Search This Blog

Tuesday, 2 April 2019

2019 ఎన్నికలలో చంద్రబాబు విజయం సాధిస్తారా??

జ్యోతిష్యం అనేది ఒక శాస్త్రం.  ఇది సంక్లిష్ట గణితం తో , కఠినమైన సూత్రాలతో ఉండటం చేత, దీనిని అర్ధం చేసుకొని సత్యమేమిటో వివరించడం అంత తేలికైన పనికాదు. అందుకే అందరూ ఒకే రకమైన జ్యోతిష ఫలితాన్ని చెప్పరు .   శాస్త్రిదే తప్పు తప్ప శాస్త్రం తప్పుకాదు.

గ్రహాలనేవి మన కర్మ భారాన్ని సూచించేవే తప్ప, అవే మన సుఖదుఃఖాలకు  కారణం కాదు. మరి ఎందుకు నవగ్రహాలకు పరిహారాలు,శాంతులు చేస్తున్నారు? ఎందుకంటే ప్రతి పదార్ధానికి వెనుక ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తినే దేవతగా భావన చేయమని మహార్హులు వాక్యం . అందుకే  గ్రహమనేది స్థూలపదార్ధ మైనా  దానిలోని శక్తి ని దేవత గా భావిస్తాము . మనం పూర్వజన్మలో చేసుకొన్న కర్మలో కొంత భాగం  ప్రారబ్ద కర్మగా  అనుభవించడానికి ఈ ప్రస్తుత జన్మ తీసుకొన్నాం.  జన్మ సమయంలో ఈ గ్రహాల స్థానం, గోచారరీత్యా  గ్రహాల చలనం అనేవి , కేవలం కర్మ సూచికలే  తప్ప అవి   కారణం కాదని గుర్తుపెట్టుకోవాలి. 
పంచభూతాలకు శాంతులు,పరిహారాలనేవి మన పూర్వజన్మల పాపపు కర్మలను కొంతైనా రద్దు చేస్తాయనే భావన, అంతేకాక, ఈ శాంతి విధానాల ద్వారా మనస్సు కొంతైనా పవిత్రమవుతుందనే భావనతో చేస్తాము. 

మరి మనిషికి స్వతంత్రం లేదా ?
 అకుంఠిత దీక్షాపరులకు, శ్రద్ధ,ఏకాగ్రత ,లక్ష్యం పై అనన్యమైన చింతన ఉన్నవారికి స్వతంత్రం ఉంటుంది తప్ప  సామాన్యులకు ఉండదు. కాబట్టి  ప్రారబ్ద కర్మ అనుభవించక తప్పదనే సామెత ఆలా వచ్చింది. 

చంద్రబాబు గారి జాతకం. 
ఇది పరాశర సిద్ధాంతాన్ని అనుసరించి గణించిన కుండలి. 
ఏప్రిల్ 20 1950 ఉదయం 6-43,కృత్తికా నక్షత్రం, శుక్లపక్ష తదియ ,గురువారం చిత్తూర్ లో జన్మించారు. 
లగ్నం : మేషం ; రాశి : వృషభం. 
నవాంశ లగ్నం : కన్య ; నవాంశ రాశి : కుంభం . 


లగ్న కుండలి బలం -దశ బలం . 
కుండలి లో లగ్నాత్ శని 5 వ  స్థానం లో ఉన్నాడు . పాపగ్రహం ,5 లో ఉంటే అంతగా ఇబ్బంది పెట్టడు . కానీ శత్రు క్షేత్రం లో ఉన్నాడు, పైపెచ్చు వక్రంగా ఉన్నాడు  కాబట్టి,మరింత పాపి గా బిహేవ్ చేస్తాడు.  అనగా దుఃఖ కారకుడు. 
2003 ఏప్రిల్ నెలనుండి 2022  ఏప్రిల్ వరకు చంద్రబాబు కి  శని మహర్దశ. అందుకే ఆయనకు 2004 నుండి  10ఏళ్ళు అధికార భంగమై ప్రతిపక్షంలోనే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే సూర్య,చంద్ర అంతర్దశలు వచ్చాయో ఆయనకు తిరిగి అధికారం దక్కింది. ఆయన జాతకం లో సూర్య చంద్రులు యోగ కారకులు. 
లగ్న కుండలి రీత్యా,రాహువు ఆయనకు యోగిస్తాడు . 2016 నుండి శనితో రాహు అంతర్దశ నడుస్తుంది . దీనివలన పెద్దగా ఇబ్బంది ఉండదు. 26 మార్చి 2019  నుండి శని-రాహు వులో సూర్య ప్రత్యాంతర దశ ,ఆ తర్వాత చంద్ర ప్రత్యాంతర దశ వస్తాయి.  ఎన్నికలు కూడా ఈ రెండు శుభగ్రహాల ప్రత్యాంతర దశలలో జరుగుతున్నాయి కాబట్టి అంతా  శుభమే జరుగుతుంది. 

