Search This Blog

Thursday, 27 February 2014

కోస్తా ప్రజలు మారాలి

సుమారు 700 ఏళ్లకు పూర్వం(క్రీ.శకం 1321) ,తుగ్లక్ చేతిలో పరాజయం పొందిన ప్రతాప రుద్రుడు ఖైదీగా ప్రయాణిస్తూ ,నర్మదా నదిలో చేసిన ఆత్మ త్యాగం త్రిలింగ దేశానికి సంబంధించినంత వరకు అతిముఖ్యమైన మొట్ట మొదటి బలిదానం . 
 డిల్లీ సుల్తాన్ లైన అల్లాఉద్దీన్ ఖిల్జీ , ఆ తర్వాత మాలిక్ కాఫర్ ముష్కరుల దాడిని సుమారు 18 ఏళ్ల పాటు వీరోచితం గా ఎదిరించిన కాకతీయలు సైనిక పరం గా ,సంస్కృతి పరం గా , సంపద పరం గా బల హీన మై, చివరకు ఒక విదేశీ ముష్కర తురుష్కుడైన తుగ్లక్ చేతిలో దారుణం గా ఓడిపోయారు . తుగ్లక్ సైన్యం నెలల తరబడి కాకతి రాజ్యాన్ని ,త్రిలింగ దేశాన్ని లూటీ చేసి  టన్ను ల కొద్దీ  బంగారం ,కోహినూర్ వజ్రాన్ని దోచుకు పోయారు .

కాకతీయ రాజులెవరు ? పశ్చిమ కళ్యాణ చాల్యుక్యుల సామంతు లైన వీరు,  అటు  చోళుల  తో ,ఇటు యాదవ రాజులతో చిన్న చిన్న యుద్దాలు చేస్తూ , నెమ్మది నెమ్మదిగా మొత్తం  తెలుగు దేశాన్ని తమ పాలనలోకి తెచ్చుకొన్నారు .
కళలు ,సాహిత్యం, వేయి స్తంభాల గుడి ,రామప్ప గుడి మొదలైన దేవాలయాల  నిర్మాణం ,సంస్కృత భాషకి ఆదరణ, గ్రూప్ లు గా విభజించి నాయకు ల ఆద్వర్యం లో   సైన్యాన్ని నడపటం ,ప్రస్తుత తెలంగాణా ప్రాంతాన్ని ఎక్కువ కాలం పాలించడం -కాకతీయ రాజుల ప్రత్యేకత .
కాకతీయ రాజులు (1083 CE to 1323 CE.) సుమారు 250 ఏళ్ళు పాలించారు . 


Kirti Stambhకాకతీయ శిల్ప ద్వార తోరణం సాంచీ స్తూప తోరణాన్ని పోలి ఉంటుంది .

బహమనీ సుల్తాన్ లు ఎవరు?  రాయలు  Vs  బహమనీ లు 
తుగ్లక్ గవర్నర్ ఐన బహమన్ షా ,అతని వారసులు  గుల్బర్గా రాజధానిగా  చేసిన పాలన విజయనగర  హిందూ సామ్రాజ్య స్థాపనకి ప్రేరణ గా నిలిచింది . రాయలు అనేక యుద్దాలు చేసి క్రమం గా బహమనీ వంశ పాలకులను నాశ నం చేసినా , టర్కీ దేశ స్తులైన 5 గురు బహమనీ తురుష్క  సైన్యాధిపతులు దక్కన్ ప్రాంతం లో అహ్మద్ నగర్ ,బేరార్ , బీదర్, గోల్కొండ, బీజాపూర్ అనే 5 చిన్న రాజ్యాలను స్థాపించు కొన్నారు .

విజయ నగర రాజ్యం ప్రస్తుత కర్నాటక రాష్ట్రం .  ప్రస్తుత రాయలసీమ ప్రాంతం కూడా ఆ రాజ్యం లో ఇమిడి ఉండేది .

ఎక్కడో టర్కీ ,పర్షియా ,గ్రీసు  దేశస్తులు, జిప్సీ ల్లాంటి దొంగలు భారత దేశాన్ని స్వాధీనం చేసు కొని ఇక్కడి సంపదను దోచుకొని ,ప్రజలను ఇబ్బంది పెట్టి యాగీ చేశారంటే దానికి కారణం ఎవరు ? మన ప్రజలా ? మన నాయకులా?

హైదరాబాద్ --- కుతుబ్  షాహీ --- అసఫ్ జాహీ ---రజాకార్ లు ---తెలంగాణా బాంచన్ లు ?
ఇప్పటి మన కధకి  అతి ముఖ్య మైన కీలక ప్రాంతమైన  హైదరాబాద్ కి తొలుత బీజం వే సిన వారు -గోల్కొండ రాజ్యాన్ని 170 ఏళ్ళు పాలించిన కుతుబ్  షాహీ వంశ  స్థులు .
1687 లో ఔరంగ్ జేబ్ దక్కన్ లోని 5 రాజ్యాలను స్వాధీనం చేసుకొన్నా , గోల్కొండ రాజ్యం నెమ్మదిగా అతని గవర్నర్ ఐన అసఫ్ జాహీ చేతిలోకి వచ్చింది .
ని జాం ప్రభువులుగా పేరు పడ్డ అసఫ్ జాహీ వంశ స్థులు నేటి తెలంగాణా ప్రాంతాన్ని ఘోరం గా పాలించారు .
చివరి తరం వాడైన 7 వ అసఫ్ జాహీ రజాకార్ లనే సొంత సైన్యం తో తెలంగాణా వారిని వేపుకు తిన్నాడు .

