Search This Blog

Tuesday, 8 January 2013

భూమి , బంగారం ,పిల్లల చదువు ,సొంత ఇల్లు ? What is Real Return and How Inflation eats your money

image

మన దేశం లో ప్రజలు  భూమి , బంగారం ,పిల్లల చదువు  ,సొంత ఇల్లు - ఈ  క్రమం లో తమ డబ్బు ని మదుపు చేస్తారు .కొత్త తరం వారు పొదుపు ని తగ్గించి తమ విలాసాలకు ఎక్కువ గా ఖర్చు చేస్తున్నారు .
 చార్ట్ ని గమనిస్తే , పది సంవత్సరాల చక్ర పరిధిలో   బంగారం ధర లో విపరీత మైన పెరుగుదల లేదా చాలా కొద్ది పెరుగుదల ను గమనిస్తాము. 

1970- 80 దశాబ్దం లో 700% పెరుగుదల ఉంటే , 1980- 2000   అనగా 20 సంవత్సరాల  లో  చాల కొద్ది పెరుగుదల 100% మాత్రమే ఉంది . మళ్ళీ 2000 -2010 దశాబ్దం లో 400 %  పెరుగుదల ఉంది . ఈ  పట్టిక గమనాన్ని బట్టి రాబోయే కాలం లో బంగారం పెరుగుదల మరీ ఎక్కువ ఉండదు .
ఏతా వాతా 1970 లో 10గ్రాముల బంగారం ధర 200/- ఉంటే , 2010 లో       10గ్రాముల బంగారం ధర 20000/- ఉంది.
అనగా 40 ఏళ్ళ లో 100 రెట్లు పెరిగింది .

అలాగే భూముల ధరలు చూస్తే - ఉదాహరణకు కృష్ణా డెల్టా లో ఎకరా భూమి ధర 1980 లో 15000/- ఉంటే  అదే భూమి 2010 లో 10 లక్షలు పలుకుతుంది .అనగా 30 ఏళ్ళ లో 70 రెట్లు పెరిగింది .

కోస్తా లో పట్టణ ఇళ్ళ ధరలు పరిశీలిస్తే , 1990 లో గజం 500/- ఉంటే ,2010 లో 30000/- ధర ఉంది . అనగా 20 ఏళ్ళ లో 60 రెట్లు పెరిగింది .

అనగా  వీటి దిగుబడి  ( return) సరాసరి 12%. ద్రవ్యోల్పణం తీసి వేస్తే నికర 
దిగుబడి  ( return) తెలుస్తుంది .
అలాగే షేర్ లలో పెట్టుబడి పెట్టినా 15%  స్థూల  దిగుబడి  (gross return) కన్నా  ఎక్కువ రాదు .

గత 30 ఏళ్ళ లో ద్రవ్యోల్పణం 5 నుండి 10 శాతం ఉండి ,
సరాసరి తీసుకొంటే 8 %  గా నిర్ణయించ వచ్చు .

మన సంపద లేదా   పెట్టు బడి పై నిజమైన రాబడి ఎంత  అనేది  క్రింది సూత్రం తో లెక్క వేయ వచ్చు .
r = is the rate of return  and
 i = is the inflation rate.

బంగారం విషయం చూస్తే --- r = 12% ; ద్రవ్యోల్పణం = 8%.


Inflation in India

నికర దిగుబడి  ( return) = 4% మాత్రమే.
అలాగే షేర్లు ,భూమి ,ఇల్లు -వీటి పై నికర నిజమైన రాబడి  4% లోపే   ఉంటుంది .

మన భార తీయులు బంగారం పై ఎక్కువ పెట్టుబడి పెట్టటానికి కారణం - 
దాని ధర  ఎప్పుడూ పెరుగుతూ  ఉంటుంది .
దానితో  నగలు చేయించు కోవచ్చు .
అవసరానికి తాకట్టు పెట్టి డబ్బులు గా మార్చు కోవచ్చు .

నిజానికి , బంగారం ధర అంతర్జాతీయ విఫణి లో తగ్గి పోతుంది .
మనందరం డాలర్  -రూపాయ్ మారకం పై ఆధార పడి బంగారాన్ని దిగుమతి చేసు కోవడం వలన ,మనకు బంగారం ధర ఎప్పుడూ  పెరుగుతూ ఉన్నట్లుగాఉంటుంది .
కానీ, 1980- 2000 మధ్య , అంతర్జాతీయ విఫణి లో డాలర్ పరంగా బంగారం ధర దారుణంగా పడి పోయింది .
Gold lost its charm as a safety net and fell to about $250 an ounce in 2000 from 700$ in 1980 . 
డాలర్ -  రూపాయ్ మారకం విలువలు , ఆర్ధిక అనిశ్చితి  ,భారతీయుల మనస్తత్వం - ఇవన్నీ బంగారం ధరను వక్రీకరించి మనం ఎక్కువ ధరకు కొనే విధంగా చేస్తున్నాయి .

No comments:

Post a Comment