ప్రస్తుత గోచారం : 


ఏప్రిల్ 1 నుండి గురువు ధనస్సులో ప్రవేశించి ,శని, కేతువులతో చేరడం అనేది చాల ముఖ్యమైన మలుపు.  ఇప్పటి వరకు పోటా పోటీ గా ఉన్న దనుకొంటున్న ఎన్నికల సమరం, ఇప్పటి నుండి ఏక పక్షంగా మారే సూచనలున్నాయి.  ఎందుకంటే లగ్నం నుండి రాజ్యస్థానం లోనూ , రాశి నుండి అష్టమ స్థానం లోనూ  ఉన్న శని ,కేతువులు   అశుభ ఫలితాలను ఇచ్చే సూచనలున్నాయి.  కానీ  సరిగ్గా 31 మార్చ్ నాడు గురువు శని, కేతువులతో కలిశాడు. 
గురువు పాపగ్రహాల అశుభత్వాన్ని కొంతమేర తగ్గించేస్తాడు. గురువు,ధనుస్సు రాశి నుండి  తన 5 వ దృష్టితో లగ్నాన్ని చూస్తున్నాడు.అలాగే 9 వ దృష్టితో  5 వ స్థానాన్ని  చూడటం చేత శత్రువులపైన ,పోటీదార్ల పైనా విజయం సిద్ధిస్తుంది. 
   

Thursday, 31 January 2019

చంద్రబాబు విశ్వరూపం

గత 4 ఏళ్లలో  కియా , ఇసుజు, టాటా, అశోక్ లేలాండ్, సినామాస్  వంటి బడా పరిశ్రమలు , పేరెన్నికున్న సాఫ్ట్ వేర్ కంపెనీలు , అదానీ,అంబానీ,జిందాల్  లాంటి దిగ్గజాలను,చైనా,కొరియా,జపాన్ ,ఇండోనేషియా లాంటి దేశాలనుండి  ధనాన్ని ఆంధ్రాకి రప్పించి సుమారు 100 పరిశ్రమలను స్థాపించి 12లక్షల ఉద్యోగాలను కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అదే మోదీ పాలన చూడండి. దేశాన్ని,నిరుద్యోగ యువత ను ఎంతగా కుంగదీశాడో అర్ధం అవుతుంది.
India's unemployment rate hit a 45-year high in 2017/18 . 
జాతీయ సర్వే NSSO-రిపోర్ట్ ఇది.

  • India's jobless rate shot up to 45-year high during 2017-2018.
  • NSSO showed unemployment rate at 6.1%, the highest since 1972-73.
  • Joblessness stood at 7.8% in urban areas compared with 5.3% in the countryside.
  • This was the first comprehensive assessment of India's employment situation post DeMo.


  • చంద్రబాబు  సారధ్యంలో దండుగ మారి వ్యవసాయం ఎలా పండుగగా మారిందో చూడండి. కేవలం 4ఏళ్లలో వ్యవసాయం, ఉద్యానవనాల నుండి రైతులు,రాష్ట్రం ఎంతగా లబ్దిపొందిందో ఈ క్రింది  చార్ట్ చూస్తే అర్ధం అవుతుంది. 3. 5శతం నుండి 18 శాతానికి పెరిగింది.





    వ్యవసాయమే కాదు, పారిశ్రామిక ప్రగతి ని గమనించండి.  ఏయే జిల్లాలలో ఏయే పరిశ్రమలు వచ్చాయో అర్ధం అవుతుంది. ఇందులో కొన్ని ప్రారంభోత్సవాలు జరుపుకొని ఉత్పత్తులు చేస్తుంటే, మరికొన్ని నిర్మాణదశలో ఉన్నాయి.
    అక్కడ లభ్యమయ్యే వనరులను బేస్ చేసుకొని  ప్రతి జిల్లాకి ప్రాముఖ్యతనిచ్చిన తీరు చూస్తే భారతదేశంలో ఏ నాయకుడూ చేయలేని ఘనకార్యం చేశాడు చంద్రబాబు అని తెలుసుకొంటాం.  పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో వికేంద్రీకరణ , యువతకు ఉద్యోగాలు, రైతుకి భరోసా, మహిళకు దన్ను , వెనకబడిన వర్గాలకు చేయూత , పేదలకు మూడు పూటలా కడుపు నిండా అన్నం , విద్యార్థులకు ఉచిత  విదేశీ విద్య , బాలికలకు సైకిళ్ళు, తల్లీబిడ్డ రక్షణకు ఎక్స్ ప్రెస్ సౌకర్యాలు, మనిషి జననం నుండి మహాప్రస్థానం వరకు అడుగు అడుగునా తోడూ నీడగా మారిన తీరు చూస్తే, ఇలాంటి నాయకుడు దొరకడం ఆంధ్రుల అదృష్టం.
    ఇదిగో ...ఇదే చంద్రబాబు విశ్వరూపం ... 

