Search This Blog

Monday, 10 December 2012

మనం ఎలా ఎందుకు బ్రతకాలి ?

మనిషి స్వధర్మాచరణ చేస్తూ సంతోషంగా,శాంతం గా బ్రతకాలి .

మనిషి జీవితం ఎలా  శాంతం గా ఉంటుంది ?
జీవనానికి నియమాలు , నదులకు చెలియలి కట్టలు
మనస్సుకి సత్సంగ సాధన -
ప్రాణానికి ఆయామం
శరీరానికి వ్యాయామం
బుధ్ధికి  ప్రగాడ సూక్ష్మత - ఇవన్నీ ఉంటేనే మనిషి జీవితం శాంతం గా ఉంటుంది .

మనిషికి సంతోషం ఎప్పుడు ,ఎలా కలుగుతుంది ?
హుషారుగా ,ఇష్టపడి కష్ట పడుట
ఇతరులకు ప్రేమతో సేవ చేయడం
నీ స్వ శక్తి పై గానీ , తోటి వారిపై గానీ ,దేవుని పై గానీ విశ్వాసం ఉంచి
ఎపుడూ  నీకు దేనిపై విశ్వాసముందో దానిని ప్రార్ధన చేస్తూ
మన పని విజయవంతం కావటానికి క్రుషి చేయడం - సంతోషానికి తొలి మెట్టు .

సత్సంగం అంటే ఏమిటి ?
ఓ మంచి గురువు ,మంచి స్నేహితుడు ,మంచి గ్రంధం తో గడపటమే సత్సంగం .
శరీరాన్ని , మనస్సుని ,ప్రాణ శక్తిని ఒకే కంపనంలో ఉంచడమే యోగానికి తొలి మెట్టు .
మనిషి జీవన  విధానం ఎలా ఉండాలి ?
మనస్సుని ఉత్సాహంతో నింపుకొని
ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోవడం
మనస్సుని అన్నివేళలా ఆశావహంగా ఉంచుకొని
దుఖాన్ని అధిగమించడం
ఇతరులు చేసిన తప్పిదాలను క్షమించడం
అన్యాయాలను ,అనినీతిని ఎదుర్కోవడం
కుటుంబం కోసం , సంఘంకోసం పాటుపడటం
వైఫల్యాలు మరిచి  నిరంతరం విజయంకోసం ప్రయత్నించడం
ధర్మమేమిటో అవగాహన చేసుకోవడం - ఇదే మనిషి జీవన విధానం .
మనిషి ఏది  వదులు కొంటే శాంతంగా ఉంటాడు ?
మనిషికి పంచ జ్ఞానేంద్రియాలు ,పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు , మానసం ,చిత్తం , బుద్ది, అహంకారం ,వీటన్నింటినీ ఆవరించి జీవాత్మ ఉంటాయి . శరీరంలో ప్రతి కణానికి మనస్సు ఉంటుంది . కణంలోని ప్రతి అణువుకూ మనస్సు ఉంటుంది . కానీ స్థాయిలోనే తేడా !
మనిషి ఏది సాధిస్తే నిత్యం  శాంతంగా ,సంతోషంగా ఉంటాడో కనిపెట్టడానికి ఎందరో ప్రవక్తలు , యోగులు ,రుషులు మొదలుకొని నేటి శాస్త్రజ్ఞులు వరకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు .
అందరూ అంగీకరించిన విషయం ఏమిటంటే , మనిషి నేను -నాది - నా వాళ్లు అనే అహంకార మమకారాలను  పూర్తిగా తొలగించుకొంటే ఎపుడూ శాంతిగా ఉండవచ్చును .
అహంకారాన్ని పరమాత్మలో నిమజ్జనం చేయడమే సాధనలో చివరి మెట్టు .
అహంకారాన్ని ఎలా నిర్ములించాలి ?
సాధనతో .
అది ఎలా చేయాలి ?
నిన్ను నువ్వు ఇష్టపూర్వకముగా కోల్పోవాలి .ఇలా జరగాలంటే పలు మార్గాలున్నాయి .
మొదటగా - ఇంద్రియాలను అదుపులోకి తెచ్చుకోవాలి.
మనస్సుని ఏకాగ్రతం చేయటం సాధన చేయాలి . దేని మీద చేయాలి ?

