Search This Blog

Monday, 26 November 2012

యోగం అంటే ఏమిటి ?

 భౌతిక ప్రపంచం-( ఇహం)లో , ఏ పదార్ధాలు , ఏ భావాలు ,
 ఏ అనుభూతులు ,ఏ శబ్దాలు , ఏ బింబ ప్రతి బింబాలు ఉన్నాయో  ,
అవన్నీ' మాయ ' వల్ల  కలిగేవి .
భారతీయ వేదాంత తత్వశాస్త్ర సారమే ఈ  ప్రకటన. 

మాయ" అంటే  ఏమిటి ? అన్నింటినీ మనవే అనుకొని ,వాటిని పొందాలని తా పత్రయపడటం,బంధాలు ,ప్రేమలు ,బంధుత్వాలు , ధనము ,కీర్తి ,సుఖ  దుఖాలు  అన్నీ శాశ్వతమని అనుకోవడమే మాయ .(Attachment of all things with 'ego'). 

నేను- నాది అనే సంకుచిత భావనే అహం. 
"నేను ఉన్నాను " అనే స్ఫురణ నే ఆత్మ అంటాం . 
నేను అనే ఉనికి  కేవలం దేహానికి, కుటుంబానికి పరిమితం చేసుకోవడమే అహంకారం.
what is ego?
 
conditioning of the mind faculty with assumptions,presumptions and prejudices.

మరి ఏది సత్యం? 
మాయ కానిది సత్యం .
ఇహానికి చెందనివి ,  పరానికి చెందేవే   అసలైన యదార్ధం .( Real reality ).
అవే   పర బ్రహ్మ ,పరమ సత్యం ,పరమానందం ,పరంధామ ,పరః నాదం (అనాహత నాదం ) .

మాయ' మిధ్య అని ,పరబ్రహ్మామ్  అనే విషయమే నిజమైన సత్యమని ఎవరు చెప్పారు ? 
అది  మనం నమ్మి ఈ జీవితంలోని సుఖ దుఖాలను వదిలివేయాలా?
సంసారం బండి చక్రం లాగా తిరిగే చావు పుట్టుకల పరంపర. సంసారాన్ని వదలమని ఎవరూ  చెప్పరు .సుఖం కలిగినప్పుడు సంతోషంలో  , దుఖం వచ్చినప్పుడు విచారంలో మునిగి  క్రుంగి పోకుండా ,సుఖ దుఖాలను సమానంగా సమ భావనతో అనుభవించమని , అలాంటి సమ తుల్య మానసిక స్థితి లేని వారు సంపూ ర్ణ శరణాగతి తో దేవుని పైనో లేదా గురువు పైనో భారం వేసి లేదా కర్మ ఫలాపేక్ష లేకుండా ధర్మ విహిత భాధ్యతలను ,కర్మలను చేయమని , జరిగే సంఘటనలను ,జీవితాన్ని సాక్షీ భావంతో చూడటం అలవాటు చేసుకోవాలని , ఇలా
 సంసారాన్ని ఈదమని వేద ఉపనిషత్  ఋషులు , శ్రీ కృష్ణుడు చెప్పారు .
 అంటే , మనిషి ,మానసిక పరి పుష్టత ,ప్రశా మ్ తత ,ఆనందం తో
 జీవనం సాగించాలని , జీవితాలను సంతోషంగా  మానేజ్ చేసుకోవటానికి రుషు లిచ్చిన ఫార్ములా .

మనం కష్టాలు సుఖాలు అనుకోనేవన్నీ ఇతరులు  అంటే  సంఘం దృష్టిలో కొలుస్తాము .
 కనీస అవసరాలైన తిండి ,బట్ట ,నీడ ,రక్షణ ప్రతి   మానవుడికి అందే అవకాశం ప్రక్రుతి పరంగా  ఎప్పుడూ ఉంటుంది .
కానీ , డబ్బు , కీర్తి ,అధికారం ,అప కీర్తి , దరిద్రం , అందం , అనాకారి త్వం ,సౌకర్యాలు ,బానిసత్వం ,ఓటమి ,విజయం , - ఇవన్నీ ఇతరుల అభిప్రాయాలతో ,పోలికతో ముడి పడి  ఉన్న విషయాలు .
అందుకే  దేశ  కాల మాన స్థితుల బట్టి మారే ఈ విషయాలను ఎక్కువగా పట్టించు కోవద్దు ,  మనస్సు  వికలం చేసుకోవద్దు అని గీతలో చెప్పారు .

అంటే ,సంఘ అభిప్రాయాలకు విలువ ఇవ్వ నక్కర లేదా ? సంఘంతో పని లేకుండా మన ఇష్ట మొచ్చిన ట్లుగా ప్రవర్తించ వచ్చా ?
అలా అని .కాదు . కష్ట  నష్టాల లో మన మానసిక స్థితిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో  గీత చెప్పింది . సంఘాన్ని గౌరవించమని చెప్పింది . నీ మనస్సు ని   సదా  సంతోషంగా ఎలా ఉంచు కోవాలో చెప్పింది . సంఘానికి , దాని రక్షణకు మనిషి ఎప్పుడూ పాటు పడాలి .నువ్వు సంఘానికి ఏమి ఇస్తావో ,సంఘం కూడా అదే నీకు ఇస్తుంది . కాబట్టి మనిషి ఎప్పుడూ ఇతరులకు మంచే చేయాలి .

భౌతిక పరమైన వన్నీ మిధ్య అనీ , ఆత్మ ఎల్లప్పుడూ శాస్వతంగా ఉంటుమ్ దనేది  
ఎలా నిరూపిస్తారు ? 
  మిధ్య ప్రపంచానికి ,నిజమైన పరా ప్రపంచానికి  వారధి వేయ టా న్నే యోగం అని అంటారు .
 వారధిని ఎలా కట్టాలి ?
how to expand the consciousness from the finite to infinite?
how to strike rhythm between individual and cosmic vibration?

శబ్దం తో నా? రూపం తో నా? భావం తో నా? కర్మ తోనా?
శబ్దం ద్వారా అంటే మంత్ర సాధన / మంత్ర యోగం.
రూపం అంటే విగ్రహారాధన భక్తీ యోగం .
భావం అంటే జ్ఞాన యోగం.
నిష్కామ కర్మ ద్వారా అంటే కర్మ యోగం .

అన్ని యోగ మార్గాలు ఆరంభం లో భిన్నంగా ఉన్నా ,
చివరి దశలో అన్నీ ఒకే విధంగా ఉంటాయి .
ఇది సాధకులందరూ  గుర్తు పెట్టు కోవలసిన విషయం . 


No comments:

Post a Comment