    Wednesday, 28 November 2018

    వ్యవసాయం భారతీయ జీవన విధానం.

    భారతదేశం అనాదిగా వ్యవసాయాధారిత దేశం. పల్లెల్లో ప్రజలు భూమిని నమ్ముకొని గొడ్డు గోదా పిల్లామేకలతో ఉన్నదాంట్లోనే సర్దుకొంటూ సంసారం సాగించేవారు. 90 వ దశకం వరకు పారిశ్రామిక రంగానికి,వ్యవసాయ రంగానికి ఉత్పార్దకత లో పెద్దగా అంతరం లేకపోవడం చేత ఈ రెండురంగాలలోని ప్రజల జీవితాలలో  చెప్పుకోదగ్గ అసంతృప్తులు లేవు. 

    ఎప్పుడైతే పారిశ్రామిక సంస్కరణలు మొదలయ్యాయో , వ్యాపార రంగానికి బాంకులు విచ్చలవిడిగా లోన్స్ ఇవ్వడం మొదలు పెట్టాయో ,అప్పటి నుండి పారిశ్రామిక ,ఆ తర్వాత సేవారంగాలలో ఉత్పా దకత  బాగా పెరిగిపోయి, వ్యవసాయ రంగం లోని ఉత్పాదకత తగ్గిపోవడం జరిగింది. 
    విద్యారంగం కూడా కేవలం సేవారంగానికి పనికొచ్చే పౌరులను తయారు చేసే కర్మాగారాలుగా మారిపోయాయి. 

    నేటికీ, దేశంలో 80కోట్లమందిని వ్యవసాయరంగమే పోషిస్తుంది.  దేశంలోఉన్న అనేక రకాల  ఉద్యోగాలలో 50శాతం వ్యవసాయ కూలీ అనే  ఉద్యోగమే!
    మనకుతెలుసు, వ్యవసాయం అనేది పరిశ్రమ కాదు. వ్యవసాయం అనేది సేవారంగమూ కాదు. వ్యవసాయం ట్రేడింగ్ వ్యాపారం కానే కాదు. అందుకే  మనం చెప్పుకొంటున్న భౌతికపరమైన సంపద లెక్కల్లో వ్యవసాయం లాభసాటి కాదు. ఆర్థికవేత్తలు లెక్కలిలా ఉంటాయి. 50శాతం ఉద్యోగులు దేశ  జా తీయ ఉత్పత్తి కి  కేవలం 16శాతం మాత్రమే ఇస్తున్నారని వారంటారు. వారికి తెలియదా?వ్యవసాయం వ్యాపారం కాదు,లాభాపేక్షలు చూసి చేసేది కాదు. వ్యవసాయం భారతీయ జీవన విధానం. 

    దేశంలోని 30కోట్ల ఎకరాల లో వ్యవసాయం,వ్యవసాయ అనుబంధ రంగాలైన డైరీ,ఆక్వా, పౌల్ట్రీ , ఉద్యానవన,అరణ్య ,మెడిసినల్ హెర్బల్స్ ద్వారా ఏ టా సుమారు 20 లక్షలకోట్ల రూపాయల విలువైన ఉత్పత్తు లు- అనగా 30 కోట్ల టన్నుల ధాన్యాలు , 15కోట్ల టన్నుల పాలు, 30కోట్ల టన్నుల పండ్లు, కాయగూరలు ,7మిలియన్ టన్నుల మాంసం ఉత్పత్తి అవుతున్నాయి. 

    ఏది ఏమైనా వ్యవసాయ రంగంలో ఉన్న 10కోట్ల రైతులు (భూమి యజమానులు) గానీ, దీనిపై ఆధారపడిఉన్న 15కోట్ల కూలీలు గానీ సంతోషంగా లేరు. ఎందుకంటే బతుకు పరుగులో  ,ఎవరైతే పరిశ్రమలు,సేవారంగాన్ని వెదుక్కుంటూ పట్టణాల బాట ప ట్టారో వారి బతుకులు మరింత రంగులమయంగా కనబడుతుంది. 
    భూమి వారికీ అన్నంపెట్టే తల్లి లా కనబడం మానేసి అప్పుల భారంతో కుంగదీసే వ్యధ భూమిగా కనబడటం మొదలైంది.  ఈ సంకెళ్లనుండి తెంచుకొని పోవాలంటే ఉన్న ఒకే ఆయుధం చదువు. 