  • శబ్దం లేదా నాదం లేదా మంత్రం మీద చిత్తాన్ని నిలిపే టట్లు సాధన చేయాలి . - మంత్ర  యోగం
  • మనస్సుని సంపూర్ణముగా దేవునిపైగానీ ,నీకిష్టమైన పనిపైగానీ లేదా నీ స్వశక్తిపైగానీ కేంద్రీకరించి ఎల్లపుడూ స్థిత ప్రజ్ఞత్వంతో ఉండేటట్లుగా సాధన చేయాలి . -కర్మ ఫల సన్యాస యోగం .
  • కర్మ సన్యాసం చేసి ప్రతి కార్య కారణానికి దేవునిపై భారమేసి ,సుఖ దుఖాలకు చలించక సంపూర్ణ శరణాగతి తో త్యాగ  వైరాగ్య  జీవనం సాగించడాన్ని -భక్తి యోగం.
  • అన్ని కర్మలూ నిమిత్త మాత్రము గా ఎలాంటి అనుభూతిలేకుండా  చేస్తూప్రేమ తో కూడిన సేవ ఇష్టపూర్వకముగా చేయడాన్ని -రాజయోగం.
  • శరీరాన్ని సం రక్షించుకొంటూ ,మనస్సుని "నేనెవరు" అనేదానిపై విచారణ చేస్తూ విహిత కర్మాచరణ చేస్తూ ,త్యాగ బుద్దితో జీవనం -జ్ఞానయోగం.

పై న చెప్పిన విధంగా చేస్తే మనిషికి నిత్య సంతోషం ,శాంతి , ఆనందం కలుగుతాయి . అదే మోక్షం .అదే నిర్వాణం . ఇది మనం బతికున్నప్పుడే కలిగే అనుభూతి . ఇలాంటి ఆనందకరమైన జీవితం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకొంటారు .
 అంటే మన మనస్సుని రీ ప్రొగ్రాం చేసుకొవడమన్న మాట . ఏమని ? సుఖ శాంతులకు బయటి ప్రపంచం పై ఆధార పడనక్కరలేదు , మన మనస్సే వీటికి మూలం ,కాబట్టి మనస్సుని మౌల్డ్ చేసుకొంటే చాలు,నిత్యం శాంతంగా ఉండవచ్చు . మనిషి కనీస అవసరాలు తీర్చుకొంటూ విద్య వినయాలతో డాంబికాలు , దంభాలు లేకుండా కనీసపు వ్రుత్తి ఉద్యోగ , కుటుంబ మరియు  సంఘ ధర్మాన్ని ఆచరిస్తూ జీవనం చేయాలి. కోరికలను తన ఆరోగ్యానికి , ఇతరులకు ఇబ్బంది రానంతవరకు తీర్చుకోవచ్చు . ఆశ ఉండాలి . అత్యాశ ,దురాశ ఉండకూడదు . పట్టుదల ఉండాలి . మొండితనం కూడదు . అన్యాయ అధర్మాలను ప్రతిఘటించే కోపం ,ఆవేశం ,ఆలోచన   ఉండాలి . తన ఆరోగ్యాన్ని ,ఇతరులను నాశనం చేసే క్రోధం ,చింత ఉండరాదు . అన్ని ప్రాణులపై సమ ధర్మం ఉండాలి . ఏమి చేస్తే నువ్వు బాధ పడతావో ,వాటిని ఇతర ప్రాణులకు చేయకపోవటమే అహింస .

స్వ ధర్మం అంటే ఏమిటి ? 
జీవితం పైనా ,తోటివారి శాంతి పైనా ఉత్సాహం
శత్రువులనుకూడ క్షమించే గుణం
తనకున్నంతలో ఇష్టపడి చేసే సేవ
ఇతర ప్రాణులను ఆనందముగా ఉంచే ప్రేమ
ఎన్ని వైఫల్యాలు ఎదురైనాచలించని ఓర్పు
తనపైనా ,ప్రతి ప్రాణి పైనా శ్రద్ద - ఈ లక్షణాలతో జీవించడమే మనిషి కనీసపు స్వ ధర్మం.
నీ స్వధర్మాన్ని నువ్వు నిర్వర్తించు . శాంతి ఆనందాలు అవే వస్తాయి .
   
జన్మ రాహిత్యం ,సారూప్య , సాలోక , సాయుజ్య మోక్షం ,నిరాకార నిర్గుణ పరమాత్మ సన్నిధి చేరే సమాధి స్థితి ,-ఇవన్నీ ఎవరికివారు అనుభూతించవలసిన అధి భౌతిక అధి ఆత్మిక విషయాలు .

తెలుసుకోతగినది ,తెలుసుకొనే వాడు ,తెలుసుకొన్న విషయం - ఇవన్నీ ఏకమైన సమయంలో అంతా శూన్యమే ! ఆ శూన్యం ఇలా ఉంటుందని ,అలా ఉంటుందని వివరించే స్మ్రుతులు ,శ్రుతులు ,గీతాసారాలు ,మరెందరో ప్రవక్తలు నుడివిన సిద్దాంతాలు మనకెన్నో ఉన్నాయి . వాటిని మార్గం చూపించే మైలు రాళ్ళుగా , దీప జ్ఞాన కాంతులుగా స్వీకరిద్దాం .