చరిత్ర తిరగేస్తే మనకు అర్ధం అయ్యేది ఏమిటంటే ,డిల్లీ సింహాసనం ఎంత బలహీనం గా ఉంటే అంత  ఎక్కువగా చిన్న చిన్న రాజ్యాలు పుట్టు కొస్తాయి . చిన్న చిన్న రాజ్యాలుగా దేశం ఎంతగా చీలి పోతుందో అంత  ఎక్కువగా విదేశీ ముష్కరుల దాడి ఎక్కువ అవుతుంది .ఇదంతా ఒక ప్రమాదకర సామాజిక చక్రం .

14 వ శతాబ్దం లో బహమనీలు ,18 వ శతాబ్దం లో అసఫ్ జాహీలు డిల్లీ పాలకులను బెదిరించి సొంత జాగేర్దార్ లా దక్కన్ మరియు తెలుగు ప్రాంతాన్ని పీల్చి పిప్పి చేసి ,ఆయా ప్రజానీకాన్ని రాచి రంపాన పెట్టారు .

మనుషులందరూ ఒక్కటే . కానీ , ఎప్పుడైతే కుటుంబ ఆచారాలు,సంఘ సంప్రదాయాలు , సాంఘిక జీవన విధానం ,మత సంస్కృతి విభిన్న దారులలో సాగుతాయో అప్పుడు ఘర్షణ ఏర్పడు తుంది . ఆ ఘర్షణ తీవ్ర మైనప్పుడు యుద్ధం గా  కదం తొక్కుతుంది . భిన్న సంస్కృతులు కలిసి ఉండాలంటే వాటన్నిం  టినీ కలిపే ఏక సూత్రమ్ ఒకటి ఉండాలి . అది మతం కావచ్చు . దేశ భక్తీ కావచ్చు . కానీ ఎప్పుడైతే విభిన్న కులాలు ,మతాలు ఉన్నాయో వాటినే బలహీనత గా మార్చి ఆయా ప్రజా సమూహాలను విడదీసి పబ్బం గడుపు కొనే వారు ఎప్పుడూ  ఉంటారు .

ఇంకో విచిత్రమైన విషయం గమనించండి . క్రీస్తు పూర్వం  ఆంద్ర ,మహారాష్ట్ర ,కర్నాటక ,మధ్య ప్రదేస్ ,గుజరాత్  -వీటన్నింటినీ ఒకే సామ్రాజ్యం గా పాలించిన శాతవాహన రాజులు కృష్ణ గోదావరి డెల్టా ప్రాంతం వారు . అప్పటి నుండి ఇప్పటి వరకు  డెల్టా ప్రాంతం నుండి ఒక్క రాజు కూడా రాజ్యం స్థాపించ లేదు . ఈ ప్రజాస్వామ్య యుగంలో జాతీయ స్థాయి గల నాయకులూ  పుట్టలేదు ఒక్క ఎన్టిఆర్ తప్ప .

Wednesday, 26 February 2014

రాబోయేది సంకుల సమరం

రాబోయేది సంకుల సమరం . 
 సీమాంధ్రుల మ నోభావాలను ఏ మాత్రం లెక్క చేయకుండా సోనియా కోటరీ నిర్దాక్షిణ్యం గా, రాష్ట్రాన్ని చీల్చు తుంటే
సిగ్గు ఎగ్గు లేని కాంగ్రెస్ నాయ కులు చొంగలు కార్చు కొంటూ పదవులను జలగ ల్లాగా  పట్టుకొని ,సరైన సమయం లో అభ్యంతరాలు తెలప కుండా సీమాన్ధ్ర ప్రజలను దారుణం గా మోసం చేశారు .
ఇప్పుడు మంచి పాకేజీలు ఇప్పిస్తామని  మళ్ళీ కల్లబొల్లి కబుర్లు చెపుతున్నారు . వీళ్ళని నమ్మటానికి ఇంకా ఆంద్ర రాష్ట్రం లో వెర్రి వెంగలాయి లున్నారా ?
కులాలుగా ,వర్గాలుగా చీల్చడానికి కాంగ్రెస్ అధినాయకత్వం నడుం కడుతుంటే పదవుల కోసం వెంపర్లా డుతూ డిల్లీ చుట్టూ తిరుగుతున్న ఈ నాయకులను ఇంకా మీరు ఉపేక్షిస్తే ఆంద్ర జాతిని , సాంఘిక వారసత్వాన్ని ఎవరూ కాపాడ లేరు .
 కులాల పరం గా మనుషులను చీల్చడం రాష్ట్రాన్ని చీల్చడం కన్నా ఘోరమైనది. 

