Search This Blog

Wednesday, 28 November 2018

వ్యవసాయం భారతీయ జీవన విధానం.

భారతదేశం అనాదిగా వ్యవసాయాధారిత దేశం. పల్లెల్లో ప్రజలు భూమిని నమ్ముకొని గొడ్డు గోదా పిల్లామేకలతో ఉన్నదాంట్లోనే సర్దుకొంటూ సంసారం సాగించేవారు. 90 వ దశకం వరకు పారిశ్రామిక రంగానికి,వ్యవసాయ రంగానికి ఉత్పార్దకత లో పెద్దగా అంతరం లేకపోవడం చేత ఈ రెండురంగాలలోని ప్రజల జీవితాలలో  చెప్పుకోదగ్గ అసంతృప్తులు లేవు. 

ఎప్పుడైతే పారిశ్రామిక సంస్కరణలు మొదలయ్యాయో , వ్యాపార రంగానికి బాంకులు విచ్చలవిడిగా లోన్స్ ఇవ్వడం మొదలు పెట్టాయో ,అప్పటి నుండి పారిశ్రామిక ,ఆ తర్వాత సేవారంగాలలో ఉత్పా దకత  బాగా పెరిగిపోయి, వ్యవసాయ రంగం లోని ఉత్పాదకత తగ్గిపోవడం జరిగింది. 
విద్యారంగం కూడా కేవలం సేవారంగానికి పనికొచ్చే పౌరులను తయారు చేసే కర్మాగారాలుగా మారిపోయాయి. 

నేటికీ, దేశంలో 80కోట్లమందిని వ్యవసాయరంగమే పోషిస్తుంది.  దేశంలోఉన్న అనేక రకాల  ఉద్యోగాలలో 50శాతం వ్యవసాయ కూలీ అనే  ఉద్యోగమే!
మనకుతెలుసు, వ్యవసాయం అనేది పరిశ్రమ కాదు. వ్యవసాయం అనేది సేవారంగమూ కాదు. వ్యవసాయం ట్రేడింగ్ వ్యాపారం కానే కాదు. అందుకే  మనం చెప్పుకొంటున్న భౌతికపరమైన సంపద లెక్కల్లో వ్యవసాయం లాభసాటి కాదు. ఆర్థికవేత్తలు లెక్కలిలా ఉంటాయి. 50శాతం ఉద్యోగులు దేశ  జా తీయ ఉత్పత్తి కి  కేవలం 16శాతం మాత్రమే ఇస్తున్నారని వారంటారు. వారికి తెలియదా?వ్యవసాయం వ్యాపారం కాదు,లాభాపేక్షలు చూసి చేసేది కాదు. వ్యవసాయం భారతీయ జీవన విధానం. 

దేశంలోని 30కోట్ల ఎకరాల లో వ్యవసాయం,వ్యవసాయ అనుబంధ రంగాలైన డైరీ,ఆక్వా, పౌల్ట్రీ , ఉద్యానవన,అరణ్య ,మెడిసినల్ హెర్బల్స్ ద్వారా ఏ టా సుమారు 20 లక్షలకోట్ల రూపాయల విలువైన ఉత్పత్తు లు- అనగా 30 కోట్ల టన్నుల ధాన్యాలు , 15కోట్ల టన్నుల పాలు, 30కోట్ల టన్నుల పండ్లు, కాయగూరలు ,7మిలియన్ టన్నుల మాంసం ఉత్పత్తి అవుతున్నాయి. 

ఏది ఏమైనా వ్యవసాయ రంగంలో ఉన్న 10కోట్ల రైతులు (భూమి యజమానులు) గానీ, దీనిపై ఆధారపడిఉన్న 15కోట్ల కూలీలు గానీ సంతోషంగా లేరు. ఎందుకంటే బతుకు పరుగులో  ,ఎవరైతే పరిశ్రమలు,సేవారంగాన్ని వెదుక్కుంటూ పట్టణాల బాట ప ట్టారో వారి బతుకులు మరింత రంగులమయంగా కనబడుతుంది. 
భూమి వారికీ అన్నంపెట్టే తల్లి లా కనబడం మానేసి అప్పుల భారంతో కుంగదీసే వ్యధ భూమిగా కనబడటం మొదలైంది.  ఈ సంకెళ్లనుండి తెంచుకొని పోవాలంటే ఉన్న ఒకే ఆయుధం చదువు. 

తరాలు పెరుగుతున్న కొద్దీ వ్యవసాయానికి గుండెకాయ గా ఉండే   ఉమ్మడి కుటుంబాలు విఛ్చిన్నమై న్యూక్లియర్ కుటుంబాలు పెరుగుతున్నకొద్దీ కమతాల సైజు తరతరానికి తగ్గిపోతుంది. జనాభాతో పాటు  భూమి పెరగదు గదా?
కమతాల సైజు సరాసరి ఒక్కో వ్యవసాయదారుడికి కేవలం 1ఎకరా గా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడిలేని ప్రక్రుతి వ్యవసాయం ,  రసాయన ఎరువులు,పురుగుమందులను తగ్గించి గోవు ఆధారిత సేంద్రియ ఎరువులు , మూలికలనుండి తీసిన పురుగుమందులను వాడించి , సూక్ష్మ బిందు తుంపర సాగుతో దిగుబళ్లను సాధించే పద్ధతులను ప్రవేశ బెట్టారు చంద్రబాబు. ఇది ఎంతో ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం. 

  • మార్కెట్టులో ఏ పంటలకు నిలకడైన మద్దతు ధర ఉంటుందో, ఏపంటలకు డిమాండ్ ఉంటుందో, ఏ పంటలను ఎక్కువకాలం పాడవకుండా నిల్వ  చెయవచ్చొ అలాంటి పంటలను మాత్రమే సాగుచే యించాలి.  
  • పంట దిగుబడిని కోల్డ్ స్టోరేజీ లలో నిల్వ చేసుకొనే సదుపాయాలు , సోలార్ ఆధారిత డ్రయ్యర్ లు ప్రతి పంచాయితీలో ఉండాలి. 
  • మెకానికల్ వ్యవసాయ  వ్యవస్థను అనగా ట్రాక్టర్లు , కోత నూర్పిడి యంత్రాలు, కలుపుతీత యంత్రాలు, నాట్లు వేసే యంత్రాలు సమస్తం ప్రతి పంచాయితీలో  అందుబాటులో ఉండాలి.  
  • ఇవన్నీ కూడా  డబ్బు చెల్లింపులు లేకుండా పండినపంట ను  బార్థర్ ఇచ్చే విధంగా ఉండాలి. అపుడు అప్పులు చేయవలసిన అవసరం ఉండదు. 
  • పంట భీమా నిర్బంధంగా అమలుచేయాలి. 
  • ఏదైనా ఒక జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రభుత్వమే సొంతంగా వ్యవసాయం చేసి పండిన పంటను ఎకరాకి ఇంతని కవులుగా రైతులకి ఇస్తే  మరింత బాగుంటుంది. 
  • వ్యవసాయంలో యాంత్రికత ఎంతపెరిగితే అంతగా కూలీలు వేరే రంగానికి మారతారు . కాబట్టి ప్రతి పంచాయితీలో నైపుణ్యాభివృద్ధి తరగతులు నిర్వహించాలి. 
  • కమ్మరి , కుమ్మరి,చాకలి, యానాది ,చేనేత,కల్లుగీత ,టైలర్,కంసాలి లాంటి  చేతిపని వారికి  నైపుణ్యాభివృద్ధి తరగతుల తోపాటు ఆధునిక పనిముట్లు అందించాలి. 
  • తక్కువ మనుషులు,ఎక్కువ ఉత్పద కత ఉంటేనే వ్యవసాయం లాభసాటి గా ఉంటుంది.  
  • భూమిని,పంటను ,తేమశాతాన్ని పరీక్షించే సాంకేతికత ప్రతి పంచాయితీలో ఉండాలి. 
  • ప్రభుత్వం  తన పధకాలను ప్రజలకు ఎంత అవినీతి రహితంగా ,, లబ్దిదారులకు ఎలాంటి కష్టం లేకుండా  ఎంత త్వరగా అందించగలదో ,అంతగా ప్రజామోదాన్ని పొందుతుంది. కేవలం పధకాలు ప్రకటించేసి అవినీతి, బంధుప్రీతి, పార్టీ ప్రీతి తో అసలైన లబ్దిదారులకు అందించకుంటే  మరింత తిరస్కారాన్ని ఎదుర్కొంటుంది. 
  • పంచాయితీ ల చేతిలోనే ప్రాధమిక అధికారాలు అనగా పంచాయితీ స్థాయిలో పనిచేసే వారికి ఆయా పంచాయతీలే జీతాలు,ఇతరత్రా సంక్షేమం చూడాలి. అలాగే పంచాయితీ వనరుల ఆదాయం లో 70శాతం ఆయా పంచాయతీలకే దక్కాలి. అపుడే గ్రామ సురాజ్యం బలపడుతుంది. 