"సర్వం గురు బ్రహ్మార్పణమస్తు .
దుర్జనో సజ్జన భూయాత్
సజ్జనో శాంతి మాప్నుయాత్
శాంతి ముచ్యతే బందేభ్యో
ముక్తిచ్య అన్యయో విమోచయేత్" .
చెడ్డవారందరూ మంచివారిగా మారాలి .
మంచి వారందరూ శాంతిని పొందాలి .
శాంతి వైరాగ్యం తో ముక్తి భావం కలుగుతుంది .
అలా ముక్తిని పొందిన వారు ఇతరులను కూడ విముక్తులను చేయాలి..

Saturday, 8 December 2012

RELIGIONS.


 మనిషి మతిని తన చెప్పు చేతల లో ఉంచుకొని మనిషి జీవన్ విధానాన్ని శాసించేది మతం .
వివిధ కాలాల లో వివిధ సంఘ పరి స్థితుల లో  ఆ యా ప్రజలకు మేలు చేసే విధంగా ఎందరో ప్రవక్తలు
రకరకాల సిద్దాంతాలను దర్శించి  వ్యాప్తి చేశారు .
ప్రతి మతమూ చేప్పేదోక్కటే  -
దేవుడు ఒక్కటే . రూపమూ ,గుణమూ లేని అవ్యక్త శక్తి . అది  సర్వ వ్యాపి . సర్వ సమర్ధత ఉన్న ది  .
రూప గుణములు లేని అవ్యక్త  శక్తి నుండి రూప ,గుణ ములున్న పదార్ధ శక్తులు వ్యక్త మ వ్వట మే సృష్టి .
మనిషి కి ఉన్న ఎరుక చాలా తక్కువ . కానీ పశు పక్ష్యాదుల కన్నా ఎక్కువ .
మనిషి కొంచెం ఎక్కువ పరిణితి చెందిన పశువు .
సత్యాన్ని చాలా తక్కువ అర్ధం చేసుకొన్న స్థాయి నుండి పూర్తిగా ఆకళింపు చేసు కోవడమే ముక్తి . దీనికి సహకరించేదే నిజమైన మతం .

మధ్య తరగతి ప్రజలు అంటే ఎ వ రు ? ఎలా నిర్ణయిస్తాం ?

50 శాతం రోజు వారీ ఖర్చులకు , మిగతా సగం పొదుపు కి కేటా యించే వారు .
కుటుంబానికి కారు కొనే సామర్ధ్యం ఉన్న వారు .
రోజుకి 200 నుండి 500 రూపాయలు ఖర్చు పెట్టే స్థోమత ఉన్న వారు. 
రోజు వారీ తలసరి  ఆదాయం 500 నుండి 3000 రూపాయలు ఉన్నవారు .
తలసరి కుటుంబ ఆదాయం 4లక్షల నుండి 18 లక్షలు ఉన్న వారు .
 ------   అలా లెక్కిస్తే   మన ఇండియా లో  4 కోట్ల మధ్య తరగతి కుటుంబాలు న్నాయి .  మన దేశ 
 కుటుంబ పరిమాణం 5.3 సభ్యులు  . అనగా మధ్య తరగతి ప్రజలు  25  కోట్ల మంది ఉన్నారు .
దేశ జనాభా లో 20 శాతం ఉన్న మధ్య తరగతి వారు , 50 శాతం కార్ లు ,ఎ.సి. లు , కంప్యూ టార్ లు ,క్రెడిట్ కార్డ్ లు , 40 శాతం ఓవెన్ లు కలిగి ఉన్నారు .

Thursday, 6 December 2012

అహింస అంటే ఏమిటి ?

అహింసా పరమో ధర్మ :  

ధర్మ హింసా  తదేవ చ :

ఆయుధం లేని దేవుడు ఉన్నాడా ఆయుధం లేని దేవత ఉందా.?
అహింసా పరమో ధర్మ :   అనేది కేవలం సన్యసించి, వైరాగ్య మార్గంలో ఉన్న సాధు సంతులకు మాత్రమే. ఒక సాధువును హింసించినా, తనకు ప్రాణహాని కలుగుతున్నా , తనని తాను రక్షించుకోవడానికి కూడా, ఆయుధం చేత బట్టడు. కారణం, సకల చరాచర సృష్టిలో తనని తాను చూసుకుంటూ అవతలి జీవిలో కూడా పరమాత్మని చూస్తాడు కాబట్టి !

