Search This Blog

Thursday, 25 April 2013

గ్రహణ సమయం లో ఏం జరుగుతుంది ?

This combination photo illustration shows a partial lunar eclipse in 2008. (China Photos/Getty Images) 
చంద్ర గ్రహణం సమయం లో ఏం జరుగుతుంది ?
సూర్యుడికి చంద్రుడికి మధ్యగా భూమి అడ్డుగా రావటం వలన మనకు చంద్రుడు కనపడడు .
సూర్య కాంతి లోని  ఎర్ర రంగు తరంగాలు ఒక ప్రత్యేక కోణం లో   చంద్రుని తాకుతాయి . ఎందు  కంటే
భూ వాతావరణం సూర్య  కాంతి లోని నీలి తరంగాలను చెల్లాచెదురు చేయడం వలన ఎక్కువగా
ఎరుపు తరంగాలు చంద్రుని పై పడి , మన భూ వాతావరణం లోనికి ఒక విధమైన శక్తి తరంగాలు
పరా వర్తనం చెందు తాయి .
  • మనస్సుకి సంకేత మైన చంద్రుడు ,ఆత్మకి సంకేత మైన సూర్యుడు ఒకే సరళ రేఖ లోకి రావడం ఒక విధం గా  అదొక యోగం . ధ్యాన లక్ష్యం కూడ మనస్సు ఆత్మా వైపు గా నిలిచి ఉండటమే గదా .
  • సూర్య నాడి , చంద్ర నాడి కూడ ఒకే విధ మైన స్పందన లో ఉన్నప్పుడు సుషుమ్నా( - అగ్ని నాడి )బాగా పని చేస్తుంది . అనగా అగ్ని నాడి ద్వారా కుండలినీ శక్తి ప్రసరణ అతి తేలికగా జరిగే అవకాశంఉంది .

అందుకే గ్రహణ సమయం లో జప , మంత్రసాధన , ధ్యానం చేస్తే ఎక్కువ ఫలితాలు కలిగే
 అవకాశం  ఉంటుంది .

అందుకే గ్రహణం రోజున ముఖ్యం గా ఉపవాసం  లేదా సాత్విక మితాహారం,ప్రాణాయామం , వీటి ద్వారా శరీర శుద్ది జరుపు కొని భూమి పై పరిడ విల్లె కుండలినీ శక్తిని మన శరీర కోశాల లోని సుషుమ్నా నాడీ ద్వారా ప్రవహింప చేసు కొనే శక్తి పాతానికి అందరూ సమాయత్త మవ్వాలని మన ఋషుల ఆశీస్సు . 
గ్రహణ కాలం లో ఆహార పదార్ధాలకు , జీవులకు హాని చేసే కిరణాలు  ఎక్కువగా భూమికి వస్తాయి . 
వీటి నుమ్డి రక్షణ పొందా లంటే మన శరీర కోశాలను శుద్దమ్ గా ఉంచు కోవాలి. 
అందుకే , స్నానం , దానం ,మితాహారం ,ప్రాణాయామం , దైవ స్మరణం మొదలగు గ్రహణ విధులను 
అమలు చేయాలి .  

Sunday, 21 April 2013

why & how to do meditation?

మనుషులెందుకు ధ్యానం చేయాలి ?
తిరిగి తిరిగి వచ్చి కాసేపు విశ్రాంతి తీసు కొంటామ్ .  
చదివి చదివి కూసేపు కునుకు తీస్తాం . 
భావ సంచలనం కలిగి నప్పుడు కాసేపటికి ఒక  స్థిమిత స్థితి కి వస్తాం . 
అందుకే శరీరం త్వరగా అలసి పోకుండా , ఎంత పనైనా అలవోకగా చేయ దానికి శరీర సామర్ధ్యాన్ని 
పెంచు కోవడానికి ఎన్నో వ్యాయామాలు నిరంతరం చేస్తాం . 
అలాగే మెదడు చురుకుగా ఉండ టానికి ఎన్నో రకాల మైండ్ గేమ్స్ ,పజిల్స్ సాధన చేస్తాం . 
భావ జాలాన్ని అలాగే మన భావాలను అదుపులో ఉంచడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తాం . 
రకరకాల శ్వాస పద్దతుల ద్వారా ప్రాణ శక్తిని అదుపులో ఉంచు కొంటాం . 
ఇదే విధం గా మన చైతన్యా న్ని అనగా అవగాహన తో కూడిన ఎరుకను విస్తరింప చేసుకొని ,మన చైతన్యం యొక్క నిజ స్థితి ని ఆవిష్కరిమ్చు కోవడానికి ధ్యానం అలవాటుగా చేసు కోవాలి . 

