Search This Blog

Sunday 13 March 2022

హోళీ

 శాస్త్రీయ కారణం చెప్పుకుంటే వసంత కాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ ఫీవర్స్, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందనేది ఒక వాదన. 

కుంకుమ, పసుపు, బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు. తడి రంగుల కోసం, మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. వాస్తవానికి ఇవి చల్లుకోవాలి కానీ ఇప్పుడు కృత్రిమ రంగులు చల్లుకుంటున్నారు.

తృప్తి ని ఇవ్వలేని కోర్కెలతో , అరిషడ్వార్గాలతో , రాగద్వేషాలతో , స్వార్ధభూయిష్టమైన ఆలోచనలతో  కలుషితమైన మనస్సును జ్ఞానం తో తపింపచేసి పునీతం చేయడమే హోళికా పూర్ణిమ లోని అంతరార్ధం. 

జీవితమంటే ఉత్సాహం ,ఉషస్సు మాత్రమేకాదు విషాదం,నిర్లిప్తత ,తమస్సు కూడా !

ఒకో రంగు ఒకో భావాన్ని  కలిగిస్తుంది. అన్ని రకాల రంగులతో  హొలీ ని మనం ఎలా హుషారుగా జరుపుకొంటామో ,అలాగే అన్నిరకాల  భావాలనూ సమానంగా హుషారుగా   శ్వీకరించాలి . 


వసంత కాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను 'వసంతోత్సవం' పేరిట జరుపుకునేవారు. హోలీ పర్వదినం ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటిరోజు పాల్గుణ పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటారు

దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి. ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. 

We command the state government and see that AMARAVATI farmers get justice

 కంటిన్యూ మాండమస్ డిక్టేర్ అంటే కోర్టు తానిచ్చిన తీర్పును పర్యవేక్షిస్తోంది. ప్రభుత్వాధికారి లేదా సంస్థ తన చట్టబద్ధ విధులను నిర్వర్తించనప్పుడు ప్రజల హక్కులకు భంగం కలుగుతుంది. అలాంటి సందర్భాల్లో ఆ విధులను నిర్వర్తించాలని న్యాయస్థానం ఈ రిట్‌ను జారీ చేస్తుంది. 

పాలనాపరంగా ప్రజలు న్యాయం పొందలేనప్పుడు ఈ రిట్‌ ద్వారా ఉపశమనం పొందొచ్చు. ఈ రిట్‌ జారీ కోర్టు విచక్షణపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వాధికారుల తప్పనిసరి విధులకే ఈ రిట్‌ వర్తిస్తుంది. సంబంధిత అధికారి విచక్షణాపూర్వక విధులకు ఇది వర్తించదు.

నిబంధన–226 ప్రకారం రాష్ట్ర హైకోర్టు లు  ఇలాంటి  రిట్ జారీ చేయవచ్చు. 

రాజధాని విషయంపై మొత్తం 70 పిటిషన్లను విచారించిన త్రిసభ్య ధర్మాసనం తుది తీర్పునిచ్చింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించాలంది. అమరావతి భూములను తనఖా పెట్టడానికి వీల్లేదని, రాజధాని అవసరాలకు తప్ప వేరే వాటికి భూములు ఇవ్వొద్దని చెప్పింది కోర్టు. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని చెప్పింది. భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. 6 నెలల్లో ఒప్పందం ప్రకారమే అభివృద్ధి చేయాలి. మూడు నెలల్లోనే రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వానికి సూచించింది. అమరావతి అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అభివృద్ధి పనులు ఎంత వరకు వచ్చాయి. రైతులకు ప్లాట్లు అప్పగించారా లేదా.. ఏంటనే విషయం పై హైకోర్టు గమనిస్తూ ఉంటోంది. దాన్నే కంటిన్యూస్ మాండమస్ అంటారు.

ఒకసారి ఆ చట్టం ( CRDA ) చేసి...అంత మంది రైతులను ఇన్ వాల్వ్ చేసి ( Promissory estoppel is a doctrine in contract law  seeks to protect the rights of a promisee or aggrieved party against the promisor.) ...అన్ని వేల ఎకరాలు తీసుకున్న తర్వాత అంత తేలికగా నిర్ణయాన్ని మార్చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ ఓ సంచలన తీర్పు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిందనే చెప్పాలి. 

Mandamus is a  command of Judicial Remedy in the form of an order from a court to any government, subordinate court, corporation, or public authority to do some specific act. which is in the nature of public duty, and in certain cases one of a statutory duty.