Search This Blog

Friday, 30 March 2018

మోదీ ముక్త్ భారత్'. - Lets throw away the Modi!

మోడీ ఏమిచేశాడో పరిశీలిస్తే సగటు భారతీయుడి కడుపు మండక మానదు. గత 4ఏళ్లలో మోడీ చేసినన్ని నినాదాలు,గిమ్మిక్ లు మరే ప్రధానీ చేయలేదు. అలాగే మోడీ వేసినన్ని రంగు రంగుల కోట్లు మరెవ్వరూ వేయరు,వేయలేరు. 
కాలికి చక్రాలు కట్టుకొని ప్రపంచాన్ని చుట్టేయడం, ఎదురుగా కనబడిన ఇతర దేశాధినేతలను కౌగలించు కోవడం, బాంక్ లపై విశ్వాసాన్ని దెబ్బతీయడం, దొంగలతో ,నేరస్తులతో జట్టు కట్టడం, రాజకీయలబ్ధికోసం కొందరు నేరస్థులను వదిలివేయడం, లక్షలకోట్ల ప్రజా ధనానికి విలువలేకుండా చేయడం అత్యంత గర్హనీయమైన నేరాలు. ఇన్ని నేరాలు చేసికూడా గర్వంగా ఛాతీ విరుసుకుని తిరుగుతూ ఉన్నాడంటే అది మన చేతకానితనమే!

2016 నవంబర్ లో మోడీ చేసిన ఓ అనాలోచిత చర్య భారతదేశాన్ని, సగటు భారతీయుడిని ఎంతలా కుంగదీసిందో చూస్తే, ఇదే ఏ కమ్యూనిస్ట్ దేశంలో ఐతే మోడీని ఈ పాటికి అభిశంసన చేసేసి ఉరి తీసే వాళ్ళు. నోట్ల రద్దు అనే పిడుగు బడా బాబులను ఏమీ కదిలించ లేకపోయింది. పైగా మధ్యతరగతి,కింది తరగతి భారతీయులను మాత్రం నానా కష్టాల పాలు చేసింది. 

పెద్దనోట్ల రద్దు అని చెప్పి అంతకంటే పెద్ద 2000 నోట్లను ముదిరించినపుడే, చంద్రబాబు లాంటి అనుభవజ్ఞులు అది తప్పని హెచ్చరించారు. అయినా మోడీ మొండితనం ముందు అవేమీ నిలవలేదు. 
నాలుగురకాల స్లాబులతో GST ని ప్రవేశపెట్టడం,ప్రతినెలా మార్పు చేర్పులు చేయడం, ప్రతి 3నెలలకు చిన్నా చితకా వ్యాపారులను రిటర్న్ లు పంపమని జులుం చేయడం 30శాతం వ్యాపారాలు మూతపడటానికి కారణమైంది. 
ఆయిల్ దిగుమతుల బిల్లు బాగా తగ్గిపోయినా కూడా రోజు రోజుకీ ఆయిల్ ధరలు పెంచేయడం, దేశ ఆర్ధిక గమనానికి తీవ్ర విఘాతమైంది.  
                              లక్షలాది భారతీయుల విషాద చరిత్ర ను ఒక సారి పరిశీలిద్దాం. 
  భారతీయ గ్రామీణ ప్రాంతంలో 5కోట్ల వ్యవసాయ కూలీ కుటుంబాలున్నాయి. మరో 13కోట్ల కుటుంబాలు తమకున్న చిన్న చిన్న కమతాలలో అతికష్టం మీద పంటలు పండిస్తూ తమ కడుపులు నింపుకోలేక పోవడమే కాక ఏటికేడు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. మోడీ చేసిన తెలివి తక్కువ నోట్లరద్దు ఈ మొత్తం 18కోట్ల కుటుంబాల డొక్కలను ఎండ గట్టి వారిని రోడ్డు పై పడేసింది. నోట్లరద్దు' అనే పిడుగుపాటు వలన,  వీరి ఆదాయం గత ఏడాదిగా 40శాతం తగ్గిపోయింది. అంతేకాదు వట్టిపోయిన పశువులను అమ్ముకో నివ్వకుండా చేసిన చట్టం వలన రైతులు ఇంకా కుంగిపోయారు. అటు పశువులను పెంచలేక,ఇటు వాటిని అమ్ముకోలేక నానా యాతన పడుతున్నారు.
  18కోట్ల కుటుంబాలలో సగటున రెండు ఓట్లు చొప్పున 36 కోట్ల ఓట్లు మోడీకి వ్యతిరేకంగా పడుతాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

సరే గ్రామీణ భారతాన్ని కుంగదీసిన మోడీ అనాలోచిత చర్యలు,మధ్యతరగతి పట్టణవాసులను కూడా ప్రభావితం చేసిందా?
ముందుగా చెప్పుకో వలసింది నిరుద్యోగం . అవినీతినైనా సహిస్తారు గానీ,పని దొరక్కపోవడాన్ని భారతీయ యువత సహించలేరు. ప్రతి రోజూ
  సుమారు 30000 మంది పనిచేయగల యువత పనికోసం భారతీయ సమాజంలోకి వస్తున్నారు. మరి వీరందరికీ ఏమైనా ఉద్యోగాలు కల్పించాడా మోడీ? స్కిల్ ఇండియా, మేకిన్ ఇండియా" అంటూ పిచ్చి పిచ్చి నినాదాలతో కాలం గడిపేశాడు తప్ప ఒక్క ఉద్యోగం కూడా కొత్తది ఇవ్వలేకపోయాడు మోడీ!
కొత్త ఉద్యోగాలు కాదు, ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతా ఉంటె జనంలో అశాంతి పెరగదా?
  పెద్దనోట్ల రద్దు తర్వాత 6నెలలలో సుమారు 20 లక్షల ఉద్యోగాలు ఊడిపోయాయి అంటే సమాజంలో ఎంత అశాంతి పెట్రేగిందో మోడీ గానీ, మోడీ చుట్టూ మూగిఉన్న మేధావుల కోటరీ గానీ  అర్ధం చేసుకోలేదు. ఒక ఉద్యోగం నలుగురిని బతికిస్తుందీ అనుకొంటే సుమారు 80 లక్షల మంది ప్రజలు డొక్కలు ఎండిపోతున్నాయి . ఇవేమీ మోడీకి తెలియదు. ఎందుకంటే అతడు ఒక కుహనా మేధావి.
తోలుపరిశ్రమలు మూతపడిపోవడానికి కారణం ఎవరు? మోడీ! ఆటను చేసిన తుగ్లక్ చర్యలవలన
కబేళాలు మూసేయడం వలన తోళ్ళపరిశ్రమకు తోళ్ళు అందలేదు. దానితో  ఆ పరిశ్రమలపై ఆధారపడిన సుమారు మిలియన్ మంది ఉద్యోగాలు పోయాయి.
వస్త్ర పరిశ్రమల లో 30% మూతపడటానికి కారణం ఎవరు? మోడీ! అతను ప్రవేశపెట్టి సరిగ్గా అమలుచేయలేకపోతున్న పన్ను విధానాల వలన 30% బట్టల పరిశ్రమలు మూత పడిపోవడం వలన మరో మిలియన్  ఉద్యోగాలు పోయాయి.
ఇలా మోడీ అనాలోచిత,అతితెలివి చర్యలు దేశాన్ని ఆర్ధిక మాంద్యంలోకి నెట్టివేస్తున్నాయి. ఓ పక్క అమెరికా,యూరప్,చైనాలు ఆర్ధిక ప్రగతితో దూసుకు పోతూ ఉంటే , భారతదేశాన్ని మాంద్యంలోకి తోసివేసిన మోడీని ఏ చెప్పుతో కొట్టాలి?

ఆయిల్ దిగుమతుల బిల్లు గణ నీయంగా తగ్గినా కూడా ఇబ్బడిముబ్బడిగా పన్నులు, పన్నులమీద సెస్సులు వేసేసి పెట్రోల్,డీజిల్ ధరలను ఆకాశంలో నిలిపిన మోడీ వలన పచారీ సరకుల ధరలు,ధాన్యం ధరలు కొండెక్కి కూర్చున్నాయి.
 ఇలా అనేక విధాలుగా  భారతదేశాన్ని చేతులారా నాశనం చేసిన మోడీ కి ఏ శిక్ష వేయాలి?
చిన్న చిన్న వ్యాపారులు కూడా ప్రతి మూడు నెలలకు తట్టెడు పన్ను రిటర్న్ లు దాఖలు చేయాలంటే ఎలా కుదురుతుంది.
దేనిపైనా స్పష్టత లేని మోడీ, అన్ని శాఖలను తన అధీనంలో ఉంచుకొని కేవలం 10మంది  క్షేత్రస్థాయిలో అనుభవంలేని కుహనా మేధావులను వెంటేసుకొని  ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తావుంటే 
ఆపేవారెవరూ లేరా ?