ధర్మ హింసా  తదేవ చ : కూడా అంతే గొప్పది. సనాతంధర్మంలో ధర్మ హింస అనేది క్షాత్ర ధర్మం. దానిని అనుసరించి , సంఘాన్ని రాక్షసుల బారినుంచి, దోపిడీ ముఠాల నుంచి, క్రూర మృగాల నుంచి, దుర్మార్గులనుంచి రాజులు రక్షించేవారు. కానీ నేటికాలం లో ముఖ్యంగా భారతదేశం లాంటి ప్రజాస్వామ్యం లో రక్షించడం అనేది ప్రతి పౌరుడి బాధ్యత.

కష్ట నష్టాలను ,దౌర్జన్యాలను ,అవినీతి ,అధర్మాలను ,అన్యాయాలను ,దోపిడీని  ఉపేక్షించి , ముడుచుకొని మూల కూర్చోవటం  మాత్రం కాదు .  ఉదాహ రణ  కు గాంధీ అహింస మార్గాన్ని ఎంచుకొని పోరాటం చేశాడు తప్ప అహింస అని వల్లిస్తూ మూలన కూర్చో లేదు. 

సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలు! 

అన్యాయాన్ని,అధర్మాన్ని ఎదిరించి పోరాడవలసిందే! కొందరు కర్రను పెట్టుకొంటే గాంధీ అహింస అనే ఆయుధాన్ని పట్టుకొన్నాడు. 

అన్ని సందర్భాలలో అహింస విజయవంతం అవుతుందని చెప్పలేం. కొన్ని సార్లు ధర్మరక్షణకోసం హింస చేయాలి. అది కూడా అహింస గానే చూడాలి. 

ముఖ్యమైన విషయం ఏమిటంటే, పదిమంది మంచికోసం ఒక్కడిని హింసించడం లో తప్పేమీ లేదు. 

వైద్యుడు ఆపరేషన్ చేసి పాడైన అవయవాన్ని తొలగించడం హింస కాదు గదా? 

అధర్మాలను
 ఎదుర్కొని న్యాయం సాధించుకోవడం ,కానీ ఆ ఎదుర్కొనే విధానం లో హింస ఉండ వచ్చు, లేకపోవచ్చు. .
నిన్నె వారైనా కొడితే తిరిగి కొట్టక పోయినా, వారి నుండి
   క్షమార్పణ వచ్చె వరకు వారిని ఎదుర్కోవటమే అహింస .
సమాజానికి అన్యాయం జరిగితే ,న్యాయం జరిగే వరకు హింస లేకుండా
  పోరాడటమే అహింసా విధానం . మంచి,మానవత , న్యాయ ధర్మాల కోసం  పోరాటం చేయవలసిందే! యుద్ధం జరగవలసిందే! 

ధర్మ రక్షణే అహింస.     దేహాలను కాదు , ధర్మాన్ని హింసించ కూడదు. దేహరక్షణకంటే ధర్మరక్షణ మేలు!

అహింస అంటే సమస్యనుండి పారిపోవడం కాదు. నిలబడి ఎదుర్కోవడం ! 

అహింస అనే ఆయుధం తో కొన్నిసార్లు   దుర్మార్గుల మనస్సును  కూడా గెలవ వచ్చు.    

 అహింస కూడా ఒక విధమైన తపస్సే! 

 తపస్సు అంటే ఏమిటి? 

మనో వాక్ కాయములతో దైవస్మరణ,దైవజపం,దైవకార్యం  చేయడమే తపస్సు. 

 నిర్ణయాలు చేసే బుద్ధితో  సత్య మే పలికే ధైర్యాన్ని,  అహింస యే పరమాయుధంగా వాడే కుశలతను, దైవం పై నమ్మకం,శ్రద్ధ కలిగిఉండే ఓర్పును  కలిగిఉండటమే తపస్సు. 

తపస్సు పరమార్ధం ఏమిటి ?

తపస్సు పరమార్థం త్రికరణ శుద్ధియే.!  చిత్త శుద్ధి , త్రికరణ శుద్ధి శాంతిని అందిస్తాయి. శాంతిద్వారా రాగద్వేషాలు తొలుగుతాయి. అరిషడ్వర్గాలు నశిస్తాయి' అన్నది యోగవాసిష్ఠంలో చెప్పబడింది

తపస్సు ఎలా చేయాలి? 

