Search This Blog

Thursday, 7 November 2013

కుజదోషం పట్టించు కోవద్దు.

 కుజ దోషం అనే మాట చాలా మంది మనస్సులో గుబులు పుట్టిస్తుంది .
 'కలౌ పరాశర ' అనేది పండితుల మాట. 
కాబటి ఈ కుజదోషం  విషయం లో ఎంత సత్యం ఉంది?ఎంత అపోహ ఉంది? అనేది తేల్చడానికి పరాశర సంహిత ఏం  చెప్పిందో చూద్దామ్.
1.లగ్నాత్ గానీ,చంద్ర లగ్నాత్ గానీ ,కుజుడు 1,4,7,8,12 స్తానా ల్లో ఉండి, ఎలాంటి శుభ గ్రహ సహవాసం లేదా దృష్టి లేక పోతే ,అప్పుడు మాత్రమే కుజ దోషం ఉన్నట్లు చెప్పాలి.
అలాగే కుజ దోషం రద్దు అయ్యే పరిస్థితులు- (Cancellation of Mars affliction)
అ. కుజుడు సొంత ఇంట్లో ( మేష,వృశ్చికం ) లేదా స్నేహితుల ఇంట్లో ( గురు,చంద్ర, రవి  కుజుని స్నేహితులు ,కాబట్టి ధనుస్సు,మీనం,కర్కాటకం , సింహ రాశులలో కుఝుడున్నప్పుడు దోషం లేదు .
ఆ . గురు,చంద్ర,శని,రాహు,బుధ,రవి -వీరి లో ఎవరితో అయినా కుజుడు  కలిసి ఉన్నప్పుడు ,
ఇ . కర్కాటక,సింహ లగ్నం వారికి కుజ దోషం ఉండదు .
ఈ . కుంభ లగ్న వారికి కుజుడు 4,8 స్థానాల్లో ఉన్నా ,
ఉ . లగ్నం లో గురు లేదా శుక్రుడున్నా ,
ఊ . కుజుడు అధిపతి గా ఉన్న వృశ్చిక,మేష రాశులను శని చూస్తున్నా ,--------   కుజ దోషం ఉండదు .

ఇన్ని సవరణలు ఉండ బట్టే, 90 శాతం జాతకా లలో కుజుడు 1,4,7,8,12 స్తానా ల్లో  ఉన్నా దోషం ఉండటం లేదు . 
గ్రహాల వలన దోషాలు రావు. జాతకుని కర్మ లోని  దోషాలను గ్రహాలు  సూచిస్తాయి . ఎలాగంటే , శరీరం లో వ్యాధి ఉంటే జ్వరం వస్తుంది . జ్వరం వలన వ్యాధి రాదు . జ్వరానికి మండేసుకొన్నా వ్యాధి తగ్గదు . అలాగే గ్రహానికి శాంతులు  చేసినా ఫలితాలు పూర్తిగా రావు . 
మరేం చేయాలి ?
 కారణ శరీరం లో నిబిడీకృతం గా ఉన్న కర్మ  దోషం భస్మం అవ్వాలంటే ,సాత్విక ఆహారం , సత్కర్మాచరణ ,సద్గ్రంధ పట న , దానం , ధ్యానం - ఇవి ఏదో కాసేపు చేసి వదిలేయకుండా , జీవన విధానం లో సమూ లామ్ గా ఆచరణ లో పెడితే ఎలాంటి దోషాలైనా  పోతాయి . 

No comments:

Post a Comment