అంతేకాదు, ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నా,అక్కడ వాలిపోయి నోటికొచ్చిన వాగ్దానాలు చేసి అమాయకులను మోసపుచ్చడం మోడీకి మామూలైపోయింది. 
తమిళనాడులో నీతి -అవినీతి అనే విచక్షణ ను పక్కన బెట్టి, ఉచ్చ నీచాలు మరచిపోయి, అటు DMK  ని, ఇటు అన్నా DMK లోని రెండువర్గాలను ఏక కాలంలో  దువ్వుతున్నాడు మోడీ. 
అలాగే ఆంధ్రాలో తనచేతిలో కీలుబొమ్మలా మెసలే రెండు సత్రకాయ పార్టీలను ఎగదోసి బలంగా ఉన్న చంద్రబాబుని అణగతొక్కి ఆంధ్రాలో మోడీ జెండా ఎగరవేయడానికి అతను చేస్తున్న అరాచకాలు అన్నీఇన్నీ కావు. 
తాజాగా పదోతరగతి పరీక్ష పేపర్లు కూడా లీక్ చేయించి విద్యార్థులలో కూడా మోడీ పలుచనైపోయాడు. 2019లో ఈ విద్యార్థులకు కొత్తగా ఓటు హక్కు రాబోతుంది. మరి వీళ్ళు ఎవరికీ వ్యతిరేకంగా ఓటు వేస్తారో వివరించి చెప్పనక్కర లేదు. 
  అతని మాటే చెల్లిపోవాలనే అహం మూర్తీభవించిన మనిషి మోడీ  
మోడీకి కావలసింది అతను తాన అంటే తందానా అనే కీలుబొమ్మలు కావాలి. దానికోసం తనమాట వినని నాయకులపై  కేంద్ర నిఘా సంస్థలను వేట కుక్కల్లా ఉసికొల్పుతున్నాడు. శత్రువులపై లేని కేసులు పెట్టిస్తాడు. మిత్రులపై ఉన్నకేసులు నీరు గారుస్తాడు. ఇదీ ఫాసిజం. ఇది హిందూత్వ కానే  కాదు.   హిందువులను రక్షించే ఏకైక రక్షకుడుగా పేరుతెచ్చు కోవడానికి భారతదేశమంతటా  లేనిపోని అల్లర్లు,మతకలహాలు రెచ్చ గొట్టించి హిందువుల ఓట్లన్నీ గంప గుత్తగా భాజపా కే పడాలనే దురుదేశ్యంతో దేశంలో అశాంతి పుట్టిస్తున్నాడు. 
ఈ బాధలనుండి విముక్తి కలగాలంటే ఒక్కటే పరిష్కారం... అదే "మోదీ ముక్త్ భారత్'.


Thursday, 29 March 2018

ఎవర్రా నీకు రాజకీయాలు తెలియవంది ?

నిజానికి,అబద్ధానికి తేడా తెలియని వాళ్ళు  ఎవ్వరిని మోసం చేద్దామని భారీ  సభలు పెట్టి యువతను తప్పుదారి పట్టిస్తున్నారు ? నీ  చెయ్యి మెలితిప్పి ,చెవులు వాయగొట్టిందెవరు? ఎవరి ప్రోద్భలంతో అబద్దపు ఆరోపణలు చేస్తున్నావు?
ఇతరుల లెక్కలు గట్రా నాకు అర్ధం కావు ,నా లెక్క నాదే " అనుకొంటూ దారేపోయే వాళ్లతో కమిటీలు వేయడం ఏ లెక్క కిందకు వస్తుందో చెప్పాలి.
నాకేమీ తెలియదు,నేను కడిగిన ముత్యాన్ని "అంటూ నంగనాచి కబుర్లతో యువతను తప్పుదారి పట్టించే రాజకీయాలు ఆడేయడం సమాజానికి మంచిదేనా?
ఓ పక్క రాష్ట్రం కేంద్రం చేతిలో మోసపోతే కేంద్రాన్ని నిలదీయకుండా,  ఇక్కడ అధికారంలో ఉన్నవాళ్లు అవినీతి చేస్తూ సరిగా పోరాడటం లేదు, "నాకు ఓటేయండి ,నేను న్యాయం చేయిస్తా" అనే అమాయకుడికి రాజకీయాలు తెలియవు అంటే నమ్ముతారా?
యువతలో బలహీనతను రెచ్చగొట్టి  ,కులాన్ని అడ్డుపెట్టుకొని నాలుగు ఓట్లు దైర్యంగా అడుక్కోవడం రాజకేయం కాదా ?
అవినీతి తో సంపాదించేవాళ్లకు టిక్కెట్ లు ఇచ్చే నువ్వా, నీతి అవినీతి గురించి  మాట్లాడేది? మీ అన్న చేసిందే నువ్వూ చేస్తూ, పైకి నీతి మంతుడిలా నటించడం ఫక్తు రాజకీయం కాదా ?
నిట్టనిలువునా మోసం చేసి,రాష్ట్ర అధోగతికి కారణమైన కాంగ్రెస్,అధికారంలోకి వస్తే  హోదా ఇస్తామని చెప్పిన మాటను నమ్మేసి  కసాయి కాంగ్రెస్ వాళ్లతోనో, లేక నమ్మించి మోసం చేసిన దగుల్భాలజీ BJP తోనో  అంటకాగడానికి రెడీ  అవుతున్న నీకు రాజకీయాలు తెలియవు అంటే మేము నమ్మాలా?
ఆంధ్రా గవర్నమెంట్ లో అవినీతి కనిపెట్టిన నీకు, తెలంగాణా గవర్నమెంట్ లో అవినీతి  కనబడలేదని మెచ్చు కొంటున్న నీకు, రాజకీయాలు తెలియవు అంటే ఎలా నమ్మేది?
అవినీతి ఉంటే విచారణ చేపట్టాలి తప్ప,రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలను కేంద్రం  అడ్డుకోవడాన్ని సమర్ధిస్తావా ?
ఎవర్రా  నీకు  రాజకీయాలు తెలియవంది ?

Tuesday, 20 March 2018

You can defeat Modi...!

3000కోట్లు మీవి కావనుకొంటే , మోడీ పార్టీకి వచ్చే ఎలక్షన్ లలో 150 సీట్లు కంటే ఎక్కువ రాకుండా కట్టడి చేయవచ్చు. ఆలా ఖర్చు పెట్టలేకపోతే ,మోదీపార్టీకి 2019 ఎన్నికలలో 200 సీట్లు వచ్చే అవకాశం ఉంది. 
 వివరంగా చూద్దాం 
సువిశాల భారతదేశం యొక్క ఆర్ధిక పెరుగుదల రేటు ఏటా  కేవలం 7% గా ఉంది. ఇంతజనాభా,ఇంతపెద్ద స్వదేశీ మార్కెట్ ఉన్నదేశం ఇంత  మెల్లగా తాబేలు లెక్క ఆర్థికస్థితి పెంచుకోవడం చాల దారుణం. నిజానికి మిగతా ప్రపంచం మొత్తం ఆర్ధిక మాంద్యం నుండి బయటపడి పరుగులు దీస్తుంటే మోడీ నాయకత్వంలో కేవలం 5 నుండి 7% పెరుగుదల అంటే ఎంత ఘోరమో ఆలోచించండి!
ఆయిల్ దిగుమతుల బిల్లు చాలా తగ్గి పోవడం వలన గత 4ఏళ్లలో మన మోదీ ప్రభుత్వం 4లక్షలకోట్లను సేవ్ చేసుకొంది.  అదంతా ఏమైపోయింది?
4ఏళ్ళు నిద్రపోయి, 5వబడ్జెట్ లో రైతు సంక్షేమ పధకాలు,ఆరోగ్యరక్ష పధకాలు పెట్టారు. ఆర్ధిక పెరుగుదల రేటు ఏటా  కేవలం 7%  మాత్రమే ఉన్నపుడు,వీటికి నిధులు ఎక్కడనుండి ఎలా తెస్తారో జైట్లీ గారు చెప్పలేదు. కేవలం  రాబోయే ఎన్నికల కోసం ప్రచార ఆర్భాటం తప్ప నిజమైన పధకాలు కావవి. 
గ్రామీణ భారతం ఇంతగా కుంటుబడటానికి కారణం మోడీ తీసుకొన్న అనాలోచిత నిర్ణయాలే. పెద్దనోట్ల రద్దు , వస్తుసేవల వినిమయ పన్ను  అలాగే ప్రభుత్వం తీసుకొన్న కొన్ని నిర్ణయాలు మార్కెట్ లో కరెన్సీ కి కటకట లేర్పరచి , సామాన్యుడికి ,అలాగే మధ్యతరగతి వారికీ చుక్కలు చూపించాయి. అంతేకాదు, ప్రజల యెక్క  ఆస్తుల విలువ , సంపద విలువ  బాగా తగ్గిపోయింది.కానీ వారు ఖర్చు పెట్టే వస్తువులు,సేవల ధరలు మాత్రం తగ్గలేదు. దీనివలన మధ్యతరగతి వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అప్పులతో సతమత మయ్యేవారు,ఆస్తులు అమ్మేసి తీర్చుదామంటే కొనేవాళ్ళు లేరు. 
కొనుగోళ్లు బాగా మందగించాయి. కొన్ని స్వదేశీ. విదేశీ సంస్థలు ఫార్వార్డ్ ట్రేడింగ్ చేయడం వలన రైతులకు మద్దతు ధర లభించడం కష్టమై పోయింది. బాంక్ లలో నిరర్ధక ఆస్తులు పెరిగిపోయి దివాళా తీయడానికి సిద్ధంగా ఉన్నాయి. బాంక్ లను లూటీ చేసేవాళ్ళని,ఏదేదో చేస్తానన్న  మోడీ ఏమీ చేయడం లేదు. క్రమేణా, మోడీ విశ్వసనీయత కోల్పోయాడు. అందుకే,  ఎన్నికల సంవత్సరంలో  కొత్త బడ్జెట్లో  మోడీ ఎలాంటి తాయిలాలు చూపించినా  ప్రజలు నమ్మడం లేదు. 
సాధారణంగా, ఎలక్షన్ సమయాల్లో బడ్జెట్ లు అలాగే జనాకర్షంగా కనబడతాయి తప్ప మేలు మాత్రం జరగదు. ఒకవేళ మోడీ  నిక్కచ్చిగా చేయాలనుకున్నా , రైతు పంట మద్దతు ధర 150% పెంచడానికి ,  10కోట్ల కుటుంబాలకు 5లక్షల ఖరీదైన ఉచితవైద్యం అందివ్వడానికి  అవసరమైన నిధులు  ప్రభుత్వ ఖజానా లో లేవు.  
మధ్యతరగతి వారు  ఇప్పటికే  మోడీకి దూరం జరిగారు . 
FCRA చట్టానికి సవరణ చేసి విదేశాలనుండి రాజకీయ పార్టీలకు  1976 నుండి వచ్చిన డొనేషన్ లను చట్టబద్ధం చేశాడు . ఇది ఎంత ఘోరమో చూడండి. 
On March 13, 2018, Parliament’s lower house, the Lok Sabha, passed without debate funding demands from 99 Indian government ministries and departments, including two bills and 218 amendments.
మన సొంత తయారీ తేజస్"కంటే తక్కువ సామర్ధ్యమున్న 1000  రాఫెల్ జెట్ లను  ఢసాల్ట్ కంపెనీ నుండి అత్యధిక ధరకు  కొన్నాడు. 
MINIMUM GOVERNMENT AND MAXIMUM GOVERNENCE" అని చెప్పిన మోడీ ఆ మాటను మరచిపోయి,కేవలం BJP పార్టీని దేశమంతటా ఎలాగైనా సరే వ్యాపింపచేసి , బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీ లీడర్లను అణచివేసి రాష్ట్రాల అధికారాలను కాలరాచి భారతదేశాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని నిరంకుశంగా చైనాకి చెందిన జిన్ పింగ్ లా పాలించాలని కుట్రపూరితంగా ఆలోచిస్తున్నాడు. తనకు తోచిందే రైట్" అనుకొంటున్నాడు. అంతేకాదు  పూర్వం 10 ఏళ్లపాటు పాలించి దేశాన్ని భ్రష్ట్టు పట్టించిన కాంగ్రెస్ పాలనలో ఎలాంటి  పధకాలు ఉన్నాయో , వాటినే పేర్లు మార్చి కొనసాగిస్తున్నాడు . దీనికి మూలకారణం ఆర్ధిక శాఖ లో ల్యూటిన్ కాలపు కార్యదర్సులను కొనసాగిస్తూ ఉండటమే!
చిదంబరం,మన్మోహన్ సింగ్,జైట్లీ,మోడీ వీలందరూ కేవలం బయటకు కనబడే బొమ్మలు.వీళ్లకు కిర్రెక్కించి ఆడించేది ల్యూటిన్ కాలపు మైండ్ సెట్ తో ఉండే  కార్యదర్సులు ,బ్యూరోక్రాట్ లు.  
మరి మనం ఏమిచేయాలి ?

