Search This Blog

Monday, 26 August 2013

ధర్మ చక్రం

ధర్మానికి విరుద్దం గా నడిచే వారు  మిత్రులు,బంధువులు,శిష్యు లు ఎవరైనా సరే అదుపు చే యాలి.
అదే అహింస . దానికి విరుద్దం గా మీరు పలాయనం చేస్తే అది హింస అవుతుంది .
జీవులను చంపడం హింస కాదు . అది రాక్షసత్వం .
హింస  అంటే ధర్మాన్ని చంపడం , ధర్మాన్ని రక్షించ లేక పోవడం. 
అసలు ధర్మం అంటే ఏమిటి ?
మన బాధ్యత ని ఎలాంటి ప్రలోభాలకు  ,సోమరితనానికి ,భయాలకు తావివ్వ కుండా చే యడ మే ధర్మం  .
స్వ ధర్మం , పర ధర్మం, స్థూల ,సూక్ష్మ ధర్మం - ఇలా ఎన్నో స్థాయీ బేధాలు .
తల్లితండ్రులను ,భాగ స్వామిని , పిల్లలను ప్రేమతో సాకటం కర్తవ్యం .
ఇరుగు పొరుగు వారిని,జీవులను,ప్రకృతిని రక్షించడం బాధ్యత .
వ్యక్తి స్థాయి నుండి కుటుంబ స్థాయికి ,తద్వారా సంఘ స్థాయికి తమతమ బాధ్యతలను విస్తరింప చెయడ మే
మనిషి విధి.
ఈ  క్రమం లో తన శారీరక,మానసిక,ఉద్వేగ ,ప్రాణ ఆరోగ్యాన్ని కాపాడు కొంటూ ,తన హితాన్ని,సమాజ హితాన్ని ఆచరణ లో అమలు చేస్తూ ,తన కర్మలను భస్మం చేసుకొని,కొత్త కర్మలు అంట కుండా ఆత్మ  గత అనువర్తనం తో జీవనం సాగించడ మే , మనిషి స్వ ధర్మం . 

No comments:

Post a Comment