Saturday, 18 August 2018

2019 ఎన్నికల సంగ్రామంలో గెలుపు ఎవరిది ?

 2019 లో రాబోయే ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలలో ఏ పార్టీ సత్తా ఏమిటో పరిశీలిద్దాం.
అత్యంత అనుభవశాలి , కష్టపడేతత్వమున్న చంద్రబాబు ఒకపక్క , అవినీతి కేసుల్లో ఛార్జ్ షీట్ వేయబడి విచారణ ఎదుర్కొంటున్న యువనేత, సినిమారంగంలో మాస్ స్టార్ గా పేరుతెచ్చుకొని ప్రజాక్షేత్రంలో తనసత్తా ఏమిటో చూపుదామని ఉవ్విళూరుతున్న నాయకుడు మరోపక్క, అత్యంత దారుణంగా మోసం చేసిన జాతీయపార్టీలు కాంగ్రెస్,భాజపా మరోవైపు ఈ ఎన్నికల సమరంలో కదం తొక్క బోతున్నాయి. 

ఆంధ్రులకు ఆవేశాలు,ఉద్వేగాలు ఎక్కువే అయినా, తెలివితేటలు కూడా ఎక్కువే! విద్యాధికులైనా , వ్యక్తిగత ఆరాధన కూడా ఎక్కువే! రాష్ట్ర హితం కంటే వ్యాపారాత్మక ధోరణి కూడా ఎక్కువ. కులాలను బట్టి ఓట్లు పోలరైజ్ అయ్యే అవకాశం కూడా ఆంధ్రాలో ఎక్కువ. 
మెజారిటీ ప్రజలు కులాలుగా చీలిపోయి విడిపోయారు. రాజకీయంలోగానీ,పాలనలో గానీ అవినీతి, అనైతికం అనేవి సామాన్యు ఓటరు పెద్దగా పట్టించుకోవడం లేదు . మా వర్గానికి,మా సంఘానికి,మా కులానికి, మా కుటుంబానికి ఎంత లబ్ది వచ్చింది, ఎంత రాబోతుంది అనే లెక్కలు వేసుకొంటున్నారు తప్ప ,రాష్ట్ర అభివృద్ధి ని పట్టించుకొనే వాళ్ళ సంఖ్య తక్కువ. కులాల వారీగా ,మతాల వారీగా  ఓట్ల పోలరైజేషన్ జరిగే అవకాశం ఎక్కువ. 

పార్టీలకు అతీతంగా ఆలోచిస్తే, చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి దొరకడం ఆంధ్రుల అదృష్టం. శాసనసభ్యుల అవినీతి అనేది వందల కోట్లలో ఉందని భావించినా , ప్రతిపక్ష నాయకులు ఇప్పటికే  వేల కోట్ల అవినీతిలో ముద్దాయిగా నిలబడిఉన్నారు. ఏది ఏమైనా ఈ దశలో చంద్రబాబు లాంటి అనుభవశాలి,  రాజ నీతి జ్ఞుడు , కష్టపడే తత్వమున్న నాయకుడు మళ్ళీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం నిలదొక్కు కొంటుందని మేధావుల ఆలోచన.  పోలవరం,అమరావతి పూర్తయ్యి , రాష్ట్రం పురోగతి చెందే  అవకాశం ఉంటుంది. ప్రలోభాలకు, కులమతాలకు అతీతంగా,అభివృద్ధికి ఓటేయడం ఓటరు  బాధ్యత. 


కోటిన్నర కుటుంబాలు - 5కోట్ల జనాభా - రాజధానిలేని , భారీపరిశ్రమలు లేని , సేవారంగ కంపెనీలు అస్సలేమీ లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.   కాంగ్రెస్ చేతిలో ఘోరంగా అన్యాయం చేయబడి, మోడీ చేతిలో దారుణంగా మోసపోయిన  రాష్ట్రం. రెడ్డి,కాపు,కమ్మ,వైశ్య, బ్రాహ్మణ ,వెలమ,క్షత్రియ కులాలు ఫార్వార్డ్ కులాలుగా ఉన్నాయి. కులాలవారీ గణన వివరాలు కరెక్ట్ గా తెలియవు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో గణించిన వివరాలతో, ప్రస్తుత సీమాంధ్రలో ని కుల గణాంకాలను భేరీజు వేసుకొని అంచనా వేసిన వ్యాసం ఇది. ఇందులో కొన్ని పొరపాట్లు ఉండవచ్చు. 
ఏది ఏమైనా ఎన్నికలకు 6నెలల ముందుగా అంచనాలు వేయడం కరెక్ట్ ఫలితాలను గ్రహించలేదు. ఎందుకంటే ఎన్నికలకు వారం ముందువరకు తటస్థ ఓటరు తేల్చుకోలేడు . కనీసం 20%తటస్థ ఓటర్లు ఉంటారు. 
సంబంధిత చిత్రం
సంబంధిత చిత్రం

మహారాష్ట్రలో మహర్ లు , కర్ణాటకలో హోలియా లు, పులయాలు ,తమిళనాడులో పల్లార్ లు ఎలాగో ఆంధ్రప్రదేశ్ లో ఆది ఆంధ్రులు, మాలలు అనే వాళ్ళు ఒకే వర్గానికి చెందినవారు. వీరిలో మెజారిటీ ప్రజలు హిందూ మతాన్ని వదిలి,క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నారు. మాలలు,మాదిగలను కలిపి దళితులు అనికూడా అంటారు. క్రిస్టియన్ దళిత్ లను కూడా షెడ్యూల్ వర్గాల కింద పరిగణించాలని చంద్రబాబు శాసనసభ లో తీర్మానించారు.  
ప్రతిపార్టీకి సంప్రదాయ ఓటు బాంక్ ఉంటుంది. 
అగ్రవర్ణాలు 33% / వెనకబడిన వర్గాలు 37% / షెడ్యూల్ వర్గాలు 22% / మైనారిటీలు 8 % జనాభాగల  ప్రజా క్షేత్రం మన రాష్ట్రం  . 
 2014లో , TDP  సీమాంధ్ర,తెలంగాణ కలిపి 237 సీట్లలో పోటీ చేస్తే,  117 సీట్లు గెలిచింది. మొత్తం సుమారు కోటిన్నర ( 15746215 )  ఓట్లు అనగా 32.5 %  సంపాదించింది. YSRCP పార్టీ  266 సీట్లలో పోటీ చేసి,70 సీట్లు గెలిచింది. మొత్తం సుమారు  ( 13494076 )  ఓట్లు అనగా  27.88%సంపాదించింది.      
కానీ ఇపుడు  2019 లో పరిశీలించవలసింది సీమాంధ్ర 13 జిల్లాలవరకే ... 
తెలుగుదేశం పార్టీకి సాంప్రదాయ ఓటు బాంక్ : 
AP caste wise population. (all are not voters). 
మొత్తం 33% అగ్రవర్ణాల ప్రజలలో  ... 
బ్రాహ్మణ 1%,కమ్మ 3.5% ; వెలమ 0% ,రెడ్డి 1%, వైశ్య 1% ; కాపు 4% ; క్షత్రియ 0. 5% వెరసి 11%  తెలుగుదేశానికి మద్దతు ఇస్తారు. . 
మొత్తం 37% బి సి లలో ... 
బలిజ : 2% ; చాకలి : 2% యాదవ : 4% ; కమ్మర 2% , తెలగ : 3% , ఇతర బి సి లు : 7% వెరసి : 20%. తెలుగుదేశానికి మద్దతు ఇస్తారు. . 
మైనారిటీలలో మొత్తం 5% ముస్లిం జనాభాలో 3% .తెలుగుదేశానికి మద్దతు ఇస్తారు. . 
 ' మొత్తం క్రిస్టియన్ 2% జనాభాలో 0%. 
షెడ్యూల్ కులాలలో మొత్తం 9% మాల లలో 2% తెలుగుదేశానికి మద్దతు ఇస్తారు. . ; 
మొత్తం 7%మాదిగలలో 2% .  
గిరిజనులు - మొత్తం  6% లో 2% తెలుగుదేశానికి మద్దతు ఇస్తారు. . 
మొత్తం జనాభాలో టి డి పి కి 40% జనాభా సంప్రదాయ  మద్దతు ఉంటుంది. 

