Search This Blog

Sunday, 13 March 2022

హోళీ

 శాస్త్రీయ కారణం చెప్పుకుంటే వసంత కాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ ఫీవర్స్, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందనేది ఒక వాదన. 

కుంకుమ, పసుపు, బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు. తడి రంగుల కోసం, మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. వాస్తవానికి ఇవి చల్లుకోవాలి కానీ ఇప్పుడు కృత్రిమ రంగులు చల్లుకుంటున్నారు.

తృప్తి ని ఇవ్వలేని కోర్కెలతో , అరిషడ్వార్గాలతో , రాగద్వేషాలతో , స్వార్ధభూయిష్టమైన ఆలోచనలతో  కలుషితమైన మనస్సును జ్ఞానం తో తపింపచేసి పునీతం చేయడమే హోళికా పూర్ణిమ లోని అంతరార్ధం. 

జీవితమంటే ఉత్సాహం ,ఉషస్సు మాత్రమేకాదు విషాదం,నిర్లిప్తత ,తమస్సు కూడా !

ఒకో రంగు ఒకో భావాన్ని  కలిగిస్తుంది. అన్ని రకాల రంగులతో  హొలీ ని మనం ఎలా హుషారుగా జరుపుకొంటామో ,అలాగే అన్నిరకాల  భావాలనూ సమానంగా హుషారుగా   శ్వీకరించాలి . 


వసంత కాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను 'వసంతోత్సవం' పేరిట జరుపుకునేవారు. హోలీ పర్వదినం ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటిరోజు పాల్గుణ పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటారు

దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి. ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. 

1 comment: