Search This Blog

Tuesday, 27 November 2012

శబ్ద శాస్త్రం : ( the science of Sound )

శబ్ద శాస్త్రం  : 
వేద ఋషులు శబ్దం ,దాని ధర్మాలు ,ఉపయోగం వీటి గురించి పరిశోధించి , యంత్రాల సాయం లేకుండా మనిషి ఎలా  ఈ శబ్ద శక్తిని వినియోగించుకోవచ్చు అనే విషయం ఆలోచించి  భాషకు ఛందస్సు ,వ్యాకరణం ,శిక్ష ,సంగీతం మున్నగు విధి విధానాలు ఏ ర్పాటు చేశారు.

భాష  ,అది పలికే విధానం ,ఎంత బలంగా ఎక్కడ నొక్కి పలకాలి ,ఎక్కడ దీర్ఘం తీయాలి , అనే నియమాలు మంత్రం శాస్త్రానికి పునాది . 
that's why, irrespective of the meaning of the words, the Mantra must be intoned in the proper way, according to both sound (Varna) and rhythm (Svara). 
నాదం స్వర ,లయ బద్దం ఐతే సంగీతం .
నాదం చందోబద్దం ఐతే మంత్రం.
నాదం మనిషి పలికితే అక్షరం .
శ్రద్ద ,సహనం ,శరణాగతి ఉంటే ప్రతి అక్ష ర మూ మంత్రమే.

సృష్టి ఎలా జరిగింది ? 
ఋషుల ఊ హకు ,అంతర్ యానానికి ,  అందిన సత్యం వివిధ ఉపనిషత్ లలో విశదీ కరించారు .
స్రుష్టి కి ముందు శుద్ద జ్ఞానం (నిర్గుణ బ్రహ్మ)మాత్రమే ఉంది. జ్ఞానానికి  గుణ మేళ నం (త్రిగుణ) కలిగినప్పుడు అనుభుతి తద్వారా శక్తి , శక్తి వివిధ రూపాలైన శబ్దమూ ,కాంతి ఉత్పన్నమై , వాటి నుండి మానసం ఏర్పడింది . మానసం లో కలిగిన సంకల్పమే స్రుష్టి .
 శుద్ద జ్ఞానమూ -->అనుభూతి -->శక్తి -->శబ్దం ->కాంతి->మానసం --> సంకల్పం -->స్రుష్టి .

శుద్ద జ్ఞానం నుండి అనుభూతి వస్తుంది .
అనుభూతి నుండి శక్తి వస్తుంది.
శక్తి నుండి శబ్దమూ ,శబ్దం నుండి కాంతి , కాంతి నుండి మనస్సూ పుడతాయి .
మనస్సు ఆలొచనల ఉత్పత్తి మరియు ప్రవాహ స్థానం .

శబ్దం నుండి అక్షరం
కాంతి నుండి వర్ణం
ఆలోచన నుండి సంఖ్య

 శబ్దమూ , అంటే అక్షరం
కాంతి , అంటే వర్ణమూ
రెంటి సాయంతో మనస్సుని నియంత్రించుకొంటూ భౌతిక కాన్షస్ నుండి తప్పుకోవడమే మంత్ర పరమార్ధం .
కాన్షస్ నెస్స్ ని భౌతిక స్థాయి నుండి మార్చుకొవడమే సాధన .

సంస్క్రుతంలొ 51 అక్షరాలున్నాయి . ప్రతి అక్షరానికి ఒక అంకె , వర్ణమూ , శబ్దమూ , శక్తీ , తత్వమూ , తన్మాత్ర ఉంటాయి .
అక్షరాలను ఒక క్రమ పద్దతిలొ , రకరకాల స్థాయీలలో , వివిధరీతులలో ,వివిధ బలాలతొ , ఒక ప్రత్యెక రూపాన్ని ఊహిస్తూ పలుకడమే మంత్రం .
మంత్రాన్ని ఒక విధమైన శాస్త్రీయ పద్దతిలొ ఉచ్చరించడాన్ని , అనుష్టానం చేయడాన్ని తంత్రం అంటాం .
పైన చెప్పుకొన్నవన్నీ ఒక బొమ్మ రూపంలో వేయడాన్ని యంత్రం అంటాం .

పరా , పశ్యంతి ,మధ్యమా , వైఖరీ - భిన్న రీతులలో మంత్రాన్ని స్మరించడమే మంత్ర సాధన .
 అధి భౌతిక స్థాయిలకు మన ఎరుక చేరటానికి మంత్రం తాళం చెవిలా పని చేస్తుంది .
 శరీరం , మనస్సు , తర్వాత భావ శరీరం , తర్వాత కారణ శరీరం , పై ఆత్మ సన్నిధి కి మన ఎరుక చేరుకొవడానికి ఒక మార్గం మంత్రం .
అంటేఎరుక ఆత్మగత మవ్వాలంటే ఆరోగ్యమైన శరీరం ,ప్రశాంత మనస్సు , గట్టి సంకల్పం , ఓర్పు ఉండాలి .

బీజాక్షరాలు , ఏ  వాక్య మంత్రాలు ,మంత్ర మాలలు ,మంత్ర సంపుటీకరణలు , నామ మంత్రాలు ,భాషా , వ్యాకరణం , శిక్ష - ఇలాంటి సంగతులు త్వరలో  చెప్పుకొందాం

No comments:

Post a Comment