రాత్రికి రాత్రి దేశానికి మంచిరోజులు తేవడానికి మోడీ దగ్గర మంత్రదండం ఏమైనా ఉందా ?అనే సందేహం ఎవరికైనా ఉందా ?
ఒక్కసారి ఇది చూడండి
- నకిలీ కరెన్సీ ముఠాలు ,హవాలా గాంగ్ లు చిత్తు . అందుకే రాజకీయనాయకులు ,మీడియా మొగల్స్ చొక్కాలు చింపుకొంటూ రోడ్డున పడుతున్నారు !
- రక్తం చిందించే జిహాదీలు , టెర్రరిస్ట్స్ ,మావోయిస్టు లు ముఖాలలో నెత్తురు చుక్కలేకుండా పోయింది .
- ఇన్నాళ్ళూ ప్రభుత్వాలు ఎంత బతిమాలినా చలించని బాంక్ లు హాస్పిటల్స్ , ఆయిల్ బంకులు , నిత్యావసర సరుకుల పంపిణీ కేంద్రాల దగ్గర మొబైల్ లు పెడుతున్నారు .
- ఇన్నాళ్లు జీడిపాకం లా సాగదీస్తున్న కోట్లాదిరూపాయల తగాదాలు ఒక్కరోజులోనే లోక్ అదాలత్ ల ద్వారా సమసిపోయాయి .
- ఎప్పుడూ లేనిది వ్యాపారవేత్తలు తమదగ్గర పేరుకు పోయిన నల్ల ధనాన్ని ఈ సంవత్సరపు సంపాదనగా చూపిస్తూ, అడ్వాన్స్ పన్ను కట్టి మరీ డిపాజిట్ చేస్తున్నారు .
- ఇన్నాళ్ళూ ఎంత చెప్పినా తమ జనధన ఖాతాలలో డబ్బు లేయని వారు , ఇప్పుడు ఎవరో తరుముకు వస్తున్నట్లు తమ ఖాతాలను డబ్బుతో నింపేస్తున్నారు .
- బంగారు నగల వర్తకులు పుంజాలు తెంపు కొంటూ బంగారం నిల్వల సమాచారాన్ని ఏరోజు కా రోజు ఇవ్వడంతో నల్ల డబ్బుని బంగారం గా మార్చుకోవడం కష్టమై పోయింది . (అయినా దొంగ బంగారాన్ని ఎక్కువ ధరకు అమ్ముకొంటూ వర్తకులు లాభాలు గడిస్తుంటే , తమ నల్ల ధనాన్ని బంగారం గా మార్చు కొంటున్న నల్ల ధనాసురులను అదుపు చేయడం గురించి ప్రభుత్వం ఆలోచించాలి) .
- ప్రజలు తమ ఆస్తిపన్ను ,నీటిపన్ను ,కరెంట్ బిల్లులు ,ఫోన్ బిల్లులు ,బాంక్ లోన్స్ మొదలైన సమస్త పన్ను బకాయిలను చెల్లించడం వలన ప్రభుత్వానికి ,బాంక్ లకు పండగ వఛ్చినట్లే ఉంది .
- రోడ్ పక్కన దుకాణాలలో కూడా డిజిటల్ చెల్లింపులనేవి నెమ్మదిగా పుంజుకొంటున్నాయి .
- అన్నింటి కంటే ముఖ్యం, మనదేశ ఆర్ధిక లోటు తగ్గడం , దేశ ఉత్పత్తి పుంజుకోవడం , ద్రవ్యోల్పణం తగ్గడం మనం అపుడే చూస్తున్నాం !
కేజరీవాల్ లాంటి బాగా చదువుకు న్న వారికి , భారతీయ అమాయక ఆడపడుచు మమత గారికి , మంచి బాలుడు రాహుల్ జీ కి , సభల్లో గొంతులు ,మైకులు చించు కొంటున్న గౌరవ సభ్యులకు ఎవరైనా ఈ విషయాలు చెప్పినా
వింటారా ? వినరు ! ఎందుకంటే వారికీ ఇవన్నీ మనకన్నా బాగా తెలుసు . కానీ రాజకీయం చేయాలి గదా !
ఆడు మగాడ్రా! ఛాన్స్ బలేగా తన్నుకుపోయాడని
ReplyDelete