2019
లో రాబోయే ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలలో ఏ పార్టీ సత్తా ఏమిటో పరిశీలిద్దాం.
అత్యంత
అనుభవశాలి , కష్టపడేతత్వమున్న చంద్రబాబు ఒకపక్క ,
అవినీతి కేసుల్లో ఛార్జ్ షీట్ వేయబడి విచారణ ఎదుర్కొంటున్న యువనేత, సినిమారంగంలో
మాస్ స్టార్ గా పేరుతెచ్చుకొని ప్రజాక్షేత్రంలో తనసత్తా ఏమిటో చూపుదామని
ఉవ్విళూరుతున్న నాయకుడు మరోపక్క, అత్యంత దారుణంగా మోసం చేసిన జాతీయపార్టీలు
కాంగ్రెస్,భాజపా మరోవైపు ఈ ఎన్నికల సమరంలో కదం తొక్క బోతున్నాయి. 
ఆంధ్రులకు
ఆవేశాలు,ఉద్వేగాలు ఎక్కువే అయినా, తెలివితేటలు కూడా ఎక్కువే! విద్యాధికులైనా ,
వ్యక్తిగత ఆరాధన కూడా ఎక్కువే! రాష్ట్ర హితం కంటే వ్యాపారాత్మక ధోరణి కూడా ఎక్కువ. కులాలను బట్టి ఓట్లు పోలరైజ్ అయ్యే అవకాశం కూడా ఆంధ్రాలో ఎక్కువ. 
మెజారిటీ
ప్రజలు కులాలుగా చీలిపోయి విడిపోయారు. రాజకీయంలోగానీ,పాలనలో గానీ అవినీతి,
అనైతికం అనేవి సామాన్యు ఓటరు పెద్దగా పట్టించుకోవడం లేదు . మా వర్గానికి,మా
సంఘానికి,మా కులానికి, మా కుటుంబానికి ఎంత లబ్ది వచ్చింది, ఎంత రాబోతుంది అనే
లెక్కలు వేసుకొంటున్నారు తప్ప ,రాష్ట్ర అభివృద్ధి ని పట్టించుకొనే వాళ్ళ సంఖ్య
తక్కువ. కులాల వారీగా ,మతాల వారీగా  ఓట్ల
పోలరైజేషన్ జరిగే అవకాశం ఎక్కువ. 
పార్టీలకు
అతీతంగా ఆలోచిస్తే, చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి దొరకడం ఆంధ్రుల అదృష్టం.
శాసనసభ్యుల అవినీతి అనేది వందల కోట్లలో ఉందని భావించినా ,
ప్రతిపక్ష నాయకులు ఇప్పటికే  వేల కోట్ల అవినీతిలో ముద్దాయిగా
నిలబడిఉన్నారు. ఏది ఏమైనా ఈ దశలో చంద్రబాబు లాంటి అనుభవశాలి,  రాజ నీతి జ్ఞుడు , కష్టపడే
తత్వమున్న నాయకుడు మళ్ళీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం నిలదొక్కు కొంటుందని
మేధావుల ఆలోచన.  పోలవరం,అమరావతి పూర్తయ్యి , రాష్ట్రం పురోగతి
చెందే  అవకాశం ఉంటుంది. ప్రలోభాలకు, కులమతాలకు
అతీతంగా,అభివృద్ధికి ఓటేయడం ఓటరు  బాధ్యత. 
కోటిన్నర
కుటుంబాలు - 5కోట్ల జనాభా - రాజధానిలేని , భారీపరిశ్రమలు లేని , సేవారంగ కంపెనీలు అస్సలేమీ లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.   కాంగ్రెస్ చేతిలో ఘోరంగా అన్యాయం చేయబడి, మోడీ
చేతిలో దారుణంగా మోసపోయిన  రాష్ట్రం. రెడ్డి,కాపు,కమ్మ,వైశ్య,
బ్రాహ్మణ ,వెలమ,క్షత్రియ కులాలు ఫార్వార్డ్ కులాలుగా ఉన్నాయి. కులాలవారీ గణన
వివరాలు కరెక్ట్ గా తెలియవు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో గణించిన వివరాలతో, ప్రస్తుత సీమాంధ్రలో
ని కుల గణాంకాలను భేరీజు వేసుకొని అంచనా వేసిన వ్యాసం ఇది. ఇందులో కొన్ని
పొరపాట్లు ఉండవచ్చు. 
