సమగ్రమైన ,సంపూర్ణ మైన శాస్త్రం ఎంత మంచి
చేస్తుందో , అసంపూర్ణ శాస్త్రం అంతగా సమాజానికి చెరుపు చేస్తుంది . శాస్త్రం
ఆయుధం లాంటిది .
అది లోక కల్యాణా నికా ? లోక వినాశ నానికా ? అనేది మనిషి మీదే
ఆధార పది ఉంటుంది .
అసంపూర్ణ మైన , అసమగ్ర మైన శాస్త్రాలు సమాజాన్ని ,ముఖ్యం గా
బలహీనులను తప్పుదారి పట్టిస్తాయి .
తెలివిగలవారికి ఆ శాస్త్రం ఒక ఆయుధం గా మారి బలహీనులను మోసం చేసి
పబ్బం గడుపు కోవడానికి ఉపయోగ పడుతుంది .
కష్టాలతో ,బాధలతో కునారిల్లుతూ మానసికం గా కుంగిపోయి
ఆసరాగా గడ్డిపరకైనా దొరకుతుమ్దేమో అనే ఆశతో ఎదురు చూసే వారికి
ఆ శాస్త్రము ఓ గట్టి విశ్వాసాన్ని , అలాగే ఓ మూడ
నమ్మకాన్ని పెంచి పోషిస్తుంది .
ఆ శాస్త్రాన్ని అందించే వారు ఓ దేవత లెక్క సమాజంలో చలా మణీ అవుతారు .
మంది పై పట్టు సాధించడానికి కులం , డబ్బు ,మతం ఇలా
ఎన్నో జిత్తులు ఉన్నాయి . బలహీనుల సెంటిమెంట్ పై పట్టు సాధించ దానికి తద్వారా ధ నం
,అధికారం ,దర్పం ఇబ్బడి ముబ్బడి గా పోగేసు కోవడానికి అసంపూర్ణ శాస్త్రాలను
దుర్వినియోగ పరచడం అందులో బాగమే !
ఈ దోపిడీ ని ఎదుర్కోవడం లో ఎన్నో కష్ట నష్టాలను
భరించి నేటికీ సమాజంలోని చేకటి కోణాలను చేధించడం లో నిరంతరం నిమగ్నమైతున్న గోరా
సమాజము వారికి అందరం కృతజ్ఞులమై ఉండాలి . ఇలాంటి నిత్య నూతనమైన భావాలతో ఒక సంస్థను స్థాపించి తెలుగు నెలకు సేవలందించిన గోరా మహాశయునికి వినమ్ర పూర్వక నివాళి.
ఇలాంటి మహాపురుషుల జీవితాలనుండి ప్రతి విద్యార్ధి స్పూర్తిని పొందాలి .ప్రశ్నిం చే అలవాటు పెంపోదిం చు కోవాలి !
No comments:
Post a Comment