  • జగన్ గారి  పార్టీకి : అగ్రవర్ణాలు : 15% ; బి సి లలో 9%,మైనారిటీలలో 4% , మాలలలో 4% ; మాదిగలలో  2% ; గిరిజనులలో 3%  వెరసి = 37% మద్దతు ఇస్తారు. .  . 
  • కాంగ్రెస్ కి : అగ్రవర్ణాలు : 1% ; బి సి లలో 1%, మైనారిటీలలో 0. 5 % , మాలలలో 2% ; మాదిగలలో  2% ; గిరిజనులలో 0%  వెరసి = 6. 5 %మద్దతు ఇస్తారు. .  . .
  • పవన్ గారి  కి అగ్రవర్ణాలు 6 % ; బి సి లలో 7%, మైనారిటీలలో 0. 5% , మాలలలో 1% ; మాదిగలలో  1% ; గిరిజనులలో 1%  వెరసి =  16. 5 %మద్దతు ఇస్తారు. .  . . 
పైన చెప్పుకొన్నవి జనాభా పరంగా చెప్పుకొన్నాంఇపుడు ఓటు బాంక్ పరంగా విశ్లేషిద్దాం
తెలుగుదేశం పార్టీకి ఒరిజినల్ గా  35% ఓట్లు పునాదిగా ఉన్నాయి.
  
సంప్రదాయ కాంగ్రెస్ ఓటు బాంక్ 40% ఉండేది. 2014లో ఇదంతా జగన్ గారి పార్టీ కి బట్వాడా ఐంది.  
2014లో తెలుగుదేశానికి,జగన్ గారికి తేడా కేవలం 2% ఓట్లు. అయినా ,తెలుగుదేశానికి 35సీట్లు ఎక్కువ వచ్చాయి. YSRCP got 44.47 per cent votes and TDP got 46.3 per cent, a difference of 2.6 per cent.
తెలుగుదేశం ---- polled 1,33,72,862 votes against 
the YSRCP’s ------------  1,27,71, 323.

2019లో మొత్తం 3కోట్ల ఓట్లు పోల్ అయ్యే అవకాశం ఉంది. 
2014లో జగన్ గారిపార్టీకి వచ్చిన   45% ఓట్లలో అగ్రవర్ణాల ఓట్లు 15%, దళిత ఓటు 9%, గిరిజన ఓట్లు 5% , మైనారిటీ ఓట్లు 6%, బి సి ఓట్లు 10% . 
వీటిలో ఏ వర్గం నుండి జగన్ గారిపార్టీ   ఓట్లు  కోల్పోవచో అంచనా వేద్దాం. 
అగ్రవర్ణవోట్లలో  4%, దళిత ఓట్లలో 3%, గిరిజన ఓట్లలో 2%, మైనారిటీ ఓట్లలో 3% , వెరసి 12% ఓట్లు కోల్పోయే అవకాశం ఉంది. అనగా 2014లో సాధించిన 45% ఓట్లలో 12% పోగా మిగిలింది 33%. 
ఇలా కోల్పోయిన 12% ఓట్లను ఏయే పార్టీలు పంచుకొంటాయో అంచనా చూద్దాం. 
1% కాంగ్రెస్, 3% తెలుగుదేశం, 8%పవన్ గారిపార్టీ . 
తెలుగుదేశం కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కోల్పోయే అవకాశం ఉంది. 2014లో తెలుగుదేశం సాధించిన 47% ఓట్ల నుండి, దళితులు 5%, అగ్రవర్ణాలు 3% ,కాపులు 3%, గిరిజనులు 1%, వెరసి 12% కోల్పోయే అవకాశం ఉంది. వీటిని, పవన్ 8%, కాంగ్రెస్ 1%, జగన్ 3% పంచుకొనే అవకాశం ఉంది. 
2014లో  3%  కాంగ్రెసుకి , 3% భాజపా కి వచ్చాయి. వీటిలో భాజపాకి 1% మిగిలి మిగతా 2% పవన్ కి వెళ్లే అవకాశం ఉంది. 
పైన అనాలిసిస్ క్రోడీకరిస్తే , 
తెలుగుదేశం కి 2014లో వచ్చిన 47% ఓట్లలో   పోయేవి = 12% ;  వచ్చేవి  = 3%. వెరసి 9% నష్టం . కాబట్టి 2019లో 38%. ఓట్లు . 
జగన్ పార్టీకి  కి 2014 లో 45% ఓట్లలో   పోయేవి = 12% ;  వచ్చేవి  =3%. వెరసి 9% నష్టం . మొత్తం= 2019 లో 36% ఓట్లు . 
పవన్ గారి పార్టీ కి   - జగన్ గా రి  పార్టీ నుండి 8%, తెలుగుదేశం నుండి 8% చీల్చుకొంటారు. ఇవికాక కుల మతాలకు అతీతంగా  సినిమా అభిమానులనుండి  2 % ఓట్లు  వెరసి 18% ఓట్లు. 
కాంగ్రెస్ కి 6%. & భాజపా కి 1% ఓట్లు రావచ్చు. 

