భారతీయులు ఆచరించే సంప్రదాయాలను హిందూ మతం అని పిలవడం తప్పు.
హిందువులకు మతం లేదు. ఉన్నదంతా మనిషి సుఖంగా,శాంతం గా ఎలా జీవించాలో తెలిపే జీవన విధానం.
ఆ పద్దతి నే సంస్క్రుతం లో ధర్మం' అని పిలుచు కొంటాము.ఎప్పటి నుండో పురాతన కాలం నుండి ఉన్న సత్ ధర్మం కాబట్టి సనాతన ధర్మం అని చెప్పుకొంటా ము .సింధు ప్రాంతపు ప్రజలు ఆచరించే ధర్మం కాబట్టి పర దేశీయులు హిందూ మతం అని పిలుస్తున్నారు .
ధర్మం, జీవన సూత్ర సంపుటి. మనిషి ఎప్పుడు ఎలా,ఏ విధం గా ప్రవర్తిస్తే
వ్యక్తి తో పాటు వ్యవస్థ కూడ ఆనందం గా సమతుల్యత లో ఉంటుందో తెలిపేది హిందూ ధర్మం.
ఇది చాలా పురాతన మైనది. ఎన్నో వేల ఏళ్ళ క్రితం అనేక మంది మహర్షులు
సంఘ గమనాన్ని,మనిషి బలం -బలహీనతలను,తద్వారా దేశ సౌభాగ్యం ఎలా పరివర్తనం చెందుతుంది-
మొదలగు సాంఘిక,భౌతిక విషయాలను పరిశీలించి , వివేకం తో విచక్షణ చేసి, నిగ్గు తేల్చిన జీవిత
విధానాలు, హిందూ ధర్మం గా పరివ్యాప్తి చెందింది.
దీని నుండి,ఆయా దేశ,కాల మాన పరిస్థితులకు
అనుగుణం గా ఆహార అలవాట్లు,పండుగలు,నమ్మకాలు,ఆచారాలు,సంప్రదాయాలు వ్యాప్తి చెందాయి.
ప్రపంచం ఇలా దేశాలుగా విడిపోక ముందే,పరిణామ క్రమంలో హిందూ ధర్మం
పుట్టి ,వ్యాప్తి చెందింది.
సిద్దాంతం ఎంత మంచిదైనా,
ఆయా మహర్షులు ఎంతగా తపించి జీవన విధానాన్ని
సూత్రాలుగా చెప్పినా,కాల క్రమం లో మానవ సమూహాలు ఆయా సంఘ అవసరాలకు అనుగుణ్యం గా కొత్త కొత్త భాష్యాలు లేవదీస్తాయి. అలా ఏర్పడినవే,
జైన,బుద్ద, వైష్ణవ,శైవ,శాక్తేయ,గాణ పత్య,ఆదిత్య, ఇస్లాం,యూదు,జొరాష్ట్రియన్,క్రీస్తు
సూత్రాలు /మతాలు.
సూత్రాలకు,అంటే ధర్మానికి, మతానికి తేడా ఏమిటి?
ధర్మం ఓ జీవ నదీ ప్రవాహం ఐతే,మతం
ఒక దిగుడు బావి లాంటిది.
నదిలో నీరున్నం త వరకే ఏ బావి ఐనా దప్పిక తీర్చుతుంది.
మనిషి ఎలాంటి వాడు?
మనిషి ఎల్లప్పుడూ తన అస్తిత్వాన్ని
కాపాడుకోవడానికి ఎన్నో యుక్తులు పన్నుతాడు. అందులో ముఖ్యమైనది,గుంపు ని పోగు చేయడం
లేదా గుంపులో కలిసిపోవడం.
జంతువులు కూడ ఈ యుక్తినే పాటిస్తాయి.
సరే,గుంపు లేదా సమూహం ఎలా తయారవుతుంది?
గుంపుకి ఏదైనా ప్రత్యేకత ఉండాలి. చర్మం రంగు,బలమైన శరీరం, ఆ తర్వాత
మతం,కులం, ధనం,క్లబ్బు, వ్రుత్తి,అలవాట్లు- ఇలా ఏదో ఒక దానిని ప్రత్యేక లక్షణం గా చూపుతూ
గుంపులు ఏర్పడ తాయి.
ఆ గుంపు లో ఉన్న వ్యక్తుల సంఖ్యని బట్టి ఆ గుంపు కి అంత బలం ఏర్పడుతుంది.
