మీకు దైవం పై నమ్మకం ఉన్నా,లేకున్నా మీ ఆత్మ సాక్షిగా , ప్రతి రోజూ 3 సార్లు ఈ క్రింది ప్రార్ధన శ్రద్ధతో,విస్వాసం తో చేయండి. మీరు పలుకుతున్న ప్రతి పదము' పైన ప్రగాఢమైన నమ్మకం తో ఉంటూ ,భావయుక్తంగా ఉచ్చరించండి. ఇలా జరగాలనే కోరికతోకాకుండా , మీరు పలికినవన్నీ నిజంగా జరుగుతున్నాయని భావన చేయండి.
"నేను ఎల్లపుడూ నిజమే
మాట్లాడుతాను.
నేను అన్నివేళలా ఇతరులకు సహాయం అందిస్తాను.
నేను దైర్యంగా ఉంటాను.
నేను ఎల్లపుడు ఆత్మవిశ్వాసంతో
ఆలోచిస్తాను,ఆత్మ విశ్వాసంతో మాట్లాడుతాను,ఆత్మవిశ్వాసంతో కార్యాలు సాధిస్తాను.
నేను ఎల్లపుడు ఆరోగ్యంగా,ఉత్సాహంగా ఉంటాను.
నేను ఎల్లపుడూ విజయాన్నే సాధిస్తాను.
నేను బాధ్యతగా ఉంటాను.
నేను ఎల్లపుడూ సత్యమే చెబుతాను.
నేను ఎల్లపుడు అన్ని భాషలలో
అనర్గళంగా మాట్లాడుతాను.
నా మాటలు,చేష్టలు అందరి
హృదయాలకు చేరుతాయి.
నా మాటలు,చేష్టలు
అందరికీ స్వాన్తన నిస్తాయి.
నేను అందరితో సామరస్యంగా ఉంటాను.
నేను మానవ సంబంధాలకు ప్రాముఖ్యత నిస్తాను .
నేను ఎప్పుడూ ప్రశాంతంగా,ఆనందంగా ,శాంతిగా ఉంటాను.
నేను సమస్త జీవులకు ప్రశాంతతను,
ఆనందాన్ని, శాంతిని ఇస్తాను.
నేను సాధించే విజయాలలో అందరికీ భాగస్వామ్యం ఉంటుంది.
నేను సాధించిన ఫలాలలో అందరికీ భాగస్వామ్యం ఉంటుంది.
నేను ప్రకృతిని ప్రేమిస్తాను.
నేను ధర్మం గా చరిస్తాను.
నేను-నేను-నేను అని చెబుతున్నాను గానీ,నిజానికి నేను అనేది "అదే!
No comments:
Post a Comment