Monday, 24 February 2014

తన్ను కోకండిరా . కష్ట పడి పనిచేయడం మొదలెట్టండ్రా

అటు ప్రజలు,ఇటు నాయకులు రాజధాని కోసం తన్నుకొంటు న్నారు .
జరిగిన విభజన ను అడ్డుకో లేకపోయిన  వీరి పౌరుషం ఇప్పుడు తమ ప్రాంతమే రాజధాని అవ్వాలని పరవళ్ళు తొక్కుతుంది .
తలకు 25000 రూపాయల అప్పుతో 5కోట్ల సీమాన్ద్రులు   తల్ల దిల్లుతూ  దిక్కులేని అనాధల్లా మిగిలి పోవడానికి కారణం ఎవరు ?
తెల్ల కాలర్ ఉద్యోగాలు చేసే వాళ్ళలో 60శాతం సీమాంధ్ర కి చెందిన వారే . ఇప్పుడు వారంతా ఒక క్రమ పద్దతిలో హైదరాబాద్ ని వదిలి సీమాంధ్ర కి తిరిగి రావలసిందే .
విద్యార్ధులకి ఉపాది అవకాశాలు లేక రోడ్లు పట్టవలసిన దుస్థితి .
సరే . ఇలాంటి మాటలు చెప్పీ చెప్పి విసు గోచ్చేసింది .
ఇప్పటి కైనా కళ్ళు తెరిచి , ఆఫేసు లన్నీ ఒకే చోట కుప్ప పోయకుండా, అభివృద్ధి వికేంద్రీ కరణ ద్వారా   అన్ని జిల్లాలు అభివృద్ధి చెందే టట్లు చూడాలి .

నేటి  సమాచార విప్లవ కాలంలో దూరాలకు సంబంధం లేకుండా ఆడియో -విడియో సమావేశాలను చక్కగా నిర్వర్తించు కోవచ్చు . అలాగే ఉద్యోగులను కూడా నెమ్మది గా క్రమ పద్దతి లో తగ్గించు కోవచ్చు .

హైకోర్టు మరికొన్ని న్యాయ వ్యవస్థకి సంబంధించిన కార్యా లయాలు గుంటూరు  జిల్లాలో ,
వ్యవసాయం,పశువుల,కోళ్ళ ,చేపల పెంపకానికి సంబంధించిన ఆఫీసులు
నెల్లూర్ ,  తూర్పు- పశ్చిమ గోదావరి లో ,
భారీ పరిశ్రమలు, సముద్రయాన ,నౌకా నిర్మాణ పరిశ్రమల ఆఫీసులు తీరం వెంబడి ,
జల విద్యుత్ ,ధర్మల్ విద్యుత్ , అణు విద్యుత్ ఆఫేసులు ఆయా పరిశ్రమలున్న చోట ,
చేనేత ,హస్త కళా కారీ మొదలగు కుటీర పరిశ్రమలు ఆయా గ్రామాలకు దగ్గరలోని మండల కార్యాలయాలలో ,
చిన్నతరహా ,మధ్య తరహా పరిశ్రమల ఆఫీసులు అనంతపూర్ లో ,
జలరవాణా,రోడ్ రవాణా ఆఫేసులు విజయవాడ లో ,
ఇరిగేషన్ ,మురుగుపారుదలకి సంబంధించిన ఆఫీసులు శ్రీశైలం లో ,
 గనుల శాఖ ఆఫీసులు కర్నూల్ లో ,
వ్యవసాయ పరిశ్రమల ఆఫీసులు చిత్తూర్ లో ,
ఆయుధ పరిశ్రమల ఆఫీసులు కడపలో ,
ఇలా ఆయా కార్యాలయాలు వాటికీ  సంబంధించిన పరిశ్రమలకు దగ్గరలో ఏర్పాటు కావాలి .

సీమాంధ్ర లో దరిదాపు 100 ఇంజనేరింగ్ కాలేజీలు మూత పడే స్థితిలో ఉన్నాయి . కేంద్ర ప్రభుత్వం వాటిని కొని , వివిధ కార్యాలయాలకు అనుగుణం గా తీర్చి దిద్దు కోవచ్చు .
అలాగే నాగార్జున విశ్వ విద్యాలయాన్ని సెక్రటేరియట్ గా మలచు కోవచ్చు .




Sunday, 23 February 2014

కాంగ్రెస్ ని తరిమి కొట్టండి .

సీమాంధ్ర నాయకులు పూర్తిగా మారాలి. అంటే ప్రజలు, పనిచేసే కొత్త యువ నాయకులను రాబోయే ఎన్నికలలో పార్టీలకు అతీతం గా గెలిపించాలి . ఇప్పటికే పెండింగ్ లో ఉన్న అనేక భారీ ప్రాజక్ట్ లను యుద్ద ప్రాతి పాదిక పై పూర్తి  చేయాలి .
రాష్ట్ర విభజన కి కారణ మైన రాజకీయ నాయకులు  ముఖ్యం గా అవినీతితో మకిలి పట్టిన కాంగ్రెస్స్  MP &MLA లను సమాజ బహిష్కరణ చేసి చిత్తు చిత్తూ గా ఓడిమ్చకపోతే తెలుగు వారి కర్మని దేవుడు కూడా బాగు చేయలేడు .


Wednesday, 19 February 2014

తెలుగోడి తొలి దెబ్బ

ఇంతకు  ముందే  వాగ్దానం చేసినందు వల్ల , తెలంగాణా నాయకుల సుదీర్ఘ పోరాటం వల్లే తెలంగాణా ను ఇవ్వ వలసి వస్తుందని చెబుతున్నాయి రాజకీయ పార్టీ లన్నీ .
అంటే, వేల మంది పోరాటం చేస్తే కోట్ల మందికి నష్టం కలిగే విధం గా రాష్ట్రాలను ముక్కలు చేస్తారా?