గుంపు ఎంత బలం గా ఉంటే ఆ గుంపులోని వ్యక్తి కూడ అంత బలం గా ఉంటాడు.
ప్రస్తుత భారత దేశం లో మత సామరస్యత పేరుతో ఒక మతాన్ని పూచిక పుల్ల
లా చూస్తూ ,మరి కొన్ని మతాలను ప్రోత్సహిస్తున్నారు. అది తప్పు .
ప్రజలందరి మనోభావాలు ఎలాంటి వివక్ష లేకుండా కాపాడట మే ప్రభుత్వ ధర్మమ్.
ప్రజలందరి మనోభావాలు ఎలాంటి వివక్ష లేకుండా కాపాడట మే ప్రభుత్వ ధర్మమ్.
కానీ జరుగుతుంది ఏమిటంటే,మతం పేరుతో ప్రభుత్వాలు ప్రజల మధ్య పొరపొచ్చాలు
కలుగ చేసి అధికారాన్ని అందుకోవడం ఒక దుర్మార్గపు ఆనవాయితీ ఐంది .
అజ్ఞానం ముదిరితే మూర్ఖత్వం అవుతుంది .
శాస్త్ర జ్ఞానం వేరు -నిజమైన ప్రజ్ఞ వేరు .
తర్కం , స్పందన వేర్వేరు గా ఉండొచ్చు . .
భావం,ఆలోచన,కార్యా చరణ ఒకే రకం గా ఉండటమే సమతుల్యత.
అజ్ఞానం ముదిరితే మూర్ఖత్వం అవుతుంది .
శాస్త్ర జ్ఞానం వేరు -నిజమైన ప్రజ్ఞ వేరు .
తర్కం , స్పందన వేర్వేరు గా ఉండొచ్చు . .
భావం,ఆలోచన,కార్యా చరణ ఒకే రకం గా ఉండటమే సమతుల్యత.
ఎవరైతే సనాతన ధర్మ సూత్రాలకు అనుగుణం గా ప్రవర్తిస్తారో ఏ మతం లో ఉన్నా వారందరూ
హిందువులే. వీరు మంచి అనేది ఎక్కడున్నా స్వీకరిస్తారు. సమాజ హితవు కోరే ఏ భావ జాలాన్ని
ఐనా గౌరవిస్తారు. వారు అన్ని వర్గాల వారి నమ్మకాలను సహ్రుదయం తో గౌరవిస్తారు.
మతాలను మాత్రమే నమ్మేవారు చాందస వాదులుగా ఉండిపోయి ఇతరుల భావాలకు విలువ
ఇవ్వరు.దాని వలన ఎన్నో యుద్దాలు,మారణ కాండలు జరిగాయి.జరుగుతున్నాయి.
నిజమైన హిందువు ఎల్లప్పుడూ తన బుద్దిని పదును పెట్టుకొంటూ, తనూ,తనతో పాటు
అన్ని జీవులు,14 మితులున్న(dimensions) సకల చరాచర విశ్వం(14 లోకాలు) సుఖం గా,శాంతం గా ఉండటానికి ,దానికి తోడ్పడే
ఆలోచనలు ఎక్కడినుండి వచ్చినా స్వీకరిస్తాడు. గాయత్రి మంత్ర అర్ధం కూడ అదే.
మనిషి గమ్యం - మళ్ళీ జన్మ లేకుండా, జనన మరణ చక్రం నుండి విముక్తి.
గమ్యం చేర్చే మార్గం: సాధన.
ఏమి సాధన చేయాలి?
వయస్సుకి,బాధ్యతలకు తగ్గ
ధర్మ కార్యా చరణ. ధర్మ సమ్హితం గా కోరికలను అధిగమించి (కోరికలను అణచుకోవడం కాదు),అర్ధాన్ని
సంపాదించుకొని మోక్షం పొందటమే హిందువుల చతుర్విధ పురుషార్ధ సాధన.
అలాగే,అష్టాంగ యోగ సాధన అనేది సంచిత కర్మలను భస్మం చేసుకొని,ఆగామి
కర్మలను లేకుండా చేసుకొని,ప్రారబ్ద కర్మలను సహించే బలాన్ని పొందటానికి చేసే శారీరక,మానసిక
క్రియలు.
సర్వేషాం స్వస్తిర్భవతు ; సర్వేషాం శాంతి ర్భవతు ;
సర్వేషాం పూర్ణం భవతు ; సర్వేషాం మంగళం భవతు.
ఓం శాంతి