Search This Blog

Thursday, 25 April 2013

గ్రహణ సమయం లో ఏం జరుగుతుంది ?

This combination photo illustration shows a partial lunar eclipse in 2008. (China Photos/Getty Images) 
చంద్ర గ్రహణం సమయం లో ఏం జరుగుతుంది ?
సూర్యుడికి చంద్రుడికి మధ్యగా భూమి అడ్డుగా రావటం వలన మనకు చంద్రుడు కనపడడు .
సూర్య కాంతి లోని  ఎర్ర రంగు తరంగాలు ఒక ప్రత్యేక కోణం లో   చంద్రుని తాకుతాయి . ఎందు  కంటే
భూ వాతావరణం సూర్య  కాంతి లోని నీలి తరంగాలను చెల్లాచెదురు చేయడం వలన ఎక్కువగా
ఎరుపు తరంగాలు చంద్రుని పై పడి , మన భూ వాతావరణం లోనికి ఒక విధమైన శక్తి తరంగాలు
పరా వర్తనం చెందు తాయి .
  • మనస్సుకి సంకేత మైన చంద్రుడు ,ఆత్మకి సంకేత మైన సూర్యుడు ఒకే సరళ రేఖ లోకి రావడం ఒక విధం గా  అదొక యోగం . ధ్యాన లక్ష్యం కూడ మనస్సు ఆత్మా వైపు గా నిలిచి ఉండటమే గదా .
  • సూర్య నాడి , చంద్ర నాడి కూడ ఒకే విధ మైన స్పందన లో ఉన్నప్పుడు సుషుమ్నా( - అగ్ని నాడి )బాగా పని చేస్తుంది . అనగా అగ్ని నాడి ద్వారా కుండలినీ శక్తి ప్రసరణ అతి తేలికగా జరిగే అవకాశంఉంది .

అందుకే గ్రహణ సమయం లో జప , మంత్రసాధన , ధ్యానం చేస్తే ఎక్కువ ఫలితాలు కలిగే
 అవకాశం  ఉంటుంది .

అందుకే గ్రహణం రోజున ముఖ్యం గా ఉపవాసం  లేదా సాత్విక మితాహారం,ప్రాణాయామం , వీటి ద్వారా శరీర శుద్ది జరుపు కొని భూమి పై పరిడ విల్లె కుండలినీ శక్తిని మన శరీర కోశాల లోని సుషుమ్నా నాడీ ద్వారా ప్రవహింప చేసు కొనే శక్తి పాతానికి అందరూ సమాయత్త మవ్వాలని మన ఋషుల ఆశీస్సు . 
గ్రహణ కాలం లో ఆహార పదార్ధాలకు , జీవులకు హాని చేసే కిరణాలు  ఎక్కువగా భూమికి వస్తాయి . 
వీటి నుమ్డి రక్షణ పొందా లంటే మన శరీర కోశాలను శుద్దమ్ గా ఉంచు కోవాలి. 
అందుకే , స్నానం , దానం ,మితాహారం ,ప్రాణాయామం , దైవ స్మరణం మొదలగు గ్రహణ విధులను 
అమలు చేయాలి .  

Sunday, 21 April 2013

why & how to do meditation?

మనుషులెందుకు ధ్యానం చేయాలి ?
తిరిగి తిరిగి వచ్చి కాసేపు విశ్రాంతి తీసు కొంటామ్ .  
చదివి చదివి కూసేపు కునుకు తీస్తాం . 
భావ సంచలనం కలిగి నప్పుడు కాసేపటికి ఒక  స్థిమిత స్థితి కి వస్తాం . 
అందుకే శరీరం త్వరగా అలసి పోకుండా , ఎంత పనైనా అలవోకగా చేయ దానికి శరీర సామర్ధ్యాన్ని 
పెంచు కోవడానికి ఎన్నో వ్యాయామాలు నిరంతరం చేస్తాం . 
అలాగే మెదడు చురుకుగా ఉండ టానికి ఎన్నో రకాల మైండ్ గేమ్స్ ,పజిల్స్ సాధన చేస్తాం . 
భావ జాలాన్ని అలాగే మన భావాలను అదుపులో ఉంచడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తాం . 
రకరకాల శ్వాస పద్దతుల ద్వారా ప్రాణ శక్తిని అదుపులో ఉంచు కొంటాం . 
ఇదే విధం గా మన చైతన్యా న్ని అనగా అవగాహన తో కూడిన ఎరుకను విస్తరింప చేసుకొని ,మన చైతన్యం యొక్క నిజ స్థితి ని ఆవిష్కరిమ్చు కోవడానికి ధ్యానం అలవాటుగా చేసు కోవాలి . 