రాష్ట్రాల విభజన విషయం లో ఆయా రాష్ట్ర శాసన సభ ల అభిప్రాయానికి విలువ లేదా?
అతి ముఖ్యమైన రాష్ట్రాన్ని విభ జించె విధా నం ఇదా ?
దొడ్డి దారిన ,చాటుమాటు గా ,మీడియాకి గంత లు కట్టి నియంతృత్వ పోకడలతో పార్లమెంటు లో బిల్లు పాస్ చేసే స్తారా ?
రాష్ట్ర పార్లమెంట్ సభ్యుల నోరు నొక్కేసి,ప్రజలలో ఉన్న భయాలను నివృత్తి చేయకుండా కేంద్రం ఇష్ట మొచ్చి నట్లు చేయ వచ్చా ?

రాజ్యాంగ బద్దం గా నే చేస్తున్నాము . ఇందులో పెద్ద తప్పేమీ లేదు . అందరికీ న్యాయం జరగడం అసాధ్యం -- ఇదీ కేంద్రం, కాదు సోనియా కోటరీ వాదన.

ప్రతి దశలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ సాగిన విభజన పద్దతి ,చివరకు లోక్ సభ లో ప్రధాన ప్రతి పక్షం తో కుమ్మక్కై 6కోట్ల తెలుగు వారిని నిర్భాగ్యులను చేసిన సోనియా ప్రభుత్వం దీనికి మూల్యం చెల్లించు కోవాలి .
6కోట్ల తెలుగు వారి ఉసురు ఊరకే పోదు .

కేంద్రం దగ్గర పైసలు లేవు . అప్పుల ఊబిలొ కూరుకు పోయిన కేంద్రం ఇచ్చే హామీలు నీటి మూటలు .
 వాటిని నమ్మేంత వెర్రోల్లు కాదు తెలుగోళ్ళు .

ఓట్లు సీట్ల లెక్కలు వేసుకొన్నారు గానీ ప్రజల లో ఉన్న భయాన్ని ,అభద్రతను లెక్కచేయ లేదు .
అభివృద్ధి లో దూసుకు పోతున్న రాష్ట్రాన్ని ప్రకృతికి , భౌగోళిక స్థితికి విరుద్దం గా ముక్కలు చేస్తే జ రగ బోయే ఆర్ధిక,హార్దిక విపత్కర పరిణామాలు తెలిసీ ఇలా చేస్తారా ?

సోనియా గానీ,రాహుల్ గానీ కనీసం ప్రజానాయకులతొ ,విద్యార్ధి - ఉద్యోగుల నాయకులతో ,ఇతర  పార్టీ నాయకులతో మాట్లా డారా ?  లేదే .
 లోక్ సభలో బిల్లుని పెట్ట లేదన్న సుష్మా స్వరాజ్ రెండో రోజు అదే బిల్లుని ఎలాంటి  సవరణల కోసం పట్టుబట్ట కుండా ఎలా ఆమోదించారు ?
అంటే  అహంకార పూరిత రాజకీయం చేసి భారత దేశ  ప్రగతిని నాశనం చేసి ,దేశాన్ని విచ్చిన్నం  చేసే ఎజండా తో ముందుకు సాగుదా మను కొంటున్నారా ?
కాంగ్రెస్స్ ముద్దర ఉన్న ప్రతి రాజకీయ నాయకుడిని సమాజ బహిష్కరణ చేయాలి . 
ఇదే తెలుగు వారి తొ లి దెబ్బ గా రుచి చూపించాలి . 

Tuesday, 18 February 2014

నేటి భారతం

రెండు సమాంతర ఆర్ధిక వ్యవస్థలు న్న దేశం మహా ప్రమాద కరమైన అశాంతి కి దారి తీస్తుంది . 

నల్ల ధనం, యాంత్రీకరణ , కార్పోరేట్ ఆక్రమణ లు , విదేశీ పెట్టుబళ్ళు  ఒక వైపు 
తెల్ల ధనం , చేతి పనివారి కూలీ రేట్ల  పెరుగుదల , కూలీ చెల్లించలేని స్థితిలో రైతులు , దేశం చేసిన అప్పులతో సంక్షేమ కార్యక్రమాలు,ఉత్పాదకత లేకుండా అప్పులు   -ఇదీ నేటి భారత ఆర్ధిక దుస్థితి . 

భారత దేశం లో మనుషులకు పని లేదు . నిజం చెప్పా లంటే పని దొరకడం లేదు . ఎప్పుడైతే పని లేదో రకరకాల అవాంఛ నీయమైన కార్య క్రమాలు పెచ్చరిల్లుతాయి . 
మన దేశ ఆర్ధిక పునాదులు విదేశీ పెట్టు బడులపై న , కార్పోరేట్ కంపెనీలు చెల్లించే పన్నుల పైనా ఆధారపడి ఉన్నాయి . 
కార్పోరేట్ కంపెనీలు  బలం గా ఉండాలంటే తక్కువ జీతాలకు పని చేసే శ్రామికులు కావాలి . లేదంటే వారు భారీ యంత్రాలపై న ,ఆటోమేషన్ పైన ఆధార పడతారు . 

