Search This Blog

Friday 9 August 2013

ఇది తేలేది కాదు !

ప్రక్రుతి వనరుల పరంగా, భౌగోళికం గా,  నదీ ప్రవాహ పరంగా ,  సాంస్కృతిక  పరంగా ,జన సాంద్రత పరంగా, జిల్లా విభజన పరంగా ,రాజధాని లో కేంద్రీకృత  అభివృద్ధి  పరంగా - ఇలా ఏది చూసినా ,ఏ రకం గా  చూసినా,   చీల్చడానికి వీలు లేని ప్రాంతం ఏదైనా మన దేశం లో ఉందీ అంటే  అది ఆంద్ర ప్రదేశ్ .
ఒక ప్రాంతాన్ని చీల్చి తే ఎన్నో కష్టాలు వస్తాయని అందరికీ తెలుసు.
సుమారు 30 సంవత్సరాలు, అంటే రెండు తరాల ప్రజలు కష్టాలు పడా లసిందే .

దేశం ఆర్ధికం గా చాలా క్లిష్ట స్థితి లో ఉంది . కొత్త పరిపాలనా యంత్రాంగానికి, ఎన్ని కోట్లు కావాలో? నిధుల కొరత,వనరుల అసమతుల్యత , ఇచ్చి పుచ్చు కోలేని ధోరణి ,కొద్ది గా కూడా త్యాగాలు చేయలేని స్వార్ధం - ఇవన్నీ
కొత్త రాష్ట్ర ఏర్పాటుకు ప్రతి బంధ కాలు.

యువత ఉద్యోగాలకు హామీ ,ఉద్యోగులకు భద్రత ,నదుల పంపకం,ప్రాంతాల పంపకం, ఆస్తులు అప్పుల పంపకం,వనరుల పంపకం -ఇవన్నీ చాల శ్రమ తో త్యాగాలతో ముడిపడ్డ విష యాలు.
నేటి కాలపు మనస్తత్వాలతో ,కుహనా నాయకులతో జరిగే పని కాదు .
అందరి మనోభావాలను  నమ్మాలి ,గౌర వించాలి.
కానీ , అంత  కన్నా ముందు సమాజ భద్రతా, కనీస అవసరాల  సరఫరా,  ,దేశ  సమగ్రత చాలా ముఖ్యమ్.
సుఖం గా అభివృద్ధి పధం లో దూసుకు పోతున్న సమాజాన్ని నిర్ధా క్షిణ్యమ్ గా సమస్యల కూపం లోకి తోసి వేయడం మంచిది కాదు.
నిజం చెప్పా లంటే ఇది తెలంగాణ ప్రజల సమస్య కానే కాదు. కొన్ని ప్రాంతాల వెనక బాటును ఎరగా చూపించి ఆత్మ గౌ రవం,ఆత్మాభిమానం, అనే రంగుటద్దా లలో ప్రాంతీయాభిమానం అనే సంకుచితాన్ని మెల్లగా మనస్సు ల్లోకి జొప్పించి, ప్రజలను ముఖ్యం గా  యువత ని తప్పు దారి పట్టించి తద్వారా సమాజ ఆర్ధిక స్థితిని కునారిల్ల చేస్తున్న రాజ కీయ పార్టీల అధికార  సమస్య.
తెలంగాణ నాయకుల సమస్యలకు సరైన పరిష్కారం ,వారికి రాష్ట్ర పగ్గాలు అప్ప చెప్ప డ మే . 

No comments:

Post a Comment