Search This Blog

Wednesday, 16 October 2013

బువ్వ కావాలి... రైతన్న లారా మీరు మారాలి...

జనాభా పెరుగుతోంది! పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార భద్రత పెరగాలంటే.. రెండే పరిష్కారాలు!! అయితే, సాగు విస్తీర్ణం పెరగాలి! లేదంటే.. ఎకరా  ఉత్పాదకత పెరగాలి! సాగు విస్తీర్ణం పెంపు అనేది దీర్ఘకాల ప్రక్రియ! దీనికి వ్యయమూ ఎక్కువే! కానీ, ఉత్పాదకతను పెంచడం మన చేతుల్లోనే ఉంది! 
ఇప్పుడు  60 లక్షల హెక్టార్లలో మాత్రమే ఆహార ధాన్యాలను సాగు చేస్తున్నారు 
బువ్వ కావాలంటే.. భూమి పండాలి! 
భూమి పండుతోంది! కానీ, అందరికీ బువ్వ ఎందుకని   అందడం లేదు ?
భు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటే వరి ఉత్పాదకత మరింత తగ్గే ముప్పు ఉంది . 
నేటికీ ,వరి ఉత్పాదకత హెక్టారుకు 30 క్వింటాళ్లుగా ఉంది.

సన్న రకాల సాగుకు ఖరీఫ్ అనుకూలం. రబీలో పండేవి దొడ్డురకం ధాన్యమ్ . 
కృష్ణా డెల్టాలో ఖరీఫ్‌లో సుమారు 13 లక్షల ఎకరాల్లో వరి వేస్తారు. ఇందుకు 180 నుంచి 200 టీఎంసీల నీటిని వాడుతున్నారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే వంద టీఎంసీల నీళ్లు సరిపోతాయి. అలాగే, నాగార్జున సాగర్ కింద 22 లక్షల ఎకరాల మేరకు వరి సాగవుతుంది. ఇందుకు సుమారు 260 టీఎంసీల నీటిని వాడుతున్నారు. ఇక్కడ 110 టీఎంసీల నీరు వృథా అవుతున్నట్లు చెబుతున్నారు. పుష్కలంగా నీరుండి, అధికస్థాయిలో వాడినప్పటి కంటే...ఆచితూచి నీరు విడుదల చేసినప్పుడే 'బంపర్ క్రాప్' వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి.ఖరీఫ్ లో సూర్య రశ్మి తక్కువ . కాబట్టి నీరు ఎక్కువ పెట్టినా లాభం లేదుః 


System of Root Intensification -  శ్రీ వరి సాగు 

 నారు మాళ్ళు పోయడానికి వాడే విత్తనాలలో సగం నేరుగా దమ్ము చేసిన పొలం లో నాటి ,నారు కొద్దిగా పెరిగాక, పాయల మధ్య ఓ పది అంగుళాల ఖాళీ ఉండేటట్లు చూసుకోని,ఇప్పుడు మన రైతులు పెట్టే నీటిలో 5 వ వంతు నీటి తో కొద్ది మోతాదుల్లో సేంద్రియ ఎరువులు వాడుతూ ,కలుపు లేకుండా పైపాటు చేస్తుంటే ఎకరానికి 50 బస్తాల ధాన్యం పండుద్ది. అందరి కడుపూ నిండు ద్ది .  

No comments:

Post a Comment