Search This Blog

Friday, 1 March 2013

మన దేశ ఆర్ధిక స్థితి ఎలా ఉండ బోతుంది ?

 మన దేశ  ఆర్ధిక స్థితి ఎలా ఉండ బోతుంది ?
విదేశీ పెట్టుబడులను బాగా ప్రోత్స హించ డం వల్ల , వ్యవసాయ అనుబంధ ,ఆహార పరిశ్రమలు ,
 గిడ్డంగులు  ఎక్కువగా వచ్చే ఆవకాశం  ఉంది .
తద్వారా రైతుకి మంచి గిట్టు బాటు ధరలు  వచ్చి , పళ్ళు ,కాయగూరలు   కుళ్ళి పోయే
ప్రమాదం తప్పి పంట నష్ట పోయే దుస్థితి ఉండదు .

సాంఘిక సంక్షేమ పధకాలకు G.D.P.   లో 7% కేటాయించడం వలన , అలాగే నగదు బదిలీ తో కొంత
 అవినీతిని అరి కట్టే అవకాసం వలన పేదలకు కడుపులు నిండుతాయి .
వ్యవసాయ రంగం లో ఉన్న 60 కోట్ల మందిని పటిష్టం గా ఉపయోగించు కో గలిగితే ,
 మన దేశానికి ఎదురు లేదు .
60 కోట్ల మంది రైతు కూలీలు   G.D.P. లో 14% మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు .
ఇంకో పచ్చ విప్లవం వస్తేనే రైతు ఆనందం గా ఉంటాడు .
జనిటిక్స్  ,బయో టెక్నాలజి పరిశోధనలు రైతు ముంగిటికి వస్తే మన రైతులు G.D.P. లో 25%
ఉత్పత్తి చేయగలరు .
గ్రామాలలో సౌర శక్తి వినియోగం , మంచి పాల చార గల ఆవుల పెంపకం  పెరగాలి .
నీటి పంపులు  అన్నీ సౌర శక్తి పై నడిస్తే రైతుకి ఎంతో  మేలు జరుగుతుంది .
ఉన్న భూమి లో వివిధ రకాల పంటలు కొంత చేపల పెంపకం చే పట్టి ఏడాది పొడుగునా
రైతుకి చేతి నిండా పని ,కడుపు నిండా కూడు ఉండాలి .

శ్రీ అబ్దుల్ కలాం చెప్పిన PURA (Providing urban amenities in rural areas)    పధకా న్ని
ప్రతి మండలం లో చే పట్టాలి .
ప్రతి పల్లె స్వయం సమృద్ది గా ఉండాలి .
గాంధీ -కలాం కల నిజ మయ్యే రోజులు ముందున్నాయి . 

No comments:

Post a Comment