 విదేశీ పెట్టుబడుల ఆధారంతో కార్పొరేట్ కంపెనీల సారథ్య ంలో ఆర్థికాభివృద్ధిని సాధించడమనే అభివృద్ధి నమూనాను మనం అనుసరిస్తున్నంతవరకు మనం మన లక్షలాది యువజనులకు ఉద్యోగాలను సృష్టించలేము; ఉపాధి అవకాశాలను పెంపొందించలేము. 
కార్పొరేట్ కంపెనీలు చెల్లించే పన్నుల నుంచి సమకూరే ఆదాయాన్ని ఉద్యోగాల సృష్టికి ఉపయోగించవచ్చునని ప్రస్తుత అభివృద్ధి నమూనా విశ్వసిస్తోంది. అయితే ఇది తప్పుడు భావన. 
కార్మికులను వీలైనంతవరకు తగ్గించుకొని, ఉత్పత్తి కార్యకలాపాల్లో గరిష్ఠంగా స్వయంచాలక యం త్రాలను ఉపయోగించుకోవడం ద్వారా మాత్రమే కార్పొరేట్ కం పెనీలు పన్నులను చెల్లించగలుగుతాయి.

రెండంకెల వృద్ధి రేట్లను సాధించడానికి మన ప్రణాళికాకర్తలు, పాలకులు ఆరాటపడుతున్నారు. నిజానికి వృద్ధిరేట్లు అధికంగా ఉండడమనేది ఉద్యోగాల సృష్టికి దోహదం చేయదు. అందుకు భిన్నంగా శ్రమ శక్తితో పెద్దగా ప్రమేయం లేకుండా స్వయంచాలక యంత్రాలతో ఉత్పత్తి కార్యకలాపాలను నిర్వహించే కంపెనీలపై భారీ పన్నులు విధించాలి. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు తగ్గినప్పటికీ ఉద్యోగాల సృష్టికి గణనీయమైన దోహదం సమకూరుతుంది. 

దేశ  ఆర్ధిక వృద్ధిరేట్లు అధికంగా ఉండడమనేది ఉద్యోగాల సృష్టికి దోహదం చేయదు.ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం మరింతగా పెచ్చరిల్లిపోతోందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) పేర్కొంది. దీనికి నివారణ -

  • ఉద్యోగాల లభ్యతకు సంబంధించిన సమాచారాన్ని కార్మిక విపణిలోకి ప్రవేశించిన వారికి సమకూర్చాలి .
  • ఉపాధికి దోహదం చేసే నైపుణ్యాలలో శిక్షణ దేశ వ్యాప్తం గా అమలు చేయాలి . 
  • కొత్త ఉద్యోగాల సృష్టికి ఆర్థిక సహాయం : స్వయం ఉపాధి కార్యక్రమాలకు మన ప్రభుత్వాలు ఆర్థిక సహాయాన్ని అందించాలి . 
  • ఉద్యోగాల సృష్టికి ఏకైక మార్గం నేత మొదలైన శ్రమాధిక్య  రంగాలలోకి ప్రవేశించకుండా కార్పొరేట్ కంపెనీలపై ఆంక్షలు విధించడమే. తద్వారా చేనేతరంగంలో చాలా పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగాలను సృష్టించవచ్చు. 
  •  శ్రమ శక్తితో పెద్దగా ప్రమేయం లేకుండా స్వయంచాలక యంత్రాలతో ఉత్పత్తి కార్యకలాపాలను నిర్వహించే కంపెనీలపై భారీ పన్నులు విధించాలి. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు తగ్గినప్పటికీ ఉద్యోగాల సృష్టికి గణనీయమైన దోహదం సమకూరుతుంది - 

Friday, 14 February 2014

బ్రిటిష్ వారిని పారద్రోలి మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన్దెవరు ?

బ్రిటిష్  వారిని పారద్రోలి మన  దేశానికి స్వాతంత్రం తెచ్చిన్దెవరు ? 

మహాత్మా గాంధీ  భావ జాలమా ? సుభాష్ బోస్ తెంపరి తనమా ? భగత్సింగ్,వీర్ సావర్కర్ ,అల్లూరి సీతారాం రాజు లాంటి విప్లవ కారుల ఉద్వేగ భరిత పోరాటమా ?1942 యుద్దంలో లో జపనీయుల చేతిలో దెబ్బ తిని సింగపూర్ ని వదులుకోవలసి రావడ మా ?

ఒక చారిత్రిక సంఘటన,ఏదో ఒక్క  కారణం లేదా ఏదో  ఒక్క వ్యక్తి  వల్లే అది జరిగిందని అనుకోవడం అమాయకత్వం . ఎన్నో భావ జాలాలు మనుషులను రగిలించి ఒకే  లక్ష్యం తో ముందుకు నడి పిస్తే నే , తిరుగుబాటు గానీ విప్లవాలు గానీ విజయం సాధిస్తాయి . 

దెబ్బకి దెబ్బ,కన్నుకి కన్ను ,అన్యాయాన్ని ఎదుర్కొనే క్రమం లో కొన్ని ప్రాణాలు పోయినా బెదరక,అదరక నమ్మిన  గమ్యం వైపు సాగడ మే ఉగ్రవాదం . 

1857లో సిపాయ్ తిరుగుబాటు ,    భగత్సింగ్,వీర్ సావర్కర్ ,అల్లూరి సీతారాం రాజు లాంటి విప్లవ కారుల  గెరిల్లా యుద్దాలు , బోస్ ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చి ఏర్పాటు చేసిన  ఆజాద్ హింద్ ఫౌజ్ -  భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో  ఇలా ఎన్నో రోమాంచిత సంఘటనలు ... 

ఎందరో రచయితలు తమ కలాలను   మరిగే రక్తం లో ముంచి వ్రాసిన అక్షరాలు  ఒక్కోటీ సామాన్యుని గుండెల్లో స్వాతంత్రం తమ జన్మ హక్క నే కాంక్ష ని రగిలించాయి . 

