Search This Blog

Sunday, 13 March 2022

హోళీ

 శాస్త్రీయ కారణం చెప్పుకుంటే వసంత కాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ ఫీవర్స్, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందనేది ఒక వాదన. 

కుంకుమ, పసుపు, బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు. తడి రంగుల కోసం, మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. వాస్తవానికి ఇవి చల్లుకోవాలి కానీ ఇప్పుడు కృత్రిమ రంగులు చల్లుకుంటున్నారు.

తృప్తి ని ఇవ్వలేని కోర్కెలతో , అరిషడ్వార్గాలతో , రాగద్వేషాలతో , స్వార్ధభూయిష్టమైన ఆలోచనలతో  కలుషితమైన మనస్సును జ్ఞానం తో తపింపచేసి పునీతం చేయడమే హోళికా పూర్ణిమ లోని అంతరార్ధం. 

జీవితమంటే ఉత్సాహం ,ఉషస్సు మాత్రమేకాదు విషాదం,నిర్లిప్తత ,తమస్సు కూడా !

ఒకో రంగు ఒకో భావాన్ని  కలిగిస్తుంది. అన్ని రకాల రంగులతో  హొలీ ని మనం ఎలా హుషారుగా జరుపుకొంటామో ,అలాగే అన్నిరకాల  భావాలనూ సమానంగా హుషారుగా   శ్వీకరించాలి . 


వసంత కాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను 'వసంతోత్సవం' పేరిట జరుపుకునేవారు. హోలీ పర్వదినం ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటిరోజు పాల్గుణ పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటారు

దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి. ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. 

We command the state government and see that AMARAVATI farmers get justice

 కంటిన్యూ మాండమస్ డిక్టేర్ అంటే కోర్టు తానిచ్చిన తీర్పును పర్యవేక్షిస్తోంది. ప్రభుత్వాధికారి లేదా సంస్థ తన చట్టబద్ధ విధులను నిర్వర్తించనప్పుడు ప్రజల హక్కులకు భంగం కలుగుతుంది. అలాంటి సందర్భాల్లో ఆ విధులను నిర్వర్తించాలని న్యాయస్థానం ఈ రిట్‌ను జారీ చేస్తుంది. 

పాలనాపరంగా ప్రజలు న్యాయం పొందలేనప్పుడు ఈ రిట్‌ ద్వారా ఉపశమనం పొందొచ్చు. ఈ రిట్‌ జారీ కోర్టు విచక్షణపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వాధికారుల తప్పనిసరి విధులకే ఈ రిట్‌ వర్తిస్తుంది. సంబంధిత అధికారి విచక్షణాపూర్వక విధులకు ఇది వర్తించదు.

నిబంధన–226 ప్రకారం రాష్ట్ర హైకోర్టు లు  ఇలాంటి  రిట్ జారీ చేయవచ్చు. 

రాజధాని విషయంపై మొత్తం 70 పిటిషన్లను విచారించిన త్రిసభ్య ధర్మాసనం తుది తీర్పునిచ్చింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించాలంది. అమరావతి భూములను తనఖా పెట్టడానికి వీల్లేదని, రాజధాని అవసరాలకు తప్ప వేరే వాటికి భూములు ఇవ్వొద్దని చెప్పింది కోర్టు. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని చెప్పింది. భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. 6 నెలల్లో ఒప్పందం ప్రకారమే అభివృద్ధి చేయాలి. మూడు నెలల్లోనే రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వానికి సూచించింది. అమరావతి అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అభివృద్ధి పనులు ఎంత వరకు వచ్చాయి. రైతులకు ప్లాట్లు అప్పగించారా లేదా.. ఏంటనే విషయం పై హైకోర్టు గమనిస్తూ ఉంటోంది. దాన్నే కంటిన్యూస్ మాండమస్ అంటారు.

ఒకసారి ఆ చట్టం ( CRDA ) చేసి...అంత మంది రైతులను ఇన్ వాల్వ్ చేసి ( Promissory estoppel is a doctrine in contract law  seeks to protect the rights of a promisee or aggrieved party against the promisor.) ...అన్ని వేల ఎకరాలు తీసుకున్న తర్వాత అంత తేలికగా నిర్ణయాన్ని మార్చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ ఓ సంచలన తీర్పు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిందనే చెప్పాలి. 