    తరాలు పెరుగుతున్న కొద్దీ వ్యవసాయానికి గుండెకాయ గా ఉండే   ఉమ్మడి కుటుంబాలు విఛ్చిన్నమై న్యూక్లియర్ కుటుంబాలు పెరుగుతున్నకొద్దీ కమతాల సైజు తరతరానికి తగ్గిపోతుంది. జనాభాతో పాటు  భూమి పెరగదు గదా?
    కమతాల సైజు సరాసరి ఒక్కో వ్యవసాయదారుడికి కేవలం 1ఎకరా గా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడిలేని ప్రక్రుతి వ్యవసాయం ,  రసాయన ఎరువులు,పురుగుమందులను తగ్గించి గోవు ఆధారిత సేంద్రియ ఎరువులు , మూలికలనుండి తీసిన పురుగుమందులను వాడించి , సూక్ష్మ బిందు తుంపర సాగుతో దిగుబళ్లను సాధించే పద్ధతులను ప్రవేశ బెట్టారు చంద్రబాబు. ఇది ఎంతో ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం. 

    • మార్కెట్టులో ఏ పంటలకు నిలకడైన మద్దతు ధర ఉంటుందో, ఏపంటలకు డిమాండ్ ఉంటుందో, ఏ పంటలను ఎక్కువకాలం పాడవకుండా నిల్వ  చెయవచ్చొ అలాంటి పంటలను మాత్రమే సాగుచే యించాలి.  
    • పంట దిగుబడిని కోల్డ్ స్టోరేజీ లలో నిల్వ చేసుకొనే సదుపాయాలు , సోలార్ ఆధారిత డ్రయ్యర్ లు ప్రతి పంచాయితీలో ఉండాలి. 
    • మెకానికల్ వ్యవసాయ  వ్యవస్థను అనగా ట్రాక్టర్లు , కోత నూర్పిడి యంత్రాలు, కలుపుతీత యంత్రాలు, నాట్లు వేసే యంత్రాలు సమస్తం ప్రతి పంచాయితీలో  అందుబాటులో ఉండాలి.  
    • ఇవన్నీ కూడా  డబ్బు చెల్లింపులు లేకుండా పండినపంట ను  బార్థర్ ఇచ్చే విధంగా ఉండాలి. అపుడు అప్పులు చేయవలసిన అవసరం ఉండదు. 
    • పంట భీమా నిర్బంధంగా అమలుచేయాలి. 
    • ఏదైనా ఒక జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రభుత్వమే సొంతంగా వ్యవసాయం చేసి పండిన పంటను ఎకరాకి ఇంతని కవులుగా రైతులకి ఇస్తే  మరింత బాగుంటుంది. 
    • వ్యవసాయంలో యాంత్రికత ఎంతపెరిగితే అంతగా కూలీలు వేరే రంగానికి మారతారు . కాబట్టి ప్రతి పంచాయితీలో నైపుణ్యాభివృద్ధి తరగతులు నిర్వహించాలి. 
    • కమ్మరి , కుమ్మరి,చాకలి, యానాది ,చేనేత,కల్లుగీత ,టైలర్,కంసాలి లాంటి  చేతిపని వారికి  నైపుణ్యాభివృద్ధి తరగతుల తోపాటు ఆధునిక పనిముట్లు అందించాలి. 
    • తక్కువ మనుషులు,ఎక్కువ ఉత్పద కత ఉంటేనే వ్యవసాయం లాభసాటి గా ఉంటుంది.  
    • భూమిని,పంటను ,తేమశాతాన్ని పరీక్షించే సాంకేతికత ప్రతి పంచాయితీలో ఉండాలి. 
    • ప్రభుత్వం  తన పధకాలను ప్రజలకు ఎంత అవినీతి రహితంగా ,, లబ్దిదారులకు ఎలాంటి కష్టం లేకుండా  ఎంత త్వరగా అందించగలదో ,అంతగా ప్రజామోదాన్ని పొందుతుంది. కేవలం పధకాలు ప్రకటించేసి అవినీతి, బంధుప్రీతి, పార్టీ ప్రీతి తో అసలైన లబ్దిదారులకు అందించకుంటే  మరింత తిరస్కారాన్ని ఎదుర్కొంటుంది. 
    • పంచాయితీ ల చేతిలోనే ప్రాధమిక అధికారాలు అనగా పంచాయితీ స్థాయిలో పనిచేసే వారికి ఆయా పంచాయతీలే జీతాలు,ఇతరత్రా సంక్షేమం చూడాలి. అలాగే పంచాయితీ వనరుల ఆదాయం లో 70శాతం ఆయా పంచాయతీలకే దక్కాలి. అపుడే గ్రామ సురాజ్యం బలపడుతుంది. 




    Saturday, 18 August 2018

    2019 ఎన్నికల సంగ్రామంలో గెలుపు ఎవరిది ?