బారత దేశ  సాంస్కృతిక వారసత్వ మైన అహింస,సత్యాగ్రహం,సహనం,శీలం -వీటినే ఆయుధాలుగా మలచు కొన్న భావ జాలానికి మహాత్మా గాంధీ ఒక బల మైన ఆలంబన గా నిలిచి ,వేలాది రాజ కీయ నాయకులకు,వందలాది సామాజిక కార్య కర్తలకు ,కోట్లాది సామాన్య జనులకు స్పూర్తి ప్రదాత గా  నిలిచి  జాతి పితగా అమరుడయ్యా డు.
లాల్,బాల్ ,పాల్ ;ఇంకా ఎందఱో చరిత్ర కె క్కని నాయకులు,వారి జీవితాలను,కుటుంబాలను  పణం  గా పెట్టి అమరులయ్యారు .

 గాంధీ, భారతీయులలో దేశ భక్తీ రగిలించి,మనుషు ల్లో మానసిక పరివర్తన కలిగించి ఎన్నో రాష్ట్రాలు,రాజ్యాలు , కులాలు,మతాలుగా చీలిపోయున్న సమాజాన్ని ఒక తాటి పైకి పట్టుకొచ్చాడు .  భారత ఉపఖండం లో ఐక్యతా రాగాన్ని శృతి చేసి అందరిలో స్వతంత్ర కాంక్షని రగిలించి సమాజమంతా ఒకే నినాదం తో కదిలే విధం గా జనాన్ని నడిపి బ్రిటిష్ వారి గుండెలను కదిలించాడు . 

Thursday, 13 February 2014

తప్పెవరిది ?

ఇటలీ  నుండి వచ్చి , సుదీర్ఘ ఘన చరిత్ర ఉన్న అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని శాసించే స్థితి కి ఓ వ్యక్తి చేరు కొందీ అంటే ఎంతో సామర్ధ్యం, అద్రుష్టం ఉండాలి .
 చదువు,ఇంగిత జ్ఞానం లేనితనం ,దేశ ప్రజల మనోభావాలపై ఎలాంటి గౌరవం లేని తెంపరితనం ,
దేశం ఏమై పోయినా తన బిడ్డ బాగుంటే చాలను కొనే స్వార్ధం,దేశ ద్రోహానికి నిర్లజ్జ గా పాల్బడే రాజకీయుల ను వాడుకొనే మాఫియా మనస్తత్వం - ఇవే ఆ వ్యక్తి సామర్ధ్యం.
దేశ  భక్తి లేని విద్యావంతులు,దేశ ప్రజల అలసత్వం,సోమరితనం, -ఈ దయనీయ దౌర్భాగ్య  ప్రజల పరిస్థితిని అవకాశం గా ,అద్రుష్టం గా మలచు కున్న తీరు దేశ చరిత్ర లో ఓ చీకటి అధ్యాయం.

ఫక్తు ఉద్యోగి మనస్తత్వం ,జీహుజూర్ అనే బానిసతనం ,దేశ మంటే ఎలాంటి భక్తీ ,దయ లేని కార్పణ్యం , ఓ  విద్యావంతున్ని ఎంతగా దిగ జార్చు తాయో  దేశ ప్రధాన వ్యక్తీ ని చూస్తే తెలుస్తుంది .
25కోట్ల మంది పేద వారున్నారని  ప్రణాలికా లెక్కలు చూపిస్తుంటే ,80కోట్ల మందికి ఆహార భద్రతా హక్కు చట్టం చేసి లక్ష కోట్ల ధనాన్ని రాజకీయ పందికొక్కులకు పంచి పెట్టాలని ప్రణాళిక రచించిన కుహనా ఆర్ధిక వేత్త ,
2జి వేలం లో లక్ష కోట్ల నష్టం దేశానికి వచ్చినా చీమకుట్టని వ్యక్తి ,
ఈ పది ఏళ్లలో పది లక్షల కోట్ల దేశ సంపద నల్ల బజారుకి దోచబడినా ఏ  మాత్రం చలించని గుండె లేని భీరువు ,
తన కుర్చీ కిందే ,వందలాది కుంభకోణాలు జరుగుతున్నా రెప్పకూ డా వేయని మరమనిషి --- ,
అలాంటి వ్యక్తిని పది ఏళ్ల సుదీర్ఘ అందలం ఎక్కించడం భారతీయుల చేతగానితనం కాదా?

ఓ దగుల్బాజీ పది మందిని పోగేసుకొని రాష్ట్రాన్ని ముక్కచేక్కలు చేద్దాం రా రమ్మంటే ,ఓ పది సీట్లు గంప గుత్తం గా  గెలవ వచ్చనే దురాశ  తో  ఓ వికృత రాజకీయ పార్టీ రాష్ట్ర శాసన సభ ని కూడా బే ఖాతర్ చేస్తూ ,పార్లమెంట్ నియమాలను కాల రాస్తూ 10కోట్ల తెలుగు వారిని విభజించి నంచు కోవాలని రంకె లేస్తుం టే ,తెలుగు ప్రజలు టి వి ల్లో సినిమా చూస్తున్నారు గానీ,లేచి పిడికిలి ఎత్తడం లేదు .

