Search This Blog

Tuesday, 10 March 2015

మనదేశం బంగారు దేశం


  • మన దేశం లో వ్యక్తుల వద్ద కనీసం 20000 టన్నుల బంగారం కడ్డీల రూపం మరియు ఆభరణాల రూపం లో పోగు పది ఉంది . 
  • ఏటా 1000 టన్నుల బంగారం భారత దేశ వాసులు దిగుమతి చేసుకోవడం వలన 2 లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఖర్చు అవుతుంది . దీనిని ఎలా కంట్రోల్ చేయాలి ?
  •  దొంగచాటుగా వచ్చే బంగారం  వలన జరుగుతున్న   నష్టం ను ఎలా కంట్రోల్ చేయాలి ?
  • సరైన హాల్ మార్కింగ్ వ్యవస్థ లేక పోవుట వలన ఆభరణాల ఎగుమతులు తగ్గి పోతున్నాయి . 
  • 3.5 కోట్ల  మంది స్వర్ణ ఆభరణాల తయారీ మరియు అమ్మకపు రంగం లో ఉపాధి పొందుతున్నారు . వీటన్నింటికి విరుగుడే,  కొత్త బడ్జెట్ లో ని కొన్ని అంశాలు  

Saturday, 7 March 2015

WHATs happening in CRDA REGION IN A.P.?

The duties of farmers:
  •          to give consent application, and facilitate survey and demarcation.
  •     to prove rights over the land.
  •   to transfer ownership rights to the Authority against a guaranteed return of reconstituted plot in the vicinity of pooled land.
  • not to create any encumberances after entering into agreement with the Competent Authority for Land Pooling.
  • to handover physical possession to the Competent Authority for Land Pooling for development.

 The duties of CRDA? 
  • ·         issue statutory receipt for consent application with documents.
  • ·         to allot reconstituted plot by lottery.
  • ·         statutory land pooling ownership certificate [LPOC] with alienable rights within 9 months of agreement with all willing land owners.
  • ·         to handover physical possession of reconstituted plot within 1 year of issue of LPOC.
  • . • to complete the development of the scheme area within 3 years of issue of LPOC.


 


                  

Wednesday, 17 December 2014

లూట్ మార్

 అధికారులు, వ్యాపారస్తులు ,అధికారం లో ఉన్న రాజకీయనాయకులు  గడచిన దశాబ్దం లో సుమారు 30 లక్షల కోట్ల మనదేశ సంపదను లూటీ చేశారు . ఈ సంపద ని బయటకు పోకుండా కాపాడు కొంటే, మనం విదేశీ పెట్టుబళ్ళ
పై ఆధార పడ నక్కర లేదు . పోయినదానిని తెచ్చినా ,తేకున్నా కనీసం ఇప్పటి నుండైనా జాగ్రత్త పడే పాలసీలను పటిష్ఠం గా అమలు చేసే సత్తా ఉన్న మోడీ ప్రభుత్వం ఎందుకనో ,అనుకొన్నంత వేగం చూపడం లేదు .
according to the latest study released on Tuesday by Global Financial Integrity (GFI), a Washington DC-based research and advisory organization,in the preceding decade,  the total illicit outflow of capital from the country mounts to about  Rs 28 lakh crore.  
weather modi's govt brings black money or not, we expected that it can control further illicit outflow of capital from the country with iron fist. but its not so!

Wednesday, 5 November 2014

engineering colleges has to change

ఇన్నాళ్ళూ , ఒక సాఫ్ట్ వేర్ కంపనీ లో 6000కోట్ల రూపాయల అదనపు రాబడికి దేశీయ ఐటి కంపెనీల్లో కొత్తగా 26,500 ఉద్యోగాలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు . కారణం ?
ఆటో మేషన్ !
గత ఏడు , 2013-14లో ఐటి కంపెనీలు ప్రతి 6000కోట్ల రూపాయల అదనపు రాబడికి, కొత్తగా కల్పించిన ఉద్యోగాల సంఖ్య కేవలం 13,000 మాత్రమే. అంటే దాదాపు సగం ఉద్యోగాలు తగ్గి పోయాయి . 
 డైనమిక్‌ ఆటోమేషన్‌ కోసం ఐటి కంపెనీలు, ఆటోమేషన్‌ టూల్స్‌, సాఫ్ట్‌వేర్‌ రోబోలను ఉపయోగిస్తున్నాయి. 
తక్కువ స్కిల్‌ ఉండి, చేసినపనే మళ్లీమళ్లీ చేయాల్సిన చోట ఆటోమేషన్‌ ఉపాధిని దెబ్బతీస్తుంది. టెలికామ్‌ రంగంలో స్విచ్‌ బోర్డు ఉద్యోగాలు గల్లంతైన విషయం తెలిసిందే.  
కానీ , యంత్రంపై యాంత్రికంగా పనిచేసే ఉద్యోగాలు గల్లంతైనా, మనిషి తన నైపుణ్యాలను, ఆలోచనా శక్తిని, స్పందనలను ఉపయోగించక త ప్పని రంగాల్లో ఉద్యోగాలను మాత్రం ఎవరూ తగ్గించలేరు.వైద్యం, వ్యవసాయ రంగాల్లో సేవలు, విద్యుత్‌, నీటి సరఫరా వంటి సర్వీసులు వీటిని ఐటితో అనుసంధానం చేయడం ద్వారా కొత్త హైబ్రిడ్‌ రంగాలు ఉనికిలోకి వస్తాయి.
కాబట్టి , ఇంజనీరింగ్ కాలేజీలు డాక్టర్స్ ,నర్సులు ,ఇంకా అన్ని రకాల వృత్తుల వారికీ సాఫ్ట్ స్కిల్స్ నేర్పే సిలబస్ తో కోర్సులు నిర్వహి స్తే వారికీ ఆర్ధికం గా బాగుంటుంది . 

