Search This Blog

Monday, 6 January 2014

Art of Living -1

మనుషులు ఎక్కువ శాతం సామాన్యమైన వివేకం తో ,అరిశడ్వర్గాలతొ కూడిన చిత్తం తో , శారీరక,మానసిక ఇబ్బందులకు ,ఆర్ధిక పర మైన సమస్యలకు , రక్షణ గురించి కలిగే భయాలకు , అలాగే రకరకాల కోరికలను తీర్చు కొనే క్రమం లో కలిగే వత్తిడి కి  లొంగి, కుంగి పోతుంటారు .

తమ లో కలిగే ఆలోచనలకు , కష్టాలకు ,నష్టాలకు  పూర్వ జన్మ కర్మలే కారణ మనుకొని  సరి పెట్టు  కొనే వాళ్ళు కొందరు . స్వాముల కి  ,గుళ్ళ  కి వెళ్లి మొక్కు కొనే వాళ్ళు  కొందరు .

తమ బలాన్ని ,బలహీనతని తెలుసు కోలేని వాళ్ళు ,
తమకున్న స్థితిని,పరిస్థితులను అర్ధం చేసు కో ని వాళ్ళు ,
విపరీత మైన కోరికలతో వేసారి పోయే వాళ్ళు  ----- ఎవరు ఏది చెప్పినా నమ్మే స్థితి లొఉన్నప్పుడు, స్వాములు,బాబా లు ,గుళ్ళలో జరిపే కార్యక్రమాలు, సేవలు వీటన్నింటికీ ఆకర్షిత మవ్వుతారు.

చేయ వలన ప్రయత్నం శక్తి వంచన లేకుండా చేసి కోరికని, కోరిక వలన కలిగే లాభ నష్టాలను పూర్తిగా వదిలేసి ఒక శక్తి కి మనసా వాచా కర్మణా లొంగి పోవడమే  భక్తి .

అనాసక్తి  - వైరాగ్యం - కర్మ నిర్వహణ  -కర్మ ఫల త్యాగం లేదా కర్మ ఫలం పై అనాసక్తి -
 పదిమందికీ క్షేమం కలిగించేది యజ్ఞం  . మన కర్మలను యజ్ఞం వలే చేయాలి .
మనం గాలి పీలుస్తున్నాము . అన్నం తింటు న్నాము . ఆ గాలి ,నీరు , ఆహారం పదిమందికీ  అందే విధం గా మన ప్రయత్నం , కార్యా చరణ ఉండాలి . అదే యజ్ఞం .

 హోమ యజ్ఞ కార్యాలు బాహ్య పర మైన క్రతువులైనా , హోమ ద్రవ్యాలు , అప్పుడు  సంకల్పించే సమర్పణా భావనలు ఈ  విశ్వమ్ లోని అంతర్గత శక్తులకు మేలు చేసే పనులే .

ఆత్మ అంటే తన నిజ స్వరూపమని ,ఈ విశ్వ శక్తి లో అదొక భాగమని పూర్తిగా అనుభూతి చెంది - అనుభూతి కలిగించే భావం , ఆ అనుభూతిని గ్రహించే ప్రజ్ఞ , అనుభూతిని పొందే శక్తి - ఇవన్నీ ఒక్కటే అని సంభావిమ్చిన ప్పుడు మిగిలేది మౌన మే .

కానీ సామాన్యులు తమ తొలి  యత్నం గా  చేయ వలసింది --- ఫలాసక్తి లేని యజ్ఞ బద్ద  మైన  కర్మలు . అనగా మన దైనందిన పనులను, ఉద్యోగాలను , బాధ్యతలను ,నిర్ణయాలను , కోరికలను ,సమాచార సంబంధాలను , మానవ సంభంధాలను -ఫలాపేక్ష లేని యజ్ఞ బద్దంగా చేయడం అలవాటు చేసుకోవాలి .
వీటిని ప్రతి నిత్యం అభ్యాసం చేయాలి . అదే సాధన . దీనికి సహాయ పడేవి -భగవన్నామ సంకీర్తనలు, కర్తృత్వ భావం లేకుండా సమర్పణా భావం తో చేసే పూజలు,మనస్సుని అధిగ మించడానికి చేసే క్రియలు .

మనస్సుని ఎలా అధీనం చేసుకో వాలి ?
మనిషిలోని 6 జంతు  గుణాలను అధిగమించా లంటే వాటికి వ్యతి రేక మైన గుణాలను సాధన గా చేయాలి .
క్రోధాన్ని క్షమా ఓర్పు తో
కామాన్ని వైరాగ్యం తో
లోభాన్ని దానం తో
మోహాన్ని వివేకం తో
మదాన్ని అణకువతో
మాత్సర్యాన్ని కారుణ్య సేవ తో  --  - అధి గ మించే విధం గా మనస్సుని పూర్తిగా మార్చు కోవాలి .

ధ్యానం ఎంత సేపు చేస్తే అంత  సేపు మాత్ర మే మీకు శాంతిని , ఆనందాన్ని ఇవ్వగలదు . 
కానీ భగవద్గీతని నిత్య జీవితం లో అన్వయించు కొంటే ,మన జీవన మే ధ్యాన మో తుంది . 

No comments:

Post a Comment