ఎవరైనా ధనవంతుడు, అతనికి ఉన్న విదేశీ సంపద నుండి 3000 కోట్లు ఖర్చు పెడితే మన స్టాక్ మార్కెట్ కుప్ప కూలిపోతుందని ఒక ఆర్థికవేత్త చెప్పాడు. ఎన్నికలకు ముందు స్టాక్ మార్కెట్ పడిపోతే మధ్యతరగతి ఓట్లు మోడీకి పడవు. ఇది ఒక అంచనా మాత్రమే సుమా ! నిజానికి అంత ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. 2019 ఎన్నికలలో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు, కులమత పోలరైజేషన్ కు లొంగ కుండా కాస్త దేశాభిమానం తో ఉంటే చాలు. 
హిందుత్వ ను భారతదేశంలో స్థాపన చేసే ది మోడీ కానే  కాదు. విదేశీ తొత్తులు ఆ పని ఎందుకు చేస్తారు?
విదేశీ బాంక్ లే మన రాజకీయపార్టీలకు నిధులు, డొనేషన్ లు  బాహాటం గా ఇచ్చే రోజు వస్తుంది. అలంటి చట్టాన్ని నిస్సిగ్గుగా మొన్న పాస్ చేశారు. అపుడు మన పార్లమెంట్ లో ఉండేది విదేశీ తొత్తులు తప్ప భారతీయులు కాదు. ఎన్నికలలో ఎవరు గెలిస్తే మాత్రం ఏమిటి లాభం? వాళ్ళను  విదేశీ తొత్తు లుగా మార్చే డబ్బు మూటలతో విదేశీ కంపెనీలు సదా సిద్ధంగా ఉంటాయి. 
ఏది ఏమైనా  ఇపుడు మోడీ ని దేశ భక్తులు ఎవరైనా  ఓడించవచ్చు. తప్పనిసరిగా ఓడించాలి కూడా !ఎందుకంటే మోడీ నమ్మకాన్ని నిలబెట్టుకో లేకపోయాడు. ప్రజావిశ్వాసాన్ని రోజు రోజుకీ కోల్పోతున్నాడు . భారతీయుల ముఖాలలో నవ్వుని తీసేసిన మోడీ ని ఎవరుమాత్రం ఎలా బలపరుస్తారు?


Be careful....! Modi is ruling

రైతులు సంతోషంగా లేరు. మద్దతు ధరలు లేవు. పెట్టుబళ్ళు ఇచ్చే బాంక్ లన్నీ దివాళా తీయడానికి సిద్ధం గా ఉన్నాయ్ . అస్మదీయులకు వేలకోట్ల ఋణాలు మంజూరు చేస్తూ రైతులకు వేయి రూపాయలు ఇవ్వడానికి సవాలక్ష రూల్స్ పెడుతుంది కేంద్రం. రుణాలను ఎగవేత వేసే సొంత వాళ్ళను విదేశాలకు పారిపోయేటట్లు వెసులుబాటు ఇస్తున్నాడు మోడీ.  10లక్షలకోట్ల నిరర్ధక ఆస్తులతో బ్యాంకు లు దివాళాతీయడానికి మూలకారణం కాంగ్రెస్ మరియు మోడీ ప్రభుత్వాలే! ఎందుకంటే  మోడీ అధికారం చేపట్టిన తర్వాత, గత 4 ఏళ్లలోనే సుమారు 4లక్షల కోట్లు నిరర్ధక ఆస్తులుగా లెక్క తేలింది.

రాష్ట్రాలు సంతోషంగా లేవు. 14 వ ఆర్ధిక సంఘం పేరిట  లెక్కలన్నీ తారుమారు చేస్తుంది . అదేమని అడిగితే రాష్ట్రాలలో నానా రభస సృష్టిస్తుంది  కేంద్రం.  కాగ్ చేసిన లెక్కలు పక్కన పడేసి  పార్టీకార్యకర్తలకే రాష్ట్ర పద్దుల ఆడిటింగ్ అప్పచెబుతుంది.  GST పేరిట వసూల్ చేస్తున్న పన్నుల లో 30% బ్లాక్ మార్కెట్ దార్ల చేతుల్లోకే పోతున్నాయ్ తప్ప ఖజానకి చేరడం లేదు. పైపెచ్చు సామాన్యుల  ఆదాయంలో 40%  ప్రత్యక్ష ,పరోక్ష పన్నులకే పోతుంది.

సామాన్యులు సంతోషంగా లేరు. "పెద్దనోట్ల రద్దు"అని చెప్పి మరింతపెద్ద నోటు ను విడుదల చేయడంతో  ధనం మరింతగా వ్యవస్థలోకి రాకుండా చీకట్లోకి పోతుంది. మోదీకి చదువులేకపోయినా మంచి చురుకైన బుర్ర ఉందని నమ్మామ్ . కానీ అదీ లేదని తేలిపోయింది. ఎన్నికల కోసం నానా అబద్దాలు,  మాట వినని ప్రాంతీయ నాయకులను భయపెట్టడం, తనమాట వినే నేరస్థులపైనున్న కేసులను నీరుగార్చేయడం , నిరంకుశంగా తప్పులమీదతప్పులు చేయడం మోడీకి మామూలై పోయింది. దీని వలన నిరుద్యోగ సమస్య తీవ్రతరం అవుతుంది.ఆర్ధిక మాంద్యంలో దేశం కూరుకు పోతుంది. మోడీకి   కేవలం వాగాడంబరం, పైపై పటాటోపం  తప్ప అంకిత భావంతో  చేసే హృదయంకూడా లేదని తేలింది.

యువత సంతోషంగా లేరు. ఎటు చూసినా నిరుద్యోగం . ఇండియాలో తయారీ, పరిశుభ్రమైన భారత్ , సొంతకాళ్ళ పై నిలబడ్డ భారత్, వికాస భారతం, ... ఇలా లేని పోనీ ఆడంబర డంబాలు తప్ప క్షేత్రస్థాయిలో  చెప్పుకోతగ్గ  పెద్దపరిశ్రమ గానీ , ప్రాజెక్ట్ గానీ నిర్మించలేదు. చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రులు ఎవరైనా నానా కష్టాలు పడి  ఏదైనా ప్రాజెక్ట్ నిర్మాణం చేద్దామనుకొంటే మోడీ మోకాలడ్డం పెడుతున్నాడు.

సహచర కేంద్ర మంత్రులు సంతోషంగా లేరు. ప్రధాన మంత్రి ఆఫీసు రాజదర్బార్ లెక్క పనిచేస్తూ మిగతా మంత్రుల స్వయం చాలిత  అధికారాన్ని కూడా హరించివేస్తుంది . ఒక్క ప్రధానమంత్రి తప్ప మిగతా మంత్రులందరూ కాగితాలకే పరిమితం. మోడీ ఒక్కడే సార్వభౌముడిగా నిరంకుశ అధికారాన్ని వెలగబెడుతున్నాడు. సరే,రాజు ప్రజ్ఞా దురంధరుడు అయితే ప్రజలకు మంచిదే! కానీ మోడీ అసంపూర్ణజ్ఞాని !

వైద్యులు సంతోషంగా లేరు. జాతీయవైద్యాకమిషన్ పేరుతొ తిక్క తిక్క చట్టాలు చేసి దేశీయ వైద్యాన్ని,ఆధునిక శాస్త్రీయ వైద్యాన్ని కలగాపులగం చేయడానికి మోడీ నడుం బిగించాడు. అంతేకాదు మెడికల్ విద్యలో వేలుపెట్టి, 60% మెడికల్ సీట్లను యాజమాన్యం అమ్ముకోటానికి వీలుగా , మెడికల్ మాఫియాకి కొమ్ముకాసే విధంగా చట్టాలు తయారు చేస్తున్నాడు.

