డయాఫ్రమ్ వాల్.. ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న టాపిక్ ఇది... YCP ప్రభుత్వం చేసిన అరాచక పాలన, వివాదాస్పద నిర్ణయాలు, రివర్స్ టెండరింగ్ , పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ వద్దని చెప్పినా వినకుండా కాంట్రాక్టర్ ని కమిషన్లకోసం మార్చేయడం ,తదితర దుర్మార్గాలవలన పోలవరం ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోవడమేకాదు,సుమారు లక్షకోట్ల నష్టం జరిగింది.
అసలు డయాఫ్రమ్ వాల్ లో ఏమి జరిగింది, ఎవరు దీనికి బాధ్యలు అనేది తెలుసుకుందాం రండి..
డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటి ?
పోలవరం ప్రాజెక్టు కోసం 41 మీటర్ల ఎత్తులో, దాదాపు 1750 మీటర్ల పొడవునా రాతి-మట్టికట్ట నిర్మించాల్సి ఉంది. అలా మట్టికట్ట వేసినప్పటికీ ఎన్నో రోజులు నిలవదు. ఎందుకంటే... కట్ట కింద ఉన్న ఇసుక కదిలిపోతుంది. దాంతోపాటు రాక్‌ఫిల్ డ్యామ్ కూడా కుంగిపోతుంది. అలా జరగకుండా మట్టికట్ట కింది నుంచి ఒక్క చుక్క కూడా నీరు అట్నుంచి ఇటు రాకుండా నదీగర్భంలోనే అతిపెద్ద గోడ కట్టాలి. అదే... ‘డయాఫ్రమ్ వాల్’. మొత్తం ప్రాజెక్టులో ఇది అత్యంత కీలకం. గోదావరినదిలో 300 అడుగుల లోతులో 1427 మీటర్ల పొడవునా, 1.5 మీటర్ల మందంతో నిర్మించారు.
చంద్రబాబు గారు ఎంతో అనుభవం ఉన్న బావర్ కంపెనీకి పనులు అప్ప చెప్పారు. ఇనుప చక్రాలున్న భారీ యంత్రం ఇసుకను తొలుచుకుంటూ రాతి పొర తగిలేదాకా వెళ్లి, రాతి పొరను కూడా మరో రెండు మీటర్లు లోపలికి తవ్వి... అక్కడి నుంచి పైదాకా ఐదు మీటర్ల వెడల్పుతో కాంక్రీట్ గోడ కొట్టారు. ఇది పూర్తిగా నదీ గర్భంలో ఉంటుంది. అందుకే జగన్ రెడ్డి మొదటి సారి పోలవరం వెళ్ళినప్పుడు, డయాఫ్రమ్ వాల్ ఎక్కడ కనిపించదే అని తన అజ్ఞానాన్ని బయట పెట్టి అభాసు పాలు అయ్యాడు.
2017 ఫిబ్రవరి లో మొదలయ్యి 2018 జూన్ నెలలో పూర్తయ్యింది. 412 రోజుల్లో నిర్మాణం పూర్తి చేసారు.
పోలవరం కాఫర్ డాం నిజాలు:
కాఫర్ డ్యాం మూడు streches గా కట్టారు. ఒకటి 300 మీటర్లు, మరొకటి 1700 మీటర్లు, మూడోది 300 మీటర్లు. ఈ మూడిటి మధ్య, 300 మీటర్లు వరకు రెండు గ్యాపులు ఉంటాయి.
గడువుకి వారమ్ ముందే, జూన్ 2018లో.. ఎగువ కాఫర్ డామ్ గ్రౌటింగ్ పనులు పూర్తి అయ్యింది, అక్టోబర్ 2018 నాటికి దిగువ కాఫర్ డామ్ గ్రౌటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి.
వివాదం ఏంటి ?
2018 జూన్ నెలలో డయాఫ్రమ్ వాల్ పూర్తయ్యింది. 2018 సీజన్ లో వరద వచ్చింది, 2019 లో భారీ వరద వచ్చింది. 2019లో స్పిల్ వే మీద నుంచి కూడా నీళ్ళు వెళ్ళాయి. అప్పుడు కొట్టుకు పోని డయాఫ్రమ్ వాల్ 2020 ఆగస్టు లో ఎందుకు కొట్టుకుపోయింది ?
