీరు నిలువ వుంచుతారు కృష్ణ బ్యారేజి మీద వున్న ఎత్తు సముద్ర మట్టం నుంచి 25 మీటర్లు అమరావతి వైపు వున్న కరకట్ట ఎత్తు సముద్ర మట్టం నుంచి 25 మీటర్లు 2009 లో వచ్చిన 100 సంవత్సరాలలో అతి పెద్ద వరద ఎత్తు 21 మీటర్లు .. అప్పుడు 11 లక్షలు cusecs వరద వచ్చింది. అమరావతి మునగాలి అంటే 25 మీటర్లు కన్నా ఎక్కువ ఎత్తు వరద రావాలి అంటే 25 లక్షలు cusecs వరద రావాలి 11 లక్షలు cusecs వరద శ్రీశైలం నుంచి వదిలినప్పుడే శ్రీశైలం ఏమైపోతుందో అని భయం వేసింది .. 25 లక్షల వరద శ్రీశైలం నుంచి వదలాలి అంటే ... శ్రీశైలం కొట్టుకు పోతుంది .. కింద నాగార్జున సాగర్ కొట్టుకు పోతుంది చెప్పాలి అంటే .. కర్నూల్ నుంచి బంగాళ ఖాతం వరకు మొత్తం వరద మించితే కానీ అమరావతి లోకి చుక్క నీరు అమరావతి లోకి రాదు. అది పరిస్థితి అమరావతి లోకి వరద రావాలి అంటే ప్రళయమే రావాలి కొండవీటి వాగు ముంపు గురుంచి .. చంద్రబాబు క్రైసిస్ నీ oppurtunity గా ఎలా మర్చేసాడో .. అమరావతి ఫైల్స్ 6 లో మాట్లాడుకుందాము
Image


అమరావతి ఫైల్స్ 6 కొండవీటి వాగు ముంపు - చంద్రబాబు క్రైసిస్ నీ oppurtunity గా ఎలా మార్చేశాడు అమరావతి కి నిజంగా ముంపు ప్రోబ్లం ఏదైనా వుంది అంటే అది కొండవీటి వాగు వల్ల వుంది కొండవీటి వాగు ప్రస్తుత రాజధాని ప్రాంతంలో నెక్కల్లు దగ్గర ప్రవేశించి , శాఖమూరు వరకు తూర్పు దిశగా ప్రయాణించి , అక్కడ నుంచి దక్షిణ దిశగా నీరుకొండ వరకు వెళ్లి .. అక్కడ నుంచి ఈశాన్య దిశగా ప్రయాణించి , ప్రకాశం బ్యారేజి దగ్గర కృష్ణ నదిలో కలుస్తుంది. ప్రస్తుత రాజధాని లో ఆల్మోస్ట్ 25 km ప్రవహిస్తుంది రాజధాని లో ఇంకో వాగు పాలవాగు. ఈ రెండు వాగులు కలిపి రాజధాని ప్రాంతం లో 40 కిలోమీటర్లు పైనే ప్రవహిస్తాయి కొండవీటి వాగు వల్ల మామూలు రోజులలో ముంపు వుండదు .. కానీ కొండవీటి వాగు కు కృష్ణ నదికి ఒకేసారి వరద వస్తేనే ఇబ్బంది. కృష్ణ నది లో వరద వున్నప్పుడు కొండవీటి వాగు వరద వెనక్కి తన్ని .. అమరావతి లో ముంపు ఏర్పడుతుంది అందుకే చంద్రబాబు గారు అన్నిటికన్నా ముందు ఈ problem నీ అడ్రెస్స్ చేశారు. ఆయన కొండవీటి వాగు లిఫ్ట్ కట్టించారు .. కృష్ణ నదికి వరద వచ్చినప్పుడు కొండవీటి వాగు వరదని కృష్ణ నదిలోకి ఎత్తి పోస్తారు అన్నమాట .. అవసరమైతే కొంత వరద నీ గుంటూరు కాలువ లోకి కూడా డైవర్ట్ చేస్తారు. ఇది చెయ్యటం వల్ల కొండవీటి వాగు ముంపు ప్రోబ్లం నీ అమరావతి పనులు మొదలు పెట్టక ముందే solve చేశారు. ఇదే కాకుండా .. కొండవీటి వాగు వెడల్పు నీ 100 మీటర్లు వరకు పెంచుతున్నారు. శాఖమూరు, నీరుకొండ , కృష్ణయ్యపాలెం లో కొండవీటి వాగు మీద బాలన్సింగ్ చెరువులు తవ్వుతున్నారు .. పాలావాగు కూడా వెడల్పు చేస్తారు. కృష్ణ బ్యారేజి లో ఎప్పుడు సముద్రమట్టం నుంచి 17.5 మీటర్ల ఎత్తులో నీళ్ళు వుంటాయి. ఇప్పుడు అమరావతి లో అన్ని వాగులలో కూడా అదే ఎత్తు కి నీళ్ళు నిత్యం వుంటాయి. దీని వల్ల 45 కిలోమీటర్లు బారు waterfront Property Amaravati లో వుంటుంది అమరావతి మొత్తం బోట్లు లో తిరిగి రావొచ్చు. అసెంబ్లీ దగ్గర బోట్ లో బయల్దేరి .. అమరావతి చుట్టు తిరిగి (40km) మళ్లీ అసెంబ్లీ దగ్గరకి రావొచ్చు. ఒక ముంపు ప్రోబ్లం కి సొల్యూషన్ వెతుకుతూ .. 45 కిలోమీటర్లు బారు waterfront real-estate , tourism , navigation వంటి opportunities శృష్టించాడు Chandrababu. మనకి వున్న కుళ్ళు బుద్ది ఒప్పుకోదు కానీ .. అమరావతి తెలుగు జాతికి ఒక గోల్డ్ mine.