"control over the physical,emotional,mental,praanic bodies and then expansion of real consciousness through contemplation,meditation leading to liberation from wheel of 
karma".

అంతర వ్యక్తిత్వ వికాసానికి ,  జీవన వికాసానికి ,జీవితాన్ని ప్రశాంతం గా జీవించడానికి , అన్ని రకాల పరిస్థితులను ఒకే విధమైన మానసిక స్థితి తో స్వీకరించే సమ స్థితి అలవాటు చేయడానికి , మనలోని
 వాసనా గుణాలను సమూ లమ్ గా మార్చుకొని సత్వ నిర్మల స్థితిలో ఉండటానికి , శ్రద్ద , ఓరిమి ,క్షమ ,ప్రేమ తదితర సాత్విక గుణాలను పెంచు కోవడానికి ,జీవిత పరమావధి ఐన ముక్త స్థితి ని చేరు కోవడానికి ---
 ధ్యానం చేయాలి . 

ధ్యానం లో ఏం జరుగుతుంది?
జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే సమాచారాన్ని ,చిత్తం లో కలిగే  ఆలోచనలను  , జ్ఞాపకాలలో దాగిన
 సమాచారాన్ని , పాత అనుభవాలను   ---  మనస్సు అసలు పట్టించు కోదు . అంటే , మనస్సు (-బుద్ధి)
దేనినీ  బేరీజు వేయదు . మమేక మవ్వదు .  అనుభూతి చెందదు . (అహం లేదు).
పింగాణీ పెంకు పై ఏ దైనా రంగు వేసినా పీల్చు కోదు . కాబట్టి రంగు ఏమీ మారదు . అదే ఒక బ్లాట్టింగ్
పేపర్ ఐతే రంగు ని మొత్తం పీల్చు కొని రంగు మారుతుంది .
అలాగే మన మనస్సు కి  ఎన్ని రకాల సంఘటనలు - అవి సుఖం లేదా దుఖం -కలిగించినా  ఎలాంటి
అనుభూతి లేకుండా సాక్షి గా సమ స్థితి లో ఉండటం అలవాటు చేయాలి .

చైతన్యాన్ని , అనగా మన ధ్యాస ను ఇంతకూ ముందు మనం చెప్పుకొన్న శక్తి ప్రవాహ గొలుసు లో
ఎక్కడైన నిలిపి ధ్యానా న్ని సులభం చే సు కోవచ్చు .
(చైతన్యం  ---- విశ్వ శక్తి (కుండలినీ శక్తి ) ---- మనస్సు ---- ప్రాణ శక్తి ----దేహం ) .

ధ్యానానికి కావలసిన కనీస అర్హత ఏమిటి ?
ఒక్క మనిషికి మాత్రమే నిరంతర ఆలోచనా వృత్త సామర్ధ్యం  ఉంటుంది .
మనిషి కి మనస్సే ఒక వరమూ , అలాగే శాపమూ  !
ఆరోగ్య వంతమైన శరీరం అనగా  పంచ కోశ శుద్ది ఉండాలి .
అందుకే పతంజలి రుషి అష్టాంగా యోగం ద్వారా -
యమ ,నియమ ,ఆసనాల  ద్వారా- శరీర , మానస శుద్ది
ప్రాణ యామం ద్వారా - ప్రాణ శక్తి శుద్ది ,తద్వారా ప్రాణ శక్తి పై అదుపు -
ప్రత్యాహారం అనగా సాక్షిగా వైరాగ్య భావం తో అన్నింటినీ గమనించడం -(ఇది మంచి ఇది చెడు , ఇది సుఖం ,ఇది దుఖం అనే ద్వంద అనుభూతి లేకుండా )అలవాటు చేసు కోవాలి . - ఇంద్రియాలు , చిత్తము ,
జ్ఞాపకాల సంచి ,మానసం -వీటన్నింటి గురించి మనకు కలిగే జ్ఞానం తద్వారా  మనస్సు పై అదుపు .
ఎప్పుడైతే మనకు  శరీరం ,ప్రాణ శక్తి , మనస్సు పై అదుపు వచ్చిందో అప్పుడు -
ధారణ ,ధ్యానం తద్వారా సమాధి స్థితి ....