     2019 లో రాబోయే ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలలో ఏ పార్టీ సత్తా ఏమిటో పరిశీలిద్దాం.
    అత్యంత అనుభవశాలి , కష్టపడేతత్వమున్న చంద్రబాబు ఒకపక్క , అవినీతి కేసుల్లో ఛార్జ్ షీట్ వేయబడి విచారణ ఎదుర్కొంటున్న యువనేత, సినిమారంగంలో మాస్ స్టార్ గా పేరుతెచ్చుకొని ప్రజాక్షేత్రంలో తనసత్తా ఏమిటో చూపుదామని ఉవ్విళూరుతున్న నాయకుడు మరోపక్క, అత్యంత దారుణంగా మోసం చేసిన జాతీయపార్టీలు కాంగ్రెస్,భాజపా మరోవైపు ఈ ఎన్నికల సమరంలో కదం తొక్క బోతున్నాయి. 

    ఆంధ్రులకు ఆవేశాలు,ఉద్వేగాలు ఎక్కువే అయినా, తెలివితేటలు కూడా ఎక్కువే! విద్యాధికులైనా , వ్యక్తిగత ఆరాధన కూడా ఎక్కువే! రాష్ట్ర హితం కంటే వ్యాపారాత్మక ధోరణి కూడా ఎక్కువ. కులాలను బట్టి ఓట్లు పోలరైజ్ అయ్యే అవకాశం కూడా ఆంధ్రాలో ఎక్కువ. 
    మెజారిటీ ప్రజలు కులాలుగా చీలిపోయి విడిపోయారు. రాజకీయంలోగానీ,పాలనలో గానీ అవినీతి, అనైతికం అనేవి సామాన్యు ఓటరు పెద్దగా పట్టించుకోవడం లేదు . మా వర్గానికి,మా సంఘానికి,మా కులానికి, మా కుటుంబానికి ఎంత లబ్ది వచ్చింది, ఎంత రాబోతుంది అనే లెక్కలు వేసుకొంటున్నారు తప్ప ,రాష్ట్ర అభివృద్ధి ని పట్టించుకొనే వాళ్ళ సంఖ్య తక్కువ. కులాల వారీగా ,మతాల వారీగా  ఓట్ల పోలరైజేషన్ జరిగే అవకాశం ఎక్కువ. 

    పార్టీలకు అతీతంగా ఆలోచిస్తే, చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి దొరకడం ఆంధ్రుల అదృష్టం. శాసనసభ్యుల అవినీతి అనేది వందల కోట్లలో ఉందని భావించినా , ప్రతిపక్ష నాయకులు ఇప్పటికే  వేల కోట్ల అవినీతిలో ముద్దాయిగా నిలబడిఉన్నారు. ఏది ఏమైనా ఈ దశలో చంద్రబాబు లాంటి అనుభవశాలి,  రాజ నీతి జ్ఞుడు , కష్టపడే తత్వమున్న నాయకుడు మళ్ళీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం నిలదొక్కు కొంటుందని మేధావుల ఆలోచన.  పోలవరం,అమరావతి పూర్తయ్యి , రాష్ట్రం పురోగతి చెందే  అవకాశం ఉంటుంది. ప్రలోభాలకు, కులమతాలకు అతీతంగా,అభివృద్ధికి ఓటేయడం ఓటరు  బాధ్యత. 


    కోటిన్నర కుటుంబాలు - 5కోట్ల జనాభా - రాజధానిలేని , భారీపరిశ్రమలు లేని , సేవారంగ కంపెనీలు అస్సలేమీ లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.   కాంగ్రెస్ చేతిలో ఘోరంగా అన్యాయం చేయబడి, మోడీ చేతిలో దారుణంగా మోసపోయిన  రాష్ట్రం. రెడ్డి,కాపు,కమ్మ,వైశ్య, బ్రాహ్మణ ,వెలమ,క్షత్రియ కులాలు ఫార్వార్డ్ కులాలుగా ఉన్నాయి. కులాలవారీ గణన వివరాలు కరెక్ట్ గా తెలియవు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో గణించిన వివరాలతో, ప్రస్తుత సీమాంధ్రలో ని కుల గణాంకాలను భేరీజు వేసుకొని అంచనా వేసిన వ్యాసం ఇది. ఇందులో కొన్ని పొరపాట్లు ఉండవచ్చు. 
    ఏది ఏమైనా ఎన్నికలకు 6నెలల ముందుగా అంచనాలు వేయడం కరెక్ట్ ఫలితాలను గ్రహించలేదు. ఎందుకంటే ఎన్నికలకు వారం ముందువరకు తటస్థ ఓటరు తేల్చుకోలేడు . కనీసం 20%తటస్థ ఓటర్లు ఉంటారు. 
    సంబంధిత చిత్రం
    సంబంధిత చిత్రం