"control over the physical,emotional,mental,praanic bodies and then expansion of real consciousness through contemplation,meditation leading to liberation from wheel of 
karma".

అంతర వ్యక్తిత్వ వికాసానికి ,  జీవన వికాసానికి ,జీవితాన్ని ప్రశాంతం గా జీవించడానికి , అన్ని రకాల పరిస్థితులను ఒకే విధమైన మానసిక స్థితి తో స్వీకరించే సమ స్థితి అలవాటు చేయడానికి , మనలోని
 వాసనా గుణాలను సమూ లమ్ గా మార్చుకొని సత్వ నిర్మల స్థితిలో ఉండటానికి , శ్రద్ద , ఓరిమి ,క్షమ ,ప్రేమ తదితర సాత్విక గుణాలను పెంచు కోవడానికి ,జీవిత పరమావధి ఐన ముక్త స్థితి ని చేరు కోవడానికి ---
 ధ్యానం చేయాలి . 

ధ్యానం లో ఏం జరుగుతుంది?
జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే సమాచారాన్ని ,చిత్తం లో కలిగే  ఆలోచనలను  , జ్ఞాపకాలలో దాగిన
 సమాచారాన్ని , పాత అనుభవాలను   ---  మనస్సు అసలు పట్టించు కోదు . అంటే , మనస్సు (-బుద్ధి)
దేనినీ  బేరీజు వేయదు . మమేక మవ్వదు .  అనుభూతి చెందదు . (అహం లేదు).
పింగాణీ పెంకు పై ఏ దైనా రంగు వేసినా పీల్చు కోదు . కాబట్టి రంగు ఏమీ మారదు . అదే ఒక బ్లాట్టింగ్
పేపర్ ఐతే రంగు ని మొత్తం పీల్చు కొని రంగు మారుతుంది .
అలాగే మన మనస్సు కి  ఎన్ని రకాల సంఘటనలు - అవి సుఖం లేదా దుఖం -కలిగించినా  ఎలాంటి
అనుభూతి లేకుండా సాక్షి గా సమ స్థితి లో ఉండటం అలవాటు చేయాలి .

చైతన్యాన్ని , అనగా మన ధ్యాస ను ఇంతకూ ముందు మనం చెప్పుకొన్న శక్తి ప్రవాహ గొలుసు లో
ఎక్కడైన నిలిపి ధ్యానా న్ని సులభం చే సు కోవచ్చు .
(చైతన్యం  ---- విశ్వ శక్తి (కుండలినీ శక్తి ) ---- మనస్సు ---- ప్రాణ శక్తి ----దేహం ) .

ధ్యానానికి కావలసిన కనీస అర్హత ఏమిటి ?
ఒక్క మనిషికి మాత్రమే నిరంతర ఆలోచనా వృత్త సామర్ధ్యం  ఉంటుంది .
మనిషి కి మనస్సే ఒక వరమూ , అలాగే శాపమూ  !
ఆరోగ్య వంతమైన శరీరం అనగా  పంచ కోశ శుద్ది ఉండాలి .
అందుకే పతంజలి రుషి అష్టాంగా యోగం ద్వారా -
యమ ,నియమ ,ఆసనాల  ద్వారా- శరీర , మానస శుద్ది
ప్రాణ యామం ద్వారా - ప్రాణ శక్తి శుద్ది ,తద్వారా ప్రాణ శక్తి పై అదుపు -
ప్రత్యాహారం అనగా సాక్షిగా వైరాగ్య భావం తో అన్నింటినీ గమనించడం -(ఇది మంచి ఇది చెడు , ఇది సుఖం ,ఇది దుఖం అనే ద్వంద అనుభూతి లేకుండా )అలవాటు చేసు కోవాలి . - ఇంద్రియాలు , చిత్తము ,
జ్ఞాపకాల సంచి ,మానసం -వీటన్నింటి గురించి మనకు కలిగే జ్ఞానం తద్వారా  మనస్సు పై అదుపు .
ఎప్పుడైతే మనకు  శరీరం ,ప్రాణ శక్తి , మనస్సు పై అదుపు వచ్చిందో అప్పుడు -
ధారణ ,ధ్యానం తద్వారా సమాధి స్థితి ....