కొండలాంటి పనికిరాని విగ్రహాలు, ఇప్పట్లో పూర్తికాని బులెట్ రైళ్లు , స్వచ్ఛ గంగ పేరిట నిధులన్నీ గంగపాలు  చేయడం, అవినీతిని కడిగేస్తానని చెప్పి పైస్థాయిలో  అవినీతి ని ప్రోత్సహించడం,బ్యాంకు ల దివాళా, ఎన్నో పబ్లిక్ సంస్థలను కారుచౌకగా అస్మదీయులకు అమ్మేయడం, ఆర్థికనేరాలుచేసిన వారిని అక్కునచేర్చుకోవడం  తదితర  అభివృద్ధి నిరోధక  చేష్టలు మిక్కుటంగా చేస్తున్నాడు మోడీ.
ఓ పక్క రైతులు ఆకలితో అల్లాడుతూ చావుకేకలు పెడుతుంటే, ఉద్యోగుల ఓటుబాంక్ ను కాపాడుకోవడం కోసం , 7 వ కమిషన్ చెప్పిందంటూ  ఉద్యోగులకు ఏకంగా 3రేట్లు జీతాలు
పెంచేసి న మోడీని ఏమనాలి?
 కులలు గా, మతాలుగా విడిపోయిన భారతీయులను మరింతగా విడదీసి ఒకరిపై మరొకరిని ఉసికొలిపే విధంగా ఓట్లకోసం మతకల్లోలాలు , సీట్లకోసం కులాలకుమ్ములాటలు పేట్రేపుతున్న సంఘ్ పరివార్ తోకలిసి మోడీ ఆడుతున్న నాటకం ఈ దేశానికి పెద్దప్రమాదం. 
తస్మాత్ జాగ్రత్త!

Thursday, 15 March 2018

modi+jagan+pavan = < chandrababu = jai aandhra!

మోడీకి తమపార్టీ భవిష్యత్ ముఖ్యం. అదే సమయంలో ప్రధానిగా అన్ని రాష్ట్రాలను చూసుకోవలసిన బాధ్యత కూడా  ఉంది. కానీ మోదీ దేశ ప్రయోజనాలకంటే తన పార్టీ నే ముఖ్యమనుకొని దక్షిణ భారత దేశాన్ని గాలికి వదిలేస్తున్నాడు . చంద్రబాబు  రాష్ట్రప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలను జోడు గుర్రాల స్వారీగా రెంటినీ సమానంగా చూస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈ విషయంలో దేశంలోనే బెస్ట్ ముఖ్యమంత్రి గా చంద్రబాబుని చెప్పుకోవాలి.
అవినీతి అనేది సమాజంలో ఒక భాగంగా మారిపోయిన కాలంలో ప్రభుత్వాల అవినీతి గురించి విపక్షాలు బురద జల్లడం మామూలే . అవినీతిని తరిమేసి,నల్లధనాన్ని పట్టుకొస్తాం అని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన ప్రధాని ఎంతవరకు సఫలం అయ్యారో అందరికి తెలుసు. నల్లధనం పక్కనపెట్టండి. బ్యాంకు లోని తెల్లధనాన్ని లూటీ చేసినవాళ్లను ఉపేక్షించే ప్రధానిని ఇంకా ఎవరు విశ్వసిస్తారు?
పిల్ల కాంగ్రెస్ కి  ఒక బాధ్యతానేది లేదు,కేవలం తనపై ఉన్న కేసులనుండి ఎలా తప్పించుకోవాలనే ధ్యాస తప్ప! తల్లి కాంగ్రెస్ ను ఒక పార్టీగా చూడటం మానేసి 60నెలలవుతుంది.
పవన్ లాంటి అనుభవ శూన్యులు ,ఏమాత్రం అవగాహన లేకుండా గందరగోళం పడిపోతూ,  ప్రజలను కూడా గందరగోళంలో పడేస్తున్నారు. ఏవో  పేపర్లలో వచ్చిన  నిరాధారమైన వార్తలు చదివేసి ఒకరిపై  బురద జల్లే మనస్తత్వం పవన్ కి ఉండటం బాధ వేస్తుంది . BJP&JAGAN చేతిలో కీలుబొమ్మలా మారిపోవడం ఇతని స్వార్థపర రాజకీయ చతురత ను  వెల్లడి చేస్తుంది . 
ఆంధ్రులు ఆలోచించాలి. ఇకనైనా కులమతాలకు అతీతంగా అలోచించి, రాష్ట్రప్రయోజనాలకు ఎవరైతే కట్టుబడి ఉన్నారో,కట్టుబడి ఉంటారో వారి నే బలపరచాలి . అలా జరగకపోతే నష్టపోయేది ఆంధ్రులే!
 మోడీ గురించి మొదట్లో ఈ బ్లాగులోనే ఎంతో మంచిగా వ్రాశాను . నేనేకాదు, మెజారిటీ భారతీయులు మోడీ బాగా పాలనా చేస్తాడని నమ్మారు . కానీ ఏటికి ఏడాది అతని పాలన లోని లోటుపాట్లు భారతీయులను కుంగదీస్తున్నాయి. చివరికి ఎలా వచ్చిందంటే, కుంభకోణాల మయమైన కాంగ్రెస్ పాలనే మెరుగు అనే అభిప్రాయానికి జనం వచ్చేస్తున్నారు.  ఒకో రాష్ట్రంలో,ప్రాంతీయపార్టీల జుట్లు ముడివేసి పబ్బం గడుపుకొంటానికి ప్రయత్నం చేస్తూ,ఆ క్రమంలో ఎదురుతిరిగే  రాష్ట్రాలకు నిధులుగానీ, ప్రాజెక్ట్ లు గానీ కేటాయించకుండా కట్టడి చేస్తున్నారు మోడీ&షా. ఉదాహరణకు ,ప్రత్యేకహోదా ఇవ్వమని డిమాండ్ చేస్తున్నందుకు శిక్షగా  జగన్ ని,పవన్ ని కలిపి,చంద్రబాబు పైకి ఉసిగొల్పడం
మనం చూస్తున్నాం. మోదీకి ఉచ్చము నీచం అనే తేడా లేదు. బ్రిటిష్ వాళ్ళు, ఇందిరాగాంధీ పాలించినట్లే "విభజించు -పాలించు" అనే సూత్రాన్ని నిర్ధాక్షిణ్యంగా అమలు చేస్తున్నారు.  
అంతేకాదు తనకు ఎదురుతిరిగిన వాళ్లపై లేనిపోని కేసులు బనాయించడం,తనకు దాసోహం అన్న వారి  పై నున్న కేసులను నీరుగార్చేయడం మనం చూస్తున్నాం. 21వ శతాబ్దంలోకూడా కోలోనియల్ పద్ధతులు,ఫాసిస్ట్ చర్యలు చేయడం చూస్తుంటే జాతీయ పార్టీల పాలనా ఇంతే అనే నిర్వేదం వస్తుంది. 
ఎందుకంటే మార్పు తెస్తానని నమ్మించి మోసం చేసిన మోడీ గురించి ఒక్కసారి పరిశీలించండి...
అవినీతిని తరిమేస్తానన్నమోడీ మరింతగా అవినీతిపరులకు సాయం చేస్తున్నాడు .  మధ్యతరగతి వారిని పూర్తిగా దోచేసే  చట్టాలు చేసి ఆర్ధికవ్యవస్థ ను అతలాకుతలం చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్,బంగారం,పరిశ్రమలు ,షేర్ లు , బ్యాంకింగ్ తదితర రంగాలు పూర్తిగా కుదేలై పోతున్నాయి.
పాలనలో పారదర్శకత అంటే సాంకేతికత ను ఉపయోగించి పక్కదారిపట్టకుండా అనగా ఉద్యోగులు,చోటా రాజకీయనాయకులు దోచేయడానికి వీలులేకుండా , లబ్దిదారులకు సంక్షేమపథకాలు అందేటట్లు చేస్తున్నాడు.  అంతవరకూ మెచ్చు కో వచ్చు. కానీ ఆలా సేవ్ చేసిన ధనాన్ని మళ్ళీ తనకు ఇష్టమొచ్చిన పారిశ్రామికవేత్తలకు పంచే  ఏర్పాట్లు చేస్తున్నాడు. ఆ ధనాన్ని ఓటు బ్యాంకును  కైవసం చేసుకోవడానికి వినియోగిస్తున్నాడు . అంతేతప్ప మౌలిక సదుపాయాల కల్పనకు తద్వారా ఉద్యోగ కల్పనకు చేయూత నివ్వకుండా కేవలం తన పార్టీ ఎన్నికల  ప్రచారానికి, పైపై మెరుగులు అద్దే కార్యక్రమాలకు ధనం  వెదజల్లుతున్నాడు.
ఇలా వెదజల్లుతున్న మోడీ కి  ఓటర్లు తప్ప మనుషులు కనబడరు.
 బ్యాంకింగ్ రంగం పూర్తిగా అవినీతితో కుళ్ళి పోయేటట్లు చేసిన కాంగ్రెస్ పార్టీ కంటే మిన్నగా మోడీ ఏమీ చేయడం లేదు. పెద్దనోట్ల రద్దు, జి ఎస్ టి అనేవి మంచివే అయినా వాటిని అమలుచేసిన తీరు ఆర్ధికమాంద్యానికి దారి తీసింది.
ప్రజాస్వామ్య మనే దానిపై మోడీకి విశ్వాసం లేదు. క్రమేణా ఫాసిస్టు పోకడలు కనబడుతున్నాయి. అందుకే ప్రజాస్వామ్య బద్ధ అటానమస్ సంస్థలను మూసేసి, పార్టీ, ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మల్లా ఆడే సంస్థలను స్థాపిస్తున్నాడు.
కాంగ్రెస్ నక్క లాంటిదైతే మోదీ నాయకత్వంలో బి జె పి తోడేలు లెక్క ప్రవర్తిస్తుంది. ప్రాంతీయపార్టీల కు స్వార్ధం,అధికార అభిలాష తప్ప రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకొనే తీరిక ఉండదు . 
రాష్ట్రం కోసం  కష్టపడిపనిచేసే టి డి పి లాంటి పార్టీలు చాలా తక్కువ. అందుకే మూడో కూటమి అనేది కూడా చెప్పుకోవడానికి బాగానే ఉన్నా ,ఆచరణలో ఫలితాలు ఇచ్చేది కాదు.
ఏదిఏమైనా , దేశంలోని సంపద అన్ని రాష్ట్రాలకు,అన్ని జిల్లాలకు సమానంగా అందించే వ్యవస్థ రావాలి . అలంటి వ్యవస్థను కదం తొక్కించే ప్రభుత్వం కావాలి . ఎన్నికలవరకే పార్టీలు. ఆ తర్వాత అందరూ దేశంకోసం క్రమశిక్షణ తో పనిచేయాలి. అవినీతి కేసులను విచారించడానికి లోకాయుక్త,లోకపాల్ , ఫాస్ట్ ట్రాక్ కోర్టులను నియమించి 6నెలల్లోనే తీర్పువెలువడే సిస్టం ఉండాలి. ఏదైనా ప్రాంతపు ప్రజల మనోభావాలను గౌరవించకపోతే క్రమేణా వాళ్ళు దేశం అనే ప్రవాహం నుండి పక్కకు తొలగిపోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా సౌమ్యంగా డీల్ చేయాలి. ఉదాహరణకు, ఆంధ్రులకు ఉన్నంత అవగాహన మరే ప్రాంతానికీ ఉండదు. వారు ఆర్థికపరమైన దోపిడీ కి గురవుతున్నామని గట్టిగా నమ్ముతున్నారు.
ఎందుకంటే విభజన వారు కోరుకోలేదు. పైపెచ్చు, ఎక్కువశాతం  అప్పులు వాళ్ళనెత్తిపై పడేసి,తక్కువశాతం ఆస్తులు అనగా భవనాలు,సాగునీరు,విద్యుత్ , ఖనిజ సంపద  వాళ్లమొగాన కొట్టారు. అంతేకాదు, ఆదాయాన్ని ఇచ్చే పాడికుండ లాంటి రాజధాని నుండి బయటకు తోసేశారు.  ఆదాయం ఇచ్చే వనరులన్నింటినీ లాక్కొన్నారు.
    కోరుకొని విభజన వలన ఒక్కసారిగా  ఒడ్డున పడ్డ చేపల్లా గిల గిల లాడుతున్నారు ఆంధ్రులు.
వ్యవసాయ భూమి తప్ప, పరిశ్రమలు,  సర్వీసు సెక్టార్ సంస్థలు,నగరాలు   లేని రాష్ట్రం వారి కి  మిగిలింది.  కాస్త సాయం అందిస్తే చాలు,అల్లుకుపోయే సత్తా ఉన్న ప్రజలకు కష్టపడిపనిచేసే చంద్రబాబు నాయకుడిగా దొరికాడు.అలంటి సమయంలో నేనున్నా' నంటూ మోడీ చేయందించాడు. నమ్మాము .
విధిలేని పరిస్థితిలో ఇవ్వాళ కాబోతే రేపైనా  సాయం చేయడా? అనుకొంటూ 4 ఏళ్ళు ఎదురు చూశాం . చివరి బడ్జెట్ లో కూడా మొండి చేయి చూపించే సరికి ఆంధ్రుల కు అర్ధమైపోయింది. మాటతప్పాడు మోదీ! నమ్మించి మోసం చేశాడు మోడీ!
పునర్ వ్యవస్థేకృత చట్టం ప్రకారం 2024 లోపుగా , ఆయా షెడ్యూల్ ల లోని వాటిని అమలు చేయడానికి  ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వ వలసింది అక్షరాల రూ. 3లక్షల 25వేల కోట్లు. కానీ చెప్పుకొంటే సిగ్గుచేటు, ఇప్పటి వరకు విదిల్చింది కేవలం 12 వేలకోట్లు. ఎంతవరకు దిగజారారంటే,80% చేసేశాం,ఇంకా పెద్దగా ఏమీ చేయనక్కరలేదని బుకాయిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని ఏమిచేయాలి?
అభివృద్ధి చెందిన రాష్ట్రాలైన గుజరాత్,మహారాష్ట్రలో మెట్రోలు, బుల్లెట్ రైళ్లు, అంతర్జాతీయ నగరాలు , ఎక్స్ ప్రెస్ రోడ్లు వేయడానికి లక్షలకోట్లు గుమ్మరిస్తూ అనాథలా పడిపోయిన ఆంధ్రాకి  ఏమీ ఇవ్వకుండా ఎదురు మాట్లాడుతున్న కేంద్రప్రభుత్వాన్ని ఏమిచేయాలి??
ఇలాంటి స్థితిలో నాయకుడనే  వాడు ఏమి చేయాలి ?కేంద్రం పై పోరాడాలి . అంతే తప్ప పోరాడేవాళ్లపై బురదజల్లకూడదు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరదంటున్న కేంద్ర ప్రభుత్వాన్నిగానీ, ప్రధాని నరేంద్రమోదీనిగానీ ఒక్క మాట అనలేదు పవన్. నామమాత్రంగా వైకాపాను విమర్శించారు. లోకేష్‌, చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడానికే  మీటింగ్ పెట్టారు తప్ప ఇది ప్లీనరీకాదు,పాడూ కాదు. పార్టీలో ఎవరున్నారో చెప్పలేరు. ఇలా వచ్చి  బాధ్యతా రహితంగా నాలుగు మాటలనేసి,బురద జల్లేసి,తర్వాత హైదరాబాద్ పోయి సినిమా కధలు వింటారు . 
రాష్ట్ర ప్రయోజనాలు సాధించు కో వాలంటే కేంద్రం పై జాగ్రత్తగా ఆచితూచి ఎత్తులువేస్తూ పోరాడాలి. అంతే తప్ప పోరాడేవాళ్లపై బురదజల్లకూడదు.ఇది బురద జల్లే సమయం కాదు. అందరూ సంఘటితమై పోరాడి ఉద్యమం చేయవలసిన సమయం. 
పవన్ లాంటి మంచి వ్యక్తులు రాజకీయాలు ఆడకూడదు. చేతనైతే రాష్ట్రానికి పనికొచ్చే పనులు చేయాలి. అంతేగానీ,పోరాడేవాళ్ళను బలహీనపరచ కూడదు.
 “అవినీతి చిట్టా ప్రధానమంత్రి దగ్గర ఉంది.అందుకే భయంతో ఎదిరించలేకున్నారు” అని ఆరోపణ చేసే ముందు నిజాలు తెలుసు కో కుండా ఎలాపడితే ఆలా వాగేయ కూడదు.దమ్ముంటే కేంద్రాన్ని ప్రశ్నించాలి . ఆలా చేయకుండా దారినపోయే దానయ్యలా గాలికబుర్లు పోగేసి బాధ్యతా రహితంగా మాట్లాడటం మంచి పధ్ధతి కాదు. 
ఎలాంటి ఆధారాలు లేకుండా,కేవలం సాక్షి పేపర్లో చదివి ,ఇలాగట ,అలాగట అంటూ గాలి పోగేసి,ఒక వ్యక్తిపై బురద జల్లితే,ఒక వ్యక్తి యెక్క వ్యక్తిత్వాన్ని హననం చేస్తే రాష్ట్రప్రయోజనాలు సిద్ధిస్తాయా?
“వాళ్ళకంటే నేనే శుద్ధం” అని అందరూ చెప్పుకొని నాకే ఓట్లేసి అధికారం అప్పచెబితే,అపుడు నేను కేంద్రంతో పోరాడుతా! అంటున్నాడు పవన్.
"ఈ 4ఏళ్ళు నువ్వేం చేశావ్ ? నువ్వు తప్పు చూపించినపుడల్లా అగ్గగ్గ లాడుతూ ఆ తప్పుని దిద్దుకోవడానికి ప్రయత్నీమ్చి నిన్ను ఓ పెద్ద నాయకుడిగా చేయడం చంద్రబాబు తప్పు. ఉద్దానం సమస్య నీ కంటే ముందే అచ్చెన్నాయుడు భుజానవేసుకొన్నాడు. తుందుర్రు సమస్యలోతులు నీకు సరిగ్గా అర్ధమే కావు" ...  ఇలా ప్రజలు మాట్లాడుకొంటున్నారు. 

