80000 కోట్ల అప్పు,ఏటా 15000 కోట్ల లోటు బడ్జెట్ ,2000 MW విద్యుత్ కోత ,గుండె కాయ లాంటి రాజధాని కొరత -ఇవన్నీ మనకొచ్చిన తిప్పలు .
ఇంత అధ్వాన్న స్థితిలో కొత్త ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ నడుం కట్టి ఎలాంటి కష్టానికైనా వెరవక ముందుండాలి .
ముఖ్యం గా కొత్త రాజధానిని నిర్మించాలి .
స్మార్ట్ సిటీ నిర్మాణానికి ఒక నమూనా :
ఇంత అధ్వాన్న స్థితిలో కొత్త ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ నడుం కట్టి ఎలాంటి కష్టానికైనా వెరవక ముందుండాలి .
- 13 జిల్లాలను విభజించి 25 జిల్లాలుగా పెంచాలి .
- 175 నియొజక వర్గాలను 250 కి పెరిగే టట్లు పునర్వ్యవస్థీకరించాలి .
- ప్రతి జిల్లాలొ లభ్య మయ్యే వనరుల ఆధారం గా మధ్య తరహా లేదా భారీ పరిస్రమలు స్థాపన చేయ డానికి - దేశ విదేశ వ్యాపార సంస్థ లతొ చర్చలు ప్రారంభించాలి .
- విద్య -వైద్య -ఉద్యొగ కల్పన - వీటికి నిపుణులతొ రోడ్ మాప్ తయార్ చేయించాలి .
- ఉచిత నిర్బంధ ప్రాధమిక విద్య , నిర్బంధ ఓటు హక్కు ప్రవేశ పెట్టాలి .
- గ్రామాలలో మొబైల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను నిర్వర్తించాలి .
- భూ కమతాలను,అటవీ భూమిని,ప్రభుత్వ భూములను పూర్తిగా సర్వే చేసి డిజిటలైజ్ చేయాలి .
- మైనింగ్ గనులను ,ఇసుక , సముద్ర తీరాన్ని ,ఎర్ర చందనం ,జాతి రాళ్ళ గుట్టలను,పూర్తిగా సర్వే చేసి డిజిటలైజ్ చేయాలి .
ముఖ్యం గా కొత్త రాజధానిని నిర్మించాలి .
స్మార్ట్ సిటీ నిర్మాణానికి ఒక నమూనా :
- 25000 మంది రాష్ట్ర కేడర్ ఉద్యోగులకు 100 ఎకరాల స్థలంలో 25000 ఎపార్ట్మెంట్స్ నిర్మించ వచ్చు.దానిలోనే క్లబ్,ఇతర క్రీడా సదుపాయాలు,హస్పిటల్, వాకింగ్ ట్రాక్,గ్రొసరీ మాల్,కల్పించ వచ్చు.
- 100 మంది మంత్రులు,350మంది శాసన సభ్యులకు 500 ఎపార్ట్మెంట్స్ కావాలి- వీటికి 50ఎకరాలు కావాలి.
- క్లరికల్ మరియు మిగతా సిబ్బందికి సుమారు 1000 ఇళ్ళు కావాలి. వీటికి మరో 50 వ్కరాలు అవసరం.
- 10000 మంది పోలీస్,5000 మంది స్పెషల్ ఫోర్స్,వారికి కావలసిన ట్రైనింగ్ అకాడమీలు,నిత్యం వినియోగించే క్రీడా మైదానాలకు -200 ఎకరాలు కావాలి.
- రాజ్ భవన్,రాష్ట్రపతి ఆతిధ్యానికి,ప్రధాన మంత్రి మరియు ఇతర కేంద్ర మంత్రులకు మరో 25 ఎకరాలలొ విల్లాలు నిర్మించాలి.
- వివిధ రాష్త్ర ప్రతినిధులకు, వివిధ దేశ కాన్సులేట్ లకు 20 అంతస్తుల బిల్డింగ్ అవసరం. దీనికి 10ఎకరాలు కావాలి.
- అలాగే చట్ట సభలు -శాసన సభ,కౌన్సిల్,సెక్రటేరియట్ ,5000 మందికి సరిపడా ఆడిటోరియం, విడియో కాంఫరెన్స్ హాలులు,2 హెలిపాడ్ లు - వీటన్నింటికీ 200 ఎకరాలు కావాలి.
- కేజి నుండి పిజి వరకు విద్యా సంస్థలు, 4 హాస్పిటల్స్- వీటికి సుమారు 300 ఎకరాలు కావాలి.
- 5 వన్ స్టార్ హోటల్స్,రెండు 3-స్టార్ హోటల్స్,10 రెస్టారెంట్స్,10 సినిమా హాళ్ళు,ఇంకా ఇతర వినోద సౌకర్యాలకు,పెద్ద క్రీడా స్టేడియం- వీటికి సుమారు 100ఎకరాలు కావాలి.
- సోలిడ్ వేస్ట్,లిక్విడ్ వేస్ట్ శుద్ది చేసే ప్లాంట్స్,వాటర్ ప్లాంట్స్,రోడ్స్, మొదలగు వాటికి -500 ఎకరాలు.
No comments:
Post a Comment