Friday, 10 October 2014

అట్ల తద్ది నోము

అట్ల తద్ది -ఉయ్యాల పండుగనీ, గోరింటాకు పండుగనీ ,చంద్రోదయ ఉమావ్రతం' అనీ సంప్రదాయం చెబుతుంది . 
స్త్రీలలో ఉండే కోరికలు -ముఖ్యం గా మంచి వీర్య వంతుడైన భర్త ,సత్సంతానం కోరుకొంటూ వారి చర్మానికి మంచి చేసే గోరింటాకు పెట్టు కొని , ఆరోగ్యానికి శుభ కర మైన బియ్యం పిండి ,మినప్పిండి కలిపి చే సే అట్ల నే చంద్ర కళా ధరుడైన శివ సమేత గౌరీ దేవికి నివేదన చేసి ,అలాగే కొంత మంది స్త్రీలకూ దాన మనే వాయనం ఇచ్చి ప్రసాదం స్వీకరిస్తారు . 
స్త్రీలకు చెందిన హార్మోనుల పై - చంద్రుడు, కుజుడు , రాహు-కేతువు లు ప్రభావం చూపుతారు . 
ఇడా -పింగళ నాడులలోని ప్రాణ శక్తి ప్రవాహాలు , స్త్రీ గర్భాశయ -అండ కోశాల' పై ప్రభావం చూపే పారా సింప థిటిక్ నరాలు ---- ఇవన్నీ సక్రమ బద్దం గా పనిచేయ డానికి సరైన పోషకాహారం ,ప్రశాంత మైన ఉల్లాసభరిత వాతా వరణం ఉండాలి . 
పండుగలు ,వ్రతాలు చేయడం లో అంతరార్ధం ఇదే . 

Sunday, 5 October 2014

సంక్షేమ పథకాల్లో అనర్హుల ఏరివేతకు బిగ్‌డేటా ఎనలిటిక్స్‌ పరిజ్ఞానం

అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని, అదే సమయంలో ఒక్క అనర్హుడికి కూడా ఇవ్వకూడదన్న లక్ష్యంతో సరి కొత్త టెక్నాలజీని వాడుకోవడానికి నడుం బిగించిన ఆంధ్ర ప్రభుత్వం . 
క్షే త్ర స్ధాయిలో సర్వే, ఆధార్‌ కార్డుతో అనుసంధానం,మిగతా శాఖలతో సరి పోల్చి వడపోత - ఇవన్నీ నిక్కచ్చిగా చేస్తూ  నిజంగా పేదవారా కాదా అన్నదానిపై  విశ్లేషణలు  చేయిస్తున్నారు. 
 పక్కా గృహాల మంజూరు,ఫించన్ లు ,రేషన్ బియ్యం ,ఉచిత ఆరోగ్య సేవలు,ఉచిత ఇళ్ళు -ఇలా ఎన్నో పధకాలు పక్క దారి పట్ట కుండా అవసర మైన అర్హులకు మాత్రమే అందే టట్లు చేయాలని చంద్రబాబు తపన . 
కొంత మంది తమకు 65 ఏళ్ల వయసు లేకపోయినా  పింఛన్లు తీసుకొంటున్నారు . 
అసలు ఈ భూమి మీద లేని సుమారు మూడున్నర లక్షల మంది లబ్ధిదారులు ఉన్నట్లుగా కాగితాలలో చూపించి కొంతమంది   బొక్కేస్తున్నారు .