ఏది
ఏమైనా ఎన్నికలకు 6నెలల ముందుగా అంచనాలు వేయడం కరెక్ట్ ఫలితాలను గ్రహించలేదు.
ఎందుకంటే ఎన్నికలకు వారం ముందువరకు తటస్థ ఓటరు తేల్చుకోలేడు . కనీసం 20%తటస్థ
ఓటర్లు ఉంటారు. 


మహారాష్ట్రలో మహర్ లు , కర్ణాటకలో హోలియా లు, పులయాలు ,తమిళనాడులో పల్లార్ లు ఎలాగో ఆంధ్రప్రదేశ్ లో ఆది ఆంధ్రులు, మాలలు అనే వాళ్ళు ఒకే వర్గానికి చెందినవారు. వీరిలో మెజారిటీ ప్రజలు హిందూ మతాన్ని వదిలి,క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నారు. మాలలు,మాదిగలను కలిపి దళితులు అనికూడా అంటారు. క్రిస్టియన్ దళిత్ లను కూడా షెడ్యూల్ వర్గాల కింద పరిగణించాలని చంద్రబాబు శాసనసభ లో తీర్మానించారు.


మహారాష్ట్రలో మహర్ లు , కర్ణాటకలో హోలియా లు, పులయాలు ,తమిళనాడులో పల్లార్ లు ఎలాగో ఆంధ్రప్రదేశ్ లో ఆది ఆంధ్రులు, మాలలు అనే వాళ్ళు ఒకే వర్గానికి చెందినవారు. వీరిలో మెజారిటీ ప్రజలు హిందూ మతాన్ని వదిలి,క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నారు. మాలలు,మాదిగలను కలిపి దళితులు అనికూడా అంటారు. క్రిస్టియన్ దళిత్ లను కూడా షెడ్యూల్ వర్గాల కింద పరిగణించాలని చంద్రబాబు శాసనసభ లో తీర్మానించారు.
ప్రతిపార్టీకి
సంప్రదాయ ఓటు బాంక్ ఉంటుంది. 
అగ్రవర్ణాలు
33% / వెనకబడిన వర్గాలు 37% / షెడ్యూల్ వర్గాలు 22% / మైనారిటీలు 8 % జనాభాగల  ప్రజా క్షేత్రం మన రాష్ట్రం  . 
 2014లో , TDP  సీమాంధ్ర,తెలంగాణ కలిపి 237 సీట్లలో పోటీ చేస్తే,  117 సీట్లు గెలిచింది. మొత్తం సుమారు కోటిన్నర (
15746215 )  ఓట్లు అనగా 32.5 %  సంపాదించింది. YSRCP పార్టీ  266 సీట్లలో పోటీ చేసి,70 సీట్లు గెలిచింది.
మొత్తం సుమారు  ( 13494076 )  ఓట్లు అనగా  27.88%సంపాదించింది.      
కానీ ఇపుడు  2019 లో పరిశీలించవలసింది సీమాంధ్ర 13 జిల్లాలవరకే ... 
తెలుగుదేశం
పార్టీకి సాంప్రదాయ ఓటు బాంక్ : 
AP
caste wise population. (all are not voters). 
మొత్తం
33% అగ్రవర్ణాల ప్రజలలో  ... 
బ్రాహ్మణ
1%,కమ్మ 3.5% ; వెలమ 0% ,రెడ్డి 1%, వైశ్య 1% ; కాపు 4% ; క్షత్రియ 0. 5% వెరసి 11% 
తెలుగుదేశానికి మద్దతు ఇస్తారు. . 
మొత్తం
37% బి సి లలో ... 
బలిజ
: 2% ; చాకలి : 2% యాదవ : 4% ; కమ్మర 2% , తెలగ : 3% , ఇతర బి సి లు : 7% వెరసి : 20%. తెలుగుదేశానికి మద్దతు
ఇస్తారు. . 
మైనారిటీలలో మొత్తం 5% ముస్లిం జనాభాలో 3% .తెలుగుదేశానికి మద్దతు
ఇస్తారు. . 
 ' మొత్తం క్రిస్టియన్ 2%
జనాభాలో 0%. 
షెడ్యూల్
కులాలలో మొత్తం 9% మాల లలో 2% తెలుగుదేశానికి మద్దతు
ఇస్తారు. . ; 
మొత్తం
7%మాదిగలలో 2% .  
గిరిజనులు
- మొత్తం  6% లో 2% తెలుగుదేశానికి మద్దతు ఇస్తారు. . . 
మొత్తం
జనాభాలో టి డి పి కి 40% జనాభా సంప్రదాయ  మద్దతు ఉంటుంది. 