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చాల తక్కువ ఉంటుంది ఎందుకంటే, 
1. 2014 రాష్ట్రం విభజింపబడి చంద్రబాబు అధికారం చేపట్టినప్పుడు పరిపాలన చేయడానికి కనీసం ఆఫీసు కూడా లేని స్థితి నుండి  ప్రపంచంలోనే పేరెన్నిక గన్న రియల్ టైం గవర్నెన్స్ స్టేజి కి చేరుకున్నాం. 
2. గ్రామాల్లో విద్యుత్ లేని స్థితినుండి 24గంటలు సరఫరాచేసే దశకు చేరుకున్నాం. 
3. 2014 కి ముందు ఉన్న చాలీ చాలని 200/- పెన్షన్  ను 5రేట్లు పెంచి 1000/- పొందుతున్నాం.మళ్ళీ ఇప్పుడు 2019 నుండి ఈ పెన్షన్ ను 2000/ కి పెంచడం మామూలు విషయం కాదు. 55 లక్షల మంది వితంతువులు, ఒంటరి మహిళలు, ఆనాధలు ,దివ్యానుగులకు ప్రతి నెలా టంచన్ గా 2000/- వారి అకౌంట్ లో వేయడం అనేది చాలా అద్భుతమైన విషయం.  
4. ఇంతేకాదు నదుల అనుసంధాన పధకం లో భాగంగా హంద్రీ నీవా, పట్టిసీమ, చింతల పూడి , పురుషోత్తమపట్నం ప్రాజెక్ట్ ల నిర్మాణం పూర్తవ్వడం వలన లక్షలాది ఎకరాలకు సాగునీరు నికరంగా పొందుతున్నాం.
5. డ్వాక్రా సంఘాలకు పూర్తి ఋణ మాఫీ , 70% రైతులకు పూర్తి ఋణ మాఫీ,మిగతా 30%శాతం రైతులకు 60% రుణమాఫీ జరిగింది.మిగతా 40%మాఫీ కూడా ఎన్నికలలోపు అందుతుంది.  .ఋణమాఫీ జరిగినా కొన్ని మీడియా సంస్థలు  జరగనట్లే చెప్పుకొంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో  రైతులను అడిగితే వారు సంతోషంగా సంతృప్తి గానే  ఉన్నారని ఒక సంస్థ డేటా సేకరించింది. 
6. మనిషి జననం  నుండి మహా ప్రస్థానం వరకు వివిధ దశలలో అవసరమయ్యే ఆసరాని 50 సంక్షేమ పధకాల ద్వారా చంద్రబాబు  అందిస్తున్నట్లు మరే రాష్ట్రమూ అందివ్వడం లేదు. 
7.  అన్న కాంటీన్ ల ద్వారా శుచి రుచి గల ఆహారాన్ని 3పూటలా కేవలం 15/ అందివ్వడం చేత , రాష్ట్రంలో "ఆకలి" కి చోటు లేదు.
8. కొద్దిగా ఆలస్యం అయినా , సుమారు 10లక్షల మంది యువతకు నిరుద్యోగ పెన్షన్ 1000/- ఇవ్వడం సామాన్యమైన విషయం కాదు. 
9.  అన్నివర్గాలు,అన్ని స్థాయిల ఉద్యోగులకు జీతభత్యాలు ఇంత  ఆర్ధిక దుస్థితిలో కూడా  పెంచడం మామూలు విషయం కాదు. 
10.అమరావతి గురించి  అందరూ ఏమే మో అనుకొంటున్నారు. కానీ ఒక్కటి ఆలోచించండి. చిన్న ఇల్లు కట్టుకోవాలంటేనే తర్జన భర్జనలు చేస్తాం. ఆంధ్రుల భవిష్యత్ కల్పతరువు సమగ్ర ఆర్ధిక రాజధానిని ఎంత జాగ్రత్తగా నిర్మించాలో మనందరికీ తెలుసు. ఎంత నమ్మకం లేకుంటే గంటలోనే 2000కోట్ల విలువైన అమరావతి బాండ్లను కొనుగోలు చేస్తారు? 
11. దేశ వ్యాప్తంగా పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్ట్ లు 16 నిర్మాణంలోఉన్నా, కేవలం 4 ఏళ్లలో మన పోలవరం ప్రాజెక్ట్ మాత్రమే 60% పూర్తయిందని చెప్పుకోవడం గర్వం కాదూ ? 
12. సుమారు 100 మధ్యతరహా & భారీపరిశ్రమలు, వందల్లో సేవా రంగపు కంపెనీలు 4 ఏళ్లలో నెలకొల్పి 10లక్షల మంది యువతకు ప్రత్యక్షంగా,పరోక్షంగా ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం , దేశంలో కేవలం మన ఆంధ్రా మాత్రమే  !
మరి సెటిల్ మెంట్లు ,జన్మభూమి కమిటీలలో ఉంటూ సొంతవాళ్లకే పధకాలు కేటాయించుకోవడం, మైనింగ్ లో అవినీతి,అక్రమాలు చేసిన శాసన సభ్యుల వలన కొన్ని వర్గాలలో ముఖ్యంగా కమ్మకులానికి వ్యతిరేకమైన వర్గాలనుండి  వ్యతిరేకత బాగా ఉంది. ఇలాంటి ఆరోపణలున్న సిట్టింగ్ శాసన సభ్యులను మారిస్తే పార్టీకి మరిన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది. 
ఇలాంటి శాసన సభ్యుల వలన తెలుగుదేశం పార్టీకి ఎంత వ్యతిరేక త ఉంటుందో,అంతకంటే వ్యతిరేకత జగన్ గారిపై ఉంటుంది. దీనికి కారణం,ప్రత్యేక హోదా కోసం గానీ రాష్ట్ర హక్కుల కోసం గానీ జగన్ గారు చేసిన పోరాటం సున్నా.  పైపెచ్చు , ఆంధ్రా  ని మోసం చేసిన మోడీ ,ఆంధ్రా వాళ్ళను నానా బూతులు తిడుతూ ఆంధ్రా అభివృద్ధికి అడ్డు తగులుతున్న కె.సి.ఆర్ తో అంటకాగడం వలన మధ్యతరగతి వర్గాలలో  జగన్ పై నెగిటివిటీ రోజురోజుకీ పెరుగుతుంది.  

Thursday, 7 June 2018

Modern prayer! ఆధునిక ప్రార్ధన.

మీకు దైవం పై నమ్మకం ఉన్నా,లేకున్నా మీ ఆత్మ సాక్షిగా , ప్రతి రోజూ 3 సార్లు ఈ క్రింది ప్రార్ధన శ్రద్ధతో,విస్వాసం తో చేయండి. మీరు పలుకుతున్న ప్రతి పదము' పైన ప్రగాఢమైన నమ్మకం తో ఉంటూ ,భావయుక్తంగా  ఉచ్చరించండి. ఇలా  జరగాలనే కోరికతోకాకుండా , మీరు పలికినవన్నీ నిజంగా జరుగుతున్నాయని భావన చేయండి.

"నేను ఎల్లపుడూ నిజమే మాట్లాడుతాను. 
నేను అన్నివేళలా ఇతరులకు సహాయం అందిస్తాను. 
నేను దైర్యంగా ఉంటాను. 
నేను ఎల్లపుడు ఆత్మవిశ్వాసంతో ఆలోచిస్తాను,ఆత్మ విశ్వాసంతో మాట్లాడుతాను,ఆత్మవిశ్వాసంతో కార్యాలు సాధిస్తాను.
నేను ఎల్లపుడు ఆరోగ్యంగా,ఉత్సాహంగా ఉంటాను.
నేను ఎల్లపుడూ విజయాన్నే సాధిస్తాను.
నేను బాధ్యతగా ఉంటాను.
నేను ఎల్లపుడూ సత్యమే చెబుతాను.
నేను ఎల్లపుడు అన్ని భాషలలో అనర్గళంగా మాట్లాడుతాను.
 నా మాటలు,చేష్టలు  అందరి హృదయాలకు చేరుతాయి.
నా మాటలు,చేష్టలు  అందరికీ స్వాన్తన  నిస్తాయి.
నేను అందరితో సామరస్యంగా ఉంటాను.
నేను మానవ సంబంధాలకు ప్రాముఖ్యత నిస్తాను .
నేను ఎప్పుడూ ప్రశాంతంగా,ఆనందంగా ,శాంతిగా ఉంటాను.
నేను సమస్త జీవులకు ప్రశాంతతను,  ఆనందాన్ని, శాంతిని ఇస్తాను.
నేను సాధించే విజయాలలో అందరికీ భాగస్వామ్యం ఉంటుంది.
నేను సాధించిన ఫలాలలో అందరికీ భాగస్వామ్యం ఉంటుంది.
నేను ప్రకృతిని ప్రేమిస్తాను.
నేను ధర్మం గా చరిస్తాను.
నేను-నేను-నేను అని చెబుతున్నాను గానీ,నిజానికి నేను అనేది "అదే!


Wednesday, 6 June 2018

BJP's Betrayal - భాజపా వారి మహాకుట్ర - 1 వ భాగం!

ఆంధ్రులు ఆధ్యాత్మిక చింతనా పరులేగానీ పరమత సహనం లేని మూఢ మతస్థులు కాదు. కాబట్టి సంఘ్ పరివార్ యుక్తులు ఉత్తరభారతంలో చెల్లుబాటైనట్లు ,ఆంధ్రాలో చెల్లవు. ఆంధ్రాలో కేవలం కుల పిచ్చే  గానీ,మత పిచ్చి లేదు. కాబట్టి , ఆంధ్రాలో కులాల మధ్యన మంటలు పెట్టి పబ్బం గడుపుకోవడానికి ఎక్కువశాతం ప్రయత్నం చేస్తారు భాజపా  వాళ్ళు.

