Search This Blog

Thursday, 5 June 2014

నూతన రాష్ట్ర నిర్మాణానికి నడుం కట్టిన ఆంద్ర జాతికి నమస్కారం .

సోనియా కాంగ్రెస్ చేసిన దుర్మార్గపు రాష్ట్ర విభజన వలన సీమాంధ్ర మొత్తం రగిలిపోయింది.

పచ్చని ఆంధ్ర రాష్ట్రాన్ని విడ దీయడం  భౌగోళికం గా ,వనరుల పరం గా చాలా కష్టం. ఆత్మ హత్యా సద్రుశ్యం.అభివ్రుద్ది పట్టాల పై దూసుకు పోతున్న రాష్ట్రాన్ని ఆపి అడ్డం గా నరికేసి మీ చావు మీరు చావండని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది సోనియా కాంగ్రెస్.

విడదీస్తే ఎవరికి వారు ఇంకా బాగా బతుకుతారనే వాదం ఉంది.అలాగే ఎక్కువ మంది రాజకీయ నాయకులకు మంచి అధికార అవకాశాలు  వస్తాయనే దురాశ ఉండనే ఉంది .

రాష్ట్ర విభజన సోనియా కాంగ్రెస్ కల్పిత ఉత్పాతం .
ఆస్తులు అప్పులు,ఉద్యోగులు,విద్యుత్,నీళ్ళు,విద్యా - వైద్య సంస్థలు,ప్రాజెక్ట్ లు ఎలా పంచాలో కూడ తెలీని కేంద్ర వ్యవస్థ, తమ బుర్ర తక్కువ చేష్టలతో తెలుగు జాతి మధ్యన చిచ్చు పెట్టింది.

ఆక్రోశంతో ,అభద్రతా భావంతో రగిలిపోతున్న ఆంధ్ర యువత పెడ దారి పట్టి బ్రష్ట్టు పట్టకుండా కాపాడ గలిగే నాయకుడు చంద్ర బాబే అని నమ్మి తెలుగు ప్రజలు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం.

సమయానికి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు సమన్యాయం అనే ఒక సకారాత్మక ద్రుక్పధం వలన ఆంధ్ర జాతి యువత  లొ చిచ్చు రేగిన  దేశ విచ్చిన్న వాదం,వేర్పాటు భావం సద్దుమణిగి  మరల దేశ జన జీవన స్రవంతి లో కలిసిపోయి,జరిగిన అన్యాయాన్ని దిగమింగి,సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఒక్కటే కాంగ్రెస్ చేసిన అరాచకాన్ని అరికట్టగలదు,అభివ్రుద్దికే అంకితమైన చంద్రబాబు ఒక్కడే సమర్ధ మైన నాయకత్వం తో నడిపించ గలడు అని అనుకొని, తమ సొంత రాష్ట్ర పునర్నిర్మాణం పై ద్రుష్టి పెట్టారు.
ఈ సందర్భం గా మనందరమూ సంఘీభావం తో ఉండి రాష్ట్రాన్ని నిర్మించు కొందాం .


Tuesday, 3 June 2014

Road Map for swarnaandhra !

80000 కోట్ల అప్పు,ఏటా 15000 కోట్ల లోటు బడ్జెట్ ,2000 MW విద్యుత్ కోత ,గుండె కాయ లాంటి రాజధాని కొరత -ఇవన్నీ మనకొచ్చిన తిప్పలు . 
ఇంత  అధ్వాన్న స్థితిలో  కొత్త ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ నడుం కట్టి ఎలాంటి కష్టానికైనా వెరవక ముందుండాలి . 
  • 13 జిల్లాలను విభజించి 25 జిల్లాలుగా  పెంచాలి .
  • 175 నియొజక వర్గాలను 250 కి పెరిగే టట్లు  పునర్వ్యవస్థీకరించాలి .
  • ప్రతి జిల్లాలొ లభ్య మయ్యే వనరుల ఆధారం గా మధ్య తరహా లేదా భారీ పరిస్రమలు స్థాపన చేయ డానికి - దేశ విదేశ వ్యాపార సంస్థ లతొ చర్చలు ప్రారంభించాలి . 
  • విద్య -వైద్య -ఉద్యొగ కల్పన - వీటికి నిపుణులతొ రోడ్ మాప్ తయార్ చేయించాలి . 
  •  ఉచిత నిర్బంధ ప్రాధమిక విద్య , నిర్బంధ ఓటు హక్కు  ప్రవేశ పెట్టాలి . 
  • గ్రామాలలో మొబైల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను నిర్వర్తించాలి . 
  • భూ కమతాలను,అటవీ భూమిని,ప్రభుత్వ భూములను  పూర్తిగా సర్వే చేసి డిజిటలైజ్ చేయాలి . 
  • మైనింగ్ గనులను ,ఇసుక , సముద్ర  తీరాన్ని ,ఎర్ర చందనం ,జాతి రాళ్ళ గుట్టలను,పూర్తిగా సర్వే చేసి డిజిటలైజ్ చేయాలి . 