Mandamus is a  command of Judicial Remedy in the form of an order from a court to any government, subordinate court, corporation, or public authority to do some specific act. which is in the nature of public duty, and in certain cases one of a statutory duty. 


Saturday, 29 January 2022

కొండా కోన ఎండా వాన వెలుగు చీకటి


విశాఖ సాగర తీరం, కొండా కోన ల పరచుకొన్న పచ్చదనం , శిఖరాల ను తాకుతూ అల్లనల్లన సాగే మేఘమాలికలు, ధవళ తుషార హార నీహారికలు మనిషి పంచేంద్రియాలను, మానసాన్ని ఉహల ఉషస్సులో , కళల తపస్సులో, కలల తమస్సులో ఓల లాడిస్తాయని చెప్పడం లో అతిశయోక్తి లేదు. 
 

Difference between branded and generic medicines?

 Difference between branded and generic medicines?



Sunday, 10 January 2021

3 minute Introduction to Kaya Kalpa Yoga

 

ఓజస్సు, తేజస్సుగా,తేజస్సుప్రాణశక్తిని ఉద్దీపన చేసే శక్తిగా చేసే  విధానమే కాయకల్ప. 

సృష్టిలో ఏదైనా దేశ కాలాలకు లొంగి ఉండవలసిందే!   కాలమానాలలో తేడా ఉండవచ్చు తప్ప , చివరికి బ్రహ్మ అనే శక్తికి కూడా జననం,లయమూ ఉంటాయి. మానవ పూర్ణ  ఆయుర్ధాయం 120 ఏళ్ళు. . కానీ ఈతి బాధలు, అంటువ్యాధులు, ధాతు నష్ట ము, జనటిక్ తదితర వ్యాధులు , దురిత(కర్మ) కారకములు ఇలా అనేక కారణాల చేత ఆయుర్ధాయం తగ్గిపోతుంది. 

ముఖ్యంగా అపరిమితమైన లేదా పూర్తిగా  లోపించిన  ఆహరం,నిద్ర,ఆలోచనలు ,పని , లైంగిక క్రియ  అనేవి మనిషిలో వైటల్ ఎనర్జీని బాగా తగ్గించివేస్తాయి. ఎప్పుడైతే వైటల్ ఎనర్జీ తగ్గిందో, కణాలను పట్టిఉంచే  బయో అయస్కాంత శక్తి తగ్గి వ్యాధులు కలుగుతాయి . 

కాబట్టి , ఆహరం,నిద్ర,ఆలోచనలు ,పని , లైంగిక క్రియ అనే ఐదు మితంగా అదుపులో సంతులిత స్థాయిలోనే ఉండేటట్లు మన ప్రవర్తనను తీర్చి దిద్దుకోవాలి. 

 

కేవలం వ్యాధి కి, వ్యాధి  కారణానికి  చికిత్స అందిస్తే సరిపోదు. వ్యాధులను తట్టుకొనే రోగ నిరోధ సామర్ధ్యాన్ని పెంచితే తప్ప, క్వాలిటీ ఆయువును అనగా ఎలాంటి రోగాలు లేని ఆయుస్సును   మనిషికి ఇవ్వలేము. 

బిలియన్ల సంఖ్యలోఉన్న సప్త ధాతువులకు చెందిన కణాలను  ఒక  మానవాకారం లో  కలిపి, నిలిపి  ఉంచే శక్తినే బయో అయస్కాంత ఎనర్జీ  లేదా పోలార్ ఎనర్జీ అంటారు. ఈ అయస్కాంత శక్తి ఉందంటే విద్యుత్ శక్తి లాంటిది కూడా ఉండాలి గదా?

అవును! కణాల మధ్యన భ్రమణం చేసే సూక్ష్మ మైన కణాలుంటాయి. వీటి కేంద్రీయ భ్రమణ శక్తి  ( centrifugal force ) వలన శక్తి తరంగాలు దేహమంతటా వ్యాపిస్తూ ఉంటాయి. ఇదే విద్యుత్ శక్తి,కైనటిక్ శక్తి లేదా జీవశక్తి. (vital force). 

జీవశక్తిని, బయో అయస్కాంత శక్తిని,  ఎనర్జీని సరి సమాన పాళ్ళలో ఉంచేటట్లుగా మన ఆహార విహార వ్యవహారాలను తీర్చి దిడుకొవాలి. 