    మహారాష్ట్రలో మహర్ లు , కర్ణాటకలో హోలియా లు, పులయాలు ,తమిళనాడులో పల్లార్ లు ఎలాగో ఆంధ్రప్రదేశ్ లో ఆది ఆంధ్రులు, మాలలు అనే వాళ్ళు ఒకే వర్గానికి చెందినవారు. వీరిలో మెజారిటీ ప్రజలు హిందూ మతాన్ని వదిలి,క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నారు. మాలలు,మాదిగలను కలిపి దళితులు అనికూడా అంటారు. క్రిస్టియన్ దళిత్ లను కూడా షెడ్యూల్ వర్గాల కింద పరిగణించాలని చంద్రబాబు శాసనసభ లో తీర్మానించారు.  
    ప్రతిపార్టీకి సంప్రదాయ ఓటు బాంక్ ఉంటుంది. 
    అగ్రవర్ణాలు 33% / వెనకబడిన వర్గాలు 37% / షెడ్యూల్ వర్గాలు 22% / మైనారిటీలు 8 % జనాభాగల  ప్రజా క్షేత్రం మన రాష్ట్రం  . 
     2014లో , TDP  సీమాంధ్ర,తెలంగాణ కలిపి 237 సీట్లలో పోటీ చేస్తే,  117 సీట్లు గెలిచింది. మొత్తం సుమారు కోటిన్నర ( 15746215 )  ఓట్లు అనగా 32.5 %  సంపాదించింది. YSRCP పార్టీ  266 సీట్లలో పోటీ చేసి,70 సీట్లు గెలిచింది. మొత్తం సుమారు  ( 13494076 )  ఓట్లు అనగా  27.88%సంపాదించింది.      
    కానీ ఇపుడు  2019 లో పరిశీలించవలసింది సీమాంధ్ర 13 జిల్లాలవరకే ... 
    తెలుగుదేశం పార్టీకి సాంప్రదాయ ఓటు బాంక్ : 
    AP caste wise population. (all are not voters). 
    మొత్తం 33% అగ్రవర్ణాల ప్రజలలో  ... 
    బ్రాహ్మణ 1%,కమ్మ 3.5% ; వెలమ 0% ,రెడ్డి 1%, వైశ్య 1% ; కాపు 4% ; క్షత్రియ 0. 5% వెరసి 11%  తెలుగుదేశానికి మద్దతు ఇస్తారు. . 
    మొత్తం 37% బి సి లలో ... 
    బలిజ : 2% ; చాకలి : 2% యాదవ : 4% ; కమ్మర 2% , తెలగ : 3% , ఇతర బి సి లు : 7% వెరసి : 20%. తెలుగుదేశానికి మద్దతు ఇస్తారు. . 
    మైనారిటీలలో మొత్తం 5% ముస్లిం జనాభాలో 3% .తెలుగుదేశానికి మద్దతు ఇస్తారు. . 
     ' మొత్తం క్రిస్టియన్ 2% జనాభాలో 0%. 
    షెడ్యూల్ కులాలలో మొత్తం 9% మాల లలో 2% తెలుగుదేశానికి మద్దతు ఇస్తారు. . ; 
    మొత్తం 7%మాదిగలలో 2% .  
    గిరిజనులు - మొత్తం  6% లో 2% తెలుగుదేశానికి మద్దతు ఇస్తారు. . 
    మొత్తం జనాభాలో టి డి పి కి 40% జనాభా సంప్రదాయ  మద్దతు ఉంటుంది. 

    • జగన్ గారి  పార్టీకి : అగ్రవర్ణాలు : 15% ; బి సి లలో 9%,మైనారిటీలలో 4% , మాలలలో 4% ; మాదిగలలో  2% ; గిరిజనులలో 3%  వెరసి = 37% మద్దతు ఇస్తారు. .  . 
    • కాంగ్రెస్ కి : అగ్రవర్ణాలు : 1% ; బి సి లలో 1%, మైనారిటీలలో 0. 5 % , మాలలలో 2% ; మాదిగలలో  2% ; గిరిజనులలో 0%  వెరసి = 6. 5 %మద్దతు ఇస్తారు. .  . .
    • పవన్ గారి  కి అగ్రవర్ణాలు 6 % ; బి సి లలో 7%, మైనారిటీలలో 0. 5% , మాలలలో 1% ; మాదిగలలో  1% ; గిరిజనులలో 1%  వెరసి =  16. 5 %మద్దతు ఇస్తారు. .  . . 
    పైన చెప్పుకొన్నవి జనాభా పరంగా చెప్పుకొన్నాంఇపుడు ఓటు బాంక్ పరంగా విశ్లేషిద్దాం
    తెలుగుదేశం పార్టీకి ఒరిజినల్ గా  35% ఓట్లు పునాదిగా ఉన్నాయి.
      
    సంప్రదాయ కాంగ్రెస్ ఓటు బాంక్ 40% ఉండేది. 2014లో ఇదంతా జగన్ గారి పార్టీ కి బట్వాడా ఐంది.  
    2014లో తెలుగుదేశానికి,జగన్ గారికి తేడా కేవలం 2% ఓట్లు. అయినా ,తెలుగుదేశానికి 35సీట్లు ఎక్కువ వచ్చాయి. YSRCP got 44.47 per cent votes and TDP got 46.3 per cent, a difference of 2.6 per cent.
    తెలుగుదేశం ---- polled 1,33,72,862 votes against 
    the YSRCP’s ------------  1,27,71, 323.

