చంద్ర గ్రహణం సమయం లో ఏం జరుగుతుంది ?
సూర్యుడికి చంద్రుడికి మధ్యగా భూమి అడ్డుగా రావటం వలన మనకు చంద్రుడు కనపడడు .
సూర్య కాంతి లోని ఎర్ర రంగు తరంగాలు ఒక ప్రత్యేక కోణం లో చంద్రుని తాకుతాయి . ఎందు కంటే
భూ వాతావరణం సూర్య కాంతి లోని నీలి తరంగాలను చెల్లాచెదురు చేయడం వలన ఎక్కువగా
ఎరుపు తరంగాలు చంద్రుని పై పడి , మన భూ వాతావరణం లోనికి ఒక విధమైన శక్తి తరంగాలు
పరా వర్తనం చెందు తాయి .
- మనస్సుకి సంకేత మైన చంద్రుడు ,ఆత్మకి సంకేత మైన సూర్యుడు ఒకే సరళ రేఖ లోకి రావడం ఒక విధం గా అదొక యోగం . ధ్యాన లక్ష్యం కూడ మనస్సు ఆత్మా వైపు గా నిలిచి ఉండటమే గదా .
- సూర్య నాడి , చంద్ర నాడి కూడ ఒకే విధ మైన స్పందన లో ఉన్నప్పుడు సుషుమ్నా( - అగ్ని నాడి )బాగా పని చేస్తుంది . అనగా అగ్ని నాడి ద్వారా కుండలినీ శక్తి ప్రసరణ అతి తేలికగా జరిగే అవకాశంఉంది .
అందుకే గ్రహణ సమయం లో జప , మంత్రసాధన , ధ్యానం చేస్తే ఎక్కువ ఫలితాలు కలిగే
అవకాశం ఉంటుంది .
అందుకే గ్రహణం రోజున ముఖ్యం గా ఉపవాసం లేదా సాత్విక మితాహారం,ప్రాణాయామం , వీటి ద్వారా శరీర శుద్ది జరుపు కొని భూమి పై పరిడ విల్లె కుండలినీ శక్తిని మన శరీర కోశాల లోని సుషుమ్నా నాడీ ద్వారా ప్రవహింప చేసు కొనే శక్తి పాతానికి అందరూ సమాయత్త మవ్వాలని మన ఋషుల ఆశీస్సు .
గ్రహణ కాలం లో ఆహార పదార్ధాలకు , జీవులకు హాని చేసే కిరణాలు ఎక్కువగా భూమికి వస్తాయి .
వీటి నుమ్డి రక్షణ పొందా లంటే మన శరీర కోశాలను శుద్దమ్ గా ఉంచు కోవాలి.
అందుకే , స్నానం , దానం ,మితాహారం ,ప్రాణాయామం , దైవ స్మరణం మొదలగు గ్రహణ విధులను
అమలు చేయాలి .
No comments:
Post a Comment