ధ్యానం కూ డ ఒక పని లాగే ఉంది . దాని  వలన ఎలాంటి ఆనందం కలగడం లేదు .
 మరి నేను ధ్యానాన్ని మాని వే య వచ్చా ?
ధ్యానం అంటే  ఓ మూల కాసేపు కూర్చుని  నామా న్నో , మంత్రా న్నో జపం చేయడం కాదు . దానిని
సంస్మరణ  లేదా జపం  లేదా ప్రార్ధన  అనవచ్చు .
అహాన్ని త్యాగం చేస్తూ , శూ న్యం పై గానీ , దైవ రూపం పై గానీ దృష్టి కేంద్రీక రించి చేసేది అసలైన
ధ్యానం . మిగతావ న్నీ కామ్య కర్మల నే చెప్పు కోవచ్చు .
కర్మ లెప్పుడూ ఆనందాన్ని ఇవ్వవు . ధ్యానాన్ని ఒక సకామ కర్మలాగా చేస్తే అలాగే ఉంటుంది .
అలాగని ధ్యానాన్ని మాన వద్దు . అసలేమీ చేకుండా ఉండటం కన్నా ఏదో ఒకరక మైన ప్రయత్నం చేస్తూ
ఉంటే అసలైన ధ్యానం మనకు కుదురుతుంది . కనీసం మానసిక ప్రసాంతత కలుగుతుంది . 

Thursday, 18 April 2013

రామో విగ్రహవాన్ పరమో ధర్మః

శ్రీ సీతా రాముల కల్యాణం భారతీయుల జీవన స్రవంతిలో ముఖ్యం గా హిందూ వివాహ చట్రానికి 
ఒక సూత్రం గా ఎలా ,  ఎందుకు భాసిల్లుతుంది ? 
మన దేశ సంఘ  వ్యవస్థ ఒక విధం గా మన వివాహ వ్యవస్థ పైనే ఆధార పడి ఉంది . 
చెక్కు చెదరని వివాహ వ్యవస్థ ద్వారా  పిల్లల పెంపకం , ఉమ్మడి కుటుంబాలు , సామాజిక సుస్థిరత -ఇవన్నీ ఒక దానిపై ఒకటి ఆధార పడి ఉన్నాయి . 
రాముడు  తదితర రామాయణ కాలపు వ్యక్తులు నిజం గా ఈ భూమి పై నడయాడిన వారేనా ?
లేక , కొత్తగా భూమి పై నివాసం ఏర్పరచు కొంటున్నఇతర గ్రహాల వారా ?
లేక వాల్మీకి సృష్టించిన పాత్రలా ? ----  ఇలాంటి సందేహాలతో ఎంతో  మంది సతమవుతూ ,
అందరినీ తికమక పెడుతూ  ఉన్నా, ఈ  దేశం లోని సామాన్య జనులు మాత్రం రామాయణాన్ని వారి
గుండె లలో పెట్టుకొని , జీవన విధానానికి ,జీవిత గమ్యానికి చుక్కాని లాగా  అన్వయించు కొంటూ
ప్రతి క్షణం పండుగ చేసుకొంటూ నే ఉన్నారు .