ఎందుకు కొట్టుకుపోయింది అంటే, జగన్ రెడ్డి చేతకాని తనం వల్ల:
స్పిల్ వే కట్టకుండా, కాఫర్ డ్యాం కట్టారు, కాఫర్ డ్యామ్ అవ్వకుండా డయాఫ్రం వాల్ కట్టాడు. అనేది వైసీపీ చేసే పిచ్చి వాదన:
స్పిల్ వే క్రస్ట్ లెవెల్ 25.72 మీటర్లు పూర్తి చేస్తే కాఫర్ డ్యాం మొదలు పెడతారు. చంద్రబాబు కూడా అలాగే స్పిల్ వే క్రస్ట్ లెవెల్ 25.72 మీటర్లు అయ్యాకే, కాఫర్ డ్యాం నిర్మాణం మొదలు పెట్టారు. ఈ సైకోలు చెప్తున్నట్టు, స్పిల్ వే మొత్తం పూర్తి అవ్వాల్సిన పని లేదు. నిజానికి స్పిల్ వే క్రస్ట్ లెవెల్ 25.72 మీటర్లు చంద్రబాబు పుర్తి చేసారు, ఇక్కడ నుంచి జగన్ చేసిన పని కేవలం చంద్రబాబు కట్టిన దాని పైన ప్రీక్యాస్ట్ స్లాబ్స్ వేయటమే. స్పిల్ వే మొత్తం పూర్తయితేనే కాఫర్ డ్యాం కట్టాల్సిన పని లేదు, ఆ వాదన పూర్తిగా తప్పు.. అరేయ్ సైకోలు మళ్ళీ మళ్ళీ చదవండి ఈ పాయింట్..
స్పిల్ వే క్రస్ట్ లెవెల్ 25.72 మీటర్లు వరకు కాంక్రీట్ పూర్తయితే, అప్రోచ్ ఛానెల్, స్పిల్ ఛానెల్ పూర్తయ్యి నదీ ప్రవాహం మారుతుంది. 2019 జూన్ కి ముందే అవి పూర్తి అయ్యాయి. ఇక్కడ సమస్య కాఫర్ డ్యాంలో వచ్చిన గ్యాప్ లు పూడ్చకపోవటం వల్ల, డయాఫ్రం వాల్ దెబ్బతింది. ఈ పని చేయటానికి రెండు నెలలు చాలు. చంద్రబాబు దిగిపోయి, జగన్ రెడ్డి వచ్చాక 18 నెలలు పోలవరం పనులు పూర్తి కాలేదు. ఈ లోపు రెండు సార్లు వరద వచ్చి, ఈ నష్టం జరిగింది.
కాఫర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ సమాంతరంగా కట్టాలి. దానికి తగ్గట్టే చంద్రబాబు గారు కాఫర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ కట్టారు. ఇక్కడ సమస్య కేవలం కాఫర్ డ్యాంలో ఉన్న గ్యాపుల వల్ల. 2020 వరదలకు ఈ గ్యాప్ లో నుంచి నీరు డయాఫ్రం వాల్ కి కొట్టటంతో, దెబ్బతింది. మరి 18 నెలలు జగన్ రెడ్డి, ఆ గ్యాప్ లు పుడ్చాకుండా ఏమి చేసాడు ?
మే 2019 నాటికి చంద్రబాబు ప్రభుత్వం ఏడు నెలలలో రెండు వేల కాఫర్ డ్యాం పనులు పూర్తి చేసింది. అంటే నెలకు ఏవరేజ్ గా 300 మీటర్లు పూర్తిచేసారు. ఇంకో రెండు నెలలు లో 300+300 మీటర్ల గ్యాప్ పనులు పూర్తి అయ్యేవి. కానీ మన దరిద్రానికి, జగన్ రెడ్డి వచ్చాడు పనులు ఆపేసాడు. 18 నెలలు పని ఆపేసాడు. రెండు వరదలు వచ్చాయి. మూర్ఖంగా చేయకుండా పని పూర్తి చేసి, అధికారులు, కేంద్రం చెప్పిన మాట విని ఉంటే, రెండు నెలల్లో ఆ గ్యాప్ లు ఫిల్ అయ్యేవి, ఈ పాటికే పోలవరం ప్రారంభం కూడా అయ్యేది. మ
మూర్ఖంగా చేసిన ఆ చిన్న తప్పుతో, కాఫర్ డ్యాం పోయింది, డయాఫ్రం వాల్ పోయింది, గైడ్ బండ కుంగింది, ఇంకా చాలా అనర్ధాలు జరిగి, చివరకు మళ్ళీ పోలవరం మొదటికి వచ్చింది.. ఆ రోజు రెండు నెలలు జగన్ రెడ్డి పని చేసి ఉంటే, పోలవరం వేరే రకంగా ఉండేది..
ఇంకా ఉంది. లక్షకోట్ల నష్టం ఎలా జరిగిందో నెక్స్ట్ పోస్ట్ లో తెలుసుకొందాం .