- జగన్ గారి  పార్టీకి : అగ్రవర్ణాలు : 15% ; బి సి లలో
     9%,మైనారిటీలలో 4% , మాలలలో 4% ; మాదిగలలో  2% ; గిరిజనులలో 3%  వెరసి = 37% మద్దతు ఇస్తారు. .  . 
- కాంగ్రెస్ కి : అగ్రవర్ణాలు
     : 1% ; బి సి లలో 1%, మైనారిటీలలో 0. 5 % , మాలలలో 2% ; మాదిగలలో  2%
     ; గిరిజనులలో 0%  వెరసి = 6. 5 %మద్దతు ఇస్తారు. .  . .
- పవన్ గారి  కి అగ్రవర్ణాలు 6 % ; బి సి లలో 7%,
     మైనారిటీలలో 0. 5% , మాలలలో 1% ; మాదిగలలో  1% ; గిరిజనులలో 1%  వెరసి =  16. 5 %మద్దతు
     ఇస్తారు. .  . . 
పైన
చెప్పుకొన్నవి జనాభా పరంగా చెప్పుకొన్నాం. ఇపుడు
ఓటు బాంక్ పరంగా విశ్లేషిద్దాం
తెలుగుదేశం పార్టీకి ఒరిజినల్ గా 35% ఓట్లు పునాదిగా ఉన్నాయి.
తెలుగుదేశం పార్టీకి ఒరిజినల్ గా 35% ఓట్లు పునాదిగా ఉన్నాయి.
సంప్రదాయ కాంగ్రెస్
ఓటు బాంక్ 40% ఉండేది. 2014లో ఇదంతా జగన్ గారి పార్టీ కి బట్వాడా ఐంది.  
2014లో
తెలుగుదేశానికి,జగన్ గారికి తేడా కేవలం 2% ఓట్లు. అయినా ,తెలుగుదేశానికి 35సీట్లు
ఎక్కువ వచ్చాయి. YSRCP
got 44.47 per cent votes and TDP got 46.3 per cent, a difference of 2.6 per
cent.
తెలుగుదేశం
---- polled
1,33,72,862 votes against 
the
YSRCP’s ------------  1,27,71, 323.
2019లో మొత్తం 3కోట్ల
ఓట్లు పోల్ అయ్యే అవకాశం ఉంది. 
2014లో
జగన్ గారిపార్టీకి వచ్చిన   45% ఓట్లలో అగ్రవర్ణాల
ఓట్లు 15%, దళిత ఓటు 9%, గిరిజన
ఓట్లు 5% , మైనారిటీ ఓట్లు 6%, బి సి ఓట్లు 10% . 
వీటిలో
ఏ వర్గం నుండి జగన్ గారిపార్టీ   ఓట్లు  కోల్పోవచో అంచనా వేద్దాం. 
అగ్రవర్ణవోట్లలో
 4%, దళిత ఓట్లలో 3%, గిరిజన ఓట్లలో 2%, మైనారిటీ ఓట్లలో 3% , వెరసి 12%
ఓట్లు కోల్పోయే అవకాశం ఉంది. అనగా 2014లో సాధించిన 45% ఓట్లలో 12% పోగా మిగిలింది
33%. 
ఇలా
కోల్పోయిన 12% ఓట్లను ఏయే పార్టీలు పంచుకొంటాయో అంచనా చూద్దాం. 
1%
కాంగ్రెస్, 3% తెలుగుదేశం, 8%పవన్ గారిపార్టీ . 
తెలుగుదేశం
కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కోల్పోయే అవకాశం ఉంది. 2014లో తెలుగుదేశం
సాధించిన 47% ఓట్ల నుండి, దళితులు 5%, అగ్రవర్ణాలు 3% ,కాపులు 3%,
గిరిజనులు 1%, వెరసి 12% కోల్పోయే అవకాశం ఉంది. వీటిని,
పవన్ 8%, కాంగ్రెస్ 1%, జగన్ 3% పంచుకొనే అవకాశం ఉంది. 
2014లో  3%  కాంగ్రెసుకి , 3% భాజపా కి వచ్చాయి. వీటిలో
భాజపాకి 1% మిగిలి మిగతా 2% పవన్ కి వెళ్లే అవకాశం ఉంది. 
పైన
అనాలిసిస్ క్రోడీకరిస్తే , 
తెలుగుదేశం
కి 2014లో వచ్చిన 47% ఓట్లలో   పోయేవి = 12% ;  వచ్చేవి  = 3%. వెరసి 9% నష్టం .