యోగ రసామృతం (sexual vital fluidic energy storehouse)  అనేది ఒక బ్యాటరీ లాంటి అనగా శక్తిని నిల్వ ఉంచే ఒక రసాయనశక్తి . ఇది మెదడులో ముఖ్యంగా పీనియల్,పిట్యూటరీ,హైపో థలామస్ , మూడవ కుహరం అనే ఒక వలయకారపు సర్క్యూట్  ఉత్తేజము చెందినప్పుడు ఈ యోగ రసామృతం దేహములోని వైటల్ ఫోర్స్ ప్రవహించే నాడుల లోకి ప్రసరిస్తుంది. 

Friday, 4 December 2020

కేంద్రం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లుల్ని రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?*

   * కేంద్రం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లుల్ని రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?*

ప్రభుత్వం ఏమంటుంది ?
  • కొత్త చట్టాలప్రకారం, రాష్ట్ర సహకార మార్కెట్ అనే చిన్న స్థాయి నుండి ప్రపంచం మొత్తం ఒక మహా మండీ గా మారుతుంది.
  • కనీస మద్దతు ధర అనే బిచ్చమ్ పై ఆధారపడకుండా రైతులు సంఘటితమై తమ సరకులను ప్రపంచంలో ఎక్కడికైనా ఎగుమతి చేసుకోవచ్చు.
  • వ్యవసాయరంగం లోకి ప్రవేట్ పెట్టుబళ్ళు ఎక్కువగా వస్తాయి కాబట్టి రైతులకిష్టం ఉంటే ప్రవేట్ పెట్టుబడిదారులతో కౌలు అగ్రిమెంట్ చేసుకొని ఎక్కువ కౌలు పొందే అవకాశం ఉంటుంది.
  • అలాగే వాణిజ్యపరంగా ఏ వంగడానికి ఎక్కువ డిమాండ్ ఉంటే ఆ వంగడాన్ని పండించే అవకాశం ఉంటుంది.
  • విత్తనాలు, భూమిని తయారు చేయడం, ఎరువులు,పురుగుమందులు ,కోత మిషన్లతో మాసూలు తదితర ఖర్చులు కమ్యూనిటీ వ్యవసాయం ద్వారా తగ్గించుకోవచ్చు. రైతులే సంఘాలుగా ఏర్పడి సబ్సిడీలు, సాఫ్ట్ లోన్ లు తీసుకొని గిడ్డంగులు, సోలార్ డ్రయ్యర్ లు ,శీతల స్టోరేజీ లు నిర్మించుకొని డిమాండ్ పెరిగేవరకు సరకును నిల్వ చేసుకోవచ్చు.
  • ఇదే చట్టాన్ని కార్పోరేట్ వాళ్లకు అనుకూలంగా ఉందని కూడా చెప్పవచ్చు. ఒక విషయాన్ని చూసే దృక్పధం ను అనుసరించి మన అవగాహన ఉంటుంది. అలాగైతే ఇప్పటివరకు మన రైతులు కౌలు కిచ్చేది ప్రవేట్ వ్యక్తులకే గదా? ఇప్పుడు ఎక్కువ డబ్బు,మందీ మార్బలం ఉన్న పెద్ద ప్రవేట్ వాళ్లకి కౌలుకిస్తే ఎక్కువ కౌలు గిట్టుబాటవుతుంది గదా?
వ్యవసాయానికి, సరకు మార్కెటింగ్, సరకు నిల్వ కు సంబంధించి,కేంద్రప్రభుత్వం 3 రకాల చట్టాలకు సవరణచేసింది.
వ్యవసాయం లో కూడా ,రక్షణ రంగంలో మాదిరిగానే ప్రయివేట్ శక్తులను అనుమతిస్తే తప్ప వ్యవసాయం లాభసాటిగా మారదు . కానీ నిత్యావసరాల ధరలు అదుపుచేసే సిస్టమ్ ప్రభుత్వం చేతిలో ఉంచుకోకపోతే అమెరికా,యూరప్ దేశాలలో మాదిరిగా ఆహార వస్తువుల ధరలు చాల ఎక్కువగా పేరిగిపోతాయి. అంతేకాదు ప్రాసెస్ చేసిన ఆహార పదార్ధాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగి ఆరోగ్యాన్ని కూడా పాడుచేసే ప్రమాదం ఉంటుంది.
మనదేశం లో చిన్న కమతాల వలన యాంత్రికత పెరగక పోవడం చేత, కూలీలపైనే ఎక్కువగా ఆధారపడటం వలన పంట ఖర్చు బాగా పెరిగిపోతుంది.
కమ్యూనిటీ ఫార్మింగ్ , కార్పొరేట్ ఫార్మింగ్ రావలసిన ఆవశ్యకత ఉంది.