ఫాతిమా కాలేజీ విద్యార్థులకు న్యాయం చేయ వలసింది కేంద్రమే తప్ప రాష్ట్రం కాదు. ఈ విషయం కూడా తెలుసుకో కుండా బహిరంగ సభల్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఏదో కరడుగట్టిన రాజకీయ స్వార్ధపరులకు చెల్లుతాయి గానీ పవన్ లాంటి మంచి వ్యక్తికి నప్పవు.
ఎర్ర చందనం స్మగ్లింగ్ పై అలుపెరగ కుండా పోరాటం చేస్తున్న ప్రభుత్వం పై అబద్ధపు ప్రచారాలు చేయవలసిన అవసరం పవన్ లాంటి నిస్వార్ధ పరుడుకి ఎందుకుంది?
2016లో జరిగిన నోట్లరద్దు సమయంలో జరిగిన శేఖర్ రెడ్డి ప్రహసనాన్ని తీసుకొని అందులో లోకేష్ పాత్ర ఉందని సాక్షి పేపర్ వాళ్ళు అల్లిన కధ”లో నిజానిజాలు చూసుకో కుండా,2 ఏళ్ల తర్వాత ఇలాంటి అభాండాలు వేసేది పవన్ కాదు, వెనుక ఓ పెద్ద జాతీయ పార్టీ ఉందని”ప్రజలు అనుకొంటున్నారు .

రేపో మాపో, పవన్ ఆమరణ దీక్ష చేయడం,కేంద్రం ఏదో వరాలు ప్రకటించి పవన్ దీక్షను విరమింప చేయడం, ఉద్యమకారుడి లెక్క పవన్ ని జాతీయ పైడ్ మీడియా లో ఆకాశానికెత్తడం , ఇవన్నీ రాబోయే జనసేన సినిమాలో టీజర్స్”అనే భావం ప్రజల్లో ఉంది.