దేవ లోకపు వారా ? ఇతర గ్రహాల వారా ? అసలు మనుషులేనా ? అప్పటి నాగరికత అంతగా వృద్ది
పొందిందా ? ఇలాంటి సందేహాలని శాస్త్ర కారులకు వదిలేసి , మనం చూడ వలసింది రాముని నడత ,
సీతమ్మ దైర్యం &అనువర్తత , లక్ష్మణుని అంకిత భావం , భరతుని కర్తవ్య పాలన ,హనుమ పాండిత్యమూ ,
 సేవా భక్తీ  ... ,
 భర్త గా  ,అన్నగా ,కొడుకు గా , అన్నింటినీ మించి ప్రజలను పాలించే రాజుగా - ఎలా నడవాలో ,
నడవడిని ఎలా మార్చుకోవాలో  అంటే  మనిషి తన ధర్మాన్ని  ( అవసరమైన కార్యం ) ఎలా నిర్వర్తిం చాలో
చూపించిన మార్గ దర్శి రాముడు .
ధర్మం అంటే - మనిషి జీవనానికి కి అత్యవసర మైన వన్నీ సాధించు కోవడం మనిషి కనీస ధర్మం .

నేడు మనలో లోపించిందీ ధర్మమే . అనగా మన కేది అత్యవసరమో తెలియక అన్నింటినీ కోరు కోవడ మే 
అధర్మం .
 రావణుడు , శూర్పణఖ , వాలి , కైకేయి , - వీరు , వారికి అత్యవసరం కాని వాటి పై మోజు పడి అధర్మం బాట పట్టి వారి జీవనాన్ని ,వారితో పాటు ఇతరుల జీవితాలను బ్రష్టు పట్టించారు .

మనిషి తను ఉన్న ఆశ్రమానికి ( విద్యార్ధి, గృహస్తు , వానప్రస్థ, సన్యాసి ,రాజు ,నాయకుడు  తదితర ఆశ్రమాలు ) అనుగుణం గా , తన కనీస అవసరాలను గుర్తించి సాధించు కోవడం , ఆ క్రమం లో ఇతరులకు , ప్రకృతికి  ఎలాంటి హానీ కలుగ కుండా జాగ రూకత తో మెలగడం ---- ఇదే మనిషి ధర్మం .

మతం గురించి , దైవం గురించి చెప్పడం లేదు .
రాముణ్ణి ,రామాయణాన్ని ఒక మతానికి పరిమితం చేయడం సంకుచిత్వం . 
 మనిషి జీవన నాదం ఎలా శ్రుతి  చేస్తే  స్వర లయ బద్దం గా ఉంటుందో వాల్మీకి చెప్పాడు . భారతీయులే కాదు ,
ఈ సమస్త భూమండలం లోని మనిషన్న వాడు, నడవ వలసింది రాముని బాట ,స్మరించ వలసింది రామ నామం , తరించ  వలసింది రామాయణ పారాయణం ... 
అప్పుడే సీతా రామ కల్యాణం విశ్వ కల్యాణానికి నాంది అవుతుంది . 
           రామో విగ్రహవాన్ పరమో ధర్మః 



Saturday, 6 April 2013

ఇప్పుడే ధ్యానం ప్రారంభించండి .

ధ్యానం అంటే ఏమిటి ?
మన ధ్యాసను ఒక విషయం పై ధారణ చేయడాన్ని ధ్యానం అంటాము .
ఏకాగ్రత కి ధ్యానానికి తేడా ఉందా ?
ఏకాగ్రత లో అహం మిగిలే ఉంటుంది .
ధ్యానం లో అహాన్ని దాట టానికి ప్రయత్నం ఉంటుంది .
మనస్సు గాడ నిద్రలో తప్ప అన్ని వేళలా అతి చంచలం గా కంపిస్తూ ఉంటుంది .
శాస్త్రకారుల పరిశోధనలలో ,  మనిషి ప్రతి రోజూ సుమారు 60000 రకాల ఆలోచనలు  సంకల్పిస్తాడు .
ఆలోచన పుట్టాలంటే సంకల్పం , భావ పరిపుష్టి ఉండాలి .
సంకల్పం ఎలా కలుగుతుంది ?
మనలో అంతర్లీనం గా ఉన్న గుణాల ( సత్వ ,రజో , తమో ) వలన ,
ఆ గుణాల కు బయట ఉన్న విషయాలకు కలిగే సంపర్కం వలన
సంకల్పం ఏర్పడుతుంది .
ఇంద్రియాల ద్వారా గ్రహించిన విషయాలను క్రోడీకరించి , పాత సమాచారం తో బేరీజు వేసి
మనస్సు భావ పరిపుష్టత ని పొందుతుంది .

