Search This Blog

Tuesday 27 November 2012

ఎన్నో సందేహాలకు భగ వద్గీత :

మనిషి మనస్సు ఓ క్షేత్రమని అనుకొంటే, అరిషడ్వర్గాలు కౌరవులుగా ,బుధ్ధి వివేక విచక్షణలు పాండవులుగా జరిగిన ,జరుగుతున్న అంతర పోరాటమే మానసిక అంతర్మధన కురుక్షేత్ర  యుద్దం .


మనిషి మనస్సులో ఇంత చింతన , మోహం , విషాదం ,భయం , పిరికితనం ,బేలతనం , నిరాశ , నిస్ప్రుహ ఎందుకు కలుగుతున్నాయి ?
 మన కర్తవ్యాన్ని ఎందుకు అమలు చేయలేక పొతున్నాము ?
 ఏది ఉచితమో , ఏది అనుచితమో తెలియక ఎందుకు  
గందరగోళ పడుతున్నాము ?
మన స్వ ధర్మాన్ని ఎందుచేత గుర్తించలేక పోతున్నాము ?
అసలు స్వ ధర్మం అంటే ఏమిటి ?
స్వధర్మాన్ని త్యజించడం ఎందుచేత మంచిది కాదు ?
మనస్సు సమస్యలనుండి , బాధ్యతల నుండి తప్పించుకోవాలని ఎందుకు ఆరాటపడుతుంది ?

కాలానికి అతీతముగా ఉండేది ఏది ?
ఏది సత్య మైనది ? అంటే నిరంతరం ఉండేది ఏది ?
ఏది అనిత్యమైనది ? ఏది శాశ్వతమైనది ?
ధీరుల లక్షణాలు ఎలా ఉంటాయి ?
మోక్షానికి అర్హతలు ఏమిటి ?
ఎవరు అజ్ఞాని ?

ఆత్మ లక్షణాలు ఏమిటి ?
పునర్జన్మ ఎలా సంభవిస్తుంది ?

సుఖ దుఖాలను ,జయాపజయాలను , లాభ నష్టాలను సమానముగా స్వీకరించే మానసిక స్థాయి మనిషికెందుకు అవసరం ?
సమత్వ బుధ్ధి  , నిష్కామ కర్మాచరణ నిశ్చల మనస్సుకి దారి తీస్తుంది . 
నమ్మ వచ్చా ?

పరమాత్మ అంటే ఏమిటి ? పరమాత్మ ప్రాప్తి అంటే ఏమిటి ? 
పరమానందం అంటే ఏమిటి?
వేదాలు ఎవరికోసం ?
బ్రహ్మ ఝ్నాని అంటే ఎవరు ?
యోగమంటే సమత్వ భావమేనా ?
ఫలాసక్త్తి తో  కర్మలు చేయ కూడదా  ?
ఇంద్రియ సుఖాలని నిగ్రహించడం వేరు . ఇంద్రియ సుఖములందు ఆసక్తి తొలగిపోవుట వేరు .
విషయాసక్తిని ఎలా తొలగించు కోవాలి ?
 గీత మన సందేహాలను చక్కగా తీర్చుతుంది అనే దానికి ఒక చిన్న ఉదాహరణ :
మనిషి వివేకాన్ని ఎలా ఎందుకు కోల్పోతాడు ?
విషయాసక్తి వలన కోరిక ,అది తీర నప్పుడు క్రోధం , క్రోధం వలన వ్యామోహం ,దాని వలన మానసిక చంచలత  ,దాని వలన బుద్ది మందగించి , మనిషి పతనమవుతాడు .
ఇంద్రియ నిగ్రహం ,మనో నిగ్రహం లేని వానికి వివేకం ఉండదు .

No comments:

Post a Comment