దేహంతో అంటే భౌతికంగా జరిపే పూజ, వాక్కుతో జపం, మనస్సుతో దైవధ్యానం,  అహింస,ధర్మరక్షణ, సత్య వాక్ పాలన ,దైవ శరణాగతి,నిరంతరం భగవత్  శ్రద్ధతో ఉండే బుద్ధి తద్వారా  దేహ, మనో, బుద్ధి, ఇంద్రియ నిగ్రహాలు అలవడుతాయి. అంతేకాదు ప్రాపంచిక బాధ్యతలను దైవం అప్పచెప్పిన బాధ్యతలుగా భావించి దైవకార్యంలా చేయడమే కాయతపస్సు. దీనినే కర్మకౌశలం, కర్మయోగం అనికూడా అంటారు. 

ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం తపస్సుకు మరీ ముఖ్యమైన రెండు సాధనాలు. బుద్ధి సాత్వికం గా దైవబద్ధంగా ఉంటేనే మనో  ఇంద్రియాల పైన అదుపు ఉంటుంది. 

 మంచీ-చెడూ , పాపం-పుణ్యం; సుఖదుఃఖాలు,సంతోష విచారాలు,మానావమానాలు అనే ద్వందాలు  ధర్మ  జిజ్ఞాస పరిధి లో ఉంటాయి . 

ధర్మ పరిధిని దాటి పరబ్రహ్మ పరిధికి చేరినప్పుడు మంచీ,చెడూ అనే ద్వందాలేవీ ఉండవు. 

తిను -తినిపించు;గెలువు-గెలిపించు; సంతోషాలను పంచు --ఇదే యజ్ఞం. 

పాత్రత నెరిగి దేశకాల మాన స్థితులకు అనుగుణంగా  ప్రేమతో బాధ్యతగా కొంత పంచడం-   దానం.  

తపస్సు అంటే సంకల్ప బలం ఎక్కువగా ఉన్న సాత్విక  బుద్ధి అని పైన  మనం వివరంగా చెప్పుకొన్నాం. 

 యజ్ఞ దాన తపో కార్యాలు కర్త్రుత్వ భావన అనగా నేనే చేస్తున్నాననే అహంకారం లేకుండా  చేయడమే సాత్వికత. 

సాత్వికత అనేది ఒక సాధనం. 

సాత్వికత ద్వారా దేహ ప్రపంచ పరిధినుండి ఆత్మ పరిధికి చేరుకోవడమే బ్రహ్మ విద్యా సాధన.  

అర్జున విషాదం - సనాతన ధర్మ విచారం

భగవద్గీత ప్రధమ  అధ్యాయం లో అర్జున విషాదానికి కారణాలు ? అవి సబబైన వా ? లేదా ?
అర్జునుని పరిస్థితి సామాన్య మానవుడికి కూడా రావచ్చు . అప్పుడు ఏం చేయాలి ?

అర్జునుడు జగ దేక వీరుడైనా , ధీ శక్తి యుతుడైనా , ఎన్నో యుద్దాలలో విజయుడై నా , అన్న గారి మాటకు ,ధర్మానికి , ఆర్తుల ప్రాణ రక్షణ కు కట్టు బడినా ,రుద్రుని మెప్పించినా , ద్రోణు నికి ప్రియ శిష్యుడుగా మె లిగినా , భీష్ముడికి ,కృష్ణునికి  , ద్రౌపదికి , ప్రియమైన వ్యక్తిగా  ఉన్నా , తన శారీరక , అస్త్ర బలాన్ని పెంచుకోవటానికి ఎంతో తపస్సు చేసి న శ్రద్దా సక్తుడుగా ఉన్నా ,ధర్మ  పోరాట మైన కురు క్షేత్ర యుద్దంలో ఎందుకు నీరస పడి నిర్వీరుడ య్యాడు  ?
కారణాలు :
1.ఎదురుగా ఉన్న అందరూ స్వ జనులే -బంధువులు , సోదర ,పితా ,తాత సమానులు . అలాగే 18 అక్షౌహిణ సేనా వాహిని లో  ముసలి వారు , స్త్రీలు  ,పిల్లలు తప్ప   భారత వర్షం లో ఉన్న జన పదాల జనమంతా ఉన్నారు ,. యుద్ద మంటే అంతా  సర్వ నాశ నమే . ఎవరు గెలిచినా పెద్దగా సాధించేది లేదు . గెలిచి ఎవరు ఎవరిని పరి పాలించాలి ?