దేశ వ్యవసాయ ఉత్పత్తులలో 30 శాతం వృధాగా పాడవటానికి కారణం కోల్డ్ స్టోరేజీ ,సోలార్ డ్రయర్ లు సరిపడా అందుబాటులో లేకపోవడం.
కానీ,ఎప్పుడైతే కార్పొరేట్ సంస్థలు వ్యవసాయంలోకి ఎంటర్ అవుతాయో అప్పుడు జన్యు మార్పిడి సంకర వంగడాలు ,ఎరువులు,మందుల వినియోగం అదుపుతప్పి భూసారానికి ,దేశవాళీ విత్తన జన్యువులకు ప్రమాదం కలిగే అవకాశం కూడా ఉంటుందని మరచిపోకూడదు.

పాత చట్టాల ప్రకారం , నిత్యావసర సరకులను ఒక పరిమితికి మించి నిల్వ చేయ కూడదు.
కొత్త చట్టాల ప్రకారం ఎన్నైనా నిల్వ చేసుకోవచ్చు.
నల్ల బజార్ లెక్క నిల్వలు చేసేసి మార్కెట్ లో ధరలు పెంచేస్తే ?
ధరలు ఒక పరిమితి దాటి పెరిగినప్పుడు ప్రభుత్వం ఆంక్షలు విదిస్తుంది.
ఇది జరిగే పనేనా? కార్పొరేట్ కంపెనీల చేతిలో ప్రభుత్వాలు కీలుబొమ్మలు గదా?
ఇప్పుడు పంట చేతికి రాగానే ప్రభుత్వం సూచించిన మద్దతు ధరకు సరుకు ను అమ్మకొంటున్నారు.
కొత్త చట్టాల ప్రకారం , ప్రభుత్వ కనీస మద్దతు ధర అనేది లేకపోవడం వలన , తమ సరకును దాచుకొనే సాంకేతికత, ప్రాసెస్ చేసుకొనే వెసులుబాటు లేకపోవడం వలన బక్క రైతులు ఏదో ఒక ధరకు తెగ నమ్ము కోవలసి వస్తుంది. మీకు తెలుసుగా మనదేశం లో 86 శాతం బక్క రైతులే!

86% చిన్న సన్నకారు రైతులున్న దేశంలో రైతులు తమ పొలంలో పండిన వాటిని సొంతంగా స్టోర్ చేసుకోలేరు. ఎందుకంటే రైతులకు AC గోడౌన్లు లేవు. కాబట్టి ఎలాగైనా దళారీలకో, కంపెనీలకో ఉత్పత్తి అయిన పంట పాడు అవకుండా తొందరగా అమ్మేస్తారు. ఇక్కడ లాభం పొందేది దళారీలు, కార్పొరేట్ కంపెనీలు మాత్రమే. ఎప్పటిలానే రైతు మోసపోతాడు.*
కాబట్టి ఇక్కడ రెండు పరిష్కారాలు . గిడ్డంగులు,ప్రాసెస్ ప్లాంట్ లు రైతు సంఘాలు నిర్మించుకొనేటట్లు ప్రభుత్వాలు గ్రాంట్ ,సబ్సిడీ లివ్వాలి. అలాగే ప్రయివేట్ కంపెనీలు కూడా వీటిని నిర్మించడానికి సబ్సిడీ రుణాలివ్వాలి.