కాబట్టి 2019లో 38%. ఓట్లు . 
జగన్
పార్టీకి  కి 2014 లో 45% ఓట్లలో   పోయేవి = 12% ;  వచ్చేవి  =3%. వెరసి 9% నష్టం . మొత్తం= 2019
లో 36% ఓట్లు . 
పవన్
గారి పార్టీ కి   - జగన్ గా రి  పార్టీ నుండి
8%, తెలుగుదేశం నుండి 8% చీల్చుకొంటారు. ఇవికాక కుల మతాలకు
అతీతంగా  సినిమా అభిమానులనుండి  2 % ఓట్లు
 వెరసి 18% ఓట్లు. 
కాంగ్రెస్
కి 6%. & భాజపా కి 1% ఓట్లు రావచ్చు. 
ప్రభుత్వ వ్యతిరేక ఓటు
చాల తక్కువ ఉంటుంది ఎందుకంటే, 
1. 2014 రాష్ట్రం
విభజింపబడి చంద్రబాబు అధికారం చేపట్టినప్పుడు పరిపాలన చేయడానికి కనీసం ఆఫీసు కూడా
లేని స్థితి నుండి  ప్రపంచంలోనే పేరెన్నిక గన్న రియల్ టైం గవర్నెన్స్
స్టేజి కి చేరుకున్నాం. 
2. గ్రామాల్లో
విద్యుత్ లేని స్థితినుండి 24గంటలు సరఫరాచేసే దశకు చేరుకున్నాం. 
3. 2014 కి ముందు
ఉన్న చాలీ చాలని 200/- పెన్షన్  ను 5రేట్లు పెంచి 1000/-
పొందుతున్నాం.మళ్ళీ ఇప్పుడు 2019 నుండి ఈ పెన్షన్ ను 2000/ కి పెంచడం మామూలు విషయం కాదు. 55 లక్షల మంది వితంతువులు, ఒంటరి మహిళలు, ఆనాధలు ,దివ్యానుగులకు ప్రతి నెలా టంచన్ గా 2000/- వారి అకౌంట్ లో వేయడం అనేది చాలా అద్భుతమైన విషయం.  
4. ఇంతేకాదు నదుల
అనుసంధాన పధకం లో భాగంగా హంద్రీ నీవా, పట్టిసీమ, చింతల పూడి , పురుషోత్తమపట్నం
ప్రాజెక్ట్ ల నిర్మాణం పూర్తవ్వడం వలన లక్షలాది ఎకరాలకు సాగునీరు నికరంగా
పొందుతున్నాం.
5. డ్వాక్రా సంఘాలకు
పూర్తి ఋణ మాఫీ , 70% రైతులకు పూర్తి ఋణ మాఫీ,మిగతా 30%శాతం రైతులకు 60%
రుణమాఫీ జరిగింది.మిగతా 40%మాఫీ కూడా ఎన్నికలలోపు అందుతుంది.  .ఋణమాఫీ
జరిగినా కొన్ని మీడియా సంస్థలు  జరగనట్లే చెప్పుకొంటున్నారు. కానీ
క్షేత్రస్థాయిలో  రైతులను అడిగితే వారు సంతోషంగా సంతృప్తి
గానే  ఉన్నారని ఒక సంస్థ డేటా సేకరించింది. 
6. మనిషి జననం  నుండి
మహా ప్రస్థానం వరకు వివిధ దశలలో అవసరమయ్యే ఆసరాని 50 సంక్షేమ పధకాల
ద్వారా చంద్రబాబు  అందిస్తున్నట్లు మరే రాష్ట్రమూ అందివ్వడం
లేదు. 
7.  అన్న కాంటీన్ ల
ద్వారా శుచి రుచి గల ఆహారాన్ని 3పూటలా కేవలం 15/ అందివ్వడం చేత , రాష్ట్రంలో
"ఆకలి" కి చోటు లేదు.
8. కొద్దిగా ఆలస్యం అయినా
, సుమారు 10లక్షల మంది యువతకు నిరుద్యోగ పెన్షన్ 1000/- ఇవ్వడం సామాన్యమైన విషయం
కాదు. 
9.
 అన్నివర్గాలు,అన్ని స్థాయిల ఉద్యోగులకు జీతభత్యాలు ఇంత  ఆర్ధిక
దుస్థితిలో కూడా  పెంచడం మామూలు విషయం కాదు. 