భాజపా టార్గెట్ : చంద్రబాబు పతనం & తమ గుప్పెట్లో ఆంధ్ర రాష్ట్రం !
సూత్రధారులు : శ్రీ మోదీజీ & అమిత్ షా !
పాత్రధారులు : ఆంధ్రాలో ప్రతిపక్ష పార్టీల నాయకులు , విశ్రాంత ఆఫిసర్లు,విశ్రాంత అర్చకులు , విశ్రాంత రాజకీయ నాయకులు , ఖాళీగా ఉన్న దగుల్భాజీలు !
మహాకుట్ర లో తోలి అంకం  సుమారు 3 ఏళ్ళక్రితమే మొదలయింది. రాష్ట్రానికి ఏదో బిచ్చమేసినట్లు నాలుగు రూపాయలు, పేపర్ నోటిఫికేషన్ లు, నోటి మాటలు,గుప్పెడు హామీలు, తట్టెడు  ప్రచారం తో ఆంధ్రులను,చంద్రబాబుని  అందరినీ తప్పుదారి పట్టించి , తెర వెనక జగన్,పవన్ లతో లాలూచీ లు మొదలుపెట్టారు. ఈ కుట్రను కాస్త ఆలస్యంగా గ్రహించిన చంద్రబాబు , భాజపా గుప్పిటి నుండి బయటకు వచ్చేశాడు . అప్పటి నుండి భాజపా తమ మహా  కుట్రలో గేరు మార్చింది.  
తమకు ఎలాంటి సొంత బలం లేకున్నా, ఆంధ్రాలో అధికారాన్ని తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకోవడా నికి, తమిళనాడు మోడల్ లో ,  అవినీతి మకిలి లో మెడ వరకు కూరుకు పోయిన వారిని, చెప్పినట్లుగా ఆడే  వేషగాళ్ళను  వెనకుండి  నడిపించడం సంఘ్ పరివార్ అసలైన అస్త్రం.
ఇప్పటి వరకు జగన్ మోహన్ రెడ్డి కూడా మాట్లాడని విధంగా, పరుష పదజాలంలో చంద్రబాబుని తిడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆధారాలు లేకుండా,నోటికేది వస్తే అది కక్కే స్తున్నారు.  ఒక పక్క చంద్రబాబు బీజేపీతో పోరాడుతుంటే, చంద్రబాబుని బలహీనపరుస్తూ, నేషనల్ మీడియాకు ఎక్కి మరీ చంద్రబాబుని తిడుతున్నాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబుకు ఇంగితం లేదు అన్నారు... చంద్రబాబు ఇసుక కరా కరా తింటున్నారు అన్నారు... మేము రోడ్లు వేసాం అని లోకేష్ అంటుంటే,  ఇది నీ తాత గాడి సొమ్ము ఏమన్నా తెచ్చి పెడుతున్నావా ? మీ నాన్న నువ్వు కలిసి, కంకరు, సిమెంట్ కలుపుతున్నారా అనే దిగజారుడు, చౌకబారు ఆరోపణలు చేస్తున్నాడు పవన్... ఇక పవన్ సినిమా అభిమానులు అయితే, సోషల్ మీడియాలో చంద్రబాబుని, లోకేష్ ని ఎలా తిడుతున్నారో చెప్పే పని లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఇంత దిగజారి పోవలసిన అవసరం ఏమొచ్చింది? భాజపా వారి  తావీదు  మహిమ!

ఆంధ్రాలో ఏదో విధంగా బ్రాహ్మణ కులపు ఓట్లు, వీలయితే హిందువుల ఓట్లను గంప గుత్తగా భాజపా పార్టీకి పడేటట్లు ,అలాగే మొత్తం కాపుసమాజం ఓట్లు జనసేన పార్టీకి, దళితుల ఓట్లు మొత్తం జగన్ గారి పార్టీకి  పడేటట్లు చీలిస్తే,తెలుగుదేశం ఓడిపోతుందనే గాఢమైన నమ్మకంతో ఎలక్షన్ బూత్ స్థాయిలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. 
 కులాల వారీగా ఓట్లను చీల్చడం,  చంద్రబాబు సామర్ధ్యం పై సందేహాలు,చంద్రబాబు విశ్వసనీయత పై అనుమానాలు ప్రజల్లో కలగ చేయడం,  దీనికి గాను వివిధ వ్యక్తుల తో బురద జల్లుడు కార్యక్రమాలు చేయించడం, తమ మాట వినే రెండు సత్రకాయ పార్టీ నాయకుల కు స్క్రిప్ట్ ఇచ్చి పిచ్చి పెట్టినట్లుగా రెచ్చి పోయేటట్లు బూతులు వాగించడం,భాజపా వారి మహాకుట్ర లో ని వివిధ అంకాలు.  
ఇప్పటికే తిరుమల  వ్యవహారాలపై రమణ దీక్షితులతో (బ్రాహ్మణులూ)  , దళితుల సమస్యలపై మోత్కుపల్లి తో, అమరావతి పై  విశ్రాంత ఆఫీసర్లతో  చంద్రబాబు పై  బురద జల్లించారు. ఆ బురద కడుకోవడానికే చంద్రబాబు గారి విలువైన సమయం  సరిపోతుంది కాబట్టి,ఆయన రాష్ట్రం పై దృష్టి పెట్టలేడు ,అంతే కాదు జాతీయ రాజకీయాలలో కూడా యాక్టివ్ గా పాల్గోలేడని భాజపా వాళ్ళ ఊహ!

.భాజపా వాళ్ళు చేయించే ఆరోపణల్లో వాస్తవం లేకపోయినా మీడియాలో ఏదో ఒక విధమైన నెగెటివ్ ప్రాపగాండా ని ప్రజల్లోకి తీసుకెళితే, క్రమేణా చంద్రబాబుపై విశ్వసనీయత తగ్గి పోతుందనే మహాకుట్రలో భాగం గా భాజపా పార్టీ ,  వాళ్ళ శక్తియుక్తులు, వేలాది కోట్లను డబ్బులను  నీళ్లలాగా ఖర్చు చేస్తున్నారు. అందులో సగం మన రాష్ట్రానికి కేటాయించినా చంద్రబాబు వాళ్ళతోనే ఉండేవాడు గదా?  
ఇది ఏముంది?  ఇంకా ముందు ముందు ముస్లిం వ్యక్తులు , వెనుకబడిన తరగతులకు చెందిన వాళ్ళతో కూడా తెలుగుదేశం ,ముఖ్యంగా చంద్రబాబు పై  బురద జల్లే కార్యక్రమానికి తెర తీస్తారు.  
కానీ ఆంధ్రులు భాజపా చేసే మాయలు మోసాలకు లొంగుతారా?  రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొట్టే విధంగా జగన్ &పవన్  లు చేస్తున్న అరాచకపు వేషాలకు  ప్రజలు ముగింపు పలుకుతారని ఆశిద్దాం. 

ఇప్పటికే కన్నడ నాట తెలుగు వాళ్ళ దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించారు. భాజపా  నోటికాడి వరకు వచ్చిన అధికారాన్ని  లాగేశారు. 2019 లో కూడా ఆంధ్రులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరికీ ఎలా వాత పెట్టాలో అలా కీలెరిగి వాత పెట్టాలి!  

Friday, 30 March 2018

మోదీ ముక్త్ భారత్'. - Lets throw away the Modi!