చైతన్యం  .
---> అహం -----> బుద్ది ---- జ్ఞాపక శక్తి ---- చిత్తం
= ఇవన్నీ శక్తి కి వివిధ రూపాలు . వీటన్నింటినీ కలిపి మనస్సు ' అని మనం వ్యవహరిస్తాం .
అంటే మనస్సు - ఒక శక్తి ప్రవాహం .
మనస్సు ఒక పక్క చైతన్యం తో మరో పక్క దేహం తో కలప బడి ఉంటుంది .
చైతన్యం  ---- విశ్వ శక్తి (కుండలినీ శక్తి ) ---- మనస్సు ---- ప్రాణ శక్తి ----దేహం .
ఈ గొలుసులో ఎక్కడ స్పందనలు ఎక్కువైనా గొలుసు మొత్తం దాని ఫలితం భరించాలి .
ఆ స్పందనలను నియమితం చేసు కోవడ మే ,ఒక సమ తుల్య అవస్థలో నిలపడ మే యోగ సాధన .
అనగా , దేహాన్ని ,ప్రాణాన్ని , మనస్సుని , కుండలినీ ప్రవాహాన్ని  మాయా చైతన్య మనే అహంకారాన్ని
అధిగమించి శుద్ద చైతన్యం వైపు మళ్ళించేది ధ్యానం . ఈ మార్గం లో కలిగే అనుభవాలు
జ్ఞానం . మార్గం చివర వచ్చే లేదా మిగిలే అనుభూతి ప్రజ్ఞ .
మన జీవనం , జీవితం ప్రశాంతం గా ఉండాలంటే ధ్యానం చేయాలి . 
ఇప్పుడే ధ్యానం ప్రారంభించండి . 

Wednesday, 13 March 2013

ఆదిత్య హృదయం

Solar power for the people
iఇదీ నిజమైన సూర్యారాధన . భూమి కెలాంటి నష్టం లేకుండా మన దైనందిన జీవితావసరాలకు 
శక్తి ఎలా పొంద వచ్చో ఒ క్క సారి పై చిత్రాన్ని చూచి 
ఆచరిద్దాం . 

Sunday, 10 March 2013

శివ రాత్రి ప్రత్యేకత ఏమిటి?

                       శివ రాత్రి ప్రత్యేకత ఏమిటి?
శివ రాత్రి , శివ శక్త్యాత్మకానికి ప్రతీక . శుద్ద జ్ఞాన స్వరూపం శక్తి తో ప్రకటిత మైన రోజుగా చెప్పు కొంటారు . తనలో నిద్రాణమ్ గా దాగి ఉన్న శక్తిని అవగాహన లోకి తెచ్చు కోవడమే శివ రాత్రి నాడు మనిషి చేయ వలసిన విధి.


తమ కుండలినీ శక్తిని ఊర్ధ్వ ముఖం గా వేగ వంతం చేసి సహస్రార  శక్తి 
ప్రవాహం లో కల పడమే సాధకుల విధి . 

Symbols &logos:
శివ లింగం శుద్ద సత్వ జ్ఞాన ఆనంద రూపానికి చిహ్నం . దానికి కాలం తో ,వేగముతో ,ప్రదేశం తో ,పని లేదు . గుణమూ  లేదు . అనగా త్రిగుణాతీతమ్ .  త్రి కాలాతీతం . స్పందన లేని శుద్ద తత్వానికి ఒక గుర్తు గా శివ లింగం ,తలచుకోవడానికి ఒక పేరుగా శివం . అనగా అంతటా వ్యాపించి ,అన్ని  కాలములందు ఉంటూ ,అన్నింటినీ లయం చేసు కొంటూ ఉన్నది ఏదైతే ఉందొ , దానిని వ్యవహార పరంగా, మనం తేలికగా అర్ధం చేసు కోవడానికి  తత్ ' అనీ ,దైవం' అని చెప్పుకొంటాము .

