Search This Blog

Sunday, 18 November 2012

నాగుల చవితి లో ఉన్న భౌతిక , ఆధ్యాత్మిక అర్ధం ,పర మార్ధం ఏమిటి ?

పుట్టలో పాలు ఎవరికోసం ?

పాములు పాలు త్రాగవు . పాలు పోసి ,పుట్ట దగ్గర టపాసులు కాల్చి పాముల జీవితాన్ని గందరగోళ పరిచే ఉద్దేశ్యం నాగుల చవితి పండుగ లో ఉందా ?
పుట్ట మట్టిలో ఔషధ గుణా లున్నాయా ?
టన్నులకొద్దీ పాలు ,గుడ్డ్లు  , బియ్యం పిండి వృధా చేస్తున్నామా ?

పాములు వ్యవసాయానికి సాయపడే ప్రాణులు . పంటలను పాడు చేసే 19 రకాల చీడ పురుగులను ,ఎలుకలను హరించి వాటినుండి పంటలను కాపాడే పాములు భారతీయ వ్యవసాయంలో అతి ముఖ్యమైన సహాయ కార ప్రాణులు .అలాగని పాములకు నివాస సౌకర్యం లేకుండా ఎలా పడితే అలా చేలలో తిరిగితే రైతులకు ప్రమాదం . కాబట్టి పాములకు నివాస సౌకర్యం ఉండాలి .
అలాంటి జీవులు వృద్ది పొందాలంటే వాటికి  మంచి నివాసాలు మన పంట చేలలో ఉండాలి . పాములు పుట్టలు కట్టుకో లేవు .చీమలు,చేద పురుగులు కట్టిన పుట్టలలో అవి ఉంటాయి . కాబట్టి చీమలు ఇబ్బడి ముబ్బడి గా పెరిగి పుట్టలు ఏర్పాటు చక్కగా జరగటానికి చీమలకు ఆహారమైన బియ్యం పిండి తదితర ఆహార పదార్ధాలు పొలాల లో జల్లాలి .ఎక్కడ జల్లితే చీమలు త్వరగా తిని వృద్ది పొంది పుట్టలను నిర్మిస్తాయో మనకు తెలియదు .కాబట్టి ఎక్కడైతే పుట్టలు ఉంటాయో అక్కడకు  దగ్గర లోనే చీమల కాలనీ లు ఉంటాయి . అందుకే పుట్టల వద్ద పాలు ,గుడ్డ్లు  , బియ్యం పిండి ఉంచి ఒక విధంగా చీమలను పెంచుతున్నాము .
ఆ చీమలు పుట్టలు కట్టి తే పాములు  వాటి సంతానం వృద్ది పొంది పంటలను  చీడ పీడ ల నుండి కాపాడ తాయి .
రైతులు మళ్ళ లో ,పాములు పుట్టలలో ,ఎలుకలు మొదలగు పంట నాశన కారులు కంట్రోల్ లో ఉంటాయి .

పరార్ధం .
నవ రంధ్రాల శరీర మనే పుట్టలో కుండలీ శక్తి పాము చుట్ట లాగా మూ లాదారంలో ఉండి ,  అరిషడ్ వర్గాలనే విషాన్ని కక్కుతూ ఉంటుంది . ఆ కుండలీ నాగుకి జ్ఞానమనే పాలు పోయాలి . ఎలా పోయాలి ? మన శరీరంలో ఉన్న పంచేద్రియాల ద్వారా  శుద్ధ  జ్ఞానాన్ని మాత్రమే గ్రహించాలి . ఎలాంటి చెడు ఆలోచనలు  ,భావాలు ,దృశ్యాలు ,శబ్దాలు ,పదార్ధాలు గ్రహించ కూ డదు . స్వచ్చ మైన పదార్ధాలు ,కర్తృత్వ భావం లేని ఆలోచనలు , సాక్షీ భూ త  దృష్టి , స్థిత ప్రజ్ఞా స్థి తి  , అష్టాంగ యోగ నియమాలు మొదలగు సాధన లు అభ్యాసం చేయాలి .


No comments:

Post a Comment