ప్రతి గ్రామానికి కోవెల ,ఊర
చెరువు, బడి అవసరం .
దేవాలయాలు మానవ పురోగతి లో ఒక మేలి
మలుపు .
వ్యక్తీ వికాస కేంద్రం గా ,సాంఘిక, సాంస్కృతిక కూ డలి గా
గుళ్ళు మానవుడికి సాయం చేస్తున్నాయి .
కష్టాలకు ఓర్చు కొనే మనో దైర్యాన్ని గుడి ఇస్తుంది .
ఎంతో ఉపయోగ పడుతున్న అలాంటి గుళ్ళు ఎలా కట్టాలి ,
మండపం , గర్భాలయం ఏ కొలత ల్లో ఉండాలి ,
ధ్వజ స్తంభం ,బ లి పీటం ఏ విధం
గా అమర్చాలి ,
4 రకాల విగ్రహాలు ఎలా ఎక్కడ ఉండాలి -
ఇలాంటి విషయాలను చెప్పే శాస్త్రం ఆగమ శాస్త్రం .
కానీ ,ఇప్పుడు ప్రతి పేట లో 4 గుళ్ళు కట్టి వాటితో
వ్యాపారం చేస్తున్నారు . ఇది నేరం మాత్రం కాదు .
ఇదీ ఒక రకమైన సేవే .
కానీ, ఆగమ నియమాలను కాదని గుడి
కడితే ఫలితాలు రావు .
గుడి చుట్టూ ఎలాంటి కట్టడాలు ,ఇళ్ళు ఉండ కూడదు .
ప్రతి గుడి కీ పుష్కరిణి ,బ లి పీటం ,ధ్వజ
స్థంబం
ఉండి గర్భాలయం పిరమిడ్ లేదా
శంఖు ఆకారం లో ఉండాలి .
గుడి నిర్మాణం , గర్భాలయ కొలతలు , విగ్రహ ప్రాణ ప్రతిష్ట ,
మంత్రోచ్చారణ ఇవన్నీ వాస్తు
మరియు
శబ్ద శాస్త్రానికి చెందిన విషయాలు
.
విలువలతో కూడిన విద్య నేర్పే గురువులున్న బడి ఉండాలి .
ఎవరు సత్ గురువు?
చెప్పేది ఆచరిస్తూ విద్యార్ధులకు భోధించే వారు సత్ గురువులు.
విద్యార్ధి శారీరక ,మానసిక ,ఆత్మిక ఎదుగుదలకు బడి సాయ పడాలి .
ఆట పాటలు శరీరాన్ని , చదువు విజ్ఞాన వివేక
విచక్షణలను , విలువలు వ్యక్తీ త్వాన్ని అనగా
ఆలోచన సరళిని ,వినయ విధేయతలను సాన పెట్టాలి .
ప్రతి విద్యార్ధి నెలకు మూడు రోజులు
సమాజ సేవ లో పాల్గొనాలి . అనగా చిన్న పరిశ్రమ ,పంట పొలం ,
బ్యాంక్ ,పోస్ట్ ఆపీస్ ,రైతు మార్కెట్ ,గ్రంధాలయం ,ఆసుపత్రి ,పోలీస్ స్టేషన్
,ప్రార్ధనా మందిరం లో పని చేయాలి
.అభాగ్యులకు ,వృద్దులకు వారి దిన చర్యలో సాయ పడాలి .
ప్రతి విద్యార్ధి ఏదో ఒక లలిత కళ లలో
తగు మాత్రం ప్రావీణ్యం సంపాదించాలి .
చెరువు ఎలా ఉండాలి ?
అలాగే ప్రతి ఇంటి వాకిలి లో వాన
నీరు తీసు కొనే ఇంకుడు గుంతని ఏర్పాటు చేసుకోవాలి .
No comments:
Post a Comment