తల్లి తెలంగాణా బిడ్డలను ,సీమాన్ధ్ర అన్నలను కూచుండ బెట్టి పంపకం చేయాల్నా ,వద్దా ? చేస్తే ఎలా చేయాల ? మీకెం కావాలి?మీరెం వదుల్తారు ? ఇలా సామ రస్యం  గా  గొడవ ని తీర్చాల . అంతే గానీ వంద గొడవలను నెత్తిమీన రుద్ద కూడదు .

తప్పుడు పనులు చేసే ఛండాలపు పార్టీ, భయంకర అప్రజా స్వామిక  విధానాలతో అన్ని వ్యవస్థలను బుల్ దోజ్ చే స్తూ ఏదో కక్ష కట్టి నట్టు ఒక ప్రాంత ప్రజల భయాలను,అపోహలను,మనోభావాలను తుంగలో తొక్కి సుభిక్షం గా అలరారుతున్న రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిందీ అం టే తప్పెవరిది ? 

Friday, 7 February 2014

రధ సప్తమి -సనాతన భారత కాల వి జ్ఞాన ధార .

Surya Namaskaraపిల్లలు,పెద్దలు  నిత్యం సూర్యోదయ  వేళలో ఈ బొమ్మలో చూపిన విధం గా సూర్య నమస్కార వ్యాయామం చేస్తే , వారు  హాస్పిటల్స్ కి వెళ్ళే పని ఉండదు . 
నువ్వుల నూనె శరీరానికి పట్టించి ,ఆర్క పత్రం (జిల్లేడు ఆకులు ) మన శరీరానికి తగిలించు కొని స్నానం చేయడం రధ సప్తమి నాడు ఆచరించ వలసిన విధి . 
సూర్య దేవుని పుట్టిన రోజు గా, వివస్వంత మన్వంతరానికి నాంది గా మాఘ శుద్ద సప్తమి ని ఓ పండుగ గా భారత ప్రజలు జరుపుకొంటారు . అలాగే  ఈ రోజే వసంత రుతు ప్రవేశం. పల్లెల్లో పంట కోత  కొచ్చే సమయం .
చంద్రుడు భూమి చుట్టూ ,భూమి సూర్యుని చుట్టూ,సూర్యుడు ధ్రువ నక్షత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తాయి .
 
భూమి సూర్యుని చుట్టూ చేసే ప్రదక్షిణ మార్గ మే  సూర్య రధ మార్గం . రధ సప్తమి నాడు ఆ రధం ఉత్తర దిక్కుగా మలుపు తిరుగుతుంది .
సూర్యుని గమనం,భూ భ్రమణ-పరిభ్రమణ లే కాలానికి కొ ల మానాలు .
సనాతన ఋషులు కాలాన్ని ఎంత సూక్ష్మం గా కొలిచారొ మన విద్యార్ధులు అర్ధం చేసుకోవాలి .
మన సౌర కుటుంబం  వయస్సు 500 కోట్ల సంవత్సరాలు .
బ్రహ్మ కాలంలో ఒక పగలు ని కల్పం  అని అంటారు . ప్రస్తుత కల్పం వయస్సు 500 కోట్ల సంవత్సరాలు .
కల్పం ప్రారంభం లో ,భూమి ని హిరణ్యాక్షుడు తీసుకెళ్ళి కాస్మిక్  అంతరాళం లో (సముద్రం లో) దాస్తాడు .
  సృష్టి ని ప్రారంభించ డానికి  భూమి లేక పోయే సరికి,బ్రహ్మ,  విష్ణువు ని ప్రార్ధన చేయగా , శ్రీ మహా విష్ణువు శ్వేత వరాహ రూపం లో హిరణ్యాక్షుణ్ణి  సంహరించి భూమిని మరల దాని స్థానం లో నెలకొల్పుతాడు . అందుకే ఈ కల్పాన్ని శ్వేత వరాహ కల్పం అని అంటారు .

ఒక కల్పం = 14 మన్వంతరాలు
ఒక మన్వంతరము = 72 చాతుర్ యుగాలు
ఒక చాతుర్ యుగము = 43 లక్షల సౌర లేదా మానవ సంవత్సరాలు.

ఒక కల్పం లో 14 మన్వంతరాలు ఉంటాయ్ . అనగా బ్రహ్మకి పగలు అంటే 14 బ్రహ్మ గంటలు అని గుర్తు పెట్టుకోండి.
ఒక మన్వంతరం లో 72 చాతుర్ యుగాలుంటాయి . అనగా బ్రహ్మకి ఒక గంటకి 72  బ్రహ్మ నిమిషాలు అని గుర్తు పెట్టుకోండి.
అంటే ,బ్రహ్మ కి ఒక నిమిషం అంటే , ఒక చాతుర్ యుగము . అంటే సుమారు 43 లక్షల సౌర లేదా మానవ సంవత్సరాలు.


  • ఎందుకు సూర్యుడు ఉత్తర దిక్కు (ఉత్తరాయణం )మరియు దక్షిణ దిక్కు గా ప్రయాణం చేస్తున్నట్టు కన్పిస్తాడు 

 సూర్యుని చుట్టూ, భూమి కొద్దిగా వంగి తిరుగుతూ ఉండటం వలన.
ఇలా ఒక పక్కకు వంగి ఉన్న భూమి పై పడే సూర్య కిరణాల హెచ్చు తగ్గుల వలన  6 ఋతువులు ఏర్పడ్డాయి .