మోడీ ఏమిచేశాడో పరిశీలిస్తే సగటు భారతీయుడి కడుపు మండక మానదు. గత 4ఏళ్లలో మోడీ చేసినన్ని నినాదాలు,గిమ్మిక్ లు మరే ప్రధానీ చేయలేదు. అలాగే మోడీ వేసినన్ని రంగు రంగుల కోట్లు మరెవ్వరూ వేయరు,వేయలేరు. 
కాలికి చక్రాలు కట్టుకొని ప్రపంచాన్ని చుట్టేయడం, ఎదురుగా కనబడిన ఇతర దేశాధినేతలను కౌగలించు కోవడం, బాంక్ లపై విశ్వాసాన్ని దెబ్బతీయడం, దొంగలతో ,నేరస్తులతో జట్టు కట్టడం, రాజకీయలబ్ధికోసం కొందరు నేరస్థులను వదిలివేయడం, లక్షలకోట్ల ప్రజా ధనానికి విలువలేకుండా చేయడం అత్యంత గర్హనీయమైన నేరాలు. ఇన్ని నేరాలు చేసికూడా గర్వంగా ఛాతీ విరుసుకుని తిరుగుతూ ఉన్నాడంటే అది మన చేతకానితనమే!

2016 నవంబర్ లో మోడీ చేసిన ఓ అనాలోచిత చర్య భారతదేశాన్ని, సగటు భారతీయుడిని ఎంతలా కుంగదీసిందో చూస్తే, ఇదే ఏ కమ్యూనిస్ట్ దేశంలో ఐతే మోడీని ఈ పాటికి అభిశంసన చేసేసి ఉరి తీసే వాళ్ళు. నోట్ల రద్దు అనే పిడుగు బడా బాబులను ఏమీ కదిలించ లేకపోయింది. పైగా మధ్యతరగతి,కింది తరగతి భారతీయులను మాత్రం నానా కష్టాల పాలు చేసింది. 

పెద్దనోట్ల రద్దు అని చెప్పి అంతకంటే పెద్ద 2000 నోట్లను ముదిరించినపుడే, చంద్రబాబు లాంటి అనుభవజ్ఞులు అది తప్పని హెచ్చరించారు. అయినా మోడీ మొండితనం ముందు అవేమీ నిలవలేదు. 
నాలుగురకాల స్లాబులతో GST ని ప్రవేశపెట్టడం,ప్రతినెలా మార్పు చేర్పులు చేయడం, ప్రతి 3నెలలకు చిన్నా చితకా వ్యాపారులను రిటర్న్ లు పంపమని జులుం చేయడం 30శాతం వ్యాపారాలు మూతపడటానికి కారణమైంది. 
ఆయిల్ దిగుమతుల బిల్లు బాగా తగ్గిపోయినా కూడా రోజు రోజుకీ ఆయిల్ ధరలు పెంచేయడం, దేశ ఆర్ధిక గమనానికి తీవ్ర విఘాతమైంది.  
                              లక్షలాది భారతీయుల విషాద చరిత్ర ను ఒక సారి పరిశీలిద్దాం. 
  భారతీయ గ్రామీణ ప్రాంతంలో 5కోట్ల వ్యవసాయ కూలీ కుటుంబాలున్నాయి. మరో 13కోట్ల కుటుంబాలు తమకున్న చిన్న చిన్న కమతాలలో అతికష్టం మీద పంటలు పండిస్తూ తమ కడుపులు నింపుకోలేక పోవడమే కాక ఏటికేడు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. మోడీ చేసిన తెలివి తక్కువ నోట్లరద్దు ఈ మొత్తం 18కోట్ల కుటుంబాల డొక్కలను ఎండ గట్టి వారిని రోడ్డు పై పడేసింది. నోట్లరద్దు' అనే పిడుగుపాటు వలన,  వీరి ఆదాయం గత ఏడాదిగా 40శాతం తగ్గిపోయింది. అంతేకాదు వట్టిపోయిన పశువులను అమ్ముకో నివ్వకుండా చేసిన చట్టం వలన రైతులు ఇంకా కుంగిపోయారు. అటు పశువులను పెంచలేక,ఇటు వాటిని అమ్ముకోలేక నానా యాతన పడుతున్నారు.
  18కోట్ల కుటుంబాలలో సగటున రెండు ఓట్లు చొప్పున 36 కోట్ల ఓట్లు మోడీకి వ్యతిరేకంగా పడుతాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

సరే గ్రామీణ భారతాన్ని కుంగదీసిన మోడీ అనాలోచిత చర్యలు,మధ్యతరగతి పట్టణవాసులను కూడా ప్రభావితం చేసిందా?
ముందుగా చెప్పుకో వలసింది నిరుద్యోగం . అవినీతినైనా సహిస్తారు గానీ,పని దొరక్కపోవడాన్ని భారతీయ యువత సహించలేరు. ప్రతి రోజూ
  సుమారు 30000 మంది పనిచేయగల యువత పనికోసం భారతీయ సమాజంలోకి వస్తున్నారు. మరి వీరందరికీ ఏమైనా ఉద్యోగాలు కల్పించాడా మోడీ? స్కిల్ ఇండియా, మేకిన్ ఇండియా" అంటూ పిచ్చి పిచ్చి నినాదాలతో కాలం గడిపేశాడు తప్ప ఒక్క ఉద్యోగం కూడా కొత్తది ఇవ్వలేకపోయాడు మోడీ!
కొత్త ఉద్యోగాలు కాదు, ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతా ఉంటె జనంలో అశాంతి పెరగదా?
  పెద్దనోట్ల రద్దు తర్వాత 6నెలలలో సుమారు 20 లక్షల ఉద్యోగాలు ఊడిపోయాయి అంటే సమాజంలో ఎంత అశాంతి పెట్రేగిందో మోడీ గానీ, మోడీ చుట్టూ మూగిఉన్న మేధావుల కోటరీ గానీ  అర్ధం చేసుకోలేదు. ఒక ఉద్యోగం నలుగురిని బతికిస్తుందీ అనుకొంటే సుమారు 80 లక్షల మంది ప్రజలు డొక్కలు ఎండిపోతున్నాయి . ఇవేమీ మోడీకి తెలియదు. ఎందుకంటే అతడు ఒక కుహనా మేధావి.
తోలుపరిశ్రమలు మూతపడిపోవడానికి కారణం ఎవరు? మోడీ! ఆటను చేసిన తుగ్లక్ చర్యలవలన
కబేళాలు మూసేయడం వలన తోళ్ళపరిశ్రమకు తోళ్ళు అందలేదు. దానితో  ఆ పరిశ్రమలపై ఆధారపడిన సుమారు మిలియన్ మంది ఉద్యోగాలు పోయాయి.
వస్త్ర పరిశ్రమల లో 30% మూతపడటానికి కారణం ఎవరు? మోడీ! అతను ప్రవేశపెట్టి సరిగ్గా అమలుచేయలేకపోతున్న పన్ను విధానాల వలన 30% బట్టల పరిశ్రమలు మూత పడిపోవడం వలన మరో మిలియన్  ఉద్యోగాలు పోయాయి.
ఇలా మోడీ అనాలోచిత,అతితెలివి చర్యలు దేశాన్ని ఆర్ధిక మాంద్యంలోకి నెట్టివేస్తున్నాయి. ఓ పక్క అమెరికా,యూరప్,చైనాలు ఆర్ధిక ప్రగతితో దూసుకు పోతూ ఉంటే , భారతదేశాన్ని మాంద్యంలోకి తోసివేసిన మోడీని ఏ చెప్పుతో కొట్టాలి?

ఆయిల్ దిగుమతుల బిల్లు గణ నీయంగా తగ్గినా కూడా ఇబ్బడిముబ్బడిగా పన్నులు, పన్నులమీద సెస్సులు వేసేసి పెట్రోల్,డీజిల్ ధరలను ఆకాశంలో నిలిపిన మోడీ వలన పచారీ సరకుల ధరలు,ధాన్యం ధరలు కొండెక్కి కూర్చున్నాయి.
 ఇలా అనేక విధాలుగా  భారతదేశాన్ని చేతులారా నాశనం చేసిన మోడీ కి ఏ శిక్ష వేయాలి?
చిన్న చిన్న వ్యాపారులు కూడా ప్రతి మూడు నెలలకు తట్టెడు పన్ను రిటర్న్ లు దాఖలు చేయాలంటే ఎలా కుదురుతుంది.
దేనిపైనా స్పష్టత లేని మోడీ, అన్ని శాఖలను తన అధీనంలో ఉంచుకొని కేవలం 10మంది  క్షేత్రస్థాయిలో అనుభవంలేని కుహనా మేధావులను వెంటేసుకొని  ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తావుంటే 
ఆపేవారెవరూ లేరా ?

