ఇన్సూరెన్స్ చట్టాల సవరణ బిల్లు ద్వారా ఆ
రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 26 శాతం నుంచి 49 శాతానికి పెరిగాయి.
ఎనకమిస్టులు, విధానకర్తలు... డీజిల్ ధరలపై నియంత్రణ వద్దని
కోరినట్లు గా ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమల్లోకి తెచ్చారు.
జనధన్ బ్యాంక్ అకౌంట్ల మొదలు... ప్రతీ గ్రామానికీ కరెంటు వరకూ,
ఉజ్వల స్కీమ్ మొదలు... ఆయుష్మాన్ భారత్ వరకూ...
ముద్ర రుణాల మొదలు... స్వచ్ఛ భారత్ వరకూ... ప్రతీదీ బలంగానే
అమలు చేయడానికి ప్రయత్నీమ్చినా సరిగ్గా అమలుచేయలేక పోయారు.ప్రచారంలోకనబడిన హడావిడి
క్షేత్రస్థాయిలో లేనేలేదు. నమో గంగా పధకం కూడా విజయవంతం గా అమలుచేయలేదు.
మోదీ మొదటి ఐదేళ్ల కాలంలో కొన్ని సంస్కరణలు తెచ్చారు. అవి GST, IBC,
పారదర్శక పాలన, చట్టప్రకారం పాలన, సహజ వనరుల వేలం, RERA, సరిహద్దుల గుండా వ్యాపార
సంస్కరణలు, DBT విధానం తేవడం ఓ విప్లవాత్మక అడుగు.
రెండోసారి అధికారంలోకి వచ్చాక బ్యాంకుల విలీనం, కార్మిక
చట్టాల్లో మార్పులు (నాలుగు రకాల లేబర్ కోడ్స్ అమలు), కార్పొరేట్ టాక్స్ తగ్గింపు,
(ప్రపంచంలోనే తక్కువ కార్పొరేట్ టాక్స్), ఇక మేలో ఆత్మ నిర్భర భారత్‌తో మరిన్ని
సంస్కరణల కు తెర తీశారు.
అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ (APMC) ఏర్పాటైంది. నిత్యవసర
సరుకుల చట్టాన్ని సవరించారు. ఇప్పుడు రైతులు తాము ఏం పండించాలనుకుంటే అది
పండించగలరు. ఏ రేటుకి అమ్మాలనుకుంటే, ఆ రేటుకి అమ్మగలరు. కాంట్రాక్ట్ పార్మింగ్
అనేది వాస్తవ రూపంలోకి వచ్చింది. వ్యవసాయంలో మోడ్రన్ టెక్నాలజీ అమలవుతోంది.
దేశవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లు ఏకమవుతున్నాయి.
కోల్ మైనింగ్ మళ్లీ ప్రారంభమైంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మేలు
చేసే నిర్ణయాలు తీసుకున్నారు. రక్షణ రంగంలోకి FDIలను ఆటోమేటిక్ రూట్ ద్వారా 74
శాతానికి పెంచారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరిస్తున్నారు. అంతరిక్ష రంగంలో
కూడా ప్రైవేట్ సంస్థలకు డోర్లు తెరిచారు. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు కూడా వాస్తవ
రూపు దాల్చింది.
No comments:
Post a Comment