2.ఇప్పటి వరకు చేసిన యుద్దాలు వేరు . ఈ భారత యుద్ధం వేరు .నేటి వరకు చేసిన తపస్సు ,పడ్డ కష్టాలు ,సంపాదించిన శస్త్ర అస్త్రాలు ,చేసిన ఖాండవ వన దహనం ,కిరాత రూ పంలో ఉన్న రుద్రుని తో చేసిన యుద్ధం ,ఘోష యాత్ర యుద్ధం ,ఉత్తర గోగ్రహణ యుద్ధం , రాజ సూ య కోసం చేసిన యుద్దాలు , అన్న మాట కు ,ధర్మానికి కట్టు పడి  చేసిన  పోరాటాలు ,తపస్సులు  - ఇవన్నీ  ఒక వీరునిగా ,యువ రాజుగా  ,సేనాధిపతిగా ,  వ్యక్తిగా చేసిన కార్యాలు . వాటిలో స్వార్ధమూ ఉంది . స్వధర్మమూ ఉంది . ప్రయోజనమూ ఉంది .ఎక్కువ ప్రజా నష్టం లేదు . కానీ మహా భారత యుద్దంలో అన్నింటి కంటే ఎక్కువ ప్రజా నష్టం ఉంది .అణు అ స్త్రాలు వాడ వలసి రావచ్చు. రాజ్యం కోసం ,చేసిన ప్రతినల కోసం ఇంత మంది జనాలను ,వారెంత అధర్మం చేయనీ -తన బంధు వర్గాలను , చంపి సాదించే రాజ్యం ఎందుకు ? ఎవరి కోసం ? ఇది పాపం కాదా? సైన్యం లోని అమాయక జనులే మి తప్పు  చేశారు ?

3.ధర్మ రాజు పర్య వేక్షణ ఎంతగా ఉన్నా అర్జునుడు కూడా కొన్ని అధర్మ పాప కర్మలు చేసాడు .
        తానొక్కడే మేటి విలు కాడు గా చరిత్రలో మిగిలి పోవాలని గురువుని కోరిక కోరి ,ఒక రకంగా  ఏక లవ్యుని          నిర్వీర్యున్ని చేసాడు .
        ఖాండవ వన దహనం చేసి ఎన్నో జీవ జాతులను ,పచ్చటి అడవిని బుగ్గి చేసాడు . ఆ మారణ కార్యం అర్జును ని మనస్సు ని ఎప్పుడూ తొ లుస్తానే ఉంది .
         తాపసిగా ఉన్నా ఒక్క వేట కోసం ,అహంకారంతో   కిరాత రూ పంలో ఉన్న శివుని తో నానా రకాలుగా యుద్ధం చేసి తాపసిక ధర్మానికి తూ ట్లు పొడిచాడు .
       ధర్మ రాజుని అవకాశ మున్నప్పుడ ల్లా దెప్పి పొడిచే వాడు .
       మేటి వీరుడి నని అహంకారం ,తానొక్కడే యుద్ధం చేసి శత్రువులను నిర్జిస్తానని బీరాలు పలికాడు .

ఇవన్నీ అర్జుని మనస్సులో సుళ్ళు తిరుగుతూ బుద్ది  వికలమై ఇంద్రియాలు నిస్తేజమై రధం దిగి నిస్త్రాణగా కూల బడ్డాడు .
ఈ  విధంగా అర్జునుడు గందరగోళ పడటం ,సబబా ,కాదా అని నిర్ణ యిమ్చేది ఆ నాటి దేశ  కాల మాన పరి స్థితులు , ధర్మ సూత్రమూ   , అతని  స్వధర్మం .

దేశ  సమాజ స్థితి : కౌరవ సామ్రాజ్యం దుర్యోధనుని ఏలుబడి లో క్షీణ దశ  కు చేరింది . అధర్మం పెచ్చు మీరి ప్రజలలో అరిషడ్వర్గాలు పేట్రేగి పోతున్నాయి .అనైతికత ,స్వార్ధం ,రాజ ధర్మంగా ఎప్పుడైతే మారిందో , ప్రజలు కుడా
యదా రాజా తదా ప్రజా .

కాల పరిస్థితి : ద్వాపర యుగ ధర్మం ఆడు గంటి కలిధర్మం ప్రవేసి స్తుంది .

అర్జునుని స్థితి : అతడు  రాజు .అధర్మాన్ని ,అన్యాయాన్ని అణచివేసి, ధర్మ స్థాపనే స్వ ధర్మం & రాజ ధర్మం గా ఉన్న మనిషి . .
తనకు ,తన కుటుంబానికి ,రాజ్యానికి ,సమాజానికి  కౌరవులు చేసింది అధర్మ అన్యాయా లు .

