Search This Blog

Tuesday, 28 January 2014

ఓం హూమ్ హనుమతే నమః

శంకరాంశతో  కుశంకలు తీర్చి
అంతరాళమున  ఆదిత్యుని భుజించి        
సంతసమ్ముగ్గా రాముని భజించి
సంజీవి తెచ్చి లక్ష్మణు బతికించి -ఓం హూమ్ హనుమతే నమః

రామ ముద్రను పట్టి జలధి లంఘించి
మైనాకుతో భాషించి సురసను ఏమార్చి
లంక లో అడుగెట్టి  లంకిణిని పరిమార్చి --- ఓం హూమ్ హనుమతే నమః

కడలి దాటి సీతమ్మ ను కాంచి
శ్రీ రామ రామ అనుచు సీతమ్మకు సంతసము కూర్చి
రాకాసుల  మదమణచి లంకను కాల్చి
రామ నామ మహిమను రావణుకు బోధించి - ఓం హూమ్ హనుమతే నమః

కనుగొంటి కనుగొంటి సీతమ్మ నంటూ రాముని ముదమార్చి
రామ కళను శ్రీరాముని కనుల  కాంచి
వాయు పుత్రా నీకు వందనం
వనచర పండితా నీకు వందనం
వాలి గర్వ భంగీ నీకు వందనం - ఓం హూమ్ హనుమతే నమః

అంజనాసుతునిగా  రామాంజలి ఘట్టి
సుగ్రీవు మంత్రిగా రామ స్నేహ వారధి కట్టి
వనచర శాంతి స్థాపకా,  జగజెట్టీ
ముల్లోకమ్ముల లేరు నీకు సరి సాటి - ఓం హూమ్ హనుమతే నమః

No comments:

Post a Comment