“పవన్ కూడా మామూలు రాజకీయ నాయకుడే!పవన్ కూడా జగన్ లా కేంద్రానికి తొత్తులా ఆడే కీలుబొమ్మే!ఆయనకు రాష్ట్రప్రయోజనాల పై ఎలాంటి శ్రద్ధ లేదు” అని అందరూ అనుకొంటూ ఉంటే బాధ కలుగుతుంది.

పవన్ లాంటి మంచి వ్యక్తులు రాజకీయాలు ఆడకూడదు .చేతనైతే  రాష్ట్రానికి పనికొచ్చే పనులు చేయాలి. అంతేగానీ,పోరాడేవాళ్ళను బలహీనపరచ కూడదు. 
పొరపాట్లు చేయడం మానవ సహజం. ఇప్పటికైనా మోడీ మనిషిగా,మంచి నేతగా మారాలి.పవన్ మంచి  మార్గంలో నడవాలి. ఎందుకంటే రాష్ట్రం కోసం . 
లేదూ , మాకు రాష్ట్రప్రయోజనాలకంటే మా సొంత ప్రయోజనాలే ముఖ్యమని మీరనుకొంటే ,ఇక చెప్పేదేమీ లేదు!యుద్ధమే!

Thursday, 8 February 2018

Andhras are not fools....

ముందు రెవెన్యూ లోటు గురించి మాట్లాడుకొందాం. ఆనాడు అనగా విభజన జరిగిన సంవత్సరంలో కాగ్  లెక్కవేసి ,రెవెన్యూ లోటు 16000కోట్లుగా తేల్చింది . తర్వాత 14 వ ఆర్ధిక సంఘం లెక్కవేసి రెవెన్యూ లోటు సుమారు 9000కోట్లు అని చెప్పారు.
అమరావతికి నిధులు ప్రతి ఏటా కనీసం 10000కోట్లు ఇవ్వవలసి ఉంది . కానీ దాని ఊసు  లేకుండా 5బడ్జెట్ లు కానిచ్ఛేసి ,ఇంకా ఎదురు చూడమంటున్నారు.
పోలవరం తదితర ఇరిగేషన్ ప్రాజెక్ట్ లకు నిధులు సకాలంలో ఇవ్వడం లేదు. ఇచ్చినా అరకొర గా విదిలిస్తున్నారు.
ఇ ఏ పి ప్రాజెక్ట్ లకు కాలు అడ్డమువేసి కాలయాపన చేస్తున్నారు. హడ్కో,నాబార్డ్ ద్వారా నిధులు ఇచ్చే అవకాశమున్నా లేనిపోని సాకులు చెబుతున్నారు.
ఇప్పటివరకు పేపర్ ప్రకటనలకే పరిమితమైన జాతీయ స్థాయి సంస్థలకు ఇప్పటివరకు ఎలాంటి నిధులు ఇవ్వలేదు. కనీసం ఆఖరి బడ్జెట్ లో నూ  నిధులు కేటాయించలేదు.
మిత్రపక్షంగా ఉంటున్నా ,ఏనాడూ మాకు సరైన సమాచారం ఇవ్వడం లేదు. నాలుగు ఏళ్ళు సహనంతో ఎదురు చూసినా ,మాకు నిరాశ మిగిల్చారు. బడ్జెట్ ప్రిపేర్ చేస్తున్నపుడు మిత్రపక్షాలనుండి ఇన్ పుట్స్ తీసుకోవాలన్న ఇంగితం కూడా లేదు.
చట్టప్రకారం ఆంధ్రాని  ప్రత్యేకరాష్ట్రంగా చూడవలసి ఉన్నా , కనీసం, ఇతర  రాష్ట్రాలకు మామూలు గా  నిధులు ఇస్తున్నట్లుగా,  ఇవ్వడానికి  కూడా నానా యాగీ చేస్తున్నారు. ఎన్నిసార్లు మీ దగ్గర పడిగాపులు కాయాలి ? ఎన్ని ఫైల్స్ మీకు పంపాలి? ఎన్ని యూసర్ బిల్స్ పంపాలి?
విభజన లో 9,10 షెడ్యూల్ లోని ఆస్తుల పంపకాలనూ మీరు పూర్తి చేయలేదు.
మేమేమీ బిచ్చమ్ అడగడం లేదు. న్యాయము , చట్టం ప్రకారం మాకు రావలసియున్న వాటినే డిమాండ్ చేస్తున్నాం.
భౌగోళిక ప్రాతిపదికన ఆస్తులు, జనాభా ప్రాతిపదికన అప్పులు, వినియోగం ప్రాతిపదికన విద్యుత్‌, జనాభా ప్రాతిపదికన ఉద్యోగుల పింఛన్లు విభజించి న్యాయం చేస్తానన్న  కేంద్రం ఇంతవరకు ఆ పనిపూర్తి చేయలేదు. ఉభయరాష్ట్రాలకు ఒక్క గవర్నర్ ని పెట్టారు. ఎపుడైనా ఎంతవరకు పని అయింది అని గవర్నర్ ని  ఆరా తీశారా? 

ప్లానింగ్ కమిషన్ అనేది స్వతంత్ర ఆర్ధిక సంస్థ . ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు కేటాయించాలో నిర్ణయించే అటానమస్  అధికారం ఉన్న  ఆ సంస్థను రద్దు చేసి , నిధులను రాష్ట్రాలకు పంచే అధికారాన్ని కేంద్రం తన చేతిలోకి తీసుకొని, తనకిష్టమైన రాష్ట్రాలకు అదీ ఎలక్షన్ లు జరిగే ముందు ఎలాపడితే ఆలా నిధులు గుమ్మరిస్తే మిగతా రాష్ట్రాలు ఎలా బతకాలి?  కేంద్రాన్ని కాదనే రాష్ట్రాలకు మొండి చేయి చూపెడుతుంది. ఇది అప్రజాస్వామిక మైన చర్య. 

ఊకదంపుడు ఉపన్యాసాలు మొదట్లో బాగున్నాయని జనం నమ్మి మోడీకి అధికారం ఇచ్చారు. పాలనలో కొన్ని మంచి సంస్కరణలు తెచారు గానీ,అమలు చేయడంలో దారుణంగా విఫలం అయ్యారు. స్వచ్ఛ గంగ,స్వచ్ఛభారత్  లాంటి విఫల పధకాలు ఎన్నో ప్రవేశపెట్టినా, కొన్ని మంచి వినూత్నమైన చర్యలు చేపట్టారు. అందుకే మీ పై నమ్మకంతో సహనంతో ఎదురు చూశాం . 
విద్యుత్పాదన , పల్లెలకు విద్యుత్ సౌకర్యం, పాలనలో  సంస్కరణలు, అందరికీ వంటగాస్, కేంద్ర సంక్షేమ పథకాలలో  ఆధార్ ని ఉపయోగించి అవినీతిని అరికట్ట డం , పాలనలో కుంభకోణాలు లేకుండా విజయం సాధించారని చెప్పవచ్చు. 
 డెమో, డిజిటల్ లావాదేవీలు,గోల్డ్ మోనిటైజేషన్ , బినామీ నియంత్రణ, రియల్ ఎస్టేట్ నియంత్రణ,  జి. ఎస్. టి  గురించి  ప్రజలలో ఇంకా బాగా అవగాహన పెంచి మరింత పకడ్బందీగా అమలుచేయవచ్చు . డెమో కి ముందుగానే బాంక్ లను మరింతగా సిద్ధం చేసి   సాంకేతికతను ఉపయోగించి .మానిటర్ చేయడానికి అనువుగా చేయవచ్చు. ఇవన్నీ క్షమించగల పొరపాట్లే!    
కానీ ప్రజలందరినీ కేవలం ఓటర్లు గా చూడటం అనేది మరీ ముదిరిపోయిన రాజకీయ అధికార కాంక్షకు గుర్తు. 

తెలుగు దేశం పుట్టిందే  కాంగ్రెస్ వారి చేతిలో పతనమైన తెలుగు ఆత్మగౌరవం రక్షణకోసమని  మోడీ లోక్ సభలో  చెప్పారు . అలంటి కాంగ్రెస్ తో ఎవ్వరూ జతకట్టకూడదు... ముఖ్యంగా తెలుగుదేశంపార్టీవాళ్ళు కాంగ్రెస్ తో జతకట్టకూడదని మోడీ అభిప్రాయం. 
 TDP పార్లమెంట్ సభ్యులు  చేస్తున్న ఆందోళనకు మద్దతు నిస్తున్న కాంగ్రెస్ వారిని చూసి కడుపు మంటతో మోడీ అన్నమాటలా అవి? లేక   ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని  కాపాడిన అభిమాన నాయకుడిని మెచ్చుకొని,  ఆంద్ర సెంటి మెంట్ ని రాజేసి ఆంధ్రుల మనస్సును గెలుచుకో వాలన్న యుక్తా ? 
కేసులతో సతమవ్వుతూ, తనకాళ్లకింద బానిసలా పడిఉండే  జగన్  తో అంటకాగడానికి మానసికంగా సిద్ధమైన అమిత్ షా &మోడీ మాటలు ఆంధ్రులే కాదు,రాబోయే ఎన్నికలలో ఎవ్వరూ నమ్మేపరిస్థితి లేదు. 
ఒకటిమాత్రం నిజం, గల్లా జయదేవ్ చెప్పినట్లు , మోడీ కపటపు మాటలు నమ్మడానికి  ఇపుడు...  ఆంధ్రులు  ఫూల్స్ కాదు. 
Wednesday, 7 February 2018

కోసూరు క్షత్రియులు - క్షత్రియ చరిత్ర. -1వ భాగం

కోసూరులో (కృష్ణాజిల్లా)  క్షత్రియ కుటుంబాలు ఉన్నాయని ఇంతకు  మునుపు చెప్పుకొన్నాం. వీరికి, గోదావరి క్షత్రియులకు తేడా ఉందని  కొన్ని అపోహలున్నాయి. బ్రాహ్మణులలో ఎన్ని శాఖలున్నాయో క్షత్రియులలో కూడా అన్ని శాఖలున్నాయి. ఆ శాఖలకు మరోపేరే వంశం.  ఆంధ్రాలో నాలుగు వంశాలున్నా , సూర్య,చంద్ర వంశం వారి మధ్యనే ఎక్కువగా వివాహ సంబంధాలు జరుగుతున్నాయి.ఉత్తరభారతం నుండి వలసలు మొదలై ,కృష్ణా ,గోదావరీ నదీ తీరాల వెంబడి వారి జీవనం సాగింది .
నిజానికి వేదకాలంలో కులాలు అనే చీలికలు లేవు. కేవలం 4  వర్ణాలు ,అదీ స్వభావాన్ని,వృత్తిప్రవృత్తులను బట్టి నిర్ణయించే వారే తప్ప,పుట్టుకను బట్టి నిర్ణయించే వ్యవస్థలెదు.