కాబట్టి , సమాజ పరంగా ,స్వధర్మ పరంగా ,రాజ ధర్మ పరంగా ఎలా చూచినా అర్జునుడు యుద్ధం చేసి ధర్మ స్థాపన చేయక తప్పదు .కర్మ ఫలం ఎలా ఉన్నా మనిషి తన ధర్మం తాను  చేయాలి . అనవసర మైన ,పనికి రాని  గుంజాటన మనిషికి ఉండ కూడదు . తాత్కాలిక వైరాగ్యం వలన అనర్ద మే . నిజమైన జ్ఞానం లేక పోవుట వలన , సత్యం తెలియక   పోవుట వలన మనిషి నానా రకాలుగా ఆలోచించి కర్మలను విడ నాడి పలాయన వాదిగా మిగిలి పోతాడు .
అందుకే యుద్ధం చేసి నీ ధర్మాన్ని నిర్వర్తించు . ఆ తర్వాత వచ్చేది  విజయమైనా ,వీర స్వర్గ మైనా   నీ కనవసరం .
ఇది నీ భాద్యత . దీని నుండి పారి పోవద్దు .
అంటే  ప్రతి మనిషి తన భాద్యతల నుండి పారిపోక తన స్వ ధర్మాన్ని ప్రతిఫలాపేక్ష  లేదా ఫలం ఎలా ఉంటుందో అనే చింత గానీ లేకుండా నిర్వర్తించాలి .
నీ మానసిక అంతరంగం శుష్క పాండిత్యం తో ,సందేహాలతో , గందర గోళంగా ఉంది . అనేక సందర్భాలలో ప్రతి మనిషి కి ఈ  పరిస్థితి వస్తుంది .
అప్పుడు మనం మనిషిగా  ఏమి చేయాలి ? ఎందుకు అలాగే  చేయాలి ? మనిషి ధర్మం ఏమిటి ? మనిషి గమ్యం ఏమిటి ? వీటన్నిటికి సమాధానం భగవద్గీత .
ఆత్మ  ఒక్కటే సత్యం ,అంటే  మార్పు లేనిది . మిగతా వన్నీ అంటే  ద్వందాలన్నీ  - సుఖ దుఖాలు ,కష్ట నష్టాలు , అసూయా ద్వేషాలు , పగ ప్రతీకారాలు , క్షమా  అసహనాలు -   కర్మ చక్ర భ్రమణం వలన మనకు కలిగేవి .

మనిషి నాలుగు ఆశ్రమ ధర్మాల లో  ,నాలుగు పురుషార్ధాలను   ధర్మంగా సాధించి , నాలుగు యోగ మార్గాలలో తన కనువైన ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని జన్మ రాహిత్యం పొందాలని ఉపనిషద్ సారమైన గీతలో  శ్రీ కృష్ణుడు ఉపదేశిం చాడు .
మనిషికున్న పంచ కోశాలు ,జన్మ కర్మ పరంపర ,పంచ భూతాల  ,సూక్ష్మ & కారణ శరీర వివరణ
భగవంతుని శక్తి , సత చిత్  ఆనందం ,లీల  వివరణ
మనిషి ఎలా మాయ ,ద్వందాలతో ,అహంతో అల్లాడి పోతాడు ---------- ఇవన్నీ గీతలో ఉపదేశా సారంగా చెప్పారు .
తత్ వం అసి  -తత్వమసి .
అహం బ్రహ్మం అసి  - అహం బ్రహ్మస్మి

Wednesday, 5 December 2012

108 Upanishads


108 Upanishads have arranged  in four categories according to the particular Veda to which each of them belong.

Rigveda(10): Aitareya , Atmabodha, Kaushitaki, Mudgala, Nirvana, Nadabindu, Akshamaya, Tripura, Bahvruka, Saubhagyalakshmi.

Yajurveda(50): Katha, Taittiriya , Isavasya , Brihadaranyaka, Akshi, Ekakshara, Garbha, Prnagnihotra, Svetasvatara, Sariraka, Sukarahasya, Skanda, Sarvasara, Adhyatma, Niralamba, Paingala, Mantrika, Muktika, Subala, Avadhuta, Katharudra, Brahma, Jabala, Turiyatita, Paramahamsa, Bhikshuka, Yajnavalkya, Satyayani, Amrtanada, Amrtabindu, Kshurika, Tejobindu, Dhyanabindu, Brahmavidya, YogakundalinI, Yogatattva, Yogasikha, Varaha, Advayataraka, Trisikhibrahmana, mandalabrahmana, Hamsa, Kalisantaraaa, Narayana, Tarasara, Kalagnirudra, Dakshinamurti, Pancabrahma, Rudrahrdaya, SarasvatIrahasya.

