Search This Blog

Sunday, 25 August 2013

భ వాఘ్ని ఆరామ ప్రారంభోత్సవ శుభా కాంక్షలు ...

భగవద్గీ త:

 ఎన్నో ఏళ్ళుగా సమాజం లోని బలాన్ని,బల హీనతని గమనించి మనిషి ఎలా జీవిస్తే ఆనందం గా ఉంటాడో  , తద్వారా  సమాజం ప్రశాంతం గా ఉంటుం దో ఆ జీవన మార్గా న్ని భోధించే పవిత్ర మార్గ దర్శక గ్రంధం .


సంకట పరిస్థితిలో మనిషికి కలిగే వైరాగ్యం,నిర్వేదం ,నైరాశ్యం మొదలగు తామస భావాలను ,
అత్యాశ,సుఖ లాలస, కీర్తి కాంక్ష,ధన వ్యామోహం  మొదలగు రాజస భావాలను,
క్రొధం,కార్పణ్యం,కక్ష,అసూయ,దురాశ,హింస,మొదలగు రాక్షస భావాలను,
మూడ భక్తి,మిధ్యా వాదం అనే పలాయన వాదం, మూడ నమ్మకాలు,సోమరితనం,మొదలగు అపరిపక్వ భావాలను,-----------మనిషి  అధి గమించి, అర్ధ,కామా లను ధర్మ బద్దం గా  సాధించి మోక్షం ఎలా పొందా లో తెలిపేది గీత.

మనిషికి గమ్యం : చతుర్విధ పురుషార్ధ సాధన, చావు పుట్టుకల చక్రం నుండి విముక్తి. 

భావాలను సాత్వికం గా మార్చు కొని,ఆ తర్వాత ఆయా భావాలకు పునాదిగా ఉన్న చిత్తాన్ని అధిగమించి సంకల్ప రహితం చేసుకోవడం,
మన అవగాహనను , మెట్టు మెట్టు గా కర్మ ఫల సన్యాసం ,ఇంద్రియాలను అధిగ మించే రాజయోగం ,శ్రద్ద-ఓర్పు -విశ్వాసం అనే నవ విధ భక్తి యోగం,సాక్షీత్వం -స్థిత ప్రజ్ఞత్వం-ప్రజ్ఞ అనే జ్ఞాన యోగం --- ఇలా సాధన చేస్తూ మనిషి భౌతిక పరంగా,భావ పరం గా,ఆత్మ పరం గా నిరంతర  ఆనంద స్థితి కి చేరడ మే మనిషి జీవన పధం.
ఇదే మనిషి ధర్మం.

ప్రశాంత మైన,సంతోష మైన జీవితం కావాలీ అనుకొంటే మనం ఎలా నడవాలో తెలిపే కర దీపిక, భగవద్గీ త. 

అందరూ  చదివి,ఆ సారాన్ని తమ తమ జీవితా ల్లో అన్వయించుకొని , పది మందికి తెలప వలసిన బాధ్యత భారతీయుల మైన మనందరి పై ఉంది . 

ఈ గురుతర బాధ్యత ని తమ భుజ స్కందాలపై వేసుకొని అమరావతి దగ్గరే ఉన్న వైకుంట పురం లో భ వాఘ్ని మర్మ యోగ విద్యాలయాన్ని, భ వాఘ్ని ఆరామాన్ని నిర్మించి, గీతా  చైతన్యాన్ని వ్యా పింప చేస్తున్న భ వాఘ్ని గురు దేవులకు,తమ జీవితాలను గీతా ప్రచారానికి అంకితం చేసిన గురుకుల ఆరామ భ వాఘ్నిసభ్యులకు   ఆయురారోగ్య భాగ్యాలు కలగాలని, ---
 నిరాకారుడు ,నిర్గుణో పేతు డు, గీతా కారుడైన శ్రీ కృష్ణుణ్ణి, 
గీతని గానం చేసిన వేద వ్యాస మహర్షిని ,
గీతని గ్రంధస్తం చేసిన గణేశుని - ప్రార్ధిద్దామ్ . 

No comments:

Post a Comment