Thursday, 1 February 2024

Jagannath Rathyatra



Jagannath Rath Yatra is a Hindu festival that celebrates the journey of Lord Jagannath, his brother Lord Balabhadra, and his sister Goddess SubhadraThe festival takes place annually on the second day of the Odia month of Ashadha Shukla Tithi.

During the festival, devotees pull the three deities in three large wooden chariots along the grand avenue to the Gundicha Temple. The deities stay at the temple for a week and then return to the Jagannath temple.The Rathas are huge wooden structures with wheels that are built anew each year. The chariot for Jagannath is about 45 feet high and 35 feet wide, and takes about two months to construct!

నీలాద్రి నాథం నమామి నిత్యం నమామి నిత్యం నీలాద్రి నాథం. నీలాద్రి నాథం నమామి నిత్యం నమామి నిత్యం నీలాద్రి నాథం నమీ ప్రణోమి నమస్కరోమి నమీ ప్రణోమి నమస్కరోమి గృణామి నిత్యం నీలాద్రి నాథం. || నీలాద్రినాథం || ఆనందకందం సుచ్ఛందస్యందం పూర్ణారవిందం సదైవ వంద్యం ఆనందకందం సుచ్ఛందస్యందం పూర్ణారవిందం సదైవ వంద్యం నమీ ప్రణోమి నమస్కరోమి నమీ ప్రణోమి నమస్కరోమి ముఖారవిందం సదారవిందం. ||నీలాద్రినాథం|| అశేషతోషం సుహాసవాసం మధుప్రకాశం విషవినాశం అశేషతోషం సుహాసవాసం మధుప్రకాశం విషవినాశం నమీ ప్రణోమి నమస్కరోమి నమీ ప్రణోమి నమస్కరోమి శ్రీశం సురేశం జగదీశ మీశం ||నీలాద్రినాథం|| సదా వసంతం హృది హాసంతం శ్రియలసంతం శుభం స్మరంతం సదా వసంతం హృది హాసంతం శ్రియలసంతం శుభం స్మరంతం నమీ ప్రణోమి నమస్కరోమి నమీ ప్రణోమి నమస్కరోమి సంసారసారం కరుణావతారం. ||నీలాద్రినాథం|| మనోభిరామం నికామకామం స్వయం ప్రమాణం పూర్ణా పురాణం మనోభిరామం నికామకామం స్వయం ప్రమాణం పూర్ణా పురాణం నమీ ప్రణోమి నమస్కరోమి నమీ ప్రణోమి నమస్కరోమి నారాయణాచ్ఛ ప్రణోమి నౌమి. ||నీలాద్రినాథం||
courtesy: Dr. Ruru Kumar Mahapatra wrote this lyric.