SamaVeda(16): Kena, Chandogya, Mahat, Maitrayani, Vajrasuci, Savitri, Aruneya, Kundika, Maitreyi, Samnyasa, Jabaladarsana, Yogacudaman, Avyakta, Vasudevai, Jabali, Rudrakshajabala.

Atharvaveda(32): Prasna , Mandukya, Mundaka, Atma, Surya, Narada-Parivrajakas, Parabrahma, Paramahamsa-Parivrajakas, Pasupatha-Brahma, Mahavakya, Sandilya, Krishna, Garuda, Gopalatapani, Tripadavibhuti-mahnarayana, Dattatreya, Kaivalya, NrsimhatapanI, Ramatapani, Ramarahasya, HayagrIva, Atharvasikha, Atharvasira, Ganapati, Brhajjabala, Bhasmajabala, Sarabha, Annapurna, TripuratapanI, Devi, Bhavana, SIta.

Tuesday, 4 December 2012

భారతీయం కడు కమనీయం

సంస్కృతి - సంప్రదాయం  అంటే ఏమిటి ? వాటి వలన జాతికి ఉపయోగం ఉందా?
ఒక జాతికి తిండి ,గుడ్డ ,నీడ లేక పోవచ్చు .కానీ , విజ్ఞానం లేక పోతే జాతి క్రమంగా అంతరించి పోతుంది . ఉదాహరణకు ,పశువులకు విజ్ఞాన మును వారసత్వంగా నేర్చుకొనే శక్తి , సామర్ధ్యం లేనందు వల్ల అవి ఎప్పుడూ ఇంకొకరి దయా దాక్షిణ్యాల పై ఆధారపడి బతక వలసిందే .శారీరక బలం కొంత మేరకే పనికొస్తుంది . బుద్ది  పదునెక్కి , జీవన పోరాటాన్ని సులభతరం ,సుఖ వంతం చేయక పోతే  ఆ జాతి మనలేదు .

మన విజ్ఞానమే మన సంస్కృతి . ఆ విజ్ఞానాన్ని మన దైనందిన జీవనం లో భాగం చేసు కోవడమే సంప్రదాయం .
విజ్ఞానాన్ని తరంతరం నిరంతరం ఒక ధారా లాగా అందివ్వ ట మే మనిషి భాద్యత .
ఓ చిన్న ఉదాహరణ -
శుభ , సంతోష  కార్యాలలో మనిషి బొట్టు పెట్టు కోవడం సంప్రదాయం . నుదుట ఆజ్ఞా చక్రాన్ని ఉద్దేపనం చేయడం దాగిఉన్న విజ్ఞానం .

 భౌతిక ,ఆధ్యాత్మిక అంతరార్ధం లేకుండా భారతీయ సంప్రదాయాలుండవు .
పూజ ,ఆలయం ,హోమాలు , వాకిట ముగ్గులు ,గొబ్బిళ్ళు , కొప్పులో పూ లు ,మంగళ సూత్రం ,ఉపనయనం ,షోడశ కర్మలు , పంచ యజ్ఞాలు  మొదలగు ఆచారాలు అన్నీ సత్  సంప్రదాయాలే. వీటన్నింటి వెనకాల ఉన్నవి  విజ్ఞాన వీచికలే  .

తరతరాల ఋషులు ఎన్నో పరిశోధనలు తపస్సు లాగా చేసి నిగ్గు తేల్చిన సత్యం  భారతీయ సంస్కృతి .
భారత సనాతన ధర్మం ఇహానికి ,పరానికి సమ తుల్యత నిచ్చిన జీవన వేదం .

మన భారతీయ సంస్కృతి - సంప్రదాయాన్ని కాపాడండి .
ప్రకృతిని ,గోవులను , స్త్రీలను , ద్వి జులను రక్షించండి .
వేదాలను వినండి . ఉపనిషత్ లను అధ్యయనం చేయండి . భగవంతుడే స్వయంగా భోధించిన గీతా సారాన్ని దైనందిన జీవితంలో అన్వ యించు కొండి .
రామాయణ ,భారత ,భాగవతాలను మన పిల్లలకు నేర్పటం మరవకండి .

వ్యక్తిత్వ వికాసాన్ని (personality development ) అభివ్రుది చేసు కోండి . దాని తోనే ఆగకండి .
 శీలాన్ని( character building) నిర్మించు కోండి .
సత్యము ,శౌచము ,అహింస ,కరుణ ,శ్రద్ద ,సహనము ,క్షమ  ,సేవ ,ప్రేమ - ఈ లక్షణాలను చిన్నప్పటి నుండి పిల్లలకు నేర్పిద్దాం ,మన జాతిని పరి పుష్టం చేసుకొందాం .