ఇలాంటి తత్త్వం లో స్పందన (సంకల్పం -will)ఏర్పడి నపుడు “శక్తి " గా మనకు ప్రకటిత మవుతుంది .
అనగా ఆ తత్' నుండే శక్తి ఉత్పన్న మై సకల చరా చార సృష్టి కి మూల కారణం అయింది .
ఆ 'శక్తి తో ఉన్న  తత్ ' కి ఓ రూపం , ఆ రూపానికి ఒక పేరు  మనుషులకు కావాలి .
వేలాది సంవత్సరాల నుండి శక్తి కి గుర్తుగా సర్పిలాకారాన్ని  అనగా  twisted  structure ని
మనిషి (మహర్షులు) ఏర్పాటు చేసు కొన్నాడు .అందుకే లింగం చుట్టూ సర్పం చుట్టు కొన్నట్లుగా పాన వట్టాన్ని తయారు చేశారు .

మనిషి జ్ఞానం రక రకాలుగా వృద్ది చెంది, ఒకే  విషయాన్ని ఎన్నో రకాలుగా అర్ధం చేసు కొనే
ప్రక్రియలో అర్ధ నారీశ్వర రూపము , యోని - లింగ రూపము , ఇలా మనిషి బుద్దికి ,
 తర్కానికి తోచి నట్లుగా చిహ్నాలను తయారు చేసు కొన్నాడు .

అండాండమ్ లో ఉన్నదే పిండాండమ్ లో , అదే బ్రహ్మాండం లో ఉంటుంది .
మనిషిలో ఉన్న వెన్ను పూస ని ఆవరించి ఉన్న సుషుమ్నా నాడీ శక్తి ప్రవాహాన్ని లింగం గా ,
ఇడా  పింగళా శక్తి ప్రవాహాలను సూర్య చంద్ర శక్తులుగా  ,ఈ రెండు నాడుల

 సంగమ ప్రదే శంలో  ఉన్న ఆజ్ఞా చక్ర మును  అగ్ని శక్తి గా, మూలాధారం లో ఉన్న
శక్తి ప్రవాహాము   ఓ సర్పా కారం లో ఉన్నట్లుగా  మన ఋషులు భావించారు .
వారి భావనలను ఎన్నో కధల రూపం లో పురాణాలుగా , స్త్రోత్రాలుగా ,స్తుతులుగా ప్రకటించారు .
మనిషి గానీ, ఏ జీవి అయినా పైకి కనబడే పదార్ధ దేహాన్ని వలిచి చూస్తే మన కంటికి ఏమీ కనబడదు. కానీ, శక్తి ప్రవాహం అనేది ఒకటి ఉంటుంది. బ్యాటరీ కి ఉన్నట్లే  దానికి భిన్న ధృవాలు ఉంటాయి. ఆజ్ఞా చక్రము పాజిటివ్ ధృవమైతే,మూలాధారం నెగిటివ్ ధృవం గా అర్ధం చేసుకోవాలి. ఇంతవరకు క్లాసికల్ ఫిజిక్స్ సహాయం తీసుకున్నాం. ఇంకా లోతుగా అనలైజ్ చేయడానికి క్వాంటం ఫిజిక్స్ అవసరం అవుతుంది. ఇప్పుడది అప్రస్తుతం. 


మనిషి ఎన్నో రకాలుగా వ్యవహార పరంగా ,తంత్ర సాధన ,హట యోగ , జ్ఞాన యోగ ,భక్తీ యోగ పరంగా ఆ దైవాన్ని చేరు కోవడానికి ప్రయత్నించే దిశలో ఎన్నో భావాలు , మరెన్నో గుర్తులు .

వ్యవహారిక సౌలభ్యం కోసం ఆ "తత్' ని  సత్ చిత్ ఆనందం ' గా , ఆ శక్తి ని  వివిధ పేర్ల తో
 పిలుచుకొంటాం .తేలిక గా అర్ధం చేసుకొంటా నికి  ఇచ్చా , జ్ఞాన , క్రియా శక్తులుగా విడ దీసి

పలుకుతాం .

