Search This Blog

Friday, 14 February 2014

బ్రిటిష్ వారిని పారద్రోలి మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన్దెవరు ?

బ్రిటిష్  వారిని పారద్రోలి మన  దేశానికి స్వాతంత్రం తెచ్చిన్దెవరు ? 

మహాత్మా గాంధీ  భావ జాలమా ? సుభాష్ బోస్ తెంపరి తనమా ? భగత్సింగ్,వీర్ సావర్కర్ ,అల్లూరి సీతారాం రాజు లాంటి విప్లవ కారుల ఉద్వేగ భరిత పోరాటమా ?1942 యుద్దంలో లో జపనీయుల చేతిలో దెబ్బ తిని సింగపూర్ ని వదులుకోవలసి రావడ మా ?

ఒక చారిత్రిక సంఘటన,ఏదో ఒక్క  కారణం లేదా ఏదో  ఒక్క వ్యక్తి  వల్లే అది జరిగిందని అనుకోవడం అమాయకత్వం . ఎన్నో భావ జాలాలు మనుషులను రగిలించి ఒకే  లక్ష్యం తో ముందుకు నడి పిస్తే నే , తిరుగుబాటు గానీ విప్లవాలు గానీ విజయం సాధిస్తాయి . 

దెబ్బకి దెబ్బ,కన్నుకి కన్ను ,అన్యాయాన్ని ఎదుర్కొనే క్రమం లో కొన్ని ప్రాణాలు పోయినా బెదరక,అదరక నమ్మిన  గమ్యం వైపు సాగడ మే ఉగ్రవాదం . 

1857లో సిపాయ్ తిరుగుబాటు ,    భగత్సింగ్,వీర్ సావర్కర్ ,అల్లూరి సీతారాం రాజు లాంటి విప్లవ కారుల  గెరిల్లా యుద్దాలు , బోస్ ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చి ఏర్పాటు చేసిన  ఆజాద్ హింద్ ఫౌజ్ -  భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో  ఇలా ఎన్నో రోమాంచిత సంఘటనలు ... 

ఎందరో రచయితలు తమ కలాలను   మరిగే రక్తం లో ముంచి వ్రాసిన అక్షరాలు  ఒక్కోటీ సామాన్యుని గుండెల్లో స్వాతంత్రం తమ జన్మ హక్క నే కాంక్ష ని రగిలించాయి . 

బారత దేశ  సాంస్కృతిక వారసత్వ మైన అహింస,సత్యాగ్రహం,సహనం,శీలం -వీటినే ఆయుధాలుగా మలచు కొన్న భావ జాలానికి మహాత్మా గాంధీ ఒక బల మైన ఆలంబన గా నిలిచి ,వేలాది రాజ కీయ నాయకులకు,వందలాది సామాజిక కార్య కర్తలకు ,కోట్లాది సామాన్య జనులకు స్పూర్తి ప్రదాత గా  నిలిచి  జాతి పితగా అమరుడయ్యా డు.
లాల్,బాల్ ,పాల్ ;ఇంకా ఎందఱో చరిత్ర కె క్కని నాయకులు,వారి జీవితాలను,కుటుంబాలను  పణం  గా పెట్టి అమరులయ్యారు .

 గాంధీ, భారతీయులలో దేశ భక్తీ రగిలించి,మనుషు ల్లో మానసిక పరివర్తన కలిగించి ఎన్నో రాష్ట్రాలు,రాజ్యాలు , కులాలు,మతాలుగా చీలిపోయున్న సమాజాన్ని ఒక తాటి పైకి పట్టుకొచ్చాడు .  భారత ఉపఖండం లో ఐక్యతా రాగాన్ని శృతి చేసి అందరిలో స్వతంత్ర కాంక్షని రగిలించి సమాజమంతా ఒకే నినాదం తో కదిలే విధం గా జనాన్ని నడిపి బ్రిటిష్ వారి గుండెలను కదిలించాడు . 

No comments:

Post a Comment