ధ్యానం కూ డ ఒక పని లాగే ఉంది . దాని  వలన ఎలాంటి ఆనందం కలగడం లేదు .
 మరి నేను ధ్యానాన్ని మాని వే య వచ్చా ?
ధ్యానం అంటే  ఓ మూల కాసేపు కూర్చుని  నామా న్నో , మంత్రా న్నో జపం చేయడం కాదు . దానిని
సంస్మరణ  లేదా జపం  లేదా ప్రార్ధన  అనవచ్చు .
అహాన్ని త్యాగం చేస్తూ , శూ న్యం పై గానీ , దైవ రూపం పై గానీ దృష్టి కేంద్రీక రించి చేసేది అసలైన
ధ్యానం . మిగతావ న్నీ కామ్య కర్మల నే చెప్పు కోవచ్చు .
కర్మ లెప్పుడూ ఆనందాన్ని ఇవ్వవు . ధ్యానాన్ని ఒక సకామ కర్మలాగా చేస్తే అలాగే ఉంటుంది .
అలాగని ధ్యానాన్ని మాన వద్దు . అసలేమీ చేకుండా ఉండటం కన్నా ఏదో ఒకరక మైన ప్రయత్నం చేస్తూ
ఉంటే అసలైన ధ్యానం మనకు కుదురుతుంది . కనీసం మానసిక ప్రసాంతత కలుగుతుంది . 

Thursday, 18 April 2013

రామో విగ్రహవాన్ పరమో ధర్మః

శ్రీ సీతా రాముల కల్యాణం భారతీయుల జీవన స్రవంతిలో ముఖ్యం గా హిందూ వివాహ చట్రానికి 
ఒక సూత్రం గా ఎలా ,  ఎందుకు భాసిల్లుతుంది ? 
మన దేశ సంఘ  వ్యవస్థ ఒక విధం గా మన వివాహ వ్యవస్థ పైనే ఆధార పడి ఉంది . 
చెక్కు చెదరని వివాహ వ్యవస్థ ద్వారా  పిల్లల పెంపకం , ఉమ్మడి కుటుంబాలు , సామాజిక సుస్థిరత -ఇవన్నీ ఒక దానిపై ఒకటి ఆధార పడి ఉన్నాయి . 
రాముడు  తదితర రామాయణ కాలపు వ్యక్తులు నిజం గా ఈ భూమి పై నడయాడిన వారేనా ?
లేక , కొత్తగా భూమి పై నివాసం ఏర్పరచు కొంటున్నఇతర గ్రహాల వారా ?
లేక వాల్మీకి సృష్టించిన పాత్రలా ? ----  ఇలాంటి సందేహాలతో ఎంతో  మంది సతమవుతూ ,
అందరినీ తికమక పెడుతూ  ఉన్నా, ఈ  దేశం లోని సామాన్య జనులు మాత్రం రామాయణాన్ని వారి
గుండె లలో పెట్టుకొని , జీవన విధానానికి ,జీవిత గమ్యానికి చుక్కాని లాగా  అన్వయించు కొంటూ
ప్రతి క్షణం పండుగ చేసుకొంటూ నే ఉన్నారు .

దేవ లోకపు వారా ? ఇతర గ్రహాల వారా ? అసలు మనుషులేనా ? అప్పటి నాగరికత అంతగా వృద్ది
పొందిందా ? ఇలాంటి సందేహాలని శాస్త్ర కారులకు వదిలేసి , మనం చూడ వలసింది రాముని నడత ,
సీతమ్మ దైర్యం &అనువర్తత , లక్ష్మణుని అంకిత భావం , భరతుని కర్తవ్య పాలన ,హనుమ పాండిత్యమూ ,
 సేవా భక్తీ  ... ,
 భర్త గా  ,అన్నగా ,కొడుకు గా , అన్నింటినీ మించి ప్రజలను పాలించే రాజుగా - ఎలా నడవాలో ,
నడవడిని ఎలా మార్చుకోవాలో  అంటే  మనిషి తన ధర్మాన్ని  ( అవసరమైన కార్యం ) ఎలా నిర్వర్తిం చాలో
చూపించిన మార్గ దర్శి రాముడు .
ధర్మం అంటే - మనిషి జీవనానికి కి అత్యవసర మైన వన్నీ సాధించు కోవడం మనిషి కనీస ధర్మం .

నేడు మనలో లోపించిందీ ధర్మమే . అనగా మన కేది అత్యవసరమో తెలియక అన్నింటినీ కోరు కోవడ మే 
అధర్మం .
 రావణుడు , శూర్పణఖ , వాలి , కైకేయి , - వీరు , వారికి అత్యవసరం కాని వాటి పై మోజు పడి అధర్మం బాట పట్టి వారి జీవనాన్ని ,వారితో పాటు ఇతరుల జీవితాలను బ్రష్టు పట్టించారు .