అదేమిటి సార్! కొత్త చట్టాల ప్రకారం రైతులు భారతదేశంలో ఎక్కడైనా సరే తమ పంట ఉత్పత్తులు అమ్ముకో వచ్చు గదా?
బక్క రైతులు అందరూ కలిసి ఒక సంఘం లా ఏర్పడి తమ సరకును బయట ప్రపంచం లో గిరాకీ బాగా ఉన్న చోట అమ్ముకొని లాభాలు గడించ వచ్చు గదా?
*ఒక చిన్న, సన్నకారు రైతు నిజంగా తన పంటను వేరే రాష్ట్రానికి వెళ్లి అమ్ముకుంటాడా? పక్క జిల్లాలోని మార్కెట్ యార్డులోనే అమ్ముకోవడానికి ట్రాక్టర్లు, లారీలకు బాడుగలు ఇచ్చుకోలేక నలిగిపోతున్నాడు. తీరా అక్కడికి వెళ్ళాక సరైన ధర లేక కొన్నిసార్లు అక్కడే పడేసి వస్తున్నాడు. కాబట్టి ఇది రైతులు తమ ఉత్పత్తులు అమ్ముకోవడానికి చేసిన చట్టం కాదు.*
మధ్య దళారీలు, కార్పొరేట్ కంపెనీలు దేశంలో & ప్రపంచంలో ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడ అమ్ముకోవడానికి వీలు కల్పించే చట్టం ఇది.
పరిష్కారం . రైతులు సంఘాలుగా ఏర్పడటం కనీస బాధ్యత. కనీస మద్దతు ధరను ప్రకటించడం ప్రభుత్వాల కనీస బాధ్యత.
కాంట్రాక్ట్ ఫార్మింగ్...చట్టం తెచ్చారు. అదేమీ నిర్బంధమేమీ కాదు. రైతుకి ఇష్టం ఉంటే నే కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతాడు.
కాంట్రాక్ట్ ఫార్మింగ్... వలన కలిగే నష్టాలు రైతులకు తెలుసు గదా? ఇందులో మభ్యపెట్టేదేమీ ఉండదు.

కాంట్రాక్ట్ ఫార్మింగ్..గురించి నెగిటివ్ దృక్పధం తో వెలిబుచ్చిన అభిప్రాయాలను చూడండి ---
రైతు ముందుగానే ఏ పంట వేయాలో, ఏ ఎరువును వాడాలో అని నిర్దేశించి ఈ కార్పొరేట్ కంపెనీలు రైతులతో 5 సంవత్సరాల వరకూ అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ఈ అగ్రిమెంట్ లో ఎంత ధర ఉంటే అంతే రైతు తీసుకోవాలి. రాబోయే 5 ఏళ్ల కాలంలో ధరలు పెరిగినా రైతు మాత్రం అగ్రిమెంట్ ప్రకారమే డబ్బు పొందుతాడు కానీ మార్కెట్ రేటు ప్రకారం కాదు. ఈ కార్పొరేట్ కంపెనీలతో కాంట్రాక్ట్ వ్యవసాయం చేసిన 5 సంవత్సరాల తర్వాత భూమిని చూస్తే పనికిరాని విధంగా రసాయనాలతో నిండిపోయి సారం కోల్పోతుంది. గ్రౌండ్ వాటర్ మొత్తం అయిపోగొట్టేస్తారు. భవిష్యత్తులో కొన్ని సంవత్సరాల దాకా వ్యవసాయానికి పనికిరాకుండా తయారు అయిపోతుది భూమి. *అలాంటి భూమి ని ఏమీ చేసుకోలేక చివరకు ఆ దళారీలకో, కంపెనీలకో భూముల్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది.*
ఇవన్నీ పూర్తిగా నెగిటివ్ దృక్పధం తో వెలిబుచ్చిన అభిప్రాయాలు. కాంట్రాక్ట్ లో షరతులు ఇష్టం లేకపోతె ఆ రైతు కాంట్రాక్ట్ లోకీ ఎంటర్ అవ్వడు .