10.అమరావతి గురించి  అందరూ
ఏమే మో అనుకొంటున్నారు. కానీ ఒక్కటి ఆలోచించండి. చిన్న ఇల్లు కట్టుకోవాలంటేనే
తర్జన భర్జనలు చేస్తాం. ఆంధ్రుల భవిష్యత్ కల్పతరువు సమగ్ర ఆర్ధిక రాజధానిని ఎంత
జాగ్రత్తగా నిర్మించాలో మనందరికీ తెలుసు. ఎంత నమ్మకం లేకుంటే గంటలోనే 2000కోట్ల
విలువైన అమరావతి బాండ్లను కొనుగోలు చేస్తారు? 
11. దేశ
వ్యాప్తంగా పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్ట్ లు 16 నిర్మాణంలోఉన్నా, కేవలం 4
ఏళ్లలో మన పోలవరం ప్రాజెక్ట్ మాత్రమే 60% పూర్తయిందని చెప్పుకోవడం గర్వం కాదూ
? 
12. సుమారు 100 మధ్యతరహా
& భారీపరిశ్రమలు, వందల్లో సేవా రంగపు కంపెనీలు 4 ఏళ్లలో నెలకొల్పి
10లక్షల మంది యువతకు ప్రత్యక్షంగా,పరోక్షంగా ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం ,
దేశంలో కేవలం మన ఆంధ్రా మాత్రమే  !
మరి సెటిల్ మెంట్లు ,జన్మభూమి కమిటీలలో ఉంటూ సొంతవాళ్లకే పధకాలు కేటాయించుకోవడం, మైనింగ్ లో అవినీతి,అక్రమాలు చేసిన శాసన సభ్యుల వలన కొన్ని వర్గాలలో ముఖ్యంగా కమ్మకులానికి వ్యతిరేకమైన వర్గాలనుండి వ్యతిరేకత బాగా ఉంది. ఇలాంటి ఆరోపణలున్న సిట్టింగ్ శాసన సభ్యులను మారిస్తే పార్టీకి మరిన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది.
ఇలాంటి శాసన సభ్యుల వలన తెలుగుదేశం పార్టీకి ఎంత వ్యతిరేక త ఉంటుందో,అంతకంటే వ్యతిరేకత జగన్ గారిపై ఉంటుంది. దీనికి కారణం,ప్రత్యేక హోదా కోసం గానీ రాష్ట్ర హక్కుల కోసం గానీ జగన్ గారు చేసిన పోరాటం సున్నా. పైపెచ్చు , ఆంధ్రా ని మోసం చేసిన మోడీ ,ఆంధ్రా వాళ్ళను నానా బూతులు తిడుతూ ఆంధ్రా అభివృద్ధికి అడ్డు తగులుతున్న కె.సి.ఆర్ తో అంటకాగడం వలన మధ్యతరగతి వర్గాలలో జగన్ పై నెగిటివిటీ రోజురోజుకీ పెరుగుతుంది.
మరి సెటిల్ మెంట్లు ,జన్మభూమి కమిటీలలో ఉంటూ సొంతవాళ్లకే పధకాలు కేటాయించుకోవడం, మైనింగ్ లో అవినీతి,అక్రమాలు చేసిన శాసన సభ్యుల వలన కొన్ని వర్గాలలో ముఖ్యంగా కమ్మకులానికి వ్యతిరేకమైన వర్గాలనుండి వ్యతిరేకత బాగా ఉంది. ఇలాంటి ఆరోపణలున్న సిట్టింగ్ శాసన సభ్యులను మారిస్తే పార్టీకి మరిన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది.
ఇలాంటి శాసన సభ్యుల వలన తెలుగుదేశం పార్టీకి ఎంత వ్యతిరేక త ఉంటుందో,అంతకంటే వ్యతిరేకత జగన్ గారిపై ఉంటుంది. దీనికి కారణం,ప్రత్యేక హోదా కోసం గానీ రాష్ట్ర హక్కుల కోసం గానీ జగన్ గారు చేసిన పోరాటం సున్నా. పైపెచ్చు , ఆంధ్రా ని మోసం చేసిన మోడీ ,ఆంధ్రా వాళ్ళను నానా బూతులు తిడుతూ ఆంధ్రా అభివృద్ధికి అడ్డు తగులుతున్న కె.సి.ఆర్ తో అంటకాగడం వలన మధ్యతరగతి వర్గాలలో జగన్ పై నెగిటివిటీ రోజురోజుకీ పెరుగుతుంది.
 
No comments:
Post a Comment