ముఖ్యం గా కొత్త రాజధానిని నిర్మించాలి . 
                                                                              స్మార్ట్ సిటీ నిర్మాణానికి ఒక నమూనా :
  • 25000 మంది రాష్ట్ర కేడర్ ఉద్యోగులకు 100 ఎకరాల స్థలంలో 25000 ఎపార్ట్మెంట్స్ నిర్మించ వచ్చు.దానిలోనే క్లబ్,ఇతర క్రీడా సదుపాయాలు,హస్పిటల్, వాకింగ్ ట్రాక్,గ్రొసరీ మాల్,కల్పించ వచ్చు.
  • 100 మంది మంత్రులు,350మంది శాసన సభ్యులకు 500 ఎపార్ట్మెంట్స్ కావాలి- వీటికి 50ఎకరాలు కావాలి. 
  • క్లరికల్ మరియు మిగతా సిబ్బందికి సుమారు 1000 ఇళ్ళు కావాలి. వీటికి మరో 50 వ్కరాలు అవసరం.
  • 10000 మంది పోలీస్,5000 మంది స్పెషల్ ఫోర్స్,వారికి కావలసిన ట్రైనింగ్ అకాడమీలు,నిత్యం వినియోగించే క్రీడా మైదానాలకు -200 ఎకరాలు కావాలి.
  • రాజ్ భవన్,రాష్ట్రపతి ఆతిధ్యానికి,ప్రధాన మంత్రి మరియు ఇతర కేంద్ర మంత్రులకు మరో 25 ఎకరాలలొ విల్లాలు నిర్మించాలి.
  • వివిధ రాష్త్ర ప్రతినిధులకు, వివిధ దేశ కాన్సులేట్ లకు 20 అంతస్తుల బిల్డింగ్ అవసరం. దీనికి 10ఎకరాలు కావాలి.    
  • అలాగే చట్ట సభలు -శాసన సభ,కౌన్సిల్,సెక్రటేరియట్ ,5000 మందికి సరిపడా ఆడిటోరియం, విడియో కాంఫరెన్స్ హాలులు,2 హెలిపాడ్ లు - వీటన్నింటికీ 200 ఎకరాలు కావాలి.
  • కేజి నుండి పిజి వరకు విద్యా సంస్థలు, 4 హాస్పిటల్స్- వీటికి సుమారు 300 ఎకరాలు కావాలి.
  • 5 వన్ స్టార్ హోటల్స్,రెండు 3-స్టార్ హోటల్స్,10 రెస్టారెంట్స్,10 సినిమా హాళ్ళు,ఇంకా ఇతర వినోద సౌకర్యాలకు,పెద్ద క్రీడా స్టేడియం- వీటికి సుమారు 100ఎకరాలు కావాలి. 
  • సోలిడ్ వేస్ట్,లిక్విడ్  వేస్ట్ శుద్ది చేసే ప్లాంట్స్,వాటర్ ప్లాంట్స్,రోడ్స్, మొదలగు వాటికి -500 ఎకరాలు. 
అనగా సుమారు 1500 ఎకరాలు ఉంటే మనమూ రాజధాని నగరం నిర్మించు కోవచ్చు.

డబ్బు జబ్బు చేసిన ఎలచ్చన్ లు

రాజకీయాల్లో ఎంతో సులువుగా డబ్బు సంపాదించవచ్చునని 2004 తర్వాత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం చేసి చూపించింది. ఒక రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఇంత  భారీ స్థాయిలో అవినీతి ఊడ లు దింపి వ్యవస్థలను అల్లకల్లోలం చేయ వచ్చా అనేది అందరికీ అర్ధం కాని విషయం . భారత  దేశ అవినీతి చరిత్రలో ఓ రికార్డ్ . 
ఇప్పుడు  అదే అందరికీ ఆదర్శంగా మారింది. అధికారం ఉంటే విచ్చలవిడిగా డబ్బు సంపాదించవచ్చునన్న ఉద్దేశంతో ఎన్నికల్లో అంతే విచ్చలవిడిగా ఖర్చు చేశారు. 
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ పరిసరాల్లో ప్రభుత్వ భూములు దండిగా ఉన్నాయి. కనుక ఏవో దందాలు చేసి డబ్బు సంపాదించవచ్చునని తెలంగాణ నాయకులు ఆశ పడుతుండవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో అటువంటి అవకాశం లేదే? ప్రభుత్వ ఆదాయం చూద్దామా అంటే లోటు బడ్జెట్‌తో దినదిన గండంగా బండి నడపాల్సిన పరిస్థితి. 
మరి ఎందుకు సీమాన్ధ్రలో కూడా ఇంట భారీగా ఖర్చు పెట్టారు ?