    2019లో మొత్తం 3కోట్ల ఓట్లు పోల్ అయ్యే అవకాశం ఉంది. 
    2014లో జగన్ గారిపార్టీకి వచ్చిన   45% ఓట్లలో అగ్రవర్ణాల ఓట్లు 15%, దళిత ఓటు 9%, గిరిజన ఓట్లు 5% , మైనారిటీ ఓట్లు 6%, బి సి ఓట్లు 10% . 
    వీటిలో ఏ వర్గం నుండి జగన్ గారిపార్టీ   ఓట్లు  కోల్పోవచో అంచనా వేద్దాం. 
    అగ్రవర్ణవోట్లలో  4%, దళిత ఓట్లలో 3%, గిరిజన ఓట్లలో 2%, మైనారిటీ ఓట్లలో 3% , వెరసి 12% ఓట్లు కోల్పోయే అవకాశం ఉంది. అనగా 2014లో సాధించిన 45% ఓట్లలో 12% పోగా మిగిలింది 33%. 
    ఇలా కోల్పోయిన 12% ఓట్లను ఏయే పార్టీలు పంచుకొంటాయో అంచనా చూద్దాం. 
    1% కాంగ్రెస్, 3% తెలుగుదేశం, 8%పవన్ గారిపార్టీ . 
    తెలుగుదేశం కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కోల్పోయే అవకాశం ఉంది. 2014లో తెలుగుదేశం సాధించిన 47% ఓట్ల నుండి, దళితులు 5%, అగ్రవర్ణాలు 3% ,కాపులు 3%, గిరిజనులు 1%, వెరసి 12% కోల్పోయే అవకాశం ఉంది. వీటిని, పవన్ 8%, కాంగ్రెస్ 1%, జగన్ 3% పంచుకొనే అవకాశం ఉంది. 
    2014లో  3%  కాంగ్రెసుకి , 3% భాజపా కి వచ్చాయి. వీటిలో భాజపాకి 1% మిగిలి మిగతా 2% పవన్ కి వెళ్లే అవకాశం ఉంది. 
    పైన అనాలిసిస్ క్రోడీకరిస్తే , 
    తెలుగుదేశం కి 2014లో వచ్చిన 47% ఓట్లలో   పోయేవి = 12% ;  వచ్చేవి  = 3%. వెరసి 9% నష్టం . కాబట్టి 2019లో 38%. ఓట్లు . 
    జగన్ పార్టీకి  కి 2014 లో 45% ఓట్లలో   పోయేవి = 12% ;  వచ్చేవి  =3%. వెరసి 9% నష్టం . మొత్తం= 2019 లో 36% ఓట్లు . 
    పవన్ గారి పార్టీ కి   - జగన్ గా రి  పార్టీ నుండి 8%, తెలుగుదేశం నుండి 8% చీల్చుకొంటారు. ఇవికాక కుల మతాలకు అతీతంగా  సినిమా అభిమానులనుండి  2 % ఓట్లు  వెరసి 18% ఓట్లు. 
    కాంగ్రెస్ కి 6%. & భాజపా కి 1% ఓట్లు రావచ్చు. 

