Search This Blog

Thursday, 13 August 2015

డబ్బు డబ్బు ..........

మన రాజ్యాంగం లోని 7 వ షెడ్యుల్ -ఆర్టికల్ 246 ద్వారా సంక్రమించిన అధికారం ద్వారా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు నిరాఘాటం గా పన్నులు వసూల్ చేసు కోవచ్చు . 
కేంద్రం పార్లమెంటు ద్వారా చట్టాలు చేసి -  ప్రజల  సంపాదన , వారి ఆస్తులు , ప్రజల కొనుగోళ్ళు , అలాగే పరిశ్రమల ద్వారా వస్తూత్పత్తి  ,ఎగుమతి -దిగు మతులు , వ్యాపార సంస్థల టర్నోవర్  ,వ్రుత్తు లు ,సేవలు ,  ప్రజలు ఇచ్చి పుచ్చు కొనే బహుమతులు ,వారసత్వపు ఆస్థులు - వీటన్నింటి పైనా పన్నులు -కొన్ని డైరెక్ట్ గా (ఆదాయపు పన్ను , వ్యాపార సంస్థల పై పన్ను , సంపద పన్ను ,వారసత్వపు ఆస్థి పై పన్ను ,బహుమతుల పై పన్ను ); మరికొన్ని పరోక్షం గా  వేసి వసూల్ చేస్తాయి . 
ఇవికాక సర్ చార్జి ,సెస్స్ ఉండనే ఉన్నాయి . 
రాష్ట్రాలు  విధాన సభల ద్వారా చట్టాలు చేసి - ఆస్థుల లావాదేవీలు , సేల్స్ టాక్స్ ల ద్వారా  పన్ను వసూల్ చేస్తాయి . 

వీటన్నింటి ద్వారా (సేల్స్ టాక్స్  & VAT  తప్ప ) కేంద్రానికి ఏటా సుమారు 10 లక్షల కోట్లు పోగవుతుంది . 
కేంద్రం , ఇందులో 42% రాష్ట్రాలకు తిరిగి పంచి పెడుతుంది .  

దేశం లో వస్తువుల ఉత్పత్తి ,వనరుల నుండి ఖనిజాల ఉత్పత్తి ,భూమి నుండి ఆహార ఉత్పత్తి ,అలాగే ప్రజలు కష్ట పది చేసే పని విలువ -ఇవన్నీ కలిస్తే ,దీనినే దేశ ఆర్ధిక ఉత్పత్తి అంటారు . దీని విలువ ఆధారం గానే మన రిజర్వ్ బాంక్ కరెన్సీ నోట్లను ముద్రణ చేస్తుంది . 
దేశ ఆర్ధిక ఉత్పత్తి విలువ కన్నా అధికం గా ముద్రణ చేస్తే ఆ కరెన్సీ విలువ పడిపోతుంది . అనగా మన కరెన్సీ విలువ ను పడిపోకుండా కాపాడు కోవా లంటే మనం ఉత్పత్తి చేస్తున్న సరకుల కు నిరంతర మార్కెట్ , డిమాండ్ ఉండాలి . 
దేశం లో ప్రజల కొను గోలు శక్తి పెరగాలి . లేదా మన సరకులకు ,సేవలకు విదేశాల లో డిమాండ్ పెరిగి  అమ్ముకొనే అవకాశం ఉండాలి .కానీ మనకు ఆ భాగ్యం ఉందా ? విదేశీ మార్కెట్ లో డిమాండ్ ఉండాలంటే వస్తువుల నాణ్యత బాగుండాలి. కానీ మన వస్తూత్పత్తి ,నాణ్యత నాసిరకం గానే ఉన్నాయి . 
( ఇక్కడ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి . కరెన్సీ విలువ పడిపోవడం ,సరుకుల ఎగుమతులు -దిగుమతులు '  అనేది గ్లోబల్ వ్యవస్థ వచ్చిన తర్వాత పుట్టిన పదాలు) . 
 ఉత్పత్తి చేస్తున్న సరకులన్నీ మన జనాభా నే మింగేస్తే అదీ సంక్షేమ పధకాల రూపేణ ఉచితం గా వాడేసు కొంటూ ఉంటే ,మన అధికారులు ,రాజకీయ నాయకులు అవినీతి తో హాంఫట్  అంటూ సామాన్యులకు అంద వలసిఉన్న వనరులను మింగేస్తూ ఉంటే, ఎగుమతుల మాట అటుంచి దిగుమతులు చేసుకొన్నా సరిపోవడం లేదాయె ! 

డబ్బుని , లెక్కకు అందకుండా దాచి పెట్టుకొని భూముల కొనుగోళ్ళు  ,హవాలా ద్వారా విదేశాలకు తరలింపు ,
 కేవలం లక్ష మంది వ్యాపార వాణిజ్య చట్టాలలోని లొసుగుల ద్వారా  వెనకేసు కొంటున్న సంపద ,
రోజు రోజుకీ పడిపోతున్న మన డబ్బు విలువ , 
130 కోట్లలో కేవలం 2కోట్ల మందికి మాత్రమే 5అంకెల సంపాదన ,
దేశం లో ఉన్న సంపదలో 70% కేవలం లక్ష మంది దగ్గరే పోగు పడి పోవడం - ఇవన్నీ మనిషిలో రంకె లేస్తున్న స్వార్ధం ,మోసం ,కోరికలకు అలాగే కొంత మంది భాగ్య వంతుల తెలివికి ,తెంపరి తనానికి పరాకాష్ఠ . 