మరాఠా క్షత్రియులలో  లో 96 శాఖలున్నాయి . అలాగే  రాజస్థాన్ రాజపుట్ లు  ,హర్యానా లో జాట్ లు, ఉత్తరప్రదేశ్ లో ఠాకూర్ లు,  ఇంకా అనేకరాష్ట్రాలలో భిన్న మైన పేర్లతో క్షత్రియులున్నారు.తమిళనాడులో అరసు ,ఒడయార్ లు, నాయకర్ లు, కర్ణాటకలో బంటూ లు , కేరళలో మలబార్  నాయర్ లు, ఉత్తరప్రదేశ్ లో ఖేత్రీ లు, ఒరిస్సాలో ఖండైట్  లు , బెంగాల్ లో పోలియా మరియు ఆగూరియా లు  క్షత్రియులుగా ఉన్నారు.

నిజానికి క్షత్రియులంటే ఎవరు? 
ఈ ప్రశ్నకు జవాబు చాలాకష్టం . సమాజపరంగా ,ఆర్ధిక స్థితిగతుల పరంగా  మానవసమూహాలను  వర్గాలుగా విడదీసి చూస్తున్న కాలమిది. క్షత్రియ అనే పదము వేదకాలములో వృత్తి-ప్రవ్రుత్తి లను బట్టి , రాజన్యులకు,వీరులకు ,రక్షణచేసి శాంతిని స్థాపన చేసేవారికి ఇచ్చిన నామం. తర్వాత ఇతిహాస పురాణకాలంలో వృత్తి-ప్రవ్రుత్తి లకు సంబంధం లేకుండా , పుట్టుకను అనుసరించి తరతరాలుగా  క్షత్రియుల వంశం అనే పేరు వాడుకలోకి వచ్చింది. తర్వాత కాలంలో వంశ మూలపురుషుడు, కొలిచే దైవం,ఆచారసాంప్రదాయాలను బట్టి  క్షత్రియ వర్గంలోనే  4 వంశాలు.. . సూర్య-చంద్ర-అగ్ని-నాగ వంశాలు మొదలయ్యాయి.  కుల గురువు ని అనుసరించి గోత్రం,  ఋషిప్రవర , మూలపురుషులను అనుసరించి రాజప్రవర  వాడుకలోకి వచ్చాయి. 
 క్షత్రియ'అనేపదం వీరత్వం,ధీరత్వం,శూరత్వానికి చిహ్నంగా వాడుకలోకి వచ్చింది. మనదేశంలోని భిన్న సామ్రాజ్యాలను  క్షత్రియులు మాత్రమే స్థాపించి పాలన చేయలేదు. ఇతర వర్ణాలవారు కూడా పాలన చేశారు. ఉదాహరణకు కణ్వ సామ్రాజ్యం బ్రాహ్మణ వర్ణం వారు స్థాపన చేసి పాలించారు. శాతవాహనులు కూడా క్షత్రియవర్ణానికి చెందినవారు కాదని కొందరు చరిత్రకారుల భావన. అలాగే క్షహ రాటులు మధ్య ఆసియా నుండి వచ్చి ఇక్కడనే స్థిరపడి శక సామ్రాజ్యాన్ని స్థాపించారు. అలాగే కుషాణులనే వాళ్ళు పశ్చిమ రష్యా ప్రాంతం నుండి వచ్చి పాలించారు. వారిలో కనిష్కుడు మంచి రాజుగా  పేరు పొందాడు.   
గుప్తులు క్షత్రియ వర్ణానికి చెందినవారు కాదు. 


 క్రీస్తుపూర్వం 2000 ఏళ్ల కాలాన్ని ఇతిహాస,పురాణ కాల మంటారు. ఆ కాలంలో  రాజన్యులకు,రాజగురువులకు మధ్యన సంఘర్షణ వలన బ్రాహ్మణులు ,క్షత్రియులనే వర్గాల మధ్య  వైషమ్యం పెచ్చు మీరుతా ఉండేది. కాలక్రమంలో  బ్రాహ్మణులు (రాజగురువులు) వేదాలకు వక్రభాష్యాలు చెప్పు కొంటూ ఎవరికీ తోచిన విధంగా వారు వాఖ్యానాలు ప్రచారం చేస్తూ యజ్ఞయాగాలకు  విపరీతార్ధాలు తీస్తూ దానాలు,బలులు ప్రోత్సహిస్తూ ఒక విధంగా
వ్యవసాయ,పాడిపంట ల ఉత్పత్తి ని వారే దోచేస్తూ ఉండేవారు. రాజన్యులు ( క్షత్రియులు ) ఇది గమనించి తిరుగుబాటు చేస్తూ ఉండేవాళ్లు. ఆలా మొదలైన వారే జైన మహావీరుడు,బౌద్ధ సిద్ధార్థుడు.  వీరిద్దరూ రాజన్యులే.
వేదానికి విపరీతార్ధాలను  వాఖ్యానిస్తూ బ్రాహ్మణ మతం ఎప్పుడైతే ప్రజలను భయపెట్టి ,ప్రలోభపెట్టి మతంగా మారి పీడించడం మొదలుపెట్టిందో అపుడే భిన్న ఆలోచనా ధారలతో జైన,బౌద్ధ మతాల రూపంలో సమాజంలో తిరుగుబాటు మొదలైంది.

ఇతిహాస పురాణకాలంలో సంస్కృత భాష స్థానంలో ప్రాకృతం,బ్రహ్మి ,పాళీ ,దేవనాగరి బయల్దేరడానికి కూడా ఒక కారణం ఉంది. బ్రాహ్మణ మతం వారి సంస్కృత భాషను పక్కనపెట్టి వారికీ వ్యతిరేకమైన భావజాలాన్ని వ్యాపితం చేయాలంటే జనం మాట్లాడే యాసలో భాష తేలికగా ఉండాలనే ఉద్దేశ్యంతో వివిధ భాషలు పరివ్యాపితం చెందాయి.

మధ్య ఆసియా అనగా నేటి ఇరాన్,ఇరాక్, సిరియా,టర్కీ ప్రాంతం,అలాగే నేటి ఆఫ్ఘనిస్థాన్, సియస్దాన్ , పాకిస్థాన్ ప్రాంతాలు, అలాగే అజర్ బైజాన్, కజకిస్థాన్, మొదలైన పశ్చిమ రష్యా ప్రాంతం,పశ్చిమ చైనా ,మంగోలు ప్రాంతాలన్నీ భరత ఖండంలో కలిసిఉండేవి. రకరకాల జాతులు,కొందరు మొరటుగా,జిప్సీ  జీవితం గడిపేవాళ్లు,మరికొందరు మైదానప్రాంతాలవాళ్ళు కొంచెం నాజూకుగా ఉండేవాళ్ళు ... ఇలా  భిన్న జాతులన్నింటినీ మ్లేచ్చు లనే వాళ్ళు ఇండియాలోఉన్న బ్రాహ్మణులు . కానీ కాలం గడిచిన కొద్దీ ఈ మ్లేచ్చులన బడే జాతులు  ప్రస్తుతం  నార్త్ ఇండియా  గా చెప్పుకొంటున్న  ప్రాంతాలపై  దాడులు చేస్తూ కొంతకాలానికి  ఇక్కడనే ఉండిపోయి కొత్త రాజ్యాలు స్థాపన చేసుకొని స్థానిక ప్రజలతో  కలిసిపోయి వారి ఆచారాలు పాటిస్తూ వివాహాలు చేసుకొంటూ
కలిసిపోయారు. కొన్ని సార్లు గ్రీకులు,రోమన్లు కూడా సముద్రాన్ని దాటి టర్కీ మీదుగా ఉత్తరభారతం పై దండయాత్రలు చేసి వారూ ఇక్కడనే ఉండిపోయారు.