అంతేకాదు, ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నా,అక్కడ వాలిపోయి నోటికొచ్చిన వాగ్దానాలు చేసి అమాయకులను మోసపుచ్చడం మోడీకి మామూలైపోయింది. 
తమిళనాడులో నీతి -అవినీతి అనే విచక్షణ ను పక్కన బెట్టి, ఉచ్చ నీచాలు మరచిపోయి, అటు DMK  ని, ఇటు అన్నా DMK లోని రెండువర్గాలను ఏక కాలంలో  దువ్వుతున్నాడు మోడీ. 
అలాగే ఆంధ్రాలో తనచేతిలో కీలుబొమ్మలా మెసలే రెండు సత్రకాయ పార్టీలను ఎగదోసి బలంగా ఉన్న చంద్రబాబుని అణగతొక్కి ఆంధ్రాలో మోడీ జెండా ఎగరవేయడానికి అతను చేస్తున్న అరాచకాలు అన్నీఇన్నీ కావు. 
తాజాగా పదోతరగతి పరీక్ష పేపర్లు కూడా లీక్ చేయించి విద్యార్థులలో కూడా మోడీ పలుచనైపోయాడు. 2019లో ఈ విద్యార్థులకు కొత్తగా ఓటు హక్కు రాబోతుంది. మరి వీళ్ళు ఎవరికీ వ్యతిరేకంగా ఓటు వేస్తారో వివరించి చెప్పనక్కర లేదు. 
  అతని మాటే చెల్లిపోవాలనే అహం మూర్తీభవించిన మనిషి మోడీ  
మోడీకి కావలసింది అతను తాన అంటే తందానా అనే కీలుబొమ్మలు కావాలి. దానికోసం తనమాట వినని నాయకులపై  కేంద్ర నిఘా సంస్థలను వేట కుక్కల్లా ఉసికొల్పుతున్నాడు. శత్రువులపై లేని కేసులు పెట్టిస్తాడు. మిత్రులపై ఉన్నకేసులు నీరు గారుస్తాడు. ఇదీ ఫాసిజం. ఇది హిందూత్వ కానే  కాదు.   హిందువులను రక్షించే ఏకైక రక్షకుడుగా పేరుతెచ్చు కోవడానికి భారతదేశమంతటా  లేనిపోని అల్లర్లు,మతకలహాలు రెచ్చ గొట్టించి హిందువుల ఓట్లన్నీ గంప గుత్తగా భాజపా కే పడాలనే దురుదేశ్యంతో దేశంలో అశాంతి పుట్టిస్తున్నాడు. 
ఈ బాధలనుండి విముక్తి కలగాలంటే ఒక్కటే పరిష్కారం... అదే "మోదీ ముక్త్ భారత్'.


Thursday, 29 March 2018

ఎవర్రా నీకు రాజకీయాలు తెలియవంది ?

నిజానికి,అబద్ధానికి తేడా తెలియని వాళ్ళు  ఎవ్వరిని మోసం చేద్దామని భారీ  సభలు పెట్టి యువతను తప్పుదారి పట్టిస్తున్నారు ? నీ  చెయ్యి మెలితిప్పి ,చెవులు వాయగొట్టిందెవరు? ఎవరి ప్రోద్భలంతో అబద్దపు ఆరోపణలు చేస్తున్నావు?
ఇతరుల లెక్కలు గట్రా నాకు అర్ధం కావు ,నా లెక్క నాదే " అనుకొంటూ దారేపోయే వాళ్లతో కమిటీలు వేయడం ఏ లెక్క కిందకు వస్తుందో చెప్పాలి.
నాకేమీ తెలియదు,నేను కడిగిన ముత్యాన్ని "అంటూ నంగనాచి కబుర్లతో యువతను తప్పుదారి పట్టించే రాజకీయాలు ఆడేయడం సమాజానికి మంచిదేనా?
ఓ పక్క రాష్ట్రం కేంద్రం చేతిలో మోసపోతే కేంద్రాన్ని నిలదీయకుండా,  ఇక్కడ అధికారంలో ఉన్నవాళ్లు అవినీతి చేస్తూ సరిగా పోరాడటం లేదు, "నాకు ఓటేయండి ,నేను న్యాయం చేయిస్తా" అనే అమాయకుడికి రాజకీయాలు తెలియవు అంటే నమ్ముతారా?
యువతలో బలహీనతను రెచ్చగొట్టి  ,కులాన్ని అడ్డుపెట్టుకొని నాలుగు ఓట్లు దైర్యంగా అడుక్కోవడం రాజకేయం కాదా ?
అవినీతి తో సంపాదించేవాళ్లకు టిక్కెట్ లు ఇచ్చే నువ్వా, నీతి అవినీతి గురించి  మాట్లాడేది? మీ అన్న చేసిందే నువ్వూ చేస్తూ, పైకి నీతి మంతుడిలా నటించడం ఫక్తు రాజకీయం కాదా ?
నిట్టనిలువునా మోసం చేసి,రాష్ట్ర అధోగతికి కారణమైన కాంగ్రెస్,అధికారంలోకి వస్తే  హోదా ఇస్తామని చెప్పిన మాటను నమ్మేసి  కసాయి కాంగ్రెస్ వాళ్లతోనో, లేక నమ్మించి మోసం చేసిన దగుల్భాలజీ BJP తోనో  అంటకాగడానికి రెడీ  అవుతున్న నీకు రాజకీయాలు తెలియవు అంటే మేము నమ్మాలా?
ఆంధ్రా గవర్నమెంట్ లో అవినీతి కనిపెట్టిన నీకు, తెలంగాణా గవర్నమెంట్ లో అవినీతి  కనబడలేదని మెచ్చు కొంటున్న నీకు, రాజకీయాలు తెలియవు అంటే ఎలా నమ్మేది?
అవినీతి ఉంటే విచారణ చేపట్టాలి తప్ప,రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలను కేంద్రం  అడ్డుకోవడాన్ని సమర్ధిస్తావా ?
ఎవర్రా  నీకు  రాజకీయాలు తెలియవంది ?

Tuesday, 20 March 2018

You can defeat Modi...!

