Search This Blog

Sunday, 10 March 2013

శివ రాత్రి ప్రత్యేకత ఏమిటి?

                       శివ రాత్రి ప్రత్యేకత ఏమిటి?
శివ రాత్రి , శివ శక్త్యాత్మకానికి ప్రతీక . శుద్ద జ్ఞాన స్వరూపం శక్తి తో ప్రకటిత మైన రోజుగా చెప్పు కొంటారుతనలో నిద్రాణమ్ గా దాగి ఉన్న శక్తిని అవగాహన లోకి తెచ్చు కోవడమే శివ రాత్రి నాడు మనిషి చేయ వలసిన విధి.


తమ కుండలినీ శక్తిని ఊర్ధ్వ ముఖం గా వేగ వంతం చేసి సహస్రార  శక్తి 
ప్రవాహం లో కల పడమే సాధకుల విధి

Symbols &logos:
శివ లింగం శుద్ద సత్వ జ్ఞాన ఆనంద రూపానికి చిహ్నం . దానికి కాలం తో ,వేగముతో ,ప్రదేశం తో ,పని లేదు . గుణమూ  లేదు . అనగా త్రిగుణాతీతమ్ .  త్రి కాలాతీతం . స్పందన లేని శుద్ద తత్వానికి ఒక గుర్తు గా శివ లింగం ,తలచుకోవడానికి ఒక పేరుగా శివం . అనగా అంతటా వ్యాపించి ,అన్ని  కాలములందు ఉంటూ ,అన్నింటినీ లయం చేసు కొంటూ ఉన్నది ఏదైతే ఉందొ , దానిని వ్యవహార పరంగా, మనం తేలికగా అర్ధం చేసు కోవడానికి  తత్ ' అనీ ,దైవం' అని చెప్పుకొంటాము .

ఇలాంటి తత్త్వం లో స్పందన (సంకల్పం -will)ఏర్పడి నపుడుశక్తి " గా మనకు ప్రకటిత మవుతుంది .
అనగా తత్' నుండే శక్తి ఉత్పన్న మై సకల చరా చార సృష్టి కి మూల కారణం అయింది .
'శక్తి తో ఉన్న  తత్ ' కి రూపం ,  రూపానికి ఒక పేరు  మనుషులకు కావాలి .
వేలాది సంవత్సరాల నుండి శక్తి కి గుర్తుగా సర్పిలాకారాన్ని  అనగా  twisted  structure ని
మనిషి (మహర్షులుఏర్పాటు చేసు కొన్నాడు .అందుకే లింగం చుట్టూ సర్పం చుట్టు కొన్నట్లుగా పాన వట్టాన్ని తయారు చేశారు .

మనిషి జ్ఞానం రక రకాలుగా వృద్ది చెంది, ఒకే  విషయాన్ని ఎన్నో రకాలుగా అర్ధం చేసు కొనే
ప్రక్రియలో అర్ధ నారీశ్వర రూపము , యోని - లింగ రూపము , ఇలా మనిషి బుద్దికి ,
 తర్కానికి తోచి నట్లుగా చిహ్నాలను తయారు చేసు కొన్నాడు .

అండాండమ్ లో ఉన్నదే పిండాండమ్ లో , అదే బ్రహ్మాండం లో ఉంటుంది .
మనిషిలో ఉన్న వెన్ను పూస ని ఆవరించి ఉన్న సుషుమ్నా నాడీ శక్తి ప్రవాహాన్ని లింగం గా ,
ఇడా  పింగళా శక్తి ప్రవాహాలను సూర్య చంద్ర శక్తులుగా  , రెండు నాడుల

 సంగమ ప్రదే శంలో  ఉన్న ఆజ్ఞా చక్ర మును  అగ్ని శక్తి గా, మూలాధారం లో ఉన్న
శక్తి ప్రవాహాము   సర్పా కారం లో ఉన్నట్లుగా  మన ఋషులు భావించారు .
వారి భావనలను ఎన్నో కధల రూపం లో పురాణాలుగా , స్త్రోత్రాలుగా ,స్తుతులుగా ప్రకటించారు .
మనిషి గానీ, జీవి అయినా పైకి కనబడే పదార్ధ దేహాన్ని వలిచి చూస్తే మన కంటికి ఏమీ కనబడదు. కానీ, శక్తి ప్రవాహం అనేది ఒకటి ఉంటుంది. బ్యాటరీ కి ఉన్నట్లే  దానికి భిన్న ధృవాలు ఉంటాయి. ఆజ్ఞా చక్రము పాజిటివ్ ధృవమైతే,మూలాధారం నెగిటివ్ ధృవం గా అర్ధం చేసుకోవాలిఇంతవరకు క్లాసికల్ ఫిజిక్స్ సహాయం తీసుకున్నాం. ఇంకా లోతుగా అనలైజ్ చేయడానికి క్వాంటం ఫిజిక్స్ అవసరం అవుతుంది. ఇప్పుడది అప్రస్తుతం


మనిషి ఎన్నో రకాలుగా వ్యవహార పరంగా ,తంత్ర సాధన ,హట యోగ , జ్ఞాన యోగ ,భక్తీ యోగ పరంగా దైవాన్ని చేరు కోవడానికి ప్రయత్నించే దిశలో ఎన్నో భావాలు , మరెన్నో గుర్తులు .