    ప్రభుత్వ వ్యతిరేక ఓటు చాల తక్కువ ఉంటుంది ఎందుకంటే, 
    1. 2014 రాష్ట్రం విభజింపబడి చంద్రబాబు అధికారం చేపట్టినప్పుడు పరిపాలన చేయడానికి కనీసం ఆఫీసు కూడా లేని స్థితి నుండి  ప్రపంచంలోనే పేరెన్నిక గన్న రియల్ టైం గవర్నెన్స్ స్టేజి కి చేరుకున్నాం. 
    2. గ్రామాల్లో విద్యుత్ లేని స్థితినుండి 24గంటలు సరఫరాచేసే దశకు చేరుకున్నాం. 
    3. 2014 కి ముందు ఉన్న చాలీ చాలని 200/- పెన్షన్  ను 5రేట్లు పెంచి 1000/- పొందుతున్నాం.మళ్ళీ ఇప్పుడు 2019 నుండి ఈ పెన్షన్ ను 2000/ కి పెంచడం మామూలు విషయం కాదు. 55 లక్షల మంది వితంతువులు, ఒంటరి మహిళలు, ఆనాధలు ,దివ్యానుగులకు ప్రతి నెలా టంచన్ గా 2000/- వారి అకౌంట్ లో వేయడం అనేది చాలా అద్భుతమైన విషయం.  
    4. ఇంతేకాదు నదుల అనుసంధాన పధకం లో భాగంగా హంద్రీ నీవా, పట్టిసీమ, చింతల పూడి , పురుషోత్తమపట్నం ప్రాజెక్ట్ ల నిర్మాణం పూర్తవ్వడం వలన లక్షలాది ఎకరాలకు సాగునీరు నికరంగా పొందుతున్నాం.
    5. డ్వాక్రా సంఘాలకు పూర్తి ఋణ మాఫీ , 70% రైతులకు పూర్తి ఋణ మాఫీ,మిగతా 30%శాతం రైతులకు 60% రుణమాఫీ జరిగింది.మిగతా 40%మాఫీ కూడా ఎన్నికలలోపు అందుతుంది.  .ఋణమాఫీ జరిగినా కొన్ని మీడియా సంస్థలు  జరగనట్లే చెప్పుకొంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో  రైతులను అడిగితే వారు సంతోషంగా సంతృప్తి గానే  ఉన్నారని ఒక సంస్థ డేటా సేకరించింది. 
    6. మనిషి జననం  నుండి మహా ప్రస్థానం వరకు వివిధ దశలలో అవసరమయ్యే ఆసరాని 50 సంక్షేమ పధకాల ద్వారా చంద్రబాబు  అందిస్తున్నట్లు మరే రాష్ట్రమూ అందివ్వడం లేదు. 
    7.  అన్న కాంటీన్ ల ద్వారా శుచి రుచి గల ఆహారాన్ని 3పూటలా కేవలం 15/ అందివ్వడం చేత , రాష్ట్రంలో "ఆకలి" కి చోటు లేదు.
    8. కొద్దిగా ఆలస్యం అయినా , సుమారు 10లక్షల మంది యువతకు నిరుద్యోగ పెన్షన్ 1000/- ఇవ్వడం సామాన్యమైన విషయం కాదు. 
    9.  అన్నివర్గాలు,అన్ని స్థాయిల ఉద్యోగులకు జీతభత్యాలు ఇంత  ఆర్ధిక దుస్థితిలో కూడా  పెంచడం మామూలు విషయం కాదు. 
    10.అమరావతి గురించి  అందరూ ఏమే మో అనుకొంటున్నారు. కానీ ఒక్కటి ఆలోచించండి. చిన్న ఇల్లు కట్టుకోవాలంటేనే తర్జన భర్జనలు చేస్తాం. ఆంధ్రుల భవిష్యత్ కల్పతరువు సమగ్ర ఆర్ధిక రాజధానిని ఎంత జాగ్రత్తగా నిర్మించాలో మనందరికీ తెలుసు. ఎంత నమ్మకం లేకుంటే గంటలోనే 2000కోట్ల విలువైన అమరావతి బాండ్లను కొనుగోలు చేస్తారు? 
    11. దేశ వ్యాప్తంగా పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్ట్ లు 16 నిర్మాణంలోఉన్నా, కేవలం 4 ఏళ్లలో మన పోలవరం ప్రాజెక్ట్ మాత్రమే 60% పూర్తయిందని చెప్పుకోవడం గర్వం కాదూ ? 
    12. సుమారు 100 మధ్యతరహా & భారీపరిశ్రమలు, వందల్లో సేవా రంగపు కంపెనీలు 4 ఏళ్లలో నెలకొల్పి 10లక్షల మంది యువతకు ప్రత్యక్షంగా,పరోక్షంగా ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం , దేశంలో కేవలం మన ఆంధ్రా మాత్రమే  !
    మరి సెటిల్ మెంట్లు ,జన్మభూమి కమిటీలలో ఉంటూ సొంతవాళ్లకే పధకాలు కేటాయించుకోవడం, మైనింగ్ లో అవినీతి,అక్రమాలు చేసిన శాసన సభ్యుల వలన కొన్ని వర్గాలలో ముఖ్యంగా కమ్మకులానికి వ్యతిరేకమైన వర్గాలనుండి  వ్యతిరేకత బాగా ఉంది. ఇలాంటి ఆరోపణలున్న సిట్టింగ్ శాసన సభ్యులను మారిస్తే పార్టీకి మరిన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది. 
    ఇలాంటి శాసన సభ్యుల వలన తెలుగుదేశం పార్టీకి ఎంత వ్యతిరేక త ఉంటుందో,అంతకంటే వ్యతిరేకత జగన్ గారిపై ఉంటుంది. దీనికి కారణం,ప్రత్యేక హోదా కోసం గానీ రాష్ట్ర హక్కుల కోసం గానీ జగన్ గారు చేసిన పోరాటం సున్నా.  పైపెచ్చు , ఆంధ్రా  ని మోసం చేసిన మోడీ ,ఆంధ్రా వాళ్ళను నానా బూతులు తిడుతూ ఆంధ్రా అభివృద్ధికి అడ్డు తగులుతున్న కె.సి.ఆర్ తో అంటకాగడం వలన మధ్యతరగతి వర్గాలలో  జగన్ పై నెగిటివిటీ రోజురోజుకీ పెరుగుతుంది.