మనిషి తను ఉన్న ఆశ్రమానికి ( విద్యార్ధి, గృహస్తు , వానప్రస్థ, సన్యాసి ,రాజు ,నాయకుడు  తదితర ఆశ్రమాలు ) అనుగుణం గా , తన కనీస అవసరాలను గుర్తించి సాధించు కోవడం , ఆ క్రమం లో ఇతరులకు , ప్రకృతికి  ఎలాంటి హానీ కలుగ కుండా జాగ రూకత తో మెలగడం ---- ఇదే మనిషి ధర్మం .

మతం గురించి , దైవం గురించి చెప్పడం లేదు .
రాముణ్ణి ,రామాయణాన్ని ఒక మతానికి పరిమితం చేయడం సంకుచిత్వం . 
 మనిషి జీవన నాదం ఎలా శ్రుతి  చేస్తే  స్వర లయ బద్దం గా ఉంటుందో వాల్మీకి చెప్పాడు . భారతీయులే కాదు ,
ఈ సమస్త భూమండలం లోని మనిషన్న వాడు, నడవ వలసింది రాముని బాట ,స్మరించ వలసింది రామ నామం , తరించ  వలసింది రామాయణ పారాయణం ... 
అప్పుడే సీతా రామ కల్యాణం విశ్వ కల్యాణానికి నాంది అవుతుంది . 
           రామో విగ్రహవాన్ పరమో ధర్మః 



Saturday, 6 April 2013

ఇప్పుడే ధ్యానం ప్రారంభించండి .

ధ్యానం అంటే ఏమిటి ?
మన ధ్యాసను ఒక విషయం పై ధారణ చేయడాన్ని ధ్యానం అంటాము .
ఏకాగ్రత కి ధ్యానానికి తేడా ఉందా ?
ఏకాగ్రత లో అహం మిగిలే ఉంటుంది .
ధ్యానం లో అహాన్ని దాట టానికి ప్రయత్నం ఉంటుంది .
మనస్సు గాడ నిద్రలో తప్ప అన్ని వేళలా అతి చంచలం గా కంపిస్తూ ఉంటుంది .
శాస్త్రకారుల పరిశోధనలలో ,  మనిషి ప్రతి రోజూ సుమారు 60000 రకాల ఆలోచనలు  సంకల్పిస్తాడు .
ఆలోచన పుట్టాలంటే సంకల్పం , భావ పరిపుష్టి ఉండాలి .
సంకల్పం ఎలా కలుగుతుంది ?
మనలో అంతర్లీనం గా ఉన్న గుణాల ( సత్వ ,రజో , తమో ) వలన ,
ఆ గుణాల కు బయట ఉన్న విషయాలకు కలిగే సంపర్కం వలన
సంకల్పం ఏర్పడుతుంది .
ఇంద్రియాల ద్వారా గ్రహించిన విషయాలను క్రోడీకరించి , పాత సమాచారం తో బేరీజు వేసి
మనస్సు భావ పరిపుష్టత ని పొందుతుంది .

చైతన్యం  .
---> అహం -----> బుద్ది ---- జ్ఞాపక శక్తి ---- చిత్తం
= ఇవన్నీ శక్తి కి వివిధ రూపాలు . వీటన్నింటినీ కలిపి మనస్సు ' అని మనం వ్యవహరిస్తాం .
అంటే మనస్సు - ఒక శక్తి ప్రవాహం .
మనస్సు ఒక పక్క చైతన్యం తో మరో పక్క దేహం తో కలప బడి ఉంటుంది .
చైతన్యం  ---- విశ్వ శక్తి (కుండలినీ శక్తి ) ---- మనస్సు ---- ప్రాణ శక్తి ----దేహం .
ఈ గొలుసులో ఎక్కడ స్పందనలు ఎక్కువైనా గొలుసు మొత్తం దాని ఫలితం భరించాలి .
ఆ స్పందనలను నియమితం చేసు కోవడ మే ,ఒక సమ తుల్య అవస్థలో నిలపడ మే యోగ సాధన .
అనగా , దేహాన్ని ,ప్రాణాన్ని , మనస్సుని , కుండలినీ ప్రవాహాన్ని  మాయా చైతన్య మనే అహంకారాన్ని
అధిగమించి శుద్ద చైతన్యం వైపు మళ్ళించేది ధ్యానం . ఈ మార్గం లో కలిగే అనుభవాలు
జ్ఞానం . మార్గం చివర వచ్చే లేదా మిగిలే అనుభూతి ప్రజ్ఞ .
మన జీవనం , జీవితం ప్రశాంతం గా ఉండాలంటే ధ్యానం చేయాలి . 
ఇప్పుడే ధ్యానం ప్రారంభించండి .