వ్యవహారిక సౌలభ్యం కోసం "తత్' ని  సత్ చిత్ ఆనందం ' గా , శక్తి ని  వివిధ పేర్ల తో
 పిలుచుకొంటాం .తేలిక గా అర్ధం చేసుకొంటా నికి  ఇచ్చా , జ్ఞానక్రియా శక్తులుగా విడ దీసి

పలుకుతాం .

మనిషి, తనలో కలిగే ప్రతి స్పందనకు ,చేసే ప్రతి కార్యానికి ప్రతీకగా , అలాగే  
తన కోరికలు తీరటానికి ఏమేం కావాలో అన్నింటికీ విడి విడి గా ఎన్నో రూపాలను,నామాలను తయారు చేసుకొని ప్రార్ధనలు ,ఆరాధనలు ,కామ్య కర్మలు , సకామ హోమాలు ,వ్రతాలు , ఎన్నో రకాల యోగాలు చేస్తాడు .
సంపద కావా లంటే లక్ష్మీ దేవి శక్తిని , యుద్ధం లోవిజయమ్ సాదించా లంటే దుర్గా శక్తిని  - ఇలా ప్రతి కార్యానికి ,  క్రియకూ  ఒక పేరు ,రూపం ఏర్పాటు చేసుకోవడం మనిషి నైజం .

Inter dependent relationship between Mind & Pranic energy ,just like electricity and magnetism!

భారతీయ ఋషులు మనిషి మానసానికి ,ప్రాణ శక్తికి , ఊపిరికి ఉన్న సంబంధాన్ని , అలాగే మనిషి లో ఉన్న శక్తికి ,  చుట్టూ ఉన్న ప్రక్రుతి  శక్తులకు ఉన్న కార్య కారణ అవినాభావ  సంబంధాన్నికని  పెట్టారు

అదే విధం గా   భూ మండలం లో కొన్ని ప్రదేశాలలో  అత్యధిక శక్తి ప్రకటిత మయ్యె కేంద్రాలను ( ఉదాహరణకు - స్వయంభూ క్షేత్రాలు ),అలాగే 
అంతరిక్షం లో జరిగే గ్రహ నక్షత్ర గమనాలకువిశ్వ శక్తికి ,మనిషి లోని ప్రాణ శక్తికి ఉన్న బంధాన్ని కని  పెట్టారు .

వారు దర్శించిన వాస్త వాలకు అనుగుణం గా కొన్ని అల వాట్లను ప్రజా బాహుళ్యానికి నేర్పారు . అలవాట్లే ఆచారాలుగా , సంప్రదాయాలుగా , వ్రతాలు ,నోములు , పండుగలుగా మనిషి క్షేమానికి  తద్వారా లోక కళ్యాణానికి హేతు వవుతున్నాయి .

శివ రాత్రి రోజున విశ్వ శక్తి   భూ మండల మంతా అత్యంత ఎక్కువ స్థాయి లో విడుదలయ్యే   సమయం . ప్రతి మనిషి ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించు కోవాలి .
ఎలా? ఏం చేయాలి ?

How to transform the  human vibrations into divine vibrations ?

పంచ కోశాలను శుద్ది గా ఉంచు కోవటానికి ప్రయత్నం చేయాలి .

·        శరీర శుద్ది కోసం సత్వ గుణ ఆహారాన్ని అతి తక్కువ గా తిని ,

·        మానసిక శుద్ది కోసం ప్రాణా యామం,, భగవన్నామ స్మరణ ,కీర్తన ,మంత్ర జపం ,తద్వారా ధ్యానం ,

·         బుద్ది  శుద్ది కోసం ప్రతి పనీ భగవద్  పరంగా చేయడం -   విధంగా కనీసం శివరాత్రి నాడు చేస్తే అద్భుత ఫలితాలు అంటేమనిషి పరిణామం వేగ వంత మవుతుందని ఋషులు చెప్పారు .

అందుకే , శివరాత్రి ప్రతి మనిషికీ  ఒక అద్భుత అవకాశం
ప్రతి సాధకుడి కీ పరీక్ష
(
మనోబుద్ధ్యహంకారచిత్తాని నాహం ..... 

చిదానందరూపః శివోzహం శివోzహమ్). 

1 comment:

  1. sir,
    the name of the blog is Andhra Kshatriya and the first line of the objective is to strengthen the Minority Kshatriyas. and you are saying its not a caste based or biased. there is no correlation. please clarify

    ReplyDelete