  • మనం ధ్రువ నక్షత్రం గా చెప్పు కొనే తార దేనిని సూచిస్తుంది ?  విశ్వం (galaxy)యొక్క కేంద్రాన్ని . దీనినే మన ఋషులు పరమ పదం అన్నారు. మేరు పర్వతం ధ్రువ నక్షత్రాన్ని చూ స్తూ ఉంటుంది . సూర్యుడు మేరు పర్వతం చుట్టూ తిరుగుతున్నట్లు వేద ఋషులు వర్ణించారు . అనగా సూర్యుడు విశ్వ కేంద్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు .


సూర్యుని ఆకర్షణ శక్తి వలనే గ్రహాలు ఏర్పడ్డాయి . గ్రహాలు  గతి తప్పక పరిభ్ర మించడానికి  కారణం సూర్యుడే .
సూర్యుని వ్యాసం మన భూమి వ్యాసానికి 108 రెట్లు . అలాగే, భూ -సూర్యుల కి మధ్య దూరం ,సూర్య వ్యాసానికి 108 రెట్లు .మన రాశి  చక్రం ను  108 నక్షత్ర పాదాలుగా విభజించారు .అందుకే  108 సంఖ్య కి అంత  ప్రాముఖ్యత .

ఏక చక్రరధం తో , 7 గుర్రాలతో ,14 బృందాల దేవతలు,మునులు,యక్షులు,60 వేల వాలఖిల్యులు  ప్రార్ధనలు చేస్తూ ఉంటుంటే ,అరుణుడు సారధిగా నడుస్తున్న సూర్యుడే  మన భూమండ లానికి సంభందించి నంత వరకు ప్రత్యక్ష దేవుడు . ఇదే మన కాలచక్రం . దీనినే సూర్య రధం అని పిలుచు కొంటాం .
భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్య నే ఏక చక్రం అని ,కాంతి లోని 7 వర్ణాలను 7 గుర్రాలని , సూర్య మండలాన్ని ఆవరించి ఉన్న అయస్కాంత వలయం(magnetosphere) నే సారధి అరుణుడు అని వర్ణించారు . సూర్యుని తెల్లటి కాంతి సారధి ద్వారా పయనించి 7 రంగులుగా మన భూమిని తాకుతుంది .
మేరు పర్వతం ఊహా ? నిజమా? 
మేరువు వేరు . మేరు పర్వతం వేరు .
భూమి ఇరుసు లేదా అక్ష రేఖ నే మేరువు(earth axis) అని పురాణాలలో వర్ణించారు . ఆ అక్ష రేఖ పైనే ఉత్తర ధృవం లో మేరు పర్వతం ఉంది . ఆ పర్వతం సూటిగా ధ్రువ నక్షత్రాన్ని చూడటం వలన ఆ ప్రాంతం లో దేవ భూములు ఉంటాయని అక్కడ దేవతలు,స్వర్గం ఉంటాయని పురాణాలలో వర్ణించారు .
25   కోట్ల ఏళ్ల క్రితం మన ఖండాలన్నీ కలిసి ఒకే పెద్ద ఖండం గా(pangea) ఉండేవి . ఇలా ప్రతి 25 కోట్ల ఏళ్లకు ఖండాలు విడిపోవడం ,కలవడం చేస్తాయి(plate tectonics).

సనాతన నాగరికత . 
రెండు లక్షల ఏళ్ల  క్రితం మానవ జాతి ప్రస్తుతం ఆఫ్రికా అని పిలుచు కొనే పెద్ద ఖండం లో పురుడు పోసుకొని కాల క్రమేణా ఆహార అందుబాటు ,వాతావరణ పరిస్థితుల కు అనుగుణం గా వర్వేరు ప్రదేశాలకు వలస పోయింది . అలా వలస వచ్చి న వారు అత్యధిక శాతం భారత దేశం ముఖ్యం గా ప్రస్తుత ఆప్ఘనిస్తాన్,పాకిస్తాన్,ఇరాక్,ఇరాన్ ,ప్రాంతాలలో స్థిర పడింది . 3000 ఏళ్ల క్రితం ఇరాక్ నుండి ప్రస్తుత ఇండియా ,బర్మా ,థైలాండ్ ,మలేసియా,కంబోడియా ,ఇండోనేసియా వరకు భారత వర్ష మే .   భూమండలం లోనే మొట్ట మొదటి నాగరికత ఈ భారత వర్ష ము లోనే  అభివృద్ధి చెంది నాలుగు దిక్కులా పాకింది .

మరి కొంత మంది అప్పట్లో  గా  నివాస యోగ్యం గా ఉన్న  ఉత్తర ధ్రువ ప్రాంతానికి ,మరి కొంత మంది గ్రీకు,మొదలగు యూరప్ ప్రాంతానికి,దక్షిణ అమెరికా ,ఆస్త్రే లియా కి వలస వెళ్లి స్థిర పడ్డారు . 

Sunday, 2 February 2014

ఏ లిన నాటి శ ని దోషానికి పరిహారాలు. how to remove the 'Sani' dosham?

  • Do not spend all your energy (money, attention) at once. Save.
  • Improve your skills -- whether as a brain surgeon or short order cook -- it does not matter.
  • Learn the value of learning through repetition.
  • It is better to dig one deep hole (to make a well) than one hundred shallow holes.
  • Be centered and mentally steady. Meditate. Pray.
  • Be self-sufficient. Do not count on others too much.
  • Complaining as an occasional pastime is OK. Many make it into a lifestyle. Don't do it.