కొన్ని పరిష్కారాలు .
1. కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేసే కంపెనీ, MS స్వామినాథన్ చెప్పినట్టు, రైతు పెట్టుబడికి 50% అదనంగా సొమ్మును కలిపి మద్దతు ధరగా చెల్లించాలి.
2. రైతు ఉత్పత్తులు కొన్న కంపెనీ ఫారిన్ కి ఎక్స్పోర్ట్ చేయడానికి వీలు కల్పించకూడదు. లేదా భారతదేశంలో ఖచ్చితంగా 70% సేల్ చేయాలి అని నిబంధన తేవాలి.
3. కాంట్రాక్ట్ ఫార్మింగ్ కేవలం సేంద్రీయ ఎరువులు లేదా జీరో బడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ ద్వారానే చేయాలి. రసాయనాలు వాడడం బ్యాన్ చేయాలి. లేదంటే కార్పొరేట్లు పిప్పి పీల్చేసిన భూమి రైతులకు దేనికీ పనికిరాదు.
5. ప్రతి గ్రామంలో శీతల గిడ్డంగులు, గోదాముల కట్టించాలి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెంచాలి.
6. రైతు ఉత్పత్తి సంఘాలను బలోపేతం చేసే వ్యవస్థను ఏర్పాటుచేయాలి.
*ఇవన్నీ ఏమీ చేయకుండా కార్పొరేట్లకు లాభం చేకూర్చే బిల్లులు పాస్ చేయడం వల్ల రైతులు ఎంతో నష్టపోతారు. రైతు నష్టపోతే సామాన్యుడికి తిండి కూడా దొరకని పరిస్థితి వస్తుంది.*

Tuesday, 9 June 2020

మోడీ పాలనలో మెరుపు లేవైనా ఉన్నాయా?


ఇన్సూరెన్స్ చట్టాల సవరణ బిల్లు ద్వారా ఆ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 26 శాతం నుంచి 49 శాతానికి పెరిగాయి.
 ఎనకమిస్టులు, విధానకర్తలు... డీజిల్ ధరలపై నియంత్రణ వద్దని కోరినట్లు గా  ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమల్లోకి తెచ్చారు.

 జనధన్ బ్యాంక్ అకౌంట్ల మొదలు... ప్రతీ గ్రామానికీ కరెంటు వరకూ,
ఉజ్వల స్కీమ్ మొదలు... ఆయుష్మాన్ భారత్ వరకూ...
 ముద్ర రుణాల మొదలు... స్వచ్ఛ భారత్ వరకూ... ప్రతీదీ బలంగానే అమలు చేయడానికి ప్రయత్నీమ్చినా సరిగ్గా అమలుచేయలేక పోయారు.ప్రచారంలోకనబడిన హడావిడి క్షేత్రస్థాయిలో లేనేలేదు.  నమో గంగా పధకం కూడా విజయవంతం గా అమలుచేయలేదు.
మోదీ మొదటి ఐదేళ్ల కాలంలో కొన్ని సంస్కరణలు తెచ్చారు. అవి GST, IBC, పారదర్శక పాలన, చట్టప్రకారం పాలన, సహజ వనరుల వేలం, RERA, సరిహద్దుల గుండా వ్యాపార సంస్కరణలు, DBT విధానం తేవడం ఓ విప్లవాత్మక అడుగు.

 రెండోసారి అధికారంలోకి వచ్చాక బ్యాంకుల విలీనం, కార్మిక చట్టాల్లో మార్పులు (నాలుగు రకాల లేబర్ కోడ్స్ అమలు), కార్పొరేట్ టాక్స్ తగ్గింపు, (ప్రపంచంలోనే తక్కువ కార్పొరేట్ టాక్స్), ఇక మేలో ఆత్మ నిర్భర భారత్‌తో మరిన్ని సంస్కరణల కు తెర తీశారు.

అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ (APMC) ఏర్పాటైంది. నిత్యవసర సరుకుల చట్టాన్ని సవరించారు. ఇప్పుడు రైతులు తాము ఏం పండించాలనుకుంటే అది పండించగలరు. ఏ రేటుకి అమ్మాలనుకుంటే, ఆ రేటుకి అమ్మగలరు. కాంట్రాక్ట్ పార్మింగ్ అనేది వాస్తవ రూపంలోకి వచ్చింది. వ్యవసాయంలో మోడ్రన్ టెక్నాలజీ అమలవుతోంది. దేశవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లు ఏకమవుతున్నాయి.
కోల్ మైనింగ్ మళ్లీ ప్రారంభమైంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నారు. రక్షణ రంగంలోకి FDIలను ఆటోమేటిక్ రూట్ ద్వారా 74 శాతానికి పెంచారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరిస్తున్నారు. అంతరిక్ష రంగంలో కూడా ప్రైవేట్ సంస్థలకు డోర్లు తెరిచారు. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు కూడా వాస్తవ రూపు దాల్చింది.