ఈ విధంగా భిన్నజాతులు ... వారినే ఇండో-పార్దియన్ లు , ఇండో-సిథియన్ లు (శకులు )  , ఇండో-బాక్ట్రియన్ లు , ఇండో-గ్రీకులు , ఇండో-మంగోలియన్ లు  (కుషాణులు), భిన్న భాషలు,యాసలు,భిన్న శరీర ఆకృతులు,ముఖ కవళికలు,భిన్న భావజాలం తో   ఉత్తరభారతం పై కి తోసుకు వచ్చినా, మెజారిటీ జాతులన్నీ స్థానికంగా ఉన్న ఆచారసాంప్రదాయాలను  ఆచరిస్తూ వారూ క్షత్రియులలెక్క ఈ భారత సమాజంలో చెలామణీ అయ్యారు. ఎందుకంటే వారు శారీరకంగా బలవంతులు, మొరటువారు. యుద్ధవిద్యలలో నిష్ణాతులు. స్థానికంగా ఉన్న బ్రాహ్మణులను ఎదిరిస్తూ ఉన్న స్థానిక క్షత్రియులకు వీరు తోడవ్వడంతో ముఖ్యంగా క్షత్రియ మతాలైన బౌద్ధ,జైన మతాలకు బాగా  ఊపొచ్చింది. అలాగని అందరూ క్షత్రియులుగా మారారని చెప్పలేం.  కొంతమంది నాజూకు వాళ్ళు  తెలివి ఎక్కువగా ఉన్నవాళ్లు బ్రాహ్మణు  వర్గంలో కలిసిపోయారు. మరికొందరు వారుచేసే పనిని బట్టి,  సూద్రులుగా ,వైస్యులుగా చెలామణీ అయ్యారు.
ఇలా  గత 4000 ఏళ్లుగా ఉత్తరభారత మరియు మధ్య భారత ప్రాంతం భిన్న జాతుల కలగూర గంపగా మారిపోయింది. జన్యు పరీక్షలలో కూడా తేలింది ఇది.
దీనిని బట్టి మనం అర్ధం చేసుకో వలసింది ఏమిటి?
 శుంగ వంశస్తులు, కణ్వ వంశం, శాతవాహనులు,మౌర్యులు,గుప్తులు , రాజులు ,వర్మలు, చాళుక్యులు, చోళులు , ఇక్ష్వాకులు , తదితర క్షత్రియ వర్గం వారు ,... వీరందరూ  ఉత్తర,మధ్యభారత ములో  స్థానికంగా ఉన్న క్షత్రియ వంశాలకు చెందిన వాళ్ళే తప్ప మధ్య ఆసియా నుండి వచ్చిన మ్లేచ్చులు కాదు.  కానీ, పల్లవులు,రాజపుత్రులు , జాట్ లు ,ఠాకూర్ లు ,   పైన చెప్పుకొన్న మధ్యఆసియా కి చెందిన భిన్న జాతుల నుండి వ్యాప్తి చెందిన వారే!
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, స్థానిక క్షత్రియులైనా , మధ్యఆసియా , పశ్చిమ రష్య  నుండి వలస వచ్చి  క్షత్రియులుగా చెలామణీ ఐనవారైనా అందరూ కూడా మన భారతీయ ఆచారసాంప్రదాయాలను, హిందూ బ్రాహ్మణ మతమో లేక జైన బౌధ్ధమతాన్నో అనుసరించి భారతీయతకు వన్నెలు అద్దినవారే!
సూర్య,చంద్ర,అగ్ని,నాగ  వంశాలనేవి ఆయా మూలజాతుల ఆచార సంప్రదాయాలను బట్టి అనూచానంగా వచ్చినవే!

మనిషి భిన్నరకాలుగా ఆలోచిస్తాడు. అందుకే భిన్నంగా కనిపిస్తాడు. ఆలోచన'అనేది లేకుంటే మనుషులందరూ ఒక్కటే'!
శరీరనిర్మాణం ,ముఖకవళికలనేవి ప్రాంతాన్ని బట్టి,ఆహారాన్ని ,వాతావరణ స్థితులను బట్టి భిన్నరకాలుగా పరిణామం చెందుతూ ఉంటాయి. చెబితే ఆశ్చర్యపోతారు. నేటి బ్రిటిష్ వారి మూలపురుషుడు తెల్లవాడుకాదు, నల్లవాడే!అంతేకాదు, మానసిక నిర్మాణం అనగా  ఎక్కువ శాతం ఆలోచనలు కూడా వంశ పారంపర్యంగా  వస్తాయి. అందుకే,ఒకే  వంశంలో ని  మానవులలో శరీర,మానసిక నిర్మాణం లో పోలికలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమాజంలో జీవించాలంటే మంచి బలమైన దేహనిర్మాణం,  స్థిరమైన భావాలూ,ఆలోచనలు  ఉన్న సంతానం అవసరం. దీని కోసం వంశము,గోత్రము అనేవి వ్యాప్తి చేశారు .ఇది సాధ్యపడాలంటే పటిష్టమైన  వివాహ వ్యవస్థ ఉండాలని దానిని ఆచరించారు.    ఈ విషయం, మన జన్యు పరోశోధనలలో ముఖ్యంగా "Y" క్రోమోజోమ్
యెక్క సున్నితత్వాన్ని కాపాడుకోవడానికి గోత్రం,వివాహ వ్యవస్థ అత్యవసరం అని తేలింది .


క్రీస్తు శకం మొదటి వేయి సంవత్సరాలలో  అనగా క్రీస్తుశకం 1 నుండి 10 వ శతాబ్దం వరకు , మధ్యప్రదేశ్క్ష,రాజస్థాన్,మహారాష్ట్ర   ప్రదేశాలనుండి క్షత్రియ కుటుంబాలు  దక్షిణా పదానికి వలస వచ్చి నెమ్మదిగా రాజ్యాలు స్థాపించుకొన్నాయి. ఆలా వచ్చిన వాళ్లలో పెద్దరాజ్యాన్ని స్థాపన చేసింది శాతవాహనులు.
పల్లవులు,చాళుక్యులు,పరిచేది , చోళులు ,ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు,కాకతీయులు   ఆ తర్వాత దక్షిణా పదాన్ని శాసించారు. వీరందరూ జన్మత : క్షత్రియులని చెప్పలేము. రాజ్యం వీరభోజ్యం . వీరులకే రాజ్యం దక్కుతుంది.  తెలివైన మంత్రాంగం, ప్రజా పాలన సరిగా ఉంటె  ఆ రాజ వంశం నిలబడు తుంది .

 నిజానికి వేద కాలంలో జన్మనిబట్టి వర్ణం నిర్ణయించే ఆచారం లేదు. కేవలం గుణాలను, వృత్తి ప్రవ్రుత్తి లను ఆధారం చేసుకొని వర్ణ నిర్ణయం జరిగేది. కానీ క్రీస్తు పూర్వం 1000 ఏళ్ళక్రితం నుండే ఈ ఆచారం మంటగలిసిపోయి కేవలం జన్మను బట్టి వర్ణ నిర్ణయం జరిగేది.  క్రమేణా వర్ణాలు కులాలుగా మారడం అనేది క్రీస్తుశకం 15 వ శతాబ్దం తర్వాతనే అని చరిత్రకారులు చెప్పారు. ఇందులో వాస్తవమెంతో ఇంకా నిర్ణయించ వలసిఉంది .

11 వ శతాబ్దం నుండి మొదలైన గజనీ, మొగలాయీలు , తురుష్కుల దండయాత్రల వలన క్షత్రియ వంశాలు చిన్నాభిన్నమైపోయాయి .కకావికలమైపోయి దేశం నాలుగు చెరగులా వలసలు పోయారు.విదేశీ మూకల నిర్దాక్షిణ్యమైన అణచి వేత తర్వాత , మందుగుండు సామాను వచ్చి పడటంతో కత్తి కటారు యుద్ధవిద్యలకు  ఆదరణ,అవసరం తీరిపోయింది. అలాగే క్షత్రియ పాలకుల వంశాలు కూడా ప్రాణభయంతో చెట్టుకొక్కరు,పుట్టకొక్కరు లా చెల్లా చెదురై పోయారు. కేవలం 50 వంశాలు నిలదిక్కుకొని సంస్థానాలను ఏలుకొంటూ ఉన్న స్థితిలో మాజీప్రధాని  ఇందిరా గాంధీ  ఒక్క పెన్ను పోటుతో వాటన్నింటినీ రద్దు చేసి బిచ్చ గాళ్ళ లెక్క మార్చేసింది.

నిజానికి  ఎవరైతే సమాజంలో  ఘర్షణలను తగ్గించి శాంతిని స్థాపన చేస్తారో వారే క్షత్రియులు . ఇది ఒక రాచ కుటుంబంలో పుట్టినంత మాత్రాన అబ్బే  లక్షణం కాదు. ఆంధ్ర క్షత్రియులని తొట్టతొలుత చెప్పు కొనే వారిలో ప్రప్రథమ వంశం శాతవాహన వంశం . ఈ వంశం వాళ్ళు మౌర్యులతర్వాత సుమారు 300 ఏళ్ళు,నేటి తెలంగాణ,ఆంధ్ర, మహారాష్ట్ర ప్రాంతాలను పాలించారు.

గౌతమీ పుత్ర శాతకర్ణి,  నేటి గుజరాత్,సౌరాష్ట్ర ప్రాంతాన్ని పాలించే శక రాజు  క్షత్రప మారాజు ని ఓడించడంతో , శక వంశం నెమ్మదిగా కనుమరుగైపోయింది . కానీ ఆ శకులే , క్షత్రపులని, క్షహరాటులని ,క్షత్రియులని వ్యవహరించడం క్రమేణా జరిగింది.
కాబట్టి రాజ్యాలు పాలించేవారే క్షత్రియులు కానక్కరలేదు. గత 2000 ఏళ్లలో వివిధ వర్ణాలు రాజులుగా,చక్రవర్తులుగా పాలించారు.  కానీ సైనికులుగా, దళపతులుగా, చమూ పతులుగా ఎక్కువ శాతం క్షత్రియ వర్ణం వారు ఉండేవాళ్లు.
సూద్రులలో ఎన్ని శాఖలున్నాయో,అలాగే క్షత్రియులలో కూడా ఎన్నో శాఖలున్నాయ్. అవి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. క్షత్రియ ధర్మాన్ని ,సంప్రదాయాన్ని పాటిస్తూ శాంతిని నెలకొల్పే ఏ మనిషైనా క్షత్రియుడే!

చర్మం రంగు,ముఖ కవళికలు , మనస్తత్వం అనేవి ఒక గుంపులో ఒకే రకంగా దగ్గర పోలికలతో  ఉంటాయి.
ఒకే రకమైన పక్షులు,పశువులు గుంపులుగా జీవిస్తాయి. మరి మనిషికి తెలివి,వాక్కు , హృదయచైతన్యం ఉన్నాయి. మరి మనిషి కూడా పశు పక్ష్యాదులు లాగ బతకవలసిందేనా?

( తర్వాత  2 వ భాగం  ).