మనిషి, తనలో కలిగే ప్రతి స్పందనకు ,చేసే ప్రతి కార్యానికి ప్రతీకగా , అలాగే  
తన కోరికలు తీరటానికి ఏమేం కావాలో అన్నింటికీ విడి విడి గా ఎన్నో రూపాలను,నామాలను తయారు చేసుకొని ప్రార్ధనలు ,ఆరాధనలు ,కామ్య కర్మలు , సకామ హోమాలు ,వ్రతాలు , ఎన్నో రకాల యోగాలు చేస్తాడు .
సంపద కావా లంటే లక్ష్మీ దేవి శక్తిని , యుద్ధం లోవిజయమ్ సాదించా లంటే దుర్గా శక్తిని  - ఇలా ప్రతి కార్యానికి ,  క్రియకూ  ఒక పేరు ,రూపం ఏర్పాటు చేసుకోవడం మనిషి నైజం .

Inter dependent relationship between Mind & Pranic energy ,just like electricity and magnetism!

భారతీయ ఋషులు మనిషి మానసానికి ,ప్రాణ శక్తికి , ఊపిరికి ఉన్న సంబంధాన్ని , అలాగే మనిషి లో ఉన్న శక్తికి ,  చుట్టూ ఉన్న ప్రక్రుతి  శక్తులకు ఉన్న కార్య కారణ అవినాభావ  సంబంధాన్నికని  పెట్టారు . 

అదే విధం గా ఈ  భూ మండలం లో కొన్ని ప్రదేశాలలో  అత్యధిక శక్తి ప్రకటిత మయ్యె కేంద్రాలను ( ఉదాహరణకు - స్వయంభూ క్షేత్రాలు ),అలాగే 
అంతరిక్షం లో జరిగే గ్రహ నక్షత్ర గమనాలకు , విశ్వ శక్తికి ,మనిషి లోని ప్రాణ శక్తికి ఉన్న బంధాన్ని కని  పెట్టారు .

వారు దర్శించిన వాస్త వాలకు అనుగుణం గా కొన్ని అల వాట్లను ప్రజా బాహుళ్యానికి నేర్పారు . ఆ అలవాట్లే ఆచారాలుగా , సంప్రదాయాలుగా , వ్రతాలు ,నోములు , పండుగలుగా మనిషి క్షేమానికి  తద్వారా లోక కళ్యాణానికి హేతు వవుతున్నాయి .

శివ రాత్రి రోజున విశ్వ శక్తి  ఈ భూ మండల మంతా అత్యంత ఎక్కువ స్థాయి లో విడుదలయ్యే   సమయం . ప్రతి మనిషి ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించు కోవాలి .
ఎలా? ఏం చేయాలి ?

How to transform the  human vibrations into divine vibrations ?

పంచ కోశాలను శుద్ది గా ఉంచు కోవటానికి ప్రయత్నం చేయాలి .

·        శరీర శుద్ది కోసం సత్వ గుణ ఆహారాన్ని అతి తక్కువ గా తిని ,

·        మానసిక శుద్ది కోసం ప్రాణా యామం,, భగవన్నామ స్మరణ ,కీర్తన ,మంత్ర జపం ,తద్వారా ధ్యానం ,

·         బుద్ది  శుద్ది కోసం ప్రతి పనీ భగవద్  పరంగా చేయడం - ఈ  విధంగా కనీసం శివరాత్రి నాడు చేస్తే అద్భుత ఫలితాలు అంటే , మనిషి పరిణామం వేగ వంత మవుతుందని ఋషులు చెప్పారు .

అందుకే , శివరాత్రి ప్రతి మనిషికీ  ఒక అద్భుత అవకాశం . 
ప్రతి సాధకుడి కీ ఓ పరీక్ష . 
(
మనోబుద్ధ్యహంకారచిత్తాని నాహం ..... 

చిదానందరూపః శివోzహం శివోzహమ్).