3000కోట్లు మీవి కావనుకొంటే , మోడీ పార్టీకి వచ్చే ఎలక్షన్ లలో 150 సీట్లు కంటే ఎక్కువ రాకుండా కట్టడి చేయవచ్చు. ఆలా ఖర్చు పెట్టలేకపోతే ,మోదీపార్టీకి 2019 ఎన్నికలలో 200 సీట్లు వచ్చే అవకాశం ఉంది. 
 వివరంగా చూద్దాం 
సువిశాల భారతదేశం యొక్క ఆర్ధిక పెరుగుదల రేటు ఏటా  కేవలం 7% గా ఉంది. ఇంతజనాభా,ఇంతపెద్ద స్వదేశీ మార్కెట్ ఉన్నదేశం ఇంత  మెల్లగా తాబేలు లెక్క ఆర్థికస్థితి పెంచుకోవడం చాల దారుణం. నిజానికి మిగతా ప్రపంచం మొత్తం ఆర్ధిక మాంద్యం నుండి బయటపడి పరుగులు దీస్తుంటే మోడీ నాయకత్వంలో కేవలం 5 నుండి 7% పెరుగుదల అంటే ఎంత ఘోరమో ఆలోచించండి!
ఆయిల్ దిగుమతుల బిల్లు చాలా తగ్గి పోవడం వలన గత 4ఏళ్లలో మన మోదీ ప్రభుత్వం 4లక్షలకోట్లను సేవ్ చేసుకొంది.  అదంతా ఏమైపోయింది?
4ఏళ్ళు నిద్రపోయి, 5వబడ్జెట్ లో రైతు సంక్షేమ పధకాలు,ఆరోగ్యరక్ష పధకాలు పెట్టారు. ఆర్ధిక పెరుగుదల రేటు ఏటా  కేవలం 7%  మాత్రమే ఉన్నపుడు,వీటికి నిధులు ఎక్కడనుండి ఎలా తెస్తారో జైట్లీ గారు చెప్పలేదు. కేవలం  రాబోయే ఎన్నికల కోసం ప్రచార ఆర్భాటం తప్ప నిజమైన పధకాలు కావవి. 
గ్రామీణ భారతం ఇంతగా కుంటుబడటానికి కారణం మోడీ తీసుకొన్న అనాలోచిత నిర్ణయాలే. పెద్దనోట్ల రద్దు , వస్తుసేవల వినిమయ పన్ను  అలాగే ప్రభుత్వం తీసుకొన్న కొన్ని నిర్ణయాలు మార్కెట్ లో కరెన్సీ కి కటకట లేర్పరచి , సామాన్యుడికి ,అలాగే మధ్యతరగతి వారికీ చుక్కలు చూపించాయి. అంతేకాదు, ప్రజల యెక్క  ఆస్తుల విలువ , సంపద విలువ  బాగా తగ్గిపోయింది.కానీ వారు ఖర్చు పెట్టే వస్తువులు,సేవల ధరలు మాత్రం తగ్గలేదు. దీనివలన మధ్యతరగతి వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అప్పులతో సతమత మయ్యేవారు,ఆస్తులు అమ్మేసి తీర్చుదామంటే కొనేవాళ్ళు లేరు. 
కొనుగోళ్లు బాగా మందగించాయి. కొన్ని స్వదేశీ. విదేశీ సంస్థలు ఫార్వార్డ్ ట్రేడింగ్ చేయడం వలన రైతులకు మద్దతు ధర లభించడం కష్టమై పోయింది. బాంక్ లలో నిరర్ధక ఆస్తులు పెరిగిపోయి దివాళా తీయడానికి సిద్ధంగా ఉన్నాయి. బాంక్ లను లూటీ చేసేవాళ్ళని,ఏదేదో చేస్తానన్న  మోడీ ఏమీ చేయడం లేదు. క్రమేణా, మోడీ విశ్వసనీయత కోల్పోయాడు. అందుకే,  ఎన్నికల సంవత్సరంలో  కొత్త బడ్జెట్లో  మోడీ ఎలాంటి తాయిలాలు చూపించినా  ప్రజలు నమ్మడం లేదు. 
సాధారణంగా, ఎలక్షన్ సమయాల్లో బడ్జెట్ లు అలాగే జనాకర్షంగా కనబడతాయి తప్ప మేలు మాత్రం జరగదు. ఒకవేళ మోడీ  నిక్కచ్చిగా చేయాలనుకున్నా , రైతు పంట మద్దతు ధర 150% పెంచడానికి ,  10కోట్ల కుటుంబాలకు 5లక్షల ఖరీదైన ఉచితవైద్యం అందివ్వడానికి  అవసరమైన నిధులు  ప్రభుత్వ ఖజానా లో లేవు.  
మధ్యతరగతి వారు  ఇప్పటికే  మోడీకి దూరం జరిగారు . 
FCRA చట్టానికి సవరణ చేసి విదేశాలనుండి రాజకీయ పార్టీలకు  1976 నుండి వచ్చిన డొనేషన్ లను చట్టబద్ధం చేశాడు . ఇది ఎంత ఘోరమో చూడండి. 
On March 13, 2018, Parliament’s lower house, the Lok Sabha, passed without debate funding demands from 99 Indian government ministries and departments, including two bills and 218 amendments.
మన సొంత తయారీ తేజస్"కంటే తక్కువ సామర్ధ్యమున్న 1000  రాఫెల్ జెట్ లను  ఢసాల్ట్ కంపెనీ నుండి అత్యధిక ధరకు  కొన్నాడు. 
MINIMUM GOVERNMENT AND MAXIMUM GOVERNENCE" అని చెప్పిన మోడీ ఆ మాటను మరచిపోయి,కేవలం BJP పార్టీని దేశమంతటా ఎలాగైనా సరే వ్యాపింపచేసి , బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీ లీడర్లను అణచివేసి రాష్ట్రాల అధికారాలను కాలరాచి భారతదేశాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని నిరంకుశంగా చైనాకి చెందిన జిన్ పింగ్ లా పాలించాలని కుట్రపూరితంగా ఆలోచిస్తున్నాడు. తనకు తోచిందే రైట్" అనుకొంటున్నాడు. అంతేకాదు  పూర్వం 10 ఏళ్లపాటు పాలించి దేశాన్ని భ్రష్ట్టు పట్టించిన కాంగ్రెస్ పాలనలో ఎలాంటి  పధకాలు ఉన్నాయో , వాటినే పేర్లు మార్చి కొనసాగిస్తున్నాడు . దీనికి మూలకారణం ఆర్ధిక శాఖ లో ల్యూటిన్ కాలపు కార్యదర్సులను కొనసాగిస్తూ ఉండటమే!
చిదంబరం,మన్మోహన్ సింగ్,జైట్లీ,మోడీ వీలందరూ కేవలం బయటకు కనబడే బొమ్మలు.వీళ్లకు కిర్రెక్కించి ఆడించేది ల్యూటిన్ కాలపు మైండ్ సెట్ తో ఉండే  కార్యదర్సులు ,బ్యూరోక్రాట్ లు.  
మరి మనం ఏమిచేయాలి ?

ఎవరైనా ధనవంతుడు, అతనికి ఉన్న విదేశీ సంపద నుండి 3000 కోట్లు ఖర్చు పెడితే మన స్టాక్ మార్కెట్ కుప్ప కూలిపోతుందని ఒక ఆర్థికవేత్త చెప్పాడు. ఎన్నికలకు ముందు స్టాక్ మార్కెట్ పడిపోతే మధ్యతరగతి ఓట్లు మోడీకి పడవు. ఇది ఒక అంచనా మాత్రమే సుమా ! నిజానికి అంత ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. 2019 ఎన్నికలలో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు, కులమత పోలరైజేషన్ కు లొంగ కుండా కాస్త దేశాభిమానం తో ఉంటే చాలు. 
హిందుత్వ ను భారతదేశంలో స్థాపన చేసే ది మోడీ కానే  కాదు. విదేశీ తొత్తులు ఆ పని ఎందుకు చేస్తారు?
విదేశీ బాంక్ లే మన రాజకీయపార్టీలకు నిధులు, డొనేషన్ లు  బాహాటం గా ఇచ్చే రోజు వస్తుంది. అలంటి చట్టాన్ని నిస్సిగ్గుగా మొన్న పాస్ చేశారు. అపుడు మన పార్లమెంట్ లో ఉండేది విదేశీ తొత్తులు తప్ప భారతీయులు కాదు. ఎన్నికలలో ఎవరు గెలిస్తే మాత్రం ఏమిటి లాభం? వాళ్ళను  విదేశీ తొత్తు లుగా మార్చే డబ్బు మూటలతో విదేశీ కంపెనీలు సదా సిద్ధంగా ఉంటాయి. 
ఏది ఏమైనా  ఇపుడు మోడీ ని దేశ భక్తులు ఎవరైనా  ఓడించవచ్చు. తప్పనిసరిగా ఓడించాలి కూడా !ఎందుకంటే మోడీ నమ్మకాన్ని నిలబెట్టుకో లేకపోయాడు. ప్రజావిశ్వాసాన్ని రోజు రోజుకీ కోల్పోతున్నాడు . భారతీయుల ముఖాలలో నవ్వుని తీసేసిన మోడీ ని ఎవరుమాత్రం ఎలా బలపరుస్తారు?