 నల్ల ధనం అంటే ప్రభుత్వానికి  లెక్క చెప్పని కరెన్సీ ఒక్కటే కాదు, ప్రభుత్వానికి  తెలియ చేయని లేదా లెక్క చెప్పని ఆస్తులు -భూములు ,ఇళ్ళు ,ఫాక్టరీలు , సంస్థలు , బంగారం ,జాతి రత్నాలు ---  ఇవన్నీ  దొంగ  సంపదే !
మన రిజర్వ్ బాంక్ ముద్రణ చేస్తున్న కరెన్సీ లో , ఏటా సుమారు 60 ట్రిలియన్ లు దొంగ డబ్బు గా మారుతుంది . ఇందులో 10% అనగా 6 ట్రిలియన్ లు  మాత్రమె ప్రతి ఏటా విదేశాలకు జారు కొంటుంది . 

భారత్ అత్యంత 10 పేద దేశాలలో ఒక్కటి . 
భారత్ అత్యంత 10 అవినీతి దేశాలలో  ఒకటి . 
కారణం, సోమరితనం ,స్వార్ధం ,అలసత్వం ,అవినీతి తో పుచ్చి పోయిన ప్రజలా ?
కుల బలం , ధన బలం ,మంది బలం తో పులిసి పోయి , తెలివి ,కరడు కట్టిన స్వార్ధం తో జిత్తులమారి మోసాలు , రంగులు మార్చే రాజకీయాలు చేస్తున్న కొంత మంది నాయకులా ?
ఎవరు ?

Wednesday, 12 August 2015

Special status to state? what it means??

 



  

ప్రత్యేక హోదా ? !

రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఇప్పుడు ,అటు తెలుగు దేశం ,ఇటు బిజెపి కి సంకటం గా మారింది .
దీ నిని కాష్ చేసు కోవడానికి మిగతా పార్టీలు కండువాలు దులుపుకొంటూ ముందుకు దూకుతున్నారు .
 మీడియా ఎలా కలర్ ఇస్తే ప్రజలు అలాగే నమ్మేసి ఆవేశ పడిపోతారు .
కానీ మేధావులు ,పారిశ్రామిక వేత్తలు ,పార్టీలకతీతం గా ఆలోచించే దార్సినికులు చేయ వలసింది ఒక్కటుంది .
ప్రత్యేక హోదా వలన రాష్ట్రానికి ఎంత లాభం వస్తుంది ? ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రానికి వీలు పడనప్పుడు,అంతే లభ్యత కలిగించే  ఏదైనా  ఇతర మార్గాలున్నాయా ?
ఉదాహరణకు , ప్రత్యేక హోదా వలన రాష్ట్రానికి ఏటా 1500 కోట్లు రావచ్చు .
అలాగే ప్రత్యేక హోదా వలన  ఏటా పరిశ్రమ పై తరుగు 15% వస్తుంది .
వీటికి ప్రత్యామ్నాయం గా విదేశీ సాయం పై కట్టే ప్రాజెక్ట్ లపై 70%గ్రాంట్ రూపం లో , 30% అప్పు రూపం లో  ఉండేటట్లు కేంద్రాన్ని ఒప్పించ గలిగితే , 25000 కోట్ల లాభం వచ్చే అవకాశం ఉంది .
అలాగే వె నకబడిన  ప్రాంతాల లో ని పరిశ్రమలకు మాట్ పన్ను(MAT tax) పై రాయితీ ని డిమాండ్ చేస్తే 15% తరుగు ద్వారా వచ్చే లాభం కంటే ఎక్కువ లాభం వస్తుంది .
 లేదా ప్రత్యేక హోదా పై  మళ్ళీ ఒక కమిటీ ని వేయమని డిమాండ్ చేయ వచ్చు . 
అలాగే సుప్రీం కోర్టు లో మన రాష్ట్ర హక్కుల గురించి ,జరుగుతున్నా అన్యాయం గురించి కేస్ ఫైల్ చేయ వచ్చు . 


Friday, 7 August 2015

పప్పు భారత్

మనది వ్యవసాయ దేశం . ఐనా పప్పు ధాన్యాలను సరిపడా ఉత్పత్తి చేయ లేక పోతున్నాము . అందుకే పప్పుధాన్యా లు  దిగుమతి చేసుకుంటూ  వేల కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం 
నష్టపోతు న్నాం .  
మనం ఏం చేయాలి ?
1. మొదటి పంట వరి, మొక్కజొన్న, వేరుశనగ వేసిన తర్వాత సాగునీటి అవకాశం ఉన్న చోట రెండో పంటగా పప్పుధాన్యాలను వేయించాలి. 
2. తొలకరిలో పప్పుధాన్యాలు వేసి పంట వచ్చిన తర్వాత ఖరీఫ్‌ పంటలు వేసే విధంగా ప్రణాళిక రూపొందించాలి. 
ఈ విధంగా ఖరీఫ్‌ పంట వేయడానికి ముందు, వేసిన తరువాత కూడా పప్పుధాన్యాలు పండించవచ్చు. 
ఈ పంటల  వల్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవ్వడమే కాక ,యూరియా  దిగు మతులను కూడా తగ్గించు కోవచ్చు . ఎందుకంటే ,  పప్పుధాన్యాల సాగు వల్ల ,భూమికి నత్రజని చేకూరుతుంది. పప్పుధాన్యాల తరువాత వేసే పంటకు నత్రజని తక్కువగా వినియోగించవచ్చు. 

Friday, 31 July 2015

భారతీయుడు

స్వదేశీ అని పిలి పించు కోవడం కన్నా NRI  అని పిలిపించు కోవడం లో ఎక్కువ ఆనందాన్ని పొందే వారిని  ,
సొంత మతం గురించి  చెప్పుకోవడం కన్నా సెక్యులరిస్ట్ అని చెప్పుకోవడానికి ఎక్కువ ఉత్సాహపడే వారిని ,
స్వంత  ఆచారాల పై ఏ మాత్రం నమ్మకం ,గౌరవం లేని వారిని ,
తెల్లతోలు యోరోపియన్  చెప్పిందే కరక్ట్  అనే బానిస మనస్తత్వం ఉన్నవారిని ,
ఇతర మతస్తులు కుళ్ళ పొడుస్తున్నా  వినోదిం చే వారిని  --- ఈ భూగోళం పై మరెక్కడా చూడం ,ఒక్క ఇండియాలో తప్ప ! ఇది జన్యు లోపమా ? ఆత్మ రాహిత్యమా ?

Monday, 27 July 2015

గోరాకి నివాళి .

సమగ్రమైన ,సంపూర్ణ మైన శాస్త్రం ఎంత మంచి చేస్తుందో , అసంపూర్ణ శాస్త్రం అంతగా సమాజానికి చెరుపు చేస్తుంది .  శాస్త్రం ఆయుధం లాంటిది .
అది లోక కల్యాణా నికా ? లోక వినాశ నానికా ? అనేది మనిషి మీదే ఆధార పది ఉంటుంది .

 అసంపూర్ణ మైన , అసమగ్ర మైన శాస్త్రాలు సమాజాన్ని ,ముఖ్యం గా  బలహీనులను  తప్పుదారి పట్టిస్తాయి .
తెలివిగలవారికి ఆ శాస్త్రం ఒక ఆయుధం గా మారి బలహీనులను మోసం చేసి పబ్బం గడుపు కోవడానికి ఉపయోగ పడుతుంది .
 కష్టాలతో ,బాధలతో కునారిల్లుతూ  మానసికం గా కుంగిపోయి
ఆసరాగా గడ్డిపరకైనా దొరకుతుమ్దేమో అనే ఆశతో ఎదురు చూసే వారికి  ఆ శాస్త్రము   ఓ గట్టి విశ్వాసాన్ని , అలాగే ఓ మూడ నమ్మకాన్ని  పెంచి పోషిస్తుంది .
ఆ శాస్త్రాన్ని అందించే వారు ఓ దేవత లెక్క సమాజంలో చలా మణీ అవుతారు .
           మంది పై పట్టు సాధించడానికి  కులం , డబ్బు  ,మతం ఇలా ఎన్నో జిత్తులు ఉన్నాయి .  బలహీనుల సెంటిమెంట్ పై పట్టు సాధించ దానికి తద్వారా ధ నం ,అధికారం ,దర్పం ఇబ్బడి ముబ్బడి గా పోగేసు కోవడానికి అసంపూర్ణ శాస్త్రాలను దుర్వినియోగ పరచడం అందులో బాగమే !
  ఈ దోపిడీ ని  ఎదుర్కోవడం లో ఎన్నో కష్ట నష్టాలను భరించి నేటికీ సమాజంలోని చేకటి కోణాలను చేధించడం లో నిరంతరం నిమగ్నమైతున్న గోరా సమాజము వారికి అందరం కృతజ్ఞులమై ఉండాలి . ఇలాంటి నిత్య నూతనమైన భావాలతో ఒక సంస్థను స్థాపించి తెలుగు నెలకు సేవలందించిన గోరా మహాశయునికి వినమ్ర పూర్వక నివాళి. 
ఇలాంటి మహాపురుషుల జీవితాలనుండి ప్రతి విద్యార్ధి స్పూర్తిని పొందాలి .ప్రశ్నిం చే అలవాటు పెంపోదిం చు కోవాలి !



How to assess Human development in a society?


  • good health, 
  • access to knowledge, and 
  • a decent material standard of living.
  •  the ability to participate in the decisions that affect one’s life, 
  • to have control over one’s living environment, 
  • to enjoy freedom from violence,
  •  to have societal respect, and 
  • to relax and have fun.