Search This Blog

Saturday, 9 November 2013

యోగ సాధన...

 మనిషి మనస్సు  ను ఎలా అర్ధం చేసు కోవాలి ?  
విశాల విశ్వమ్ లో అంతర్లీనం గా చైతన్యం ఉంటుంది . ఆ అవిచ్చిన్న చైతన్యపు సముద్రం లో  ఓ  శకలం మనస్సు.
మనస్సుని వ్యాపింప చెయ్యడ  మనగా, మనస్సు చుట్టూ ఉన్న బంధనాలని,మాయా మోహపు తెరలను తొలగించు కొని, సువిశాలచైతన్యాన్ని అనుభూతించ డ మే .   మనం ఉపయోగించే  మనస్సు (conscious mind )  చాలా తక్కువ . తెలియని మనస్సుని అంతర్ చైతన్యం ( subconscious and unconscious )అని పిలుస్తాము . యోగి కి అంతా కాన్షస్ మనస్సే .

మనస్సుని ఎలా వ్యాపింప చేయాలి? (how to raise  the Awareness) ?
నాడులను,చక్రాలను శుద్ది చేసుకోవాలి .
ఎలా ? 
ఆసనాల ద్వారా ,ప్రాణాయామం ద్వారా , (హట  యోగ) ;
సాత్విక మైన పద్దతుల ద్వారా మనస్సు  ను ఆధీనం చేసు కోవడం (రాజయోగ ) ద్వారా ...

ప్రాణాయామం లో జరిగేది ,ఒరిగేది ఏమిటి ? 
నీటిని కంట్రోల్ చేస్తూ  ఒక పద్దతిలో టర్బైన్ ల మీద నుండి  ప్రవహింప చేసినప్పుడు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది . అదే విధం గా  ఒక పద్దతి లో  ఊపిరి తీస్తూ ,కుంభి స్తూ , వదులుతూ గాలిని,నాడీ చక్రాల పై ప్రవహింప చేసినప్పుడు ప్రాణ శక్తి పుడుతుంది . ఎంత శక్తి కావా లంటే అంతగా ప్రాణాయామం చేయాలి .
ఊపిరి ద్వారా ఊపిరి తిత్తులలో జరిగే ఆక్సిజన్ శోషణ ,తద్వారా జరిగే కణ ప్రక్రియలు గురించి చెప్పడం లేదు .
దీపానికి గాలి - అనగా ఆక్సిజన్ అవసరం . కానీ, ఆక్సిజన్  తో దీపం వెలగదు . ముందు అగ్గి పుల్లతో దీపం వెలిగించాలి . ప్రాణ శక్తి ఒక నిప్పు రవ్వ వలే పని చేస్తూ ఉంటుంది . మన చర్మం  కూడా ఆక్సిజన్  ని  పీల్చు కొంటుంది .  కనుక నే యోగులు కుంభకం లో ఉండి , బయటి గాలి (oxygen ) పై ఆధార పడ కుండా ప్రాణ శక్తి  ని ఆరిపోకుండా చేస్తూ  జీవిస్తారు .
సరే , హట యోగం ,రాజ యోగం ద్వారా శక్తిని పోగు చేసుకొని షట్ చక్రాలను ఉద్దీపనం చేస్తారు . దీనితో ఎలా కాన్షస్ నెస్  ని వ్యాపింప చేస్తారు ?
అంతర్ ముఖం గా మనిషి చేసే పయనం లో కావలసిన శక్తి  పై యోగాల ద్వారా సంపాదించు కొని ,సుషుమ్నా నాడి లో శక్తి సంచాలనం జరిపి తే ,మనస్సు  పరిధి పెరిగి అన్ని మితులలో (Dimensions)ఉన్న వాస్తవాలు అన్నీ అవగాహన లోకి వస్తాయి . ప్రస్తుతం మనకున్న జ్ఞానేంద్రియాలు సత్యాన్ని కొంత వరకే అర్ధం చేసు కోవడానికి పనికొస్తాయి . నిజ మైన సత్య అవగాహనకి కొత్త జ్ఞానేంద్రియాలు కావాలి . అపరిమిత మైన కాస్మిక్ శక్తి తో బంధం ఏర్పరచు కొని నిరాఘాటం గా శక్తిని పొందుతున్న ప్పుడు , ఆ శక్తి తరం గా లు గా సుషుమ్నా నాడి లో ప్రవహిస్తూ సహస్రార చక్రాన్ని చేరి నప్పుడు కలిగే జ్ఞానమే నిజమైన పూర్ణ మైన జ్ఞానం . అదే సత్యావిష్కరణ . అదే మోక్షం .
అది ఓ